సరస భారతి 52వ సమావేశ విశేషాలు

  సరస భారతి 52వ సమావేశ విశేషాలు

శ్రీపానుగంటి వారి సాక్షివ్యాసలపై ప్రసంగం ,శ్రీ మతి డొక్కా సీతమ్మ గారి స్మారక స్కాలర్షిప్ ల ‘ప్రదానం గా సరసభారతి 52 వ సమావెశం శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నిన్న సాయంత్రం సాయంత్రం(22-10-13-మంగళ వారం ) ఆరున్నర గంటలకు జరిగింది .ప్రొద్దుటి నుంచి యెడ తెరిపి లేని అకాల వర్షం తో అసలు కార్యక్రమం జరపగలమా అన్న సందేహం ఉన్నా ధైర్యం తో మా  అంజనేయ స్వామి వారి అనుగ్రహం తో జరుప గలిగాం .మధ్యాహ్నం నుండి అందరికి మళ్ళీ ఫోన్లు చేసి కార్యక్రమం తప్పక జరుగుతుందని జ్ఞాపకం చేశాం .

శ్రీమతి డొక్కా సీతమ్మగారి పై సరసభారతి 52 వ సమావేశం

డొక్కా సీతమ్మ గారి మునిమనవడు శ్రీ డొక్కా సూర్య నారాయణ గారు వారి శ్రీమతి శ్రీమతి బాలా త్రిపుర సుందరి గారుఉదయానికే హైదరాబాద్ నుండి విజయ వాడకు వచ్చి శ్రీ కనక దుర్గమ్మ దర్శనం చేసుకొని సాయంత్రం నాలుగున్నరకు కార్ లో బయల్దేరి సరాసరి మా ఇంటికి వచ్చి కాసేపు కూర్చుని కాఫీ సేవించారు .మా ఇల్లూ,అరటి చెట్లు ,ఉసిరి చెట్టు చూసి మహదానంద పడ్డారు .వారు మా ఇంట్లో కి వచ్చినప్పుడు కూడా తేలిక పాటి జల్లు కురిసింది .కాని మా ఇంటినుంచిమేము నలుగురం  ఆలయానికి వారి కారు లో బయల్దేరినప్పుడు  తమాషా గా వర్షం ఆగి పోయింది .మళ్ళీ కురవలేదు  అందుకని కార్యక్రమం సవ్యం గా, నిండుగా ,ఆత్మీయ భావన తో జరిగింది

కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి అందరిని వేదిక పైకి ఆహ్వానించి ప్రార్ధన చేయటం తో అసలు కార్యక్రమం మొదలైంది .అధ్యక్షత వహించిన నేను సరసభారతి ఏర్పడి ఈ రోజుకు నాలుగేళ్ళు పూర్తీ అయ్యాయని అయిదవ ఏడాదిలో ప్రవేశించి శిశు దశ నుండి బాల్య దశలో కి చేరిందని ఇది అందరి సహకార ఫలితమేనని ,సరసభారతి తరఫున పదకొండు పుస్తకాలు ముద్రించామని ,అందులో  నేను రాసినవి ఆరు ఉన్నాయనిఇవి నెట్ లో రాసిన వే నని  తెలియ జేశాను .ఇవన్నీ అందరికి ఉచితం గా అందించామని వదాన్యులు ముందుకొచ్చి కొన్ని పుస్తకాలకు పూర్తీ ధన సహాయం చేశారని ,ప్రతి ఉగాదికి కవి సమ్మేలనాలను వరుసగ నాలుగు ఏళ్ళు నిర్వాహించామని జిల్లాలో ప్రసిద్ధులైన కవులు సుమారు యాభై మంది వరకు వచ్చి ప్రతి సారీ కవితలు వినిపించే వారని వాటిని పుస్తక రూపం లో తెచ్చి అందించామని గుర్తు చేశాను . .లబ్ధ ప్రతిస్టూలైన ఎందరో కవులను కళా కారులను ఆహ్వానించి ఉపన్యాసాలిప్పించి సత్కరించామని చెప్పాను

ఉయ్యూరు కాలేజి లో, ఫ్లోరా స్కూల్ లో విద్యార్ధులకు అనేక కార్య క్రమాలు జరిపి వారికి సాహిత్యం పట్ల అవగాహన కల్గిన్చామని అన్నాను .రెండేళ్ళ క్రితం కాలేజి ,సరసభారతి ,కాలేజీ ,,కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తం గా గురజాడ ,రవీంద్రుల 150 వ జయంతిని ఘనం గా నిర్వహించమని గుర్తు చేశాను .మళ్ళీ అలాంటి  మంచి కార్యక్రమం కాలేజి లో చే బట్టమని  తెలుగు లేక్చరర్ ,ఈ నాటి వక్త అయిన వేణుగోపాల్ ను కోరాను .జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత ,ఇటీవలే స్వర్గస్తులైన శ్రీ రావూరి భరద్వాజ గురించి కాలేజీ విద్యార్ధులకు తెలియదని ,కనుక వారిపై అవగాహనా సదస్సు నిర్వహించే ఏర్పాట్లు చేయమని వేణుగోపాల్ కు చెప్పాను ను  తప్పకుండా .చేద్దామని అన్నాడు ఆ తర్వాత అందరం రెండు నిమిషాలు భరద్వాజ మృతికి సంతాప సూచకం గా మౌనం పాటించాం.

DSCF4526ముఖ్య అతిధి వక్త అయిన శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి పానుగంటి వారు తెలుగు భాష గొప్పదనాన్ని గురించి చెప్పిన కమనీయ వాక్యాలతో ప్రసంగం ప్రారంభించి అందర్నీ ఆకట్టుకొన్నాడు .పానుగంటి లక్ష్మీ నరసింహా రావు గారు తూర్పు గోదావరి జిల్లా సీతా నగరం లో 11-2-13 న జన్మించారని 75ఏళ్ళు జీవించి 7-10-1940 లో మరణించారని ,పెద్దాపురం హైస్కూలో టీచర్ గా ఉద్యోగం ప్రారంభించారని అనేక సంస్థానాల్లో దివాన్ గా ని ,పిఠా పురం రాజా సూర్యా రావు గారి ఆస్తాన కవి అయ్యారని చెప్పాడు .ఆంధ్రా షేక్స్ పియర్, కవిశేఖర్ ,ఆంధ్రా ఎడిసన్ బిరుదులు పొందారని ,చెళ్ళపిళ్ళ వారు ‘’అభినవ కాళిదాసు ‘’బిరుదు ప్రదానం చేశారని చెప్పాడు చిలకమర్తి ,,కూచి నరసింహం ,పానుగంటి ముగ్గురిని’’నరసింహ లేక సింహ త్రయం’’ అనే వారని అన్నాడు దాదాపు ముప్ఫై నాటకాలు పానుగంటి వారు రాశారని అందులో సారంగధర ,పాదుకా పట్టాభిషేకం ,ప్రచండ చాణక్య ,విజయ రాఘవం మొదలైన నాటకాలను ఆ కాలం లో ప్రతి ఊరిలో ప్రదర్శించే వారని చిక్కని కవిత్వానికి, కమనీయ భావానికి వారు పట్టు గొమ్మ అనీ ,చేవ గల వచన రచనా నిపుణులని హాస్యాన్ని కూడా పండించి హాస్య వల్లరి ,వృద్ధ వివాహం వంటివి రచించారని చెప్పాడు  న్గాలీ  భాషలో ఆశుతోష్ ముఖర్జీ రాసిన ‘’గౌరాంగ ‘’నాటకం ఆధారం గా పానుగంటి ‘’రాదా కృష్ణ ‘’నాటకాన్ని పరమ రమణీయం గా ,వారిద్దరి అద్భుత ప్రేమకు నిదర్శనం గా రాశారని ఇదీ బాగా ప్రచారం అయిందని గుర్తు చేశాడు

పిఠా పురం రాజా ఆస్తానం తర్వాత పానుగంటి వారి ఇల్లే పెద్ద దివాణం గా ఆ రోజుల్లో ఉండేదని అందరు చెప్పుకొనే వారని ,ఆధునిక కవి సార్వ భౌముడు గా (శ్రీనాధుడు లాగా )భోగ జీవి అని ,సంపాదనలో ఖర్చు తప్ప మిగులు లేక, కొడుకులకు ఉద్యోగాలు లేకచివరి రోజుల్లో తన  పుస్తకాలు అమ్మి జీవించారని చెప్పాడు .పిఠాపురం లో 1935లో చిలక మర్తి వారి ఆధ్వర్యం లో ఘన సన్మానం జరిగిందని పానుగంటి వారి ఈవితాన్ని సంక్షిప్తం గా తెలిపాడు .

పానుగంటి వారు సాక్షి వ్యాసాలను అధిక్షేప రచనలుగా 1913-14 ,20-22 ,27-28 ,1933 లో వరుస భాగాలుగా రాశారని ఇవి ఆనాడు పత్రికల్లో వచ్చేవని వీటి కోసం వారం వారం సాహిత్య ప్రియులు ఎదురు చూసే వారని చెప్పాడు గోపాల్ .ఈ రచన కు ప్రేరణ ఎడిసన్ రాసిన స్పేక్టేటర్ వ్యాసాలని తెలియ జేశాడు అయితే ఇది సర్వ స్వతంత్ర రచనమే కాని అనువాదం, చాయా కూడా లేదని స్పష్టం చేశాడు .పానుగంటి వారి ధార అమోఘం అని ఏ విషయాన్ని అయినా కూలంకషం   గా లోతులకు వెళ్లి చర్చించారని సమాజం లో ఉన్న మూఢ నమ్మకాలను బయట పెట్టటమే వారి ధ్యేయమని .అమ్రుతోపమైన తెలుగు భాష రాశారని అందరిని అలరించారని కొందరు ఆ దెబ్బలు తమకే నని తెలుసుకొనే వారని వ్యంగ్యాన్ని అధిక్షేపాన్ని పల్లకీ లో ఊరేగించిన మహా ను భావుడు పానుగంటి అని తన ప్రసంగాన్ని ముగించాడు .

తరువాత శ్రీ డొక్కా సూర్య నారాయణ గారు సీతమ్మగారి గురించి గుర్తు చేసుకొన్నారు ఆమె చేసిన అన్న దానం వల్లనే ఇప్పటికీ తా మంతా తరతరాలుగా హాయిగా ఉన్నామని మంచిని ప్రోత్సహించాలని ఇలాంటి కార్యక్రమం సరసభారతి నిర్వహించటం ఏంతో సంతోషం గా ఉందని ,తమనూ భాగస్వామ్యులను చేసినందుకు క్రుతజ్ఞాతలని చెప్పారుఇంకెవరైనా బీద విద్యార్ధులు డబ్బు లేక చదువు కోన సాగించలేక పోతే తనకు తెలియ జేస్తే తప్పక ఆర్ధిక సహాయం అందిస్తామని తమ కుమారుడురామ భద్ర అమెరికా లో ఇలాంటివి చాలా చేస్తున్నాడని చెప్పారు  వారి శ్రీమతి బాలా త్రిపుర సుందరి విద్యార్ధులను తెలుగు భాష సంస్కృతీ లపై మక్కువ పెంచుకొమ్మని అందమైన సుందరమైన మన భాషను మరచి పోవద్దని తమ పిల్లలను కాన్వెంట్ లలో చదివించకుండా అమలా పురం లో తెలుగు స్కూల్స్ లోనే  చదివిన్చామని ఒక భాష వస్తే మిగిలినవి సునాయాసం గా నేర్వ వచ్చని తమ పిల్లలే కాక చాలా మంది రుజువు చేశారని గుర్తు చేశారు .DSCF4542 DSCF4538 DSCF4535

ఆ తర్వాతముఖ్య అతిధి చి వేణుగోపాల రెడ్డికి  ,ఆలయ మర్యాదతో సత్కరించి,తర్వాతా సరసభారతి తరఫున శాలువా కప్పి చందన తామ్బూలాలిచ్చి  టాగూర్ చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించి ,శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం పుస్తకాన్ని ,నగదును కానుకగా ఇచ్చాం .,గురువు గారి చేతుల మీదుగా సత్కారం పొందిన తాను ధన్యుడను అని ఆనందం గా రెడ్డి తెలియ జేశాడు

శ్రీ డొక్కా దంపతులకు ఆ వెంటనే ముందుగా ఆలయ మర్యాదతోపూజారి మురళి  సత్కరించ గా సరసభారతి  తర ఫున శాలువా కప్పి దండ వేసి ,శ్రీసువర్చలాన్జనేయ స్వామి వారల పెద్ద ఫోటోలు రెండు  వారికీ వారి అబ్బాయి రామ భద్ర గారికి  అంద జేశాం .సరసభారతి పుస్తకాలు శ్రీ హనుమత్ కదానిది ,శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ,సిద్ధయోగి పుంగవులు ,ఉయ్యూరు ఊసులు రెండు సెట్లు వారికీ రామ భద్ర గారికి అందించాం .జరిగిన సన్మానానికి వారిద్దరూ కృతజ్ఞత తెలిపారు

తరువాత శ్రీ డొక్కా సూర్య నారాయణదంపతుల   చేతి మీదుగా ఆరుగురు విద్యార్ధులకు అమెరికాలో ఉన్న శ్రీ డొక్కా రామ భద్ర ఏర్పాటు చేసిన ‘’నిరతాన్న దాత ,అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారి స్మారకస్కాలర్ షిప్ లను ఒక్కొక్కరికి 1,667రూపాయల చొప్పున మొత్తం10,000 రూపాయలను ,సరసభారతి పుస్తకాలు సిద్ధ యోగి పుంగవులు ,శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం తో బాటు గురజాడ వారి  ఫోటో  జ్ఞాపిక గా అందించాము స్కాలర్షిప్ లు అందుకొన్న విద్యా ర్ధులు  తలి దండ్రుల తో వచ్చి ఏంతో సంతోషం గా అందుకొని డొక్కా వారికి,సరస భారతికి కృతజ్ఞతలు మనః పూర్వకం గా తెలియ జేశారు .అమర వాణి హైస్కూల్ ప్రిన్సిపాల్ నాగరాజు ఎవరూ ఎక్కడా చేబట్టని డొక్కా సీతమ్మగారి కార్యక్రమాన్ని నిర్వహించటం పేద విద్యార్ధులకు ఆమె స్మారకరూపం గా స్కాలర్షిప్ లను అందించటం సరసభారతి నిర్వహించటం చాలా గొప్ప విషయమని దీనికి డో క్కా వారి కుటుంబ సభ్యులు రావటం మరీ హర్ష దాయకమని తెలియ జేశాడు .కార్య దర్శి శివ లక్ష్మి వందన సమర్పణ చేసింది

చివరగా నేను ఈ కార్యక్రమానికి స్పూర్తి టి.వి.లో శ్రీ చాగంటి వారు ఆ మధ్య డొక్కా సీతమ్మ గారిని గురించి మాట్లాడి విద్యార్ధులకు ఆమె జీవిత చరిత్ర తెలియ జెప్పాలని కోరటమే నని ,ఈ సభ కిందటి సభ చాగంటి వారి ప్రేరణయే నని పరోక్షం గా కృతజ్ఞతలు తెలిపాను .అమరావతి ప్రభువు వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు పాలనలో గుంటూరు జిల్లా వేట పాలెం లో నివసించిన శ్రీ బందా పరదేశిదంపతుల   అన్నదానాన్ని గురించి రాజుకు తెలిసిన విషయాన్ని ,చివర్లో అన్నీ అమ్ముకొని ఊరు వదిలి వేరే ఊరు వెళ్తే అక్కడ సత్రం లో ఒక తల్లి పిల్లలకు ఆ రాత్రికి పప్పూ బెల్లం టిని పడుకోమని ఉదయమే పరదేశి గారింటికి వెడితే ఆయన కడుపు నిండా భోజనం పెడతారని చెప్పిన మాటలు పరదేశి దంపతులు విని అప్పటికప్పుడు మళ్ళీ తమ ఊరు వెళ్లి అమ్మకానికి ఏదీ లేక రుబ్బు రో లును ఒక షావుకారుకు రెండు రూపాయలకు అమ్మి దానితో అతిధులు వచ్చె లోపు భోజనం సిద్ధం చేసి వడ్డించారని రుబ్బు రోలును కోమటి తీసుకు వెళ్ళమని కోమని రోజ్జూ చెప్పేవాడని ఒక సారి పరదేశిగారు శ్రేష్టి ఇంటికి వెళ్ళాడని అతను రోలు ఎత్తితే దానికింద బంగారు లంకె బిన్దలున్డటం చూసి అవి తనకు చెందవని పరదేశిగారివేనని చెప్పి బతిమిలాడి ఇచ్చేశాడని దానితో మళ్ళీ అన్నదానం కోన సాగించాడని మనం చేసిన పుణ్యమే మన వెంట వస్తుందని సీతమ్మగారి ,పరదేశి గారి చరిత్రలు చెబుతున్నాయని ఈ వ్యాసాన్ని మిత్రులు విజయ వాడ వాసి  బందావెంకట రామా రావు గారు నాకు పంపించే దాకా నాకు పరదేశి గారిగురించి తెలియదని నెట్ లో అందరికి దాన్ని పంపానని చెప్పాను

శ్రీ ఆంజనేయ స్వామికి హారతీ ,మంత్రం పుష్పం, తీర్ధ ప్రసాద విని యోగం తో కార్య క్రమం పూర్తీ అయింది  .

మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –   23-10-13 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.