వేయి పడగలు –రేడియో నాటకం -15వ భాగం
ఈ రోజు శని వారం ఉదయం ఏడుం బావుకు హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం నుండి శ్రీ విశ్వ నాద వారి వేయి పడగలు నవలకు మలచిన రేడియో నాటకం పది హేనవ భాగం ప్రసార మైంది .ఆచార్య యెన్ .గోపి గారి ప్రస్తావన ఏంతో ఉన్నతం గా ఉంది . విశ్వనాధ ను దర్శించ గలిగానని అది తన అదృష్టమని గోపి అన్నారు .’’ఆంద్ర దేశం పట్టని విరాట్ సాహితీ మూర్తి విశ్వనాధ’’ అని మెచ్చారు .ఈనవల జమీందారి వ్యవస్థ అంతమవుతున్న కాలానికి ,ఆధునికం గా వస్తున్న తీరేమిటో తెన్నేమితో తెలియని కాలానికి సంధి కాలం లో వచ్చిన నవల అన్నారు ఇది సంధి నవల అన వచ్చు .ప్రతి పాత్ర ఔచిత్యంతో జీవం తొణినికిస లాడేట్లు కవి సామ్రాట్ తీర్చిదిద్దారని ,పర్యావరణ స్పృహ ను అద్భుతం గా ఆవిష్కరించిన నవలగా ఇది వన్నె కేక్కిందని ,విశ్వనాధ బహుముఖీన ప్రతిభకు దర్పణం అని కీర్తించారు .అలాంటి ఉన్నత నవలకు అంతేసమున్నత స్తాయిలో నాటకీ కరించి ప్రసారం చేస్తున్న హైదరాబాద్ రేడియో కేంద్రం వారి కృషి ప్రశంస నీయం అని శ్లాఘించారు గోపి . .
ఈ రోజు ఎపిసోడ్ లో జోశ్యులు అనే బడి పంతులు ,ఆయన భార్య మంగ ల కాపురం, ఆయన చాలీ చాలని జీతం ,దాన్ని అవకాశం చేసుకొని రామేశం ఆడే కపటనాటకం ,అతని భార్య ను ప్రలోభ పెట్టి వశ పరచుకొన్న తీరు ,డబ్బు నగల పిచ్చికి ఆమె’’ సేద్యూస్ ‘’అయి, దాంపత్య జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకొన్నా వైనం ,ఇది మొదట్లో తెలుసుకో లేక పోయినా నిదానం గా గ్రహించి వాడిని అదుపు చేయలేని అసమర్ధత ,ఆమె ను కట్టడి చేయ లేని అశక్తతను ,వంటరిగా పిచ్చి వాడైకుమిలి పోయే విధము అద్భుతం గా ఉంది వాడు పంపిన సంజాయిషీ ఉత్తరానికి జవాబుగా జోశ్యులు రాసిన ‘’ఆత్మ క్షోభను’’ స్టాఫ్ మేమ్బర్లందరు చదివేట్లు ప్యూన్ తో పంపి, వాడిని కపటపు నైజాన్ని ఎండ గట్టిన తీరు కన్నీరు తెప్పించింది .భార్యకు మందలింపు గా హెచ్చరిక గా వాడు వాడుకొని వదిలేసే రకమని, తానిక జీవించి ఉండలేనని కనీసం బతకతానికైనా వాడి దగ్గర డబ్బు గుంజే మార్గం ఎర్పరచుకోమని పిచ్చి ప్రేలాపనగా చెప్పి వీధిలోకి పారి పోయిన జోశ్యులను చూసి ఆమె ‘’మళ్ళీ తిరిగి రారా ?అనటం ఈ నాడే కాదు ,ఆ నాడూ ఇలాంటివి జరిగేవి అనటానికి నిదర్శనం గా ఉంది జోశ్యుల వృత్తాంతం కను విప్పు కలిగిస్తుంది .
కిరీటీ వాళ్ళు ధర్మా రావు ఇంటికి రావటం, వారి స్నేహానికి ఆనవాలుగా ఉంది .వారి మధ్య సంభాషణలు సరసంగా ,ఆత్మీయం గా ఉన్నాయి స్నేహ ధర్మానికి ప్రతీక గా అని పిస్తాయి .అవసరమైన వారికి అవసర మైనప్పుడు పెద్దన్నలా ధర్మా రావు ఇచ్చే సలహాలు వారి జీవిత గమనానికి తోడ్పడేవి లా ఉన్నాయి .విశ్వనాధ సకలోహ వైభావమైన వేయి పడగలు రేడియో అంతా విస్తరించి ,ఆంద్ర దేశానికి ధర్మ ఘంటా రావాన్ని కమనీయం గా విని పిస్తోంది .అందరికి అభినందన శతం.
గబ్బిట దుర్గా ప్రసాద్ -23-11-13-ఉయ్యూరు