మరుగున పడిన మతాలు –మతాచార్యులు 48-
బెర్గ్ సన్
హెన్రి బెర్గ్ సన్ ఫ్రెంచ్ దార్శనికుడు .ఫ్రెంచ్ వారిపై అమిత ప్రభావం కలిగిన వాడు .1859 లో అక్టోబర్ పద్దెనిమిది న జన్మించాడు .ఈయన భావాలు విలియం జేమ్స్ ద్వారా అమెరికా చేరి బహుళ వ్యాప్తి చెందాయి ,చివరి రోజులో చరిత్ర అధ్యాయం తో గడిపాడు . ఆ యన చెప్పిన వాటిపై ఈతరం దార్శనికులు అధికం గా ఆకర్షితులవుతున్డటం బెర్గ్ సన్ ప్ర త్యేకత . .
బెర్గ్ సన్ ద్రుష్టి లో అంతరజ్ఞానమే నిజమైన దర్శనానికి మూలం .సత్యం అనేది ఏక మైన సృష్టి కార్యం గా అన్నిటా గోచరిస్తుంది .దీనినే ‘’ఎలాన్ వైటల్’’అంటే సర్జనాత్మక శక్తి అన్నాడు .ఇదే ప్రాణశక్తి .ఈ శక్తి ద్రవ్యం కలిగించే నిరోధాన్ని ,అవకాశం యొక్క కదలని తనాన్ని ప్రతిఘటిస్తూ అనేక అనుభవ రూపాలు దాలుస్తు ,భొతిక ద్రవ్యం నుండి జీవానికి ,అక్కడి నుండి మానవుడి కి అక్కడనుండి ఇంకా పైకి వ్యాపిస్తుంది .ఇది ఆత్మ వైవిధ్య ప్రక్రియ .దీనిలో ఏకత్వం ఎప్పుడూ ఉంటూనే ఉంది .ఈ ఏకత్వం నుంచే భేదాలు ఏర్పడతాయి .పైన చెప్పిన పురోగతి ఈ భేదాలను ధరించటమే కాకుండా ,వాటికి అభిన్నం గా కూడా ఉంటుంది .ఈ విషయాలన్నీ బెర్గ్ సన్ నాలుగు మహా గ్రంధాలలో నిక్షిప్తం చేశాడు .అవే లేడాన్నీల్ ఇమ్మేడిఎట్స్త్స్ డిలా కాన్షస్ (చైతన్యనికి ప్రత్యక్షం గా ఉన్న అంశాలు ),మేటి యర్ యెట్ మేమ్వారి (భౌతిక ద్రవ్యం స్మృతి ),రివల్యూషన్ క్రియార్తిర్స్ (సర్గాత్మక పరిణామం ),లేడోయ్ సోర్సీర్సేస్ డి లా మొరాలిటి యెట్ రేలిజియాన్ (నీతి ,మతాల ప్రాదుర్భావం ) ఇవి కాక పత్రికల్లో రాసిన వాటినీ పుస్తాకాలుగా ముద్రించాడు అందులో లేనర్జి స్పిరి త్యువల్(ప్రాణ శక్తి )డ్యూరియెట్ సైమల్తేనిటి (అవధి అనెవి ఉన్నాయి
దానీజ్ అనే గ్రంధం లో శుద్ధమైన కాల ప్రవాహాన్ని కాలం గాను ,భావాన్ని మనో ద్రవ్యం గాను ,తి భౌతిక సత్యం గాను చెప్పాడు ..కాలప్రవాహం మానసిక మైనది అన్నాడు నిర్విరామం గా వేరు వేరు విధాలుగా ప్రవహిస్తుంది .ఎప్పుడూ మార్పులు చెందుతూ ఉంటుంది .మన ప్రక్రియలు దాన్ని భేదించి ముక్కలుగా మనకు కనపడేట్లు చేస్తుంది .ఇది కాలానికి ఆచలత్వానికి సాపేక్షం .విస్తృతి అనే దానికి చలనం ఉండదు .దిక్ బిందువులు ఒకే విధం గా ఉంటాయి .అందులో ప్రతిదీ మిగిలిన వాటికి వెలుపలగాను ఒక దాన్ని అనుసరించి ఒకటి ఉంటాయి .నిజమైన కాలానికి విస్తృతి లేదు .సంకుచితమైంది .తర్వాతి లక్షణాలు ముందున్న వాటితో కలిసి పోయి ప్రతి క్షణం కొత్తది గా కనీ పిస్తుంది .భూత ,వర్తమాన భవిష్యత్ కాలాల క్రమం అంతా ఒక అవిభక్తమైన ప్రవ్రుత్తి —యాక్టివిటి)
మనం కాలాన్ని శాస్త్రీయ ,పారిశ్రామిక కాలం గా మార్చేశాం అంటారు బెర్గ్ సన్).అపరిచ్చేద్య వస్తువులకు పరిచ్చేద్యాన్ని ఆరోపించటం వల్లనే భాష ,తర్కం భౌతిక శాస్త్రం వగైరా గా మారాయి .సజీవ కాలం స్వతంత్రం ,ఉత్పాదకం ,అనిర్దేశ్యం అన్నాడు మన పండితుడు .దీనికి ఎన్నో ఉదాహరణల్ని ‘’ద్రవ్యం స్మృతి ‘’లో చెప్పాడు శరీరం ఆత్మ చేత కల్పించ బడిన ఒక సాధనం అన్నాడు ఆత్మ అంటే కాలం యొక్క పూర్తీ ప్రవాహమే .మన మస్తిష్కం ప్రోద్బలన కర్త గా ఉంటుంది .ప్రవృత్తిని చేబట్టని వాటిని దాచేస్తుంది దీనినే శుద్ధ స్మృతి అన్నాడు .ఇదే మన ఆత్మల మూలం అంటాడు యాక్షన్ కనపడని భూతాంశాలలో ఒక దాన్ని స్వయం గా ఎన్ను కొంటుంది .నానాత్వాన్ని గ్రహించే ప్రాణ శక్తి తానూ విడి పోకుండా అయస్కాంతం లాగా భిన్న ధ్రువాలను ఏర్పరుస్తుంది .చలనం కళ భొతిక ద్రవ్యం క్రమం గా క్షీణించి చలన శూన్యత గా మారిపోతుంది .ఈ విషయాన్ని‘’సర్గాత్మక పరిణామం ‘’లో చెప్పాడు .
వృక్షాలు మనష్యులు ఒక దాని నొకటి తిని బతుకుతాయి .’’గతం తం యొక్క రెండు ఉద్భవ స్స్థా నాలు ‘’లో మనిషి ప్రతీతుల్ని మనుష్య సంవర్గానికి అన్వయించాడు ఈ దివ్య ప్రాణ శక్తి మానవుడిలో భొతిక ద్రవ్యత్వ బంధనాలను చేదించుకొని స్వేచ్చ పొందింది .ఇలాచేయటం వల్ల పరిణామం ఏర్పడి మానవ బుద్ధి ,మనుష్యుడు మిగిలి ఉన్నారంటాడు .ప్రాణ శక్తి కి ఆటంకం కలిగితే సంఘం లో సంక్షోభం వస్తుందన్నాడు .కొందరు మహాను భావులు ఈ దివ్య శక్తిని సాధించుకొని మానవుల్ని రాక్షిస్తారు .త్యాగం ,శీలం లను బోధించి నైతిక మార్గాన్ని అవలంబించేట్లు దారి చూపిస్తారు ప్రస్తుత మన నాగరకత ఇలాంటి సంక్షోభ స్తితిలోనే ఉందని గట్టిగా చెప్పాడు అచల సంవృత స్తితి ,చల విస్తృత స్తితి లలో ఒక దాన్ని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చిందని హెచ్చరిస్తాడు బెర్గ్ సన్.1941 lలోజనవరి నాలుగున ఎనభై రెండేళ్ళ వయసులో బెర్గ్ సన్ దార్శనికుడు మహా ప్రస్తానం చెందాడు
బెర్గ్ సన్ 1927 లో నోబుల్ పురస్కారాన్ని అందుకొన్నాడు ఫ్రాన్స్ దేశపు అత్యున్నత అవార్డు”గ్రాండ్ క్రోకస్ డి లా లీజియన్ డీ ఆనర్ ” అందుకొన్న ఘనుడు . ఆయన రాసిన కాంటి నెంటల్ ఫిలాసఫీ ,ఫ్రెంచ్ స్పిరిట్యులిజం గ్రంధాలు బహుళ ప్రచారం పొందాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-10-13- ఉయ్యూరు