మరుగున పడిన మతాలు –మతాచార్యులు -44
భారతీ తీర్ధులు
ఆది శంకరా చార్యుల వారి తర్వాతా అద్వైత మత వ్యాప్తికి అధిక కృషి చేసిన వాడు భారతీ తీర్ధులు .మాధవ ,విద్యారన్యుల సమకాలికుడు .వీరిద్దరి కంటే వయసులో పెద్ద వాడు .విద్యారన్యులు అనే బిరుదనామం మాధవాచార్యులకు భారతీ తీర్ధులకుఇద్దరికీ వర్తిస్తుంది .1386 శాసనాన్ని బట్టి భారతీ తీర్దులకు విద్యా తీర్ధులు గురువు అని తెలుస్తోంది .భారతీ తీర్ధులు మాధవ ,విద్యారణ్యు లిద్దరికీ గురువే .మాధవ ,భా రతీ తీర్దులిద్దరు అద్వైత పండితులే .విజయ నగర రాజుల తో సన్నిహిత సంబంధం ఉన్న వారుకూడా .
విద్యాతీర్ధ స్వామి వారి శిష్యులు భారతీ తీర్ధులు, విద్యారన్యులు
భారతీ తీర్ధుల కాలం పద్నాలుగో శతాబ్దం .శృంగేరి పీఠాన్ని అది రోహించటం లో మాధవ ,విద్యారన్యులిద్దరికంటే భారతీ తీర్ధులు ముందు వాడు.శాంకరాద్వైతాన్ని వ్యాఖ్యానించటం లో అద్వితీయ ప్రతిభా సంపన్నుడు భారతీ తీర్ధ .విజయ నగర రాజుల చేత సన్మానింప బడిన వాడు .తీర్ధ రాసిన ‘’పంచదశి ‘’అద్వైత సంప్రదాయం లో శాశ్వత స్తానాన్ని పొందింది .ఈయన రాసిన ‘’వివరణ ప్రమేయ సంగ్రహం ‘’కూడా ఉత్తమమైనదిగా పేర్కొంటారు .’’దృక్ దృశ్య వివేకం ‘’అనే వీరి రచన పరమోత్క్రుస్ట మైంది .
భారతీ తీర్ధ 1333-1380 కాలం వాడు ఆంద్ర దేశం లో ఏకశిలా నగరం అయిన ఓరుగల్ అనే వరంగల్ లో జన్మించాడు పూర్వాశ్రమం లో విద్యారన్యుల తమ్ముడు .గురువైన విద్యా తీర్ధుల తర్వాతా పదకొండవ శృంగేరి పీతాదిపతి అయి నలభై ఏడేళ్ళు పీతాదిపత్యం లో ఉన్నాడు ఆయన కాలం చారిత్రాత్మక మైనదిగా పేర్కొంటారు .శ్రీ ఆది శంకరా చార్యులు మంచి గాంధపు శారదా విగ్రహాన్ని శృంగేరి లో ఏర్పరిస్తే భారతీ తీర్ధ స్వర్ణ విగ్రహం చేయించి ప్రతిష్టించారు ఆలయాన్ని మతాన్ని అభి వృద్ధి చేశాడు సామాన్యుల కోసం మతాన్ని విస్తృత పరచాడు .విజయ నగర రాజుల కాలం లో విద్యా శంకరాలయం నిర్మాణం జరిపించాడు హరిహర రాయమహారాజు తన తమ్ముడు మారెప్పను అల్లుడుబాలప్పను శృంగేరి పంపించి ఆశ్రమపోషణకు అయిదు గ్రామాలు దానం గా ఇప్పించాడు .అంటే కాదు భారతీ తీర్ధకు సేవకులుగా నలభై మంది బ్రాహ్మణ పరి చారకుల్ని నియమించాడు
భారతీ తీర్ధులు 120 మంది వేద పండితులకు రాజు తన కిచ్చిన దానిలో భూములనిచ్చి వారి పోషణకు సాయ పడ్డాడు .దీంతోనే శృంగేరి గ్రామ నిర్మాణం ప్రారంభ మైంది వేదాలలో ,శాస్త్రాలలో అపార పాండిత్యాన్ని చోపిన వారికి బిరుడులిచ్చి సత్కరించటం భారతీ తీర్ధ కాలం లోనే ప్రారంభ మైంది
अज्ञानां जाह्नवी तीर्थं विद्यातीर्थं विवेकिनाम् ।
सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये ॥
That Ganga which is the sin-removing refuge to the ignorant, That esoteric knowledge that is the refuge sought by the wise, That refuge which is good for all who seek Bliss, Unto that Bharati Tirtha, I bow!
ఇది భారతీ తీర్ధ స్వామిగూర్చిన ప్రస్తుతి . ‘’పవిత్ర గంగా జలం అజ్ఞానులపాప ప్రక్క్షాళ నం చేస్తుంది ఆశ్రయిస్తే మహాజ్ఞానాన్నిజ్ఞానులు ప్రసాదిస్తారు . బ్రహ్మానందాన్ని, ఆశ్రయించిన వారికందరికీ మంచిని ప్రసాదించే శ్రీ భారతీ తీర్ధులకు ప్రణామం ‘’ అని భావం
ఉపనిషత్తులలో చెప్పినట్లు బ్రహ్మం ,దాని స్వభావాన్ని బాహ్య ,అభ్యంతారాలకు అంటే ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ మెధడ్ లరెండిటిని సమన్వయ పరచి బోధించాడు భారతీ తీర్ధ .తన పంచ దశి లో ‘’పంచ మహా భూతం ‘’అనే అధ్యాయం లో బాహ్య ప్రపంచాన్నుంచి బ్రహ్మాన్ని ఎలా వేరు చేయ వచ్చో సవివరం గా తెలిపాడు .’’పంచకోశ వివేకం ‘’అనే మూడవ అధ్యాయం లో పంచకోశాల నుండి ఆత్మను వేరు చేసి చూపించాడు ఇది ధాన్యం నుండి పై పొట్టు ను తీసే విధానం లాంటిది .
జీవుడు ,ఈశ్వరుడు ఇద్దరు ప్రపంచ సృష్టికర్తలు అని భారతీర్ధ అన్నాడు ఇందులో ఈశ్వరుడు ముఖ్య కర్త .జీవుడు ఆయనకు లోబడి పని చేసే వాడు .ప్రపంచ స్తితికి మాత్రం ఆధారం ఈశ్వరుడే .ప్రపంచానుభ వాలకు మాత్రం జీవుడు ఆశ్రయుడు గా ఉంటాడు .జీవుడి సృష్టి బాహ్య ప్రపంచం కాదు .అంతర భావనా ప్రపంచమే నంటాడు తీర్ధ .’’వివరణ ప్రమేయ సంగ్రహం ‘’లో ప్రతి బింబ వాదాన్ని తీసుకొచ్చి వివరణ కోరే వారికి సంతృప్తి కలిగించాడు .కాని పంచ దశిలో ప్రతి బింబ వాదం లో ఒకటైన ‘’ఆభాస వాదం‘’ను అంగీకరించి ,వివరణ కారుని దృష్టిలో బింబం కంటే వేరే కాదని సత్యమైన అభాసం అని తేల్చాడు .అంటేభ్రాంతి అని చెప్పాడు .మాయకు ,అవిద్య కు భేదాన్ని చెప్పకుండా వివరణ కారుని సిద్ధాంతాన్ని అనుసరించి పంచ దశిలో ఈ రెండిటిని వేరు పరచి చూపించాడు .
వేదాంత విచారం చేత లభించే జ్ఞానం ఒక్కటే ముక్తికి సాధనం అని స్పష్టం చేశాడు .శ్రీ కృష్ణ .భగవానుడు చెప్పిన సాంఖ్యం ,యోగం రెండిటిలో ఏదైనా ఒకటి ముక్తికి సాధనం అవుతుందని పంచదశి లో వివరించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-13- ఉయ్యూరు