విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు – 11
సుశ్రుతుడు
నూతన మిలీనియం సందర్భం గా 2000 సంవత్సరం లో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర చికిత్స వైద్యుల జాబితాను ఫోటోలతో సహా ప్రచురించింది .అందులో మొదటి పేరు ఆచార్య సుశ్రుతుడిదే .ఆయన పరి శోధనలు ప్రయోగ శాస్త్ర విద్య తోనే ప్రారంభమైంది .
సుశ్రుతుడు క్రీ.శ.ఆరవ శతాబ్దిలో జన్మించి నట్లు తెలుస్తోంది .ఈయన విశ్వామిత్ర మహర్షి కుమారుడని ,అంటారు ధన్వంతరి కి ముఖ్య శిష్యుడు .సుఖ ప్రసవం కోసం శాస్త్ర చికిత్స కూడా చేశాడు .మూత్ర పిండాలలో రాళ్ళను కూడా తొలగించే వాడు .విరిగిన ఎముకలు అతికించటం లో ,కంటి శుక్లాలు తొలగించటం లో కృషి చేశాడు .ప్లాస్టిక్ సర్జరీ ,రైనో ప్లాస్టీ అంటే ముక్కు నిర్మాణం ప్లాస్టిక్ శాస్త్ర చికిత్సలో నిష్ణాతుడు
.
సుశ్రుతుడు శాస్త్ర చికిత్స మీద ‘’సుశ్రుత సంహిత ‘’ అనే బృహద్ద్ద్ గ్రంధాన్ని రచించాడు .ఇందులో నూటొక్క శాస్త్ర పరికరాలను పేర్కొన్నాడు .ఇది ఇప్పటి శాస్త్ర వైద్యానికి మణి దీపం గా నిలుస్తోంది .ఈయన ప్రక్రుతి ఆరాధకుడు కూడా .జంతు వృక్ష ప్రపంచం మీద ద్రుష్టి సారించి అమూల్య సమాచారాన్ని సేకరించి నిక్షిప్తం చేశాడు .భిన్న ఋతువులలో వాతావరణ పరిస్తితులలో ఆరొగ్యాఆఆఆఆఆమ్ గా ఎలా ఉండాలి అన్న వాటిని వివరించాడు .
ఒక సారి ఒక ప్రయాణీకుడు అడవి గుండా వెడుతుంటే ప్రమాద వశాన అతని ముక్కు తెగింది తెగిన ముక్కును చేత్తో పట్టుకొని దగ్గిరున్న సుశ్రుత ఆశ్రమానికి చేరాడు .ఆయన గమనించి ముందు నీతితో గాయాన్ని తుడిచాడు .దానికి మూలిక్కా రసం అద్దారు సెప్టిక్ కాకుండా .ఒక గిన్నెడు మద్యం తాగించాడు .ఆటను స్పృహ కోల్పోగానే సూక్షమమిన కత్తులతో సూదులతో శాస్త్ర చికిత్స చేశాడు .ఒక ఆకుతో ముక్కు కొలత కొలిచాడు చిన్న పడు నైన వేడి చేసిన కత్తి తో దవడ కంద లో కొంత భాగం కోసి దాన్ని సరిగ్గా కావాలసినంత గా రెండు భాగాలు చేసి ముక్కు పుతాలలో అమర్చాడు .ముక్కు ఆకారాన్ని సరి చేసి బియ్యపు పిండి ,గంధం తో పట్టు వేశాడు .దాని మీద బూరుగు దూది పెట్టి ,ఔషధ నూనె పోసి కట్టు కట్టాడు .రెండు రోజుల్లో ఆ వ్యక్తీ తేరుకొన్నాడు .అతడు ఏ ఏ ఆహార నియమాలు పాటించాలో ఏయే మందులు వాడాలో సూచించాడు సుశ్రుతుడు .
సుశ్రుత సంహిత గ్రంధాన్ని ఎనిమిదో శతాబ్దిలో అరెబిక్ భాష లోకి ‘’కితాబ్ పాశూన్ –ఏ –హింద్ ‘’,కితాబ్ –యి –సుసృద్ ‘’పేరా అనువదించారు .విరిగిన ఎముకలను సరి చేయటానికి అనేక రకాలైన కర్ర బద్దల్ వివరాలున్నాయి ఇదే ‘’శల్య తంత్రం ‘’.మత్తు మందుగా మద్యాన్ని వాడే వాడు
పిస్తులా వ్యాధికి ‘’క్షార సూత్రా ‘’చికిత్స చేసే వాడు మొలలు నాదీ వరణం మొదలైన వాటికీ దీన్ని ఉపయోగించేవారు ఒక దారాన్ని తీసుకొని ఇరవై ఒక్క సార్లుక్షార ఔషధాలతో సమ్మిళితం చేయటాన్నే క్షార చికిత్స అంటారు దీన్ని వాడితే అయిదారు వారాలలో ఫిస్తులా మాయం .
అతి నైపుణ్యం గా శాస్త్ర చికిత్స చేయటానికి కొన్ని జంతువుల వెంట్రుకలను ,బాగా ఎదిగిన వెదురు బొంగులను ,కొన్ని ప్రత్యెక లక్షణాలున్న బెరడులతో చేసిన కుంచెలను ఉపయోగించేవాడు .సున్నితమైన అవయవాలను అతికించే ముందు ఏ మాత్రం వీలున్నా పూర్వ కర్మ చికిత్స అంటే ‘’ఫిజియో తెరపి ‘’చేయాలని సూచించాడు .ఆయన వాడిన శాస్త్ర పరికరాల వివరాలనూ వివరం గా వర్ణించాడు తన గ్రంధం లో సుశ్రుతుడు ,చరకుడు చెప్పిన వైద్య విధానం క్రీస్తు పూర్వమే ఆగ్నేయ ఆసియా ఉత్తర ఆసియా ,మధ్య ప్రాచ్యాలలో బాగా వాడుక గా ఉంది చరిత్ర కారుడు ‘ఫరిస్తా ‘’రాసిన చరిత్రలో పదహారు ప్రాచీన భారత వైద్య శాస్త్ర గ్రంధాలు ఎనిమిదో శతాబ్దం నాటికే అరబ్బులకు పరిచయమైనాయి .
గర్భ ధారణా కు అనువైన ఔషధాలు యవ్వనోత్సాహానికి మందులు సూచించాడు ఆయన తయారు చేసిన ‘’ఫొర్ సేప్స్ ‘’,దిసేక్తింగ్ అండ్ డ్రెస్సింగ్ ఫొర్సేప్స్ ‘’ఈ నాటి శాస్త్ర చికిత్సా సాధనాలకు మార్గ దర్శకలయ్యాయి తెగిన ముక్కు పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేసి అతికించిన మహానుభావుడాయన .
మహా రాష్ట్ర లో పది హేనవ శతాబ్దం లోనే ఇటుకలు తయారు చేసే కాంగ్రా వంశీకులు ప్లాస్టిక్ సర్జరీ లో సిద్ధ హస్తులయ్యారు .ఈ కుటుంబాలలో హకీమ్ దీనా నద కుటుంబం ఇరవై వ శతాబ్దం లో ఈ చికిత్స చేసిన చివరి కుటుంబం .బ్రిటీష్ వాళ్ళు ఈ దేశం లో బాల పడిన తర్వాత ఈ చికిత్సా విధానాన్ని బ్రిటిష్ పాలకులు తెలుసుకొని 1794లో పాశ్చాత్య దేశాలకు తెలియ జేశారు ఇదంతా సుశ్రుత మహర్షి కృషి ఫలితమే .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-16-11-13-కాంప్-హైదరాబాద్