ఆస్పత్రి ఆవరణలో పిచ్చా పాటీ

ఆస్పత్రి ఆవరణలో పిచ్చా పాటీ –

నిన్న అంటే పద్దెనిమిదో తేది రాత్రి తొమ్మిదింటికి మిత్రుడు జి.వి.పూర్ణ చంద్ ఫోన్ చేసి గుత్తి కొండ సుబ్బా రావు గారి భార్య గారికి సుస్తీ చేయటం వల్ల ఆమెను విజయ వాడ మ్యూజియం వెనుక ఉన్న ‘’హెల్ప్ హాస్పిటల్ ‘’లో చేర్చి ఇన్సెంటివ్ కేర్ యూనిట్ లో ఉంచారని తెలియ జేశారు .మొన్న కంగారుగా ఉందని ఇవాళ కొంతనయం అని అన్నారు నేను వెంటనే సుబ్బా రావు గారికి ఫోన్ చేసి మాట్లాడాను .ఆయన’’ఆమె  బాడీ మందులకు  రెస్పాండ్ కావటానికి ఒకటి రెండు రోజులు పట్ట వచ్చునని ,అప్పటి దాకా డాక్టర్లు ఏమీ చెప్పలేమన్నారు ‘’అని చెప్పారు .సరే నేను రేపు వస్తానని చెప్పగా ‘’అంత శ్రమ పడి రావద్దన్నారు .కాని వాళ్ళందరూ నన్ను తమ ఆత్మీయులుగా భావించే వారు కనుక నేను ఒక సారి వెళ్లి చూసి రావటం నాధర్మం అనుకొన్నాను.

ఇవాళ ఉదయం నేను ఇంట్లో పూజ ,అభిషేకం చేసుకొని టిఫిన్ తిని కాఫీ తాగి తొమ్మిదిన్నరకు బయల్దేరి బేజ వాడ హెల్ప్ ఆస్పత్రికి వెళ్లాను .అక్కడ కే .వెంకట రావు ,సుబ్బారావు గారి తమ్ముడు కనీ పించారు .వెంకటరావు నన్ను బయట కాఫీ తాగుతున్నసుబ్బారావు గారి దగ్గరకు

తీసుకొని వెళ్ళాడు .అక్కడ అప్పటికే పువ్వాడ తిక్కన సోమయాజి గారున్నారు . నాకు కాఫీ ఇస్తే తాగాను .కాసేపు అక్కడే ఉండి అందరం లోపలి వెళ్లాం.సుబ్బారావు గారి భార్య ఐ.సి.లోనే ఉన్నారని ఇవాళ ఉదయం డాక్టర్ వచ్చి చూసి ఆమె బాగా రెస్పాండ్ అవుతున్నారని చెప్పారని సుబ్బారావు గారు చెప్పారు .ఈ మధ్య దాకా ఆమె ను హైదరాబాద్ లో వైద్యం చేయించి ఈ మధ్యనే బందరు తీసుకొచ్చామని ఇంట్లో యాభై రెండు వేలు పెట్టి ఆక్సిజన్ యూనిట్ డాక్టర్ సలహా పై కొని ఆక్సిజన్ అందిస్తున్నామని కాని ఊపిరి పీల్చటం ఈ మధ్య మరీ కష్టం అయి నందున మళ్ళీ బందర్లోనే హాస్పిటల్ లో చేర్చామని కాని మరీ శనివారం ఊపిరి పీల్చటం చాలా ఇబ్బంది చేయటం వల్ల  డాక్టర్ సలహాపై ఇక్కడి హెల్ప్ హాస్పిటల్ కు  అంబులెన్స్ లో తీసుకొని వచ్చి శనివారం చేర్చామని ,డాక్టర్లు ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారని కంగారులో పెద్దమ్మాయిఅమెరికా నుంచి  వచ్చేసిందని,చిన్నమ్మాయి కాలిఫోర్నియా నుంచి ఉదయమే హైదరాబాద్ చేరిందని మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరి ఇక్కడికి వస్తుందని మూడో అమ్మాయి ఇరవై నాలుగో తేదీకి వస్తుందని చెప్పారు .

ఇంతలో పెనమకూరు లో నా శిష్యుడు, మా ఇంట్లో ఈ మధ్య దాకా అద్దెకున్న హనుమంతరావు తండ్రిపూర్వ తెలుగు పండిట్  రామేశ్వర శర్మకనిపించాడు మాటల సందర్భం లో ఆతను ‘’లక్షలు పోయాయి ,ఆవిడా పోయింది ‘’అన్నాడు .ఎవరి గురించి ఏమిటి అన్నాను .అప్పుడు చెప్పాడు తన భార్య ను ఇక్కడే అడ్మిట్ చేశానని కాని లక్షలు ఖర్చు పెట్టినా దక్కలేదని దరిద్ర గొట్టు  హాస్పిటల్కు తీసుకోచ్చానని  ఇప్పుడు బాధ పడుతున్నానై వెళ్ళ బోసుకొన్నాడు .ఇప్పుడు ఎందుకోచ్చావని అడిగితె ‘’పిల్ల పోయినా పీతికంపు వదల నట్లు యేవో మెడికల్ బిల్ల్స్ ‘’కోసం వచ్చానని చెప్పాడు .మీ అబ్బాయి హనుమంత రావు ఎలా ఉన్నాడని అడిగితె ‘’వాడినీ ఇక్కడే చేర్చారు .బాగైంది డ్యూటీలో చేరి పని చేస్తున్నాడు ‘’అన్నాడు .అంటే ఇక్కడ బాగుపడటం లేక పోవటం ఆసు  పత్రీ తప్పుకాదు మన అదృష్టం కూడా అని మేము అనుకొన్నాం .

కాసేపటికి కే.ఎల్ శర్మ గారు కూడా అక్కడికి వచ్చారు . మాటల సందర్భం లో సుబ్బారావు గారు ఈ మధ్య బుద్ధ ప్రసాద్ గారు చాలా తీవ్ర స్వరం లో మాట్లాడుతున్నారని ఆ మధ్య అవని గడ్డ్డలో మాట్లాడుతూ ‘’ఈ ఇరిగేషన్ వాళ్ళు కనిపిస్తే కర్రలు తీసుకొని వెంట పడి  తరమండి .మినిస్టర్ అయినా సరే ఎవరైనా సరే .నేను చూసుకొంటాను ‘’అన్నారని అజాత శత్రువు గా ఉండే వాడు ఇంత కోపం గా మాట్లాడటం ఇప్పుడే నని అన్నారు .అలాగే సమైక్యాంధ్ర మీద మాట్లాడుతూ ‘’పైన ధిల్లీ లో ఒక పిశాచం ఉందని, దాని చుట్టూ ఆయా రాష్ట్రాలలో చెల్లని దెయ్యాలు దీని చుట్టూ చేరి అందర్నీ పీక్కు తింటున్నాయని ,ఈ రాష్ట్రం ఈ భాష ,సంస్కృతీ గురించి ఆ పిశాచానికి కాని పిల్ల పిశాచానికి కాని తెలియవని ఇదీ మన దురద్రుస్టమని ‘’అన్నారని చెప్పారు .అప్పుడు నేను ‘’నిజమే.ఇంత తీవ్ర స్వరం తో ఈ నెలలోనే బుద్ధప్రసాద్ మాట్లాడారు సహనం నశించి ,ఓర్పు  ఎలాస్టిక్ లిమిట్ దాటి ఆవేశం ,ఆవేదన తోమాట్లాడిన తీరు అని ‘’అన్నాను .నిజమే నన్నారు .

నేను వెళ్ళిన ఒక అరగంట కు పూర్ణ చంద్ గారు కారీర్ తీసుకొని వచ్చారు .సుబ్బారావు గారి భార్య కోసం ఇంటి దగ్గర మెత్తగా అన్నం వండించి పప్పు కూర ,పెరుగు తో తెచ్చిన కారియర్ అది .సుబ్బారావుగారి తమ్ముడు లోపలి తీసుకు వెళ్ళారు .అప్పుడు సుబ్బారావు గారు ‘’పూర్ణ చంద్ శని వారం నుంచి ఇక్కడ నాతోనే ఉన్నాడు .పళ్ళుతోముకోవటానికో ఇలా కారీయర్ తేవటానికో తప్ప మిగతా సమయ మంతా నాతోనే ఉన్నాడు నాకు కొండంత బలం గా ఆసరాగాఉన్నాడు ‘’అన్నారు ‘’అదేమిటి సుబ్బారావు !మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన వాళ్ళం .నా ధర్మం నేను చేస్తున్నాను ‘’అన్నాడు .నిజం గానే వాళ్ళిద్దరూ ‘’జీవికా జీవులు ‘’.స్నేహం కంటే ఆత్మీయ మైన వాళ్ళు .

కాసేపు మా సంభాషణ రాజకీయం పై మళ్ళింది రాష్ట్రం విడి పోవటం ,కోర్టు కేసులు ,విడి పొతే వచ్చే నష్టాలు గురించి మాట్లాడుకొన్నాం .పూర్ణ కొన్ని చారిత్రిక సత్యాలను చెప్పాడు .1750లో బందరు జిల్లా అటు కొవ్వూరు వరకు ,ఇటు ఒంగోలు వరకు విస్తరించి ఉండేదని , అప్పుడు మచిలీ పట్నం పెద్ద ఓడ రేవు కేంద్రం అని ,ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వస్త్రాలు ఎగుమతి అయ్యేవని గొప్ప వాణిజ్య నౌకా కేంద్రం గా మచిలీ ఓడరేవు వెలిగి పోయిందని ,కాని ఇక్కడి ఈస్ట్ ఇండియా కంపెని వాళ్ళు ‘’న్యూ ఈస్ట్ ఇండియా కంపెని ‘పేరుతో  పాలన సాగించి ఇక్కడి చేనేత వస్త్రాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఇక్కడి నేత గాళ్ళదగ్గర  అప్పులు చేసి సరుకు కొని ఎగుమతి చేసి విపరీత లాభాలు సంపాదించారని చివరికి నేతన్నలకు డబ్బు ఎగ్గొట్టి మున్చేశారని ,ఇక్కడ లాభం లేదనుకొని ,బందరు రేవుపట్నాన్ని  పాడు పెట్టి ,మద్రాస్ చెక్కే శారు  అక్కడ వ్యాపారం చేస్తూ అక్కడి రేవును అభి వృద్ధి చేశారని చెప్పారు .దీనితో బందరు జీవితం సగం దెబ్బతిని పోయి కళా విహీన మైనదని అన్నారు .ఆ తర్వాత 1920లో గుంటూరు జిల్లా వేరై పోవటం తో బందరుకు మిగతా కళ తప్పి పోయిందని ,ఆ తర్వాత గోదావరి జిల్లాలు వేరై పోవటం వల్ల  బందరు శూన్యం అయి పోయిందని ఒకప్పుడు జిల్లా కేంద్రం ఇప్పుడు దేనికీ ప్రాధాన్యత లేకుండా పోయిందని పూర్ణ అన్నాడు

రాష్ట్ర విభజన ఆపమంటూ మన వాళ్ళు కొందరు  హైకోర్టుకు ,సుప్రీం కోర్టుకు వెళ్ళారని కాని న్యాయాధిపతులు ‘’ప్రి మేచూర్’’అని కేసులు స్వీకరించలేదని అంత మాత్రం చేత ‘’తిరస్కరించటం ‘’కాదని చెప్పారని కాని కేంద్రం అసెంబ్లీ కి బిల్లు పంపక పోయినా ,పార్ల మెంటు లో సజావుగా చర్చ జరగక పోయినా తమను ఆశ్రయించ వచ్చునని అది

సరైన సమయం అని అప్పుడు మా తడాఖా చూ పిస్తాము .’’అని హామీ ఇవ్వటం దేశ చరిత్రలో గమనించ దగ్గ విషయమని కోర్టులు ఇంత గొప్పగా స్పందించటం ప్రజా విజయమే నని కనుక కేంద్రం కాని ఎవరైనా అన్యాయం గా ఏ విధమైన ‘’బై పాస్ ‘’చేసినా కోర్టు కొరడా ఝాళిపిస్తుందని చెప్పాడు పూర్ణ .

తర్వాత మా సంభాషణ ఒక వేళవిభజన జరిగితే హైదరా బాద్’’ ‘’బాధ’’ ఏమిటి అన్న అంశం మీదకు మళ్ళింది .అప్పుడు మళ్ళీ పూర్ణ’’ఇప్పటికే చత్తీస్ ఘడ్ లో తెలంగాణా వారే  నక్సలైట్లుగా చాలా మంది ఉన్నారని ఇంటెలి జేంస్ వర్గాల భోగట్టా ఇచ్చిందని శ్రీ కృష్ణ కమిటి విభజన  విషయమై ఏంతో లోతుగా ప్రతి సూక్ష్మ విషయాన్నీ చర్చించి సూచనలు చేసిందని దాన్ని పక్కన పెట్టి ఏ కొద్ది మందో ఈ రాష్ట్రం అంటే ముక్కూ మొహం తెలియని ముఠా విభజన నిర్ణయం చేయటం బాధాకరమని ,విభజన జరిగితే హైదరాబాద్ నుంచి కోస్త ఆంద్ర వారికి సీమ వారికి ఏ రకమైన ఇంటరెస్ట్ హైదరాఆద్ మీద ఉండదని ,అంత దూరం ఉన్న శంషా బాద్ ఎయిర్ పోర్ట్ కెందుకు? హాయిగా మద్రాస్ కే వెళ్లిఊరి మధ్యలో ఉన్న ఎయిర్ పోర్ట్ కు వెళ్లాలని అని పిస్తుందని ,ఇప్పటిదాకా పెట్టుబడి పెట్టి యెన్తొఅభివ్రుద్ధి చేసిన సీమాన్ద్రులకు ఇక ఇక్కడి అభి వృద్ధిపై మోజు ఉండదని ఇక్కడ పెట్టుబడి పెట్టె సాహసం చేయరని ఇది మార్వాడీలకు మహారాస్త్రీయులకు ఒక వరం అయి మొత్తం వాణిజ్యం అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్లి పోతుందని ఇప్పటికే హైదరాబాద్ మిలిటెంట్ల కు అండర్ గ్రౌండ్ గా ఉందని ఇక కేంద్ర బిందువే అయి పోతుందని ,హైదరాబాద్ ప్రాభవం మనం అందరు వదిలి పెట్టి వెళ్తే కోల్పోయి కళా విహీనమై, బందరుకు పట్టిన గతే పడుతుందని చెప్పాడు పూర్ణ చంద్ .ఈ విషయాలను ఈ మధ్య బుద్ధ ప్రసాద్ కు చెబితే ‘’మంచి పాయింటు చెప్పావు పూర్నా !బాగుంది .వీటి మీద మనం అవాగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం ‘’అన్నాడని చెప్పాడు పూర్ణ .ఈ రకం గా దాదాపు రెండు గంటల పాటు ఆస్పత్రి ఆవరణలో ‘’నిలువు కాళ్ళ మీద ‘’నిలుచునే మాట్లాడుకొన్నాం మంచి విషయాలనే చర్చిన్చుకోన్నాం .మధ్యాహ్నం ఒంటి గంటకు వారందరికీ వీడ్కోలు చెప్పి ,బస్ ఎక్కి రెండింటికి ఉయ్యూరు చేరుకొని భోజనం చేశాను .నన్ను వారితో బాటు హోటల్ కు రమ్మని అక్కడ భోజనం చేద్దామని సుబ్బారావు, పూర్ణ అంటే మా ఇంటికి రమ్మని సోమయాజి గారు ఆహ్వానిస్తే మర్యాదగా ఒద్దని చెప్పి ఇంటికి వచ్చేశాను

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-11-13-ఉయ్యూరు

.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.