విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -4

      విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -4

ప్రపంచ గణితానికి సేవలందించిన అలనాటి మన గణితశాస్త్రజ్ఞుల కృషి

రెండవ భాస్కరా చార్యుడు  1114లో కర్ణాటకలో బీజా పూర్ లో జన్మించాడు .తండ్రి మహేశ్వరోపాధ్యాయులే తొలి గురువు .కన్నడ దేశం లో పుట్టిన తొలి గణితజ్నులు ఇద్దరిలోవీరు  ఒకరు ,మరొకరు మహా వీరాచార్యులు .భాస్కరుడు రాసిన ‘’సిద్ధాంత శిరోమణి ‘’లో గణితం లోని ఎనిమిది మౌలిక అంశాలైన సంకలనం ,వ్యవకలనం ,హెచ్చ వేత ,భాగహారం ,వర్గం ,వర్గ మూలం ,ఘన మూలాలను సోదాహరణం గా వివా రించాడు .బీజ గణిత సింబల్స్ ధ్రువీకరించటం లో భాస్కరుడు విశేష కృషి చేశాడు

భాస్కరుని కుమార్తె పేర ‘’లీలా వతి గణితం ‘’వ్యాప్తి చెందింది .కూతురు పెండ్లి ముహూర్తాన్ని తప్పుగా నిర్ణయించటం వల్లఆమె త్వరలోనే వితంతువు అయింది .ఎంతో వ్యధ చెంది కాల నిర్ణయం పట్ల అశేష శ్రద్ధ చూపించాడు .దీని వల్లనే కాల నిర్ణయానికి’’ ఇసుక గడియారం నీటి గడియారాలను’’ సృష్టించాడు .లీలావతికి దగ్గరుండి గణిత మర్మాలన్ని నేర్పి విదుషీ మణి ని చేశాడు ‘లీలా వతి గణితం లో ఆయన గణిత అధ్యయనా లేమిటో అర్ధ మవుతుంది .గోళం ,అర్ధ గోళం మొదలైనవి ఖగోళ శాస్త్రం లో భాస్కరుడి వల్లనే ప్రాచుర్యం పొందాయి .’’గ్రహ గణిత ‘’అధ్యాయం లో గ్రహాల  గమనాలను కూలంకషం   గా చర్చించాడు .ఈయన్నే ఆ తర్వాతా జ్యోతిష శాస్త్రం లో నూ వాడుకోవటం జరిగింది కొందరు దీన్ని ‘’పంచాంగం ‘’గా మార్చేశారు .ఇతను రాసిన అధ్యాయాలన్ని పాశ్చాత్య భాషల్లోకి అనువాదం అయ్యాయి .1817లో కోహ్రీ బ్రూక్ అనే అతను లీలా వతి గణితాన్ని అనువాదం చేశాడు .అక్బర్ మంత్రి అబుల్ ఫాజి పార్శీ లోకి ‘’కరణ కుతూహల ‘’గా అనువదించాడు .ఇంత జరిగినా భాస్కరుడు మన వాళ్లకు 700ఏళ్ళుగా తెలియనే లేదు .భూమ్యా కర్శర్శన సిద్ధాంతాలను కూడా భాస్కరుడు తెలియ జేయ గలిగాడు .ఆధునిక సిద్ధాంతం ప్రకారం కూడా భూమికి ఉన్న ఆకర్షణ వల్ల  తన వైపుకు లాగుతుంది అని భాస్కర సిద్ధాంతాన్నే సమర్ధిస్తోంది .

మన ఆర్య భట ,బ్రాహ్మ గుప్త భాస్కరుల విశేష శేముషికి అచ్చెరువొందిన పాశ్చాత్య శాస్త్ర వేత్తలు కైమోడ్పులర్పించారు. అందులో ప్రఖ్యాత సాపేక్ష సిద్ధాంత కర్త అయిన్ స్టీన్ శాస్త్ర వేత్త ‘’మనకు లెక్కలు నేర్పి, విజ్ఞాన వంతుల్ని చేసిన భారతీయులకు మనం ఎంతో రుణ పడి ఉన్నాం .పూర్వపు భారతీయ శాస్త్రాలు లేకుండా ఏ రకమైన శాస్త్ర ,సాంకేతిక పరి శోధనలు సాధ్య మయ్యేవి కావు ‘’అని నిండు మనసుతో మెచ్చుకొన్నాడు ఆ మేధావి .

యంత్ర శాస్త్రం లో యంత్రాల గమనం లెక్కలున్నాయి దీన్ని ఆవిష్కరించిన వాడు ఆర్య భట్టు .పరస్పర విరుద్ధ దిశలలో రెండు యంత్రాలు చలిస్తుంటే ఆ రెంటి వేగాల మొత్తం ద్వారా వాటి మధ్య దూరాన్ని భాగించాలని ,ఒకే దిశలో కదుల్తుంటే వేగాల తేడాతో దూరాన్ని భాగించాలి అని చెప్పాడు త్వరణం (ఆక్సిలరేషన్ )మీద ఆర్య భట్టు కు ఎంతో భావనా సామర్ధ్యం ఉందిఅని క్రీ.శ.499లోనే రుజువైంది

శ్రీధరా చార్యుడు అనే గణితజ్ఞుడు ‘’పాటి గణిత ‘’అనే గ్రంధం రాశాడు అందులో వ్యాపార గణక శాస్త్ర సూత్రాలు ఉన్నాయి .శాతాలు, వడ్డీ ,భాగస్వామ్యం ,పెట్టు బడిలో భాగాలు, లాభాల పంపకం మొదలైన విస్త్రుతాంశాలందులో ఉన్నాయి

సరి సంఖ్యలకు బేసి సంఖ్యలకు స్క్వేర్ ఎప్పటికీ స్తిరం గా ఉంటుంది .బేసి సంఖ్యలకు వర్గ మూలం ఉండక పోవటం బేసి సంఖ్యల స్వభావం అని భాస్కర ఉవాచ .సరాసరి నిష్పత్తి ,నిష్పత్తి ప్రకారం విభజన మొదలైన గణిత సూత్రాలను రెండవ భాస్కరుడే మేధా సంపత్తి తో రూపొందించాడు .యజ్న యాగాదులకోసం చేసే అగ్ని గుండాలను నిర్మించటం లో చదరం ,సర్కిల్, త్రికోణం మొదలైన కొలతలను ఖచ్చితం గా ఈ భాస్కరుడే తెలిపాడు .పైదాగరస్ కు ముందే ప్రత్యెక ఆకారాలకు సూత్ర నిర్మాణం జరిగింది మన దేశం లో .పైధగారాస్ గణిత శాస్త్రం ఆయన స్వంతం కాదని ‘’ప్రోక్లూస్ ‘’అనే విజ్ఞుడు 460లోనే చెప్పాడు .అప్పటికే బౌద్ధాయన గణిత సిద్ధాంతాలు ప్రపంచ వ్యాప్తి చెందాయి .

పదకొండవ శతాబ్ది వాడైన జయ దేవ, భాస్కర ‘’చక్ర వాళ ‘’విధానం ,వర్గ మూల సిద్ధాంతం అభి వృద్ధి చేశారు 800 ప్రాంతం వాడైన గోవింద స్వామి ,బోధాయన వర్గ మూలాలను విశ్లేషించారు .రెండు కు వర్గ మూలం విలువ 1.4142156గా ఆపస్తంభుడు ,కాత్యాయండు నిర్ణయించారు .ఆధునికులు దీని విలువను ‘’1.414213గా నిర్ణయించారు

‘’గణిత శాస్త్ర ప్రకాన్దుడు’’ అని పిలువ బడ్డ మహా వీరాచార్య కర్ణాటకలో 850 లో జన్మించాడు ఈయన రాసిన ‘’గణిత సార సంగ్రహం’’ ‘’ఒక్కటే దొరికింది .అరిద్ మాటిక్ ఆల్జీబ్రా జ్యామెట్రీ లలో ఈయన కృషి అపారం .సున్నా ,త్రికోణం సమకోణం మొదలైన వాటి స్వరూప స్వభావాల గురించి ప్రామాణికం గా  చూపాడు .లఘుకోణం కొనికల్ ఆంగిల్ ,కాన్కేవ్ యాంగిల్ ,కరెస్పాండింగ్ యాంగిల్ ,సర్కం యాంగిల్ ,ఆల్తెర్మేట్ యాంగిల్ ,కాన్వేక్స్ యాంగిల్ ,క్రిటికల్ యాంగిల్ ,బ్లాన్తర్ యాంగిల్ ,రిఫ్లెక్స్ యాంగిల్ ,బేస్ యాంగిల్ ,రిఫ్లెక్షన్ యాంగిల్ ,అడసేంట్ యాంగిల్ ,సర్కం యాంగిల్ మొదలైన కోణాలను ఆవిష్కరించిన మేధావి మహా వీరా చార్యులే .హెచ్చ వెత లో అసంఖ్యాక లెక్కలను ఉదాహరించిన ఘనత ఈ అచార్యునిదే .నెగటివ్ నంబర్స్ ,రూట్స్ మధ్య ఉన్న సంబంధాన్ని కూడిక భాగహారం గుణ కారాలను చతురస్రాలు ,దీనికి వర్గ మూలాలు మొదలైన వన్నీ మహా వీరా చార్య గ్రంధం లో ఉన్నాయి అంటే నోరు వెల్ బెట్టి చూస్తాం ఎందు కంటే మన వాళ్ళ మీద మనకున్న నమ్మకం ఆండీ అది .ఈ గ్రంధం 1912లో మాత్ర్రమే వెలుగు చూసింది .ఈయన ‘’నృప తుంగ ‘’మహా రాజు ఆస్థానం లో ఉండగా మరిన్ని గణిత గ్రంధాలు రాసినట్లు తెలుస్తోంది కాని

బయ పడక పోవటం మన దుర దృష్టం .భారత దేశానికి ఒక గొప్ప వైజ్ఞానిక పరంపర ఉంది అన్న విషయం ,విశ్వాసం కలిగించిన వాడే మహా వీరాచార్యులు .

తెలుగులో  మొదట ఆ గణిత శాస్త్రాన్ని రాసిన ఘనత పావులూరి మల్లన్న కే దక్కింది ..ఈయన రాసిన ‘’సార సంగ్రహ గణితం ‘’పద్యాలలో రాయటం ప్రత్యేకత .1019లో గుంటూరు జిల్లల గుండ్ల కమ్మ నదీ పరివాహ ప్రాంతం పావులూరు లో  జన్మించాడు .ఈయన ను గురించి తెలుసుకొన్న రాజ రాజ నరేంద్రుడు తన ఆస్తానానికి ఆహ్వానించి మహా వీరాచార్య రచించిన ‘’గణిత సారసంగ్రహం ‘’ను అనువాదం చేయమని కోరాడు .ఈ అనువాదానికి మెచ్చి పిఠాపురం దగ్గర ఉన్న ..నవ ఖండ ‘’అగ్రహారాన్ని ధారాదత్తం చేశాడు .దీన్ని ఒక పద్యం లో వర్ణించాడు మల్లన్న .తనకు అవగాహన అయిన గణిత సూత్రాలను మక్కీకి మక్కీ గ్రాంధిక పద్యాలుగా అనువాదం చేశాడు .అన్ని పధ్యాలు దొరకలేదు. కొన్ని మాత్రమె లభ్యం .అందువల్ల పెద్దగా ప్రచారానికి నోచు కోలేకపోయింది   ఇది ఇందులో చిక్కు లెక్కలు ,గమ్మత్తు లెక్కలు చాలా ఎక్కువ గా ఉన్నాయి .విద్యార్ధులకు బానే ఉపయోగ పడే పుస్తకం .అంటే మొదటి సారి గా విద్యార్ధుల కోసమే రాసిన గ్రంధం అయింది పావుల్లోరి మల్లనీయం .అయితే ఛందస్సు, కఠిన పదాలు చిక్కని రచనా వల్ల  చేరువ కాలేక పోయింది .ప్రయత్నం మాత్రం మంచిదే .ఉదాహరణకు ఒక పద్యం –

‘’ఆరు నొక్కట్లు నొడ్పుగా నమర బెట్టి –యంత గుణకం బు చేతను నమర బెంచి ‘’

అంటే ఒకట్లను వరుసగా ఆరు రాసి ఆరు ఒకట్ల తో హెచ్చిస్తే  111111ను మళ్ళీ111111చేత హెచ్చిస్తే వచ్చే జవాబు  12345654321అని అతి సూక్ష్మం గా వివ రిస్తుంది ఈ పద్యం అంటే ముందు ఆరు అంకెల ఆరోహణ క్రమం తర్వాత అవరోహణ క్రమంలో ఆన్సర్ వస్తుంది అన్న మాట .ఇలాంటివి కోకొల్లలుగా ఈపుస్తకం లో ఉన్నాయి

తడక మల్ల వెంకట కృష్ణా రావు లీలావతి గణితాన్ని తెలుగులో అనువాదం చేశారు వ్యాఖ్యానం కూడా చేశారు. ఆర్య భాతీయం కు  సూర్య దేవర ఎల్లయ్య మొదలైన వారు టీకా టిప్పణునులు రాశారు. కృష్ణా జిల్లా మేడూరు కు దగ్గరలో ఉన్న ‘’మధునా పురం ‘’వాస్తవ్యులు  నివాసి  వెంకటేశ్వర్లు ఆర్య భటీయం లోని ఖగోళ అంశాలను తెనిగించారు .ఇలా ఎందరోగణితజ్ఞులు  గణిత శాస్త్రాన్ని మన దేశం లో అభివృద్ధి చేశారు .అందరికి వందనాలు .

వైద్య శాస్త్రం లో అలనాటి శాస్త్రజ్ఞుల కృషి గురించి తర్వాత తెలుసు కొందాం

సశేషం

ఆంద్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ ,’’ధన్ తేరాస్’’ శుభా కాంక్షలతో

 

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-11-13-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సైన్స్ and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.