విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు-14
కొందరు సంప్రదాయ వైద్య శాస్త్రజ్ఞుల
అగస్త్య మహర్షి
అగస్త్య క్రీ.పూ.ఎనిమిదో శతాబ్దానికి చెందిన రుషి భరద్వాజ మహర్షి శిష్యుడు .దక్షిణ భారతం లో స్థిర పడ్డాడు .ద్రావిడ సాహిత్యానికి శాస్త్రాలకు ఆద్యుడు .సిద్ధ వైద్యానికి ఏంతోప్రచారం తెచ్చాడు .తిరునల్వేలి జిల్లాలో ‘’సిద్ధకుట’’కొండమీద వైద్య చికిత్సా కేంద్రం స్తాపించాడు .సిద్ధ వైద్యం లో అనేక పరిశోధనలు చేసి ప్రయోగాలు నిర్వహించాడు .’’అగత్తీయ చరక్కు ,ద్వైదని నాయ ,రుదాంది కల్ప’’ అనే మంత్రాలు రచించి నట్లు ఋగ్వేదం లో ఉంది .
అగ్ని వేశ
క్రీ..పూ.ఏడవ శతాబ్ది వాడు అగ్ని రుషి కుమారుడు .ఆత్రేయ పునర్వసు వద్ద వైద్య శాస్త్రం నేర్చి గురువు ఉపదేశించిన వైద్య విధానాన్ని ప్రచారం చేశాడు .అనేక వైద్య సిద్ధాంతాలను ప్రతిపాదించాడు .’’అగ్ని వేశ తంత్ర ,అంజనా నిదాన ‘’అనే వైద్య గ్రంధాలు రాశాడు .అగ్ని వేశ తంత్ర నే సంస్కరించి ‘’చరక సంహిత ‘’గా మార్చాడు .ఆత్రేయుని శిష్యులలో మహా మేధావి అని పించుకొన్నాడు కాయ చికిత్స లో అసాధారణ ప్రజ్ఞ కల వాడు .
భావ మిశ్రుడు
క్రీ.శ. పదిహేనవ శతాబ్ది వాడు .బనారస్ లో జన్మించాడు 1558.లో రాసిన ‘’భావ ప్రకాశిక ‘’ప్రాచీన వైద్య పాఠ్య గ్రంధం గా పేరొందింది .ఇందులో కారణం ,చిహ్నం ,చికిత్స అని మూడు భాగాలున్నాయి .వీటికే పూర్వ ఖండ ,మధ్య ఖండ ,ఉత్తర ఖండాలని పేరు .ఔషధాల పుట్టుక ,తయారీ ,పరిణామం ,భ్రూణ శాస్త్రం (ఎమ్బ్రియాలజి ),శిశు రోగ చికిత్సా (పీడియాత్రిక్స్ )శరీర నిర్మాణ శరీర ధర్మ శాస్త్రం (ఫిజియాలజీ )ప్రత్యెక వ్యాధుల నివారణ వాటి లక్షణాలు మొదలైన ఎన్నో విషయాలు భావ ప్రకాశిక లో ఉన్నాయి .
హరిశ్చంద్ర భట్ట
క్రీ.శ.నాలుగైదు శతాబ్దాల వాడు .’’సహసంక ‘’ రాజు ఆస్తాన వైద్యుడు .వైద్య ,సాహిత్యాలలో మేటి .చరక సంహిత మీద విపుల వ్యాఖ్యానం గా
‘’చరక న్యాస ‘’రాశాడు . చరకం మీద వచ్చిన మొదటి వ్యాఖ్యాన గ్రంధం ఇదే .’’ఖర నాద సంహిత ‘’కూడా రాశాడు అని అంటారు కాని అలభ్యం
కేశవ మిశ్ర
న్యాయ శాస్త్ర వేత్త .పదమూడవ శతాబ్ది చివరి వాడు వైశేషిక సిద్ధాంతప్రభావితుడు.కార్య కారణ సంబంధ సిద్ధాంతాలకు ,వర్గీకరణాలకు ‘’తర్క భాష ‘’గ్రంధం రాశాడు న్యాయ శాస్త్ర దార్శనికుడు గా పేరు .
హేమాద్రి
పదమూడవ శతాబ్దం లో ‘’దేవగిరి ‘’లో పుట్టాడు .అన్ని శాస్త్రాలను ఔపోసన పట్టాడు .భావన నిర్మాణ శాస్త్రాన్ని మహా రాష్ట్ర భాషలో రాశాడు ఇదే ‘’చతుర్వర్గ చింతామణి ‘’వైద్యం లో ‘’ఆయుర్వేద రసాయనం ‘’అనే సిద్ధాంతాన్ని అసంపూర్తిగా రాశాడు .వాగ్భాటుని ‘’అష్టాంగ హృదయ ‘’గ్రంధానికి ఇది ప్రేరణ అయింది .
హిరణ్య కష
జీవితకాలం తెలియదు .చరక సంహితను స్వంత శిలిలో అభివృద్ధి చేశాడు .’’వ్యాఖ్య –మధు –కోశ ‘’అనే సాధారణ వ్యాధుల పుట్టు పూర్వోత్తరాలు రకరకాల రుచులు మీద విలువైన అభిప్రాయాలు చెప్పాడు. సాంఖ్య సాంప్రదాయం వాడు .
కేశవ
పదమూడో శతాబ్ది వాడు .వేదాపురం లో పుట్టాడు .తండ్రి మహా దేవుడు .సంస్కృతం లో ‘’సిద్ధ మంత్రం ‘’అనే వస్తు గుణ దీపిక రాశాడు కొడుకు ‘’వోప దేవా ‘’ఈ గ్రంధం పై ‘’సిద్ధ మంత్రం ప్రక్ష ‘’అనే వ్యాఖ్యాన గ్రంధం రచించాడు .
బాదిస .
శరీర నిర్మాణం పై లోతైన అధ్యనాలు చేశాడు .శరీరం లో అష్ట వ్యస్తలను రూపు మాపేందుకు ముఖ్యంగా వాతాన్ని పోగొట్టేందుకు అనేక చికిత్సలు చెప్పాడు రుచులను ఎనిమిది రకాలుగా వర్గీక రించాడు .గర్భస్థ పిండం ఎదుగు దలలో ఎదురయ్యే సమస్యలకు మంచి పరిష్కార మారగాలు చూపాడు .ఈతని గురించి మిగిలిన వారు చెప్పటమేకాని అతని వివరాలు మాత్రం తెలియ లేదు
నీల కంఠ బసవ రాజు
పద్నాలుగో శతాబ్ది వైద్య శాస్త్ర వేత్త .కర్నాటక లో దార్వార్ జిల్లా ‘’కొట్ట్ట్టురు నిధే ‘’గ్రామం లో జన్మించాడు .ఆయన రాసిన ‘’బసవ రాజీయం ‘’ప్రముఖ వైద్య గ్రంధం గా ప్రచారం అయింది .దీనిని ‘’వైద్య శాస్త్ర నిఘంటువు ‘’గా ప్రామాణిక మైనదిగా కీర్తిస్తారు .ఇరవై అయిదు అద్యాయాలతో 6,400శ్లోకాలతో అనేక వైద్యామ్శాల కూడలిగా నిర్మించాడు .హిందూ వైద్య శాస్త్ర గ్రంధాలకు బసవ రాజీయం కర దీపిక అయింది .చివరి అధ్యాయ లో ‘’రసఔషధాలు గురించి వివరాలు బాగా ఉన్నాయి రస ఔషధాలు మన రాష్ట్రం లో ,కర్నాటక లో బాగా ప్రసిద్ధి చెందాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-13- ఉయ్యూరు
అద్భుతమైన మరియు విలువైన సమాచారాన్ని, మీరు సేకరించి మా అందరికి ఆ జ్ఞానాన్ని పంచి ఇచిన్నందుకు, మీకు ఎంతగానో ధన్యవాదాలు తెలి యచేస్తున్నాను. – ప్రేమ కుమార్.