ప్రభావ శాలి అమెరికా ప్రెసిడెంట్ తల్లి నాన్సీ -విహంగ మహిళా వెబ్ మేగజైన్ -నవంబర్

ప్రభావ శాలి అమెరికా ప్రెసిడెంట్ తల్లి నాన్సీ -విహంగ మహిళా వెబ్ మేగజైన్ -నవంబర్

అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ పై  చిన్నతనం లో నే ప్రభావం చూపి మార్గ దర్శకత్వం చేసింది  అతని తల్లి

Nancy LincolnNancy Lincoln

నాన్సీ హాక్స్ లింకన్ .ఆమె1784 ఫిబ్రవరి 5న   వర్జీనియా లో నోబుల్ మాన్ అనిపించుకొన్నవ్యక్తి లూసీ హాంక్స్ కుమార్తె ..హాంప్ షైర్ కౌంటి లో పుట్టింది .అమ్మమ్మ చాలా బీద తనం లో ఉన్నా గౌరవం సాధించుకొన్నది .సరిహద్దు ప్రాంతం కనుక పొలం పనులు ,నేత చేతి పనులు తాత గారింట నేర్చింది బైబిల్ బాగా చదివి బెర్రీ హోమ్ లో ‘’సీమ్ స్ట్రెస్ ‘’గా వివాహానికి ముందు వరకు పని చేసింది అమ్మమ్మ ,తాతయ్యలనే అమ్మా ,నాన్న అని పిలిచేది నాన్సీ .. ‘’తన తల్లి తాత గారి గుణాలను వారసత్వం గా పొందిందని లింకనే చెప్పుకొన్నాడు .తనకు తల్లి లక్షణాలు సంక్రమించాయని కూడా అన్నాడు .1806 జూన్ పన్నెండున థామస్ లింకన్ తో నాన్సీ వివాహం జరిగి కెంటకి కి కాపురానికి వెళ్ళింది  .

       నాన్సీ చాలా చురుకుగా ,సూటిగా వివేకం తో తెలివి తేటలతో ఆ నాటి సమాజపు మిగిలిన స్త్రీల కంటే భిన్నం గా ఉండేది ఇవన్నీ కొడుకు లింకన్ సాధించాలని ఆమె ఆరాట పడేది .ఆ నాటి తన వయసు మహిళల సగటు ఎత్తు కన్నా నాన్సీ ఎత్తుగా ఉండేది .కాని చాలా బక్క పలచగా నూట ఇరవై  పౌండ్ల శారీరక  బరువుతో ఉండేది .ఆమెను చూసిన వారికి ఆమె క్షయ వ్యాధి తో ఉన్నట్లు సహజం గా అని పించేది .దీనికి తోడు ఎప్పుడూ దగ్గుతూ ,ఊపిరి గట్టిగా పీలుస్తూ ఉండేది .ఇవి ఆ వ్యాధి లక్షణాలే .నల్లగా ,గోధుమ రంగు జుట్టు తో ఉండేది పాలి  పోయిన కళ్ళతో కని పించేది ..ప్రస్ఫుటమైన నుదురు ,ముఖ కవళికల తోఉండేది  వయసు వచ్చినలింకన్ కూడా తల్లి లాగా కని పించే వాడు .

      నాన్సీ కెంటకి లో ఉన్న స్త్రీలందరిలో  రెస్లింగ్ లో అంటే మల్లయుద్ధం లో అద్వితీయ ప్రతిభ చూపేది .పందొమ్మిదో శతాబ్దపు తొలి భాగంలో కెంటకి లో  రెస్లింగ్ పురుషులకే ప్రత్యేకం కాదు స్త్రీలు కూడా నేర్చుకొనే వారు  .కెంటకీ మహిళా క్రీడాకారులలో నాన్సీ లింకన్ ది ప్రముఖ స్థానం .పురుషులతోనూ మల్ల యుద్ధం చేసి వారిని మట్టి కరపించే సామర్ధ్యం ఆమెది .ఆమె చక్కగా పాడేది ఎన్నో పాటలు ఆమెకు కంఠతా వచ్చు .ఆమె జ్ఞాపక శక్తి అమోఘం గా ఉండేది నిరంతరం పాటలు పాడుకొంటూ పనులు చేసుకొనేది .ఎక్కడో అడవిలో ఒంటరి కాబిన్ లో జీవిస్తున్న ఆమె కు ఈ పాటలే ధైర్యం ఇచ్చి పిల్లల ఆలనా పాలనా చూడటానికి ,వారిపై ప్రేమ కురిపించటానికి తోడ్పడేవి .ఈజ్ఞాపక శక్తి యే పిల్లలపై గొప్ప ప్రభావం చూపి వారికి మార్గ దర్శక మైంది అందుకే తల్లి అంటే లింకన్ అంత అభిమానం ఏర్పడింది .ఆమె అమృత మయ ప్రేమకు అతను కరిగి పోయాడు .ఆమెపై ఆరాధనా భావం ఏర్పడి జీవితాంతం దాన్ని కాపాడుకొన్నాడు లింకన్ .

         నాన్సీ అద్భుత మైన తెలివి తేటలతో ,సరైన నిర్ణయాలతో ,స్పష్టమైన తీర్పులతో డామినేటింగ్ గా డేరింగ్ మహిళ గా  అందర్నీ ఆకట్టుకొనేది .లింకన్ తొమ్మిదేళ్ళ వయసులో ఆమె అతన్ని తీర్చి దిద్ది దేశానికి ఉపయోగ పడే మహా నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఏర్పరచి స్పష్టమైన ఆలోచనా విధానాన్ని అలవాటు చేసుకోనేట్లు చేసిన ప్రభావ శాలి .చాలా వేగం గా విని గ్రహించటం చదవటం ,విన్నది  ప్రతిదీ మెదడులో సుస్తిరం గా .ఉంచుకోవటం ఆమె ప్రత్యేకత .ఆమెకు మంచి అంతర్ ద్రుష్టి ఉండేది అన్నీ విని నేర్చుకోవటమే  కాని చదువు లేని కాలం లో జీవించిన మహిళ నాన్సీ .బైబిల్ లోని సుదీర్ఘ పేరాలన్నీ ఆమెకు వాచో విదేయాలై పోయాయి .షేక్స్ పియర్ ఉపన్యాసాలు ,ఈసప్ కధలు ‘’బుక్ ఆఫ్ మార్టియర్స్ ‘’లో ని ప్రొటెస్టెంట్ మతస్తులు నక్కల పాలైన ఉదంతాలు ఇవన్నీ కధలుగా ఆమె విన్నదీ నిత్యం మననం చేసుకొనేది . ‘’అమెరికా డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్’’ .లోని ముఖ్య భాగాలను ,అమెరికా రాజ్యాంగం లోని ప్రముఖ భాగాలను  నాన్సీ బట్టీ పట్టి భద్రం గా మెదడు లో దాచుకోంది.ఇవన్నీతల్లి నోటి నుండినిరంతరం  వింటూ గ్రహించి ,అవగాహన చేసుకొన్నాడు .వాటి ఆంతర్యాలను చిన్నతనం లోనే లింకన్ తెలుసుకో గలిగాడు ఇదంతా తల్లి నాన్సీ ప్రభావమే .విస్తృత ప్రపంచాన్ని గురించి ఆమె కున్న మేధా పరిజ్ఞానం కొడుకు లింకన్ కు ఎంతో సహకరించింది

      తల్లి ప్రభావం తో లింకన్ తనలోని మేధకు పదును పెట్టుకొని వ్యక్తిత్వాన్ని దిద్దుకొన్నాడు .ముందుగా చదువు అంటే ప్రేమ, ఆసక్తి అతనిలో కలిగించింది తల్లి నాన్సీయే .సరైన వయసు రాగానే బడికి వెళ్లి అతను చదువుకోవాలని హితవు చెప్పింది ఆమెయే .ఏడేళ్ళ వయసు లో ఉన్న లింకన్ కెంటకీ ని వదిలి వెళ్ళే లోపు రెండు స్కూళ్ళలో చదువు నేర్చుకొన్నాడు .మొదటిది జకారియా రినే నడుపుతున్నది  ,రెండవది కాలేబ్ హాజల్ నడిపేదీ.అమెరికా విద్యా చరిత్రలో ఈ రెండు చిరస్థాయిగా నిలిచి పోయినవే .

    1861 లో లింకన్ కుటుంబం కెంటకీ నుండి ఇండియానాలోని స్పెంసర్ కౌంటికి చేరింది అక్కడ కూడా నాన్సీ తన కొడుకు లింకన్ ను వీలైనప్పుడల్లా పాఠ శాలకు పంపించేది.  ఆ స్కూల్ ఆజేల్ డార్సీ నడుపుతున్నది .లింకన్ ఫారం హౌస్ కు మైలున్నర దూరం లో ఉంది  .పదేళ్ళు వచ్చేదాకా వీలైనప్పుడల్లా లింకన్ అక్కడికి వెళ్లి విద్య నేర్చుకొనే వాడు .ఆ తర్వాత ఆండ్రూ క్రాఫోర్డ్ నడుపుతున్న స్కూల్ లో చేరి పద్నాలుగో ఏడు వచ్చేదాకా చదివాడు .తర్వాత మాత్రం మిస్టర్ స్వానీ అనే మాస్టారి దగ్గర పదిహేడవ ఏడు వచ్చేదాకా చదివాడు .ఆ నాటి బడులలో మేస్టర్లకు చదవటం రాయటం ,చిన్న చిన్న లెక్కలుఅంటే రూల్ ఆఫ్ త్రీ ( three r s)వస్తే చాలు మేస్టార్లు అయిపోయేవారు లాటిన్ వచ్చిన వాడు ఉంటే ,ఆయన్ను మాంత్రికుడు గా ఆశ్చర్యం గా చూసే వారు .మాస్టర్ల కు జీతాలు లేవు పిల్లల తలిదండ్రులు పండిన ధాన్యాన్నో ,జంతు చర్మాలనో ,,జంతువుల తొడల్నో ,దుప్పి మాంసాన్నో కానుకగా ఇస్తే చాలు.లింకన్ నాలుగు మైళ్ళు నడిచి వెళ్లి చదువు కోవాలసి వచ్చింది ఈ వానాకాలం చదువు ఒక ఏడాది మాత్రమే సాగింది .తను చదవు నేర్చుకోలేదన్న బాధ నాన్సీ కి ఉండేది. అందుకే తన కొడుకు గొప్ప విద్యా వంతుడు కావాలని ఆశించేది. .ఇలా అతన్ని చదివించటానికి భర్త తో రోజూ పోట్లాడ వలసి వచ్చేది కూడా .లింకన్ తండ్రి థామస్ లింకన్ మొండి వాడు. కొడుకు కండలు పెంచుకొంటే చాలు, బుద్ధి పెరగక్కర లేదనుకొనే రకం .ఎప్పుడూ చేతిలో పుస్తకం తో చెట్టుకింద కనిపించేవాడుకొడుకు . ఇలా ఉంటే కూలికి ఎవరూ పిలవరని ,కుటుంబ పోషణ కష్టమని తండ్రి భావించే వాడు .పనికి వెళ్ళక పోతే కొట్టే వాడు అతని కోపాన్ని భరించటం కష్టం గా ఉండేది ఆ తర్వాత ఇరవయ్యొక్కటవ  ఏడు వచ్చేదాకా ఏదో ఒక పని చేసి సంపాదించి అ డబ్బులతో కుటుంబ పోషణకు లింకన్  సాయపడే వాడు .

      1818 లో లింకన్ తల్లి నాన్సీ లింకన్ తొమ్మిదవ ఏట  ‘’మిల్క్ డిసీజ్ ‘’తో చని పోయింది .జ్ఞానోదయం అయిన లింకన్ చదవటం రాయటం పై శ్రద్ధ పెంచుకొన్నాడు .రాయటమూ అలవాటైంది గోడల మీద, లాగ్ దుంగల మీదా బొగ్గుతో, చాక్ పీస్ తో రాసేవాడు .తల్లి సాహచర్యం వల్ల  మేధో పరిజ్ఞానం ,విజ్ఞానం పై ప్రేమ, కవిత్వమూ అలవడ్డాయి అతను పెరిగిన వాతావరణం అంతా గ్రామర్ అంటే ఏమిటో తెలియని క్రూరమైన గ్రామ్య భాష ,తక్కువ స్థాయి మాండలికం మాట్లాడే వారి మధ్య ..కనుక తను మాట్లాడే భాషను సంస్కరించుకోవాలసి వచ్చింది డిక్షనరీ దగ్గరుంచు కొని ప్రతి మాటకు అర్ధం ,తాత్పర్యం గ్రహించాడు ఉచ్చారణ విధానం అవాగాహన చేసుకొన్నాడు .దీనితో భాష పై పట్టు సాధించాడు .సంస్కార వంత మైన భాష తో అవతలి వాడి హృదయాన్ని సూటిగా తాకే చెణుకులతో ,చతురోక్తులతో మాట్లాడి సెహభాష్ అని పించుకొని తల్లి ఋణం తీర్చుకొన్నాడు

 నాన్సీ  అప్పుడప్పుడు డిప్రెషన్ కు లోనయ్యేది ఇదీ లింకన్ పై ప్రభావం చూపింది. విషాదం అతని ముఖంలో కనిపించేది .తల్లి మరణం ,కొంత మంది కుటుంబ సభ్యుల మరణం లింకన్ ను కుంగ దీసింది . తల్లి మిల్క్ సిక్ నెస్  వ్యాధి తో మరణించిందని ముందే చెప్పుకొన్నాం .ఆ వ్యాధి ఇండియానోలో బాగా ఉండే.ది పీజియన్ క్రీక్ నది పరిసర ప్రాంతాల్లో అంటే లింకన్ కుటుంబం నివసించిన ప్రాంతం లో విపరీతంగ వ్యాపించింది .వేలాది  మంది మరణాలకు కారణమయింది .ఈ వ్యాధికి కారణం‘’వైట్ స్నేక్ రూట్ ‘’ను తిన్న ఆవు పాలు తాగటం వల్ల  వచ్చేది అని తర్వాత పరిశోధనల్లో తేలింది ఇది ఆవులో విషాన్ని తయారు చేసేది. అది పాలలో చేరేదన్న మాట .దీన్ని ‘’రివర్ సిక్నెస్’’  అని ‘’,ప్యూకింగ్ ఫీవర్’’ అని ఆ కాలం లో పిలిచే వారు ఈనాటి ‘’mad cow’’ వ్యాధి లాంటిది .ఈ వ్యాధి సోకితే ముందు నీరసం తర్వాత వణుకు ,ఒళ్లంతా బాధా, ,ఒళ్లంతా తిమ్మిరి ,వాపు వచ్చి డిప్రెషన్ ఏర్పడి వాంతులు వచ్చి పాలిపోయి క్షయ గా మారి చర్మం చల్ల బడి ,తెల్లబడి నాడీ  స్పందన క్రమం లో ఉండక నరక యాతన అనుభవిస్తు కోమాలోకి వెళ్లి చని పోతారు ఈ వ్యాధితో వారం బాధ పడి నాన్సీ చనిపోయింది .చనిపోయే ముందు కొడుకు లింకన్ ను ప్రేమగా పిలిచి ఆప్యాయం గా నెమ్మదిగా ‘’కుటుంబాన్ని ప్రేమించు దైవాన్ని నమ్మి పూజించు ‘’అని హితవు చెప్పి 1818 సెప్టెంబర్ అయిదున ముప్ఫై నాలుగవ ఏట మరణించింది .తల్లి శవ పేటిక ను తయారు చేయటం లో లింకన్ తండ్రికి సాయ పడ్డాడు .ఆమెను పయనీర్ సెమేటరిలోఖననం చేశారు అదే ఆ తర్వాత‘’నాన్సీ హాంక్స్ లింకన్ సెమెటరి’’గా పిలువ బడింది .   

    తల్లి నాన్సీ చెప్పిన చివరి రెండు మాటలు  లింకన్ కు తారక మంత్రాలై జీవితం లో పాటించి తల్లి ఋణం తీర్చుకొన్నాడు .తల్లి మరణాన్ని నెలల తరబడి మర్చి పోలేక పోయాడు .తల్లి గురించి ఎప్పుడు మాట్లాడినా లింకన్ ఆరాధనా భావం తో మాట్లాడే వాడు కుటుంబ బాధ్యతను తండ్రితో బాటు తీసుకొని తండ్రి మరణానంతరం కూడా ఆ బాధ్యతను సంతృప్తిగా నిర్వర్తించాడు తండ్రి కి బాసటగా లింకన్ పెద్ద అయ్యే దాకా అక్క సారా ఇంటి బాధ్యతలు నిర్వహించింది . మొదట్లో క్రైస్తవం పై నమ్మకం లేక పోయినా క్రమం గా పరమ గురువుల సాన్నిధ్యం లోగడిపి ,ప్రభావవంతమైన గ్రంధాలను చదివి యేసు క్రీస్తును ఆరాధించి తన సమస్యలకు పరిష్కారాలను సాధించుకొన్నాడు .

  –  గబ్బిట దుర్గా ప్రసాద్

– See more at: http://vihanga.com/?p=10224#sthash.C3MMinPj.dpuf

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.