పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల నటనా కౌశలం -1
ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో గొప్ప తెలుగు అధ్యాపకులు అని రీడర్ అని ఆయన క్లాసుల్లో చెప్పిన నోట్స్ ను వేలాది కాపీలు విద్యార్ధులు చదివి ఉత్తీర్నులయ్యారని వెంకట శాస్త్రి గారి ప్రధాన శిష్యుల్ని గురువు గారితో కలిసి ఎన్నో అవధానాలు చేశారని ,ఆయన కాటూరి వెంకటేశ్వర రావు గారితో జంట కవిత్వం చెప్పి ”సౌందర నందం ”అనే సుందర కావ్యాన్ని రచించారని ,తొలకరి ని ని కూడా ఇద్దరు కలిసే రాశారని ,తిరుమల తితిరుపతి దేవస్తానం వారి విశ్వవిద్యాలయం లో వారు ప్రొఫెసర్ గా పని చేశారని,స్వయం గా సాహిత్య శిల్ప సమీక్ష రాశారని అలానే కుమారవ్యాకరణం విద్యార్దులకోసం రాశారని అందరికి తెలుసు .కాని తిరుపతి యూని వర్సిటీలో ”దీన్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ ”పొందిన తోలి తెలుగు ప్రొఫెసర్ పింగళి వారే నని,,తెలుగు వాజ్మయ చరిత్ర అసమగ్రం గా రాశారని దాన్ని ఆ తర్వాతఅకాడెమి పూర్తీ చేసి ప్రచురించింది అని అతి కొద్ది మందికే తెలుసు .పింగళి వారు ఎంతో అద్వితీయ నాటక రంగ నటులని కొన్ని పాత్రలను వారు న భూతో గా నటించారు అన్న సంగతి ఎక్కువ మందికి తెలియక పోవచ్చు ..పింగళి వారి రంగస్తల నటనా కౌశలాన్ని గురించి వివరం గా తెలియ జేయటమే ఈ వ్యాసం లో నా ఉద్దేశ్యం .
సుమారుగా 1912లో గుంటూరు లో ”నరకాసుర వధ ”నాటకం శ్రీ కృష్ణ పాత్ర కోసం పోటీలు జరిగాయి అందులో పింగళి వారు ”బలభద్రుడు ”పాత్ర ధరించారు .బుర్రా రాఘవాచార్యులు కృష్ణ పాత్రకు ముఖ్య పోటీ దారు .న్యాయ నిర్ణేతలు హరి ప్రసాద రావు ,బలిజే పల్లి లక్ష్మీ కాంతం గార్లు .అందరు పింగళి వారి నటనే సూపర్బ్ అని మెచ్చారు .ఆయనకే బంగారు పతాకాన్ని ఇవ్వాలని ఏకగ్రీవం గా నిర్ణయించారు .కాని జరిగింది కృష్ణ పాత్రకు పోటీ కనుక బుర్రా వారికి బంగారు పతకం అంద జేశారు .చిన్నతనం లోనేఅంటే పది హేనువ ఏటనే హేమా హేమీల చేత ప్రసంశ లందు కొన్న వార య్యారు పింగళి వారు
పింగళి వారి అన్నగారు నరసయ్య గారు గుంటూరుజిల్లా పేద పులి వర్రు గ్రామం లో ఒక నాటక కంపెనీ స్తాపించి తమ్ముడిని అందులో చేర్పించారు .తమ్ముడు అర్జునుడుగా ,అన్న గారు గయుడుగా ”గయో పాఖ్యానం ”లో నటించే వారు .నరకాసుర్ర వధ లో కృష్ణుడు లక్ష్మీ కాంతం గారైతే నరకాసురుడు నరసయ్య గారు .నర్సయ్య గారు పులి వర్రు వదిలేశారు తూ గో జి.లోని పసర్ల పూడి లో ఒక ఔత్సాహికులు నాటక కంపెని స్తాపించి నరసయ్యగారిని ఆహ్వానిస్తే తమ్ముడితో సహా వెళ్ళారు తమ తో బాటు రాం భాయ్ అనే నటిని కూడా తీసుకొని వెళ్లి ఆ కంపెనీ లో చేర్పించారు .సారంగధర నాటకం లో రామ్భాయి చిత్రాంగి నరసయ్య గారు రాజ రాజు ,లక్ష్మీ కాంతం గారు సారంగధరుడు గా వేశారు .ఆ కంపెనీకి వీరి వల్ల పేరొచ్చింది .కాంతం గారు కృష్ణుడు అర్జునుడు ,భరతుడు వేషాలూ ధరించి మెప్పు పొందారు .బిబ్బిలి నాటకం లో బుస్సీ రంగారావు ,కంతా భరణం లో కృష్ణారావు ,చిత్ర నలీయం లో బాహుకుడు గా కాంతం గారు వివిధ వేషాలు ధరించి తన నటనా కౌశలాన్ని చాటి చెప్పారు .
బందరు లో రాయల్ దియేటర్ అనే నాటకసంస్థ ఏర్పడింది .దీనికి చెళ్ళపిళ్ళ వారుగౌరవాధ్యక్షులు . గౌరవాధ్యక్షులు . కాంతం గారు ధర్మ రాజు ,అన్న నరసయ్య గారు భీముడు ,ముంజులూరు కృష్ణ రావు గారు కృష్ణుడు తిరుపతికవుల ”పాండవ ఉద్యోగ విజయాలు ”నాటకం లో గురువు గారి ఆధ్వర్యం లో నటించి పేరొందారు .ఇదులో కాంతం గారి ధర్మ రాజు పాత్ర చేయటానికి పింగళి వారు ఎంతో విమర్శనా ద్రుష్టి తో స్టడీ చేశారు ..మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి మామ గారు పురాణం సూరి శాస్త్రి గారు తమ ”నాట్యాంబుజం ”అనే పుస్తకం లో ”పింగళి వారి ధర్మ రాజు పాత్ర వైదిక ధర్మ రాజు కాదు .పక్కా నియోగి ధర్మజుడు ”అని విమర్శించారు .ధర్మ రాజు మెత్తని పులి అని మనందరికీ తెలిసిన విషయమే .””పేరు ధర్మ రాజు పెను వేప విత్తండ్రు”అని చిలక మర్తి వారు రాసిన పద్యం అందరి హృదయాల్లో నిలిచి పోయింది .ఇవన్నీ జీర్ణించుకొని కొత్త ఒరవడిని సృష్టించారు ధర్మ రాజు పాత్ర ధారణా లో పింగళి వారు .పింగళి వారి పద్యం చదివే తీరు చెళ్ళపిళ్ళవారి ఫక్కీ లో సాగేది .ఆ రోజుల్లో బందరు లో వెంకట శాస్త్రి గారు, శిష్యుడు లక్ష్మీ కాంతం గారు ఇద్దరే పద్యాలను పదాలను చక్కగా విరిచి ,అర్ధం అందరికి తెలిసేలా పాడి ప్రేక్షకుల మెప్పు పొందే వారు వాచికాభి నయం లో వీరు సాధించిన ఘనత ఇదే .పద్యం తో రాగాన్ని ఆపెయ్యటం కాంతం గారి ప్రత్యేకత
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -.6-11-13- ఉయ్యూరు
.-