విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -22
అలనాటి శిల్ప శాస్త్రజ్ఞులు
ఖజురహో మొదటి శతాబ్ది చివరలో మధ్య భారతాన్ని పాలించిన ‘’చందేల ‘’రాజ వంశం ‘’వారు ఆర్ష ,బౌద్ధ ,జైన ధర్మాల మీద భక్తీ విశ్వాసాలతో విస్తృత కళా విలాసాలతో కొత్త శైలి లో దేవాలయాల సముదాయం నిర్మించారు .అవే ఖజురాహో శిల్పాలని పించుకోన్నాయి .
ఖజురాహో ఆలయాలు మధ్య ప్రదేశ్ లో చమతా పూర్ జిల్లాలో బుందేల్ ఖండ్ ప్రాంతం లో ఉన్నాయి .అప్సరసల అందెల మోతతో ,యక్షిణుల విరహ గీతాలతో ఖజురహో ప్రతిధ్వనిస్తుంది .నాయికా నాయికల శృంగార భంగిమలు స్వర్గాన్ని గుర్తు చేస్తాయి .జంతువుల్ని ,పక్షులను వైవిధ్య భరితం గా సృష్టించారు .ఎత్తైన గోపురాల మీదా ప్రాకారాల మీద ప్రాచీన శిల్ప కళా వైభవం కానీ పిస్తుంది . హిందూ ,బౌద్ధ ,జైన ధర్మాలకు చెందిన 80.పైగా ఖజురాహో ఆలయాలు నిర్మింప బడ్డాయి .క్రీ.శ.900-1000మధ్య కాలం లో చందేల ల రాజులు కట్టించిన ఈదేవాలయాలు ఎక్కువ భాగం నేలమట్టం అయ్యాయి ఇప్పుడు ఈ ఆలయాలలో అశ్లీలాలనే అందరు చూసి రోట్టలు వేస్తున్నారు .
ఈ ఖజురాహోలో ఇవాళ కేవలం మూడు వేల లోపు జనాభా మాత్రమె ఉంది .601భారత్ వచ్చిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ సందర్శించిన తర్వాత విదేశీ యాత్రికులు ,హిందూ జైన బౌద్ధ ఆచార్యులు ,సిద్ధులు ,యోగులు ,తాన్త్రికో పాసకులు ఖజురాహో లో విడిది చేసి నట్లు ఆధారాలున్నాయి .1839లో ఈస్ట్ ఇండియా కంపెని సైనికాధి కారి టి.ఎస్.బర్ట్ర్ట్ ఖజురాహో ను చూసి ప్రపంచానికి ఎరుక పరిచాడు
.
ఆ తర్వాత యందరో వచ్చి పరిశోధించారు .రొమిల్లా దాపర్ ,,పురాతత్వ శాస్త్ర వేత్తల కృషి తో’’డివైన్ ఎక్స్తసి’’పేర ఖజురాహో మీద పుస్తకం తెచ్చారు .భారతీయ జ్ఞాన పీఠ అనేక పుస్తకాలు ప్రచురించింది . 1996లో రెండు కొత్త సిద్ధాంతాలు వచ్చాయి .హిందూ ఆగమ శాస్త్ర విజ్ఞానం ఆధారం గా ఇవి నిర్మింప బడి నాయని తెలిపారు .
హంపి బేలూర్,అజంతా ఎల్లోరా,కోణార్క్ శిల్ప కళా వైభవం ప్రత్యేకించి ఎవరూ చెప్పక్కర లేదు .
కిరాడూ శిల్ప వైభవం
రాజస్తాన్ చాద్ మెర్ నుంచి ముప్ఫై రెండు కిలో మీటర్ల దూరం లో ‘’బూడిద రంగు రాళ్ళు ‘’తోఉన్న కొండ లోయల్లో ‘’కిరాజ్ –కూప్ ‘’నేడు కిరాడూ అని పిలువ బడే ప్రాచీన నగరం ఉంది. అక్కడ ఎత్తైన శిఖరాలతో ఉన్న మందిరాలున్నాయి .పన్నెండు వ శతాబ్దం నుంచి పదిహేనవ శతాబ్దం వరకు దీని కీర్తి దశ దిశలా వ్యాపించింది .అక్కడి శిల్పాలు నైపుణ్యం కళ్ళు జిగేల్ మంటా.యి ఇప్పుడు భగ్న శిల్పాలతో వికృతం గా ఉంది .ఇక్కడ ఏ రాయి మామూలుగా కనీ పించదు ఎనిమిది వందల ఏళ్ళ కిందట రూపు దాల్చిన శిల్పాలు ప్రక్రుతి వైపు రీత్యాలకు తట్టుకొని ,కాల పరీక్షలో నిలబడటం ఆశ్చర్యకరం .పూల రేకుల మీద గీసిన రేఖలు ఇప్పటికీ స్పష్టం గా కనీ పించి వింత గొలుపుతాయి .అదీ మన ప్రాచీన శిల్ప శాస్త్ర వైభవం .
సశేషం -మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -23-111-13-ఉయ్యూరు