ఆంద్ర వివేకానందులు ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులు -3

ఆంద్ర వివేకానందులు ప్రతి వాద భయంకరులు శ్రీ ప్రభాకర ఉమామహేశ్వర పండితులు -3

ప్రభాకర సనాతన ధర్మ ప్రసంగ జైత్ర యాత్ర

కృష్ణా ,గుంటూరు, గోదావరి జిల్లాలో సనాతన ధర్మ ప్రసంగ జైత్రయాత్రను పూర్తిగావించు కొన్న ప్రభాకరులు సామర్ల కోట కాకినాడ ,పిఠాపురం ,తుని ,అనకాపల్లి ,విశాఖ పట్నం ,విజయ నగరం ,శ్రీ కాకుళం ,బరంపురం మొదలైన పట్నాలలో ప్రజల్లో ధార్మిక మహా చైతన్యాన్ని కల్గించారు .ఆ తర్వాత చిత్తూర్ ,జిల్లాలో పర్యటన చేశారు .ఆ రోజుల్లో అమా వాస్య రోజు సెలవు ఉండేది ఆ రోజు అందరు సోదర మైత్రీ భావం తో మెలగాలని పండితుల వారు ‘’అమా వాస్య భజన’’ అనే ప్రత్యెక కార్యక్రమం చే బట్టారు .ఇది ప్రజల్లో గొప్ప చైతన్యం కల్గించింది ..

కంచి పరమాచార్య శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల వారు పండితులను ఆశీర్వదించారు .ప్రజలు మేళ తాళాలతో ఊరేగించారు తిరుపతి లో లక్షలాది ప్రజలు వీరి ఉపన్యాసాల విన్నారు .ఇదిప్రభుత్వం గమనించి అరెస్ట్ చేసి మద్రాస్ కు పంపింది .అక్కడ కాశీ నాధుని నాగేశ్వర రావు పంతులుగారు పండితుల వారికి స్వాగతం పలికి ఉద్యమాన్ని  బల పరిచారు .చిత్తూరు జిల్లాలో ప్రసంగించాకుండా  బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది .హిందూపురం ,మద్రాస్ బెంగుళూరు పట్నాలలో తమ ప్రసంగాలను కోన సాగించారు .

నిజాం రాష్ట్రం లో సికిందరాబాద్ లో ‘’సదాచార నిబందనీ పరిషత్ ‘’ను పండితుల వారు స్తాపించారు ‘’హిందూ గ్రంధ మాల ‘’పేరిట ఎన్నో గ్రంధాలు ప్రచురించారు నలభై ఏళ్ళ పాటు నిజాం రాష్ట్రంలో ధర్మ ప్రచార సభా జైత్య యాత్ర చేశారు .తరువాత విజయ వాడకు వచ్చి అక్కడే స్తిర నివాసం ఉన్నారు .తన యావత్ శక్తి యుక్తుల్ని హైందవ వ్యతిరేక ప్రచారాన్ని వమ్ము చేయటానికి ఉపయోగించిన మహా మనీషి ప్రభాకరులు .క్రైస్తవులు సంధించే అనేక ప్రశ్నలకు దీటైన సమాధానం చెప్పి నిరుత్తరుల్ని చేసే వారు

సాధారణం గా మిత భాషి అయిన పండితుల వారు వేదిక ఎక్కగానే మహోధృత రూపం లో ప్రసంగం చేసే వారు .సహజ సాత్వికులు ఆయన ఆహారమూ సాత్వికాహారమే .పాలు గోధుమ రొట్టెలు మాత్రమె తీసుకొనే వారు ఇంతకు మించి వేటినీ తినే వరుకారు .ప్రతి రోజు తలంటి పోసుకొనే వారు .ప్రాణాయామం చేసే వారు గాయత్రీ మహా మంత్రం జపం దీక్షగా చేసే వారు .చాలా తక్కువా సమయమే నిద్రపోయేవారు .ఇంత క్రంశిక్షంతో ఉండబట్టే 92సంవత్సరాలు పూర్ణాయుస్సుతో జీవించారు .రోజుకు కనీసం 18గంటలు పని చేసే వారు .సర్వ స్వతంత్ర జీవులు .రామాయణ మహాభారత భాగవత సారాన్ని జన సామాన్యానికి అందించటానికి ‘’హిందూ మతం ‘’అనే పేర రెండు వేల పేజీల మహా గ్రంధాన్ని రచించారు .అయన శతాధిక గ్రంధ కర్త కూడా .

దక్షిణ భారత జైత్ర యాత్ర సంతృప్తిగా ముగించుకొని ఉత్తర దేశ యాత్ర చేశారు .1964 మే నెలలో పండితుల వారు తన బృందం తో ఉత్త్తర భారతం చేరారు .స్వర్గంగా ప్రవాహ సదృశమైన పండితుల వారి వాణి ఉత్త్తర దేశీయులనూ విశేషం గా ఆకర్షించింది .కాశీ పండితులను కూడా సంభ్రమాశ్చర్యాలతో వారి ఉపన్యాసాలనువిని  కీర్తించారు కలకత్తా ,గయా ,కాశీ ,అలహా బాద్ ,హరిద్వార్, రుషీ కేష్ ,బదరి ,ఆగ్రా ,అయోధ్య ,మధుర ,డిల్లీ ,బాంబే ,పూనా ,అహమదా బాద్ ,కాన్పూర్ మొదలైన పట్నాలలో ప్రసంగ జైత్రయాత్ర దిగ్విజయం గా నిర్వహించారు .వారి ధర్మ పత్ని ,కుమారుడు ప్రభాకర శ్రీ కృష్ణ భగవాన్ ,ఉప్పులూరి మల్లికార్జున శర్మ , వెంట్ర ప్రగడ రాధాకృష్ణ శర్మ మున్నగు వారు పండితుల వారి బృందం లో ఉన్నారు

భగవాన్ సత్య సాయి బాబా పండితుల వారిని రప్పించి సన్మానించి ఆశీర్వదించారు .తమతో బాటు బాబా పండితుల వారిని ఆంధ్ర దేశ పర్యటన లో వెంట తీసుకు వెళ్ళే వారు. అంతటి అభిమానం ప్రభాకరులంటే బాబాకు .

ప్రభాకర సన్మాన సంరంభం

1953లో మద్రాస్ లో విక్టోరియా హాల్ లో బులుసు సాంబ మూర్తి గారి అధ్యక్షతన పది హీను రోజులు పండితుల వారి ధార్మిక ప్రసంగ ధారా సాగింది .చివరిరోజు ఘనం గా సత్కరించారు ‘’దేవా రహస్యం ‘’అనే వారి పుస్తకం అక్కడే ఆవిష్కరించారు ‘’సువర్ణ ఘంటా కంకణ ‘’సత్కారం జరిపి ఆ  పుంభావ సరస్వతికి ఘన నీరాజనాలు పలికారు .

1953లో బెంగుళూర్ లో ‘’విశ్వేశ్వర పురం ‘’లో పండితుల వారి ప్రసంగాలను మూడు నెలల పాటు నిర్వహించారు .’’హిందూ మతం ‘’అనే పండితుల వారి ఉద్గ్రంధం ఇక్కడే ఆవిష్కృత మైంది .

1956లో జరిపిన ఉత్తరాంధ్ర పట్నాలపర్యటనలో ‘’ఆర్యులు విదేశాల నుండి ఈ దేశానికి రాలేదు ‘’,’’వేదములు మనవ రచితములుకావు ‘’,’’హిందూ దేవతలు వ్యభిచారులు కారు ‘’,స్వర్గ నరకములున్నవి ‘’,’’దశావతారముల లోని పరిణామ రహస్యం ‘’,’’కర్మ కాన్దలకాం డలలోని వైశిష్ట్యం ‘’,’’వివాహ రహస్యం ‘’,’’కృష్ణావతార రహస్యం ‘’,’’గీతా సారం ‘’మొదలైన విషయాలపై అద్భుత ప్రసంగాలు చేసి ఆస్తిక జన హృదయాల్లో భక్తీ బీజాలు నాటి ,మన వారసత్వసంపద పై   గొప్ప అవాగాహన కలిగించారు. అందరికి ఉన్న సహజ సందేహాలకుజవాబులుగా  ఈ ప్రసంగాలు ఏంతో  దోహదం చేశాయి.ఈ సందర్భం లో పండితుల వారిని అపూర్వం గా సత్సత్కరించి గౌరవాదరాభిమలు చూపి కృతజ్ఞతలు ప్రకటించుకొన్నారు .

ఉత్తర దక్షిణ దేశాల్లో అపూర్వ జైత్రయాత్ర దిగ్విజయం గా ముగించుకొన్న ప్రభాకరులు 1965లో నెల రోజులువిజయ వాడ లో  ఆంద్ర ప్రభ సంపాదకులు నీలం రాజు వెంకట శేషయ్య గారి సమక్షం లో ప్రారంభించి సంపూర్తి చేశారు .డాక్టర్ టి.వి.ఎస్.చల పతిరావు ,అధ్యక్షతన కార్య నిర్వాహక సంఘం ఏర్పడి శ్రోతలకు మహా గొప్ప ఏర్పాట్లు చేశింది .గుంటూరు కలెక్టర్ అధ్యక్షతన శతావధాని పళ్ళే పూర్ణ ప్రజ్ఞా చార్యులు ,అనేక కవి ,పండితులసమక్షం లో  మధ్య అశేష జన వాహిని కర తాల ధ్వనుల మధ్యశాస్త్రోక్తం గా ‘’కనకాభి షేకం ‘’అమోఘం గా చేసి భక్తీ ప్రపత్తులు చాటుకొన్నారు

.1966లో చీరాలలో పండితుల వారి ధర్మోపన్యాసాలు నెల రోజులు చేబట్టారు ఆబాల గోపాలాన్ని పండితుల వారు ఆనందాబ్ధి లో ముంచి తేల్చారు మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యం లో ‘’పుష్ప కిరీటం ‘’సమర్పించి సహృదయ సుగంధాన్ని వెలయించారు పుర ప్రముఖులు .పట్టు వస్త్రాలతో జ్ఞాపిక లతో ఘన సన్మానం చేశారు వారి గ్రంధ ముద్రణకు నిధిని విరాళం గా సమర్పించారు ..

బాపట్లలో శ్రీ భావనారయణ స్వామి వారి దేవాలయం లో వీరు ధర్మ శంఖారావం 1966జూన్ లోపూరించారు .ప్రభాకర దంపతులను జిల్లెల్ల మూడి అమ్మ అనసూయా దేవి గారి సమక్షము  లో ఎంతో చారిత్రాత్మకం గా ‘’గండ పెండేరం ‘’తొడిగి పట్టువస్త్రాలు సమర్పించి సన్మానించారు  గ్రంధ ముద్రణకు నిధిని సమకూర్చారు ,

1957మే లో  హైదరాబాద్ ,సికందరా బాద్ నగరాలలో పండితుల వారి నెల రోజుల పాటు ధార్మిక ప్రసంగాలు చేశారు .జంట నగరాల లోని అన్ని ముఖ్య దేవాలయాలలో ,ఆధ్యాత్మిక సంస్థలలో వారు ఉపన్యసించారు ముఖ్య మంత్రి కాసు బ్రహ్మా నంద రెడ్డి గారు పండితుల వారింకి ‘’కిరీటం ‘’తొడిగి ఘన సత్కారం చేశారు .

1968 జూన్ లో విజయ వాడ కొత్త గుళ్ళలో నెల రోజులు సనాతన దార్మాన్ని గురించి ఉపన్యసించారు .దేవాదాయ శాఖ మంత్రి రుద్ర రాజు రామ లింగ రాజు అధ్యక్షతన ‘సామ్ర్రాజ్యాపట్టాభి షేకమహోపంన్యాస సన్మానం ‘’ను వైభవో పేతం గా ని ర్వ హించారు .శాసన సభ్యులు చలపతి రావు గారు, మంత్రి గారు ప్రభాకరుల ఆస్తిక సేవలనుబహుదా ప్రస్తుతించారు .

1981లో తిరుమల తిరుపతి దేవస్తానం వారు’’ ఆస్తాన పండితుని’’ గా పండితుల వారిని నియమించి అపూర్వ గౌరవం కలిగించారు  పెజావర్ స్వామి ప్రభాకరులకు ’స్వర్ణ తకం ‘’,అందజేస్తే చిన జీయర్ స్వామి పట్టువస్త్రాలతో ఆశీర్వ దించారు .కార్య నిర్వహణ అధికారి  పి.వి.ఆర్.కే .ప్రసాద్ ‘’పండితుల వారి జీవితం ఒక మాహోద్యమం  ,వారే ఒక మహా సంస్థ ‘’అని కీర్తించారు .ప్రభాకరుల 75వ ఏట వారి ధార్మిక సేవకు ఏడుకొండల వాడైన ’’శ్రీ వారి ఆస్తాన పండిత ‘’హోదా  అరుదైన గుర్తింపుగా  లభించి చిర స్తాయిగా నిలిచి పోయింది

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -4-11-13-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.