కార్తీకం లో మా పంచా రామ సందర్శనం

          కార్తీకం లో మా పంచా రామ సందర్శనం

సాధారణం గా రద్దీ సమయాలలో పుణ్య క్షేత్ర సందర్శనం నాకు ఇష్టం ఉండదు .పుణ్యం మాట దేవుడెరుగు .ఆ ఇబ్బందులు పడలేమనే అలా వెళ్ళాం .అందుకే ఖాళీ సమయాలలో ఆయా క్షేత్రాలు దర్శించి సావకాశం గా చూడటం అలవాటైంది.పంచారామాలను ఇదివరకు రెండు మూడు సార్లు అన్నీ ఒక్క సారే కాక పోయినా వీలుని బట్టి చూశాము .ఎందుకో ఈ సారి కార్తీక మాసం లో పంచా రామ సందర్శనం చేయాలని అని పించింది .మొదటి మూడు వారాలలో కుదరలేదు .ఇక నాల్గవ వారం లో ఈ నెల ఇరవై నాలుగు ఆదివారం రాత్రికి ఉయ్యూరు నుంచి ఆర్.టి.సి.వాళ్ళు ఈ స్పెషల్ బస్ ఏర్పాటు చేశారని తెలిసి మా అబ్బాయి రమణ తో వివరాలు కనుక్కోమని చెప్పాం. వాడు అడిగి తెలుసుకొని ,బుక్ చేసే ఆయన ఇంటికే వచ్చి బుక్ చేస్తాడని చెప్పాడు .అట్లాగే ఆర్ టి.సి.ఉద్యోగి వెంకటేశ్వర రావు మా ఇంటికి వచ్చి డబ్బు కట్టించుకొని నాకు,మా శ్రీమతి ప్రభావతికి ,మా మనుమ రాలు రమ్య కు టికెట్స్ బుక్ చేశాడు .పెద్దలకు 490రూపాయలు పిల్లలకు380రూపాయలు .మొత్తం రాను పోను 700కిలో మీటర్ల ప్రయాణం .చౌకే అని పించింది . ఆది వారం రాత్రి పదకొండున్నర కు బస్ బస్ స్టాండ్ లో బయల్దేరుతుందని అన్నీ చూసిన తర్వాత సోమ వారం రాత్రి పన్నెండు కు ఉయ్యూరు చేరుతుందని చెప్పాడు .సోమ వారం పంచారామ దర్శనం అని ఏంతో సంతోషించాం .

ఆది  వారం రాత్రిఎనిమిదింటికే భోజనాలు పూర్తీ చేసుకొని  పదకొండు గంటలకు ఆటో లో ముగ్గురం బస్ స్టాండ్ చేరాం . ‘’పల్లె వెలుగు బస్’’ .రాత్రి పన్నెండు గంటలకు ఉయ్యూరు లో బయల్దేరింది .కంకిపాడులో ఎక్కిన వారితో సహా మొత్తం 53మంది ,ఇద్దరు డ్రైవర్లు జోగేశ్వర రావు వెంకటేశ్వర రావు .ఆది  వారం రాత్రికి బెజవాడ ,అక్కడి నుండి  కృష్ణ కరకట్ట మీదుగా అమరావతికి రాత్రి రెండుమ్బావు కు చేరింది .దర్శనం చేసి ఎప్పుడు మళ్ళీ తిరిగి రావాలో డ్రైవర్లు ఎవరికీ చెప్పలేదు .ఇది ఒక లోపం .రెండవది బస్ ‘’పంచ రామములు ‘’ని బోర్డు పెట్టారు .నేను మాలో కొందరు అయిన యనమండ్ర పార్ధ సారధి గారి అబ్బాయి సాయి అతాని భార్య ,కొడుకు ,పాల పర్తి వెంకట్రామయ్య గారి అబ్బాయి సుబ్రహ్మణ్యం భార్య ,ఊర మల్లి కొట్లో గుమాస్తా రామా రావు మాకు తెలిసిన వాల్లుళ్ళు ఉండటం కొంచెం బాగుందని పించింది .’’పంచలో రామ దర్శనం చేయిస్తున్నారు మన డిపో వాళ్ళు.అంటే పంచె లో రామ అంటే స్త్రీ ల దర్శనం చేయిస్తున్నారన్న మాట ‘’అని వీళ్ళకు చెబితే పగల బడి నవ్వారు  సాయి కుటుంబం మాకు చేదోడు వాదోడు గా ఉన్నారు

.

దేవాలయం ఆవరణ లో ఉన్న పంపుల  దగ్గరే ఆడ ,మగా అందరం సిగ్గు విడిచి మేమందరం స్నాలు చేశాం .అక్కడేఉన్నరావి ,ఉసిరి చెట్ల కింద   మన ఆడవాళ్ళు దీపాలు వెలిగించుకొన్నారు .ఇదంతా అయ్యే సరికి మూడున్నర అయింది .వెంటనే అక్కడే ఉన్న దర్శనం లైన్ లో నిల్చున్నాం.  .ఒక్కో టికెట్టు నూట పాతిక రూపాయలు .కొని వెంటనే ముందు .కెళ్ళాం అక్కడి నుండి సరాసరి మెట్లు ఎక్కి శ్రీ అమరేశ్వర స్వామిని సందర్శించాం . దివ్య దర్శనం గా భాసించింది .ఉషోదయానికి పూర్వమే ప్రభాత శివ దర్శనం అయి నందుకు ఏంతో సంతృప్తి గా ఉంది అమ్మ వారు శ్రీ బాల చాముండీ దేవి ని, క్షేత్ర పాలకుడు శ్రీ వేణు గోపాల స్వామిని దర్శించి బయటికి వచ్చేసరికి తెల్ల వారు ఝామున నాలుగుమ్బావు మాత్రమె అయింది .బస్ సత్తెన పల్లి రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉందని తెలుసుకొని ఆటో లో అక్కడికి చేరాం .అక్కడి ఒక బడ్డీ కొట్లో మంచి కాఫీ తాగాం .ఆరురూపాయలు ఒక్కో కాఫీ .వెంటనే బస్ తలుపు తీసి అందులో ఎక్కి కూర్చున్నాం .సాయి ,సుబ్రాహ్మణ్యం కుటుంబాలు హాయిగా పడుకొన్నారు ఇద్దరూ పౌరోహిత్యం చేస్తున్న వాళ్ళే .నేను మాత్రం ఇలాంటి అవకాశం రాదు అనుకోని నాతొ తెచ్చుకొన్న పుస్తకాలు తీసి సంధ్యా వందనం నిత్య పూజ చదువుకొని .

తర్వాత మహాన్యాసం చదివినమక ,చమకాలతో  ఏక రుద్రాభిషేకం చదివి ,దశ శాంతులు సామ్రాజ్య పట్టాభి షేకం పూర్తీ చేసి,శివ అష్టోత్తర ,శతనామావళి పూర్తీ చేశా.ఆ తర్వాత ‘’బిల్వ అస్తోత్తరం ‘’కూడా చదివి మూలుగా ఇంటి దగ్గర చేతలు, మంత్రాలతో చేసి నట్లు ఒక్క మంత్రాలు మాత్రమె చదువు కొని ,నైవేద్యం ,హారతి మంత్రం పుష్పం పూర్తీ చేశాను .ఇదంతా అయ్యే సరికి ఆరు గంటలయింది .

ఇంకా చాలా మంది రావాలి .అప్పుడు డ్రైవర్లకు కంగారు పట్టుకోంది .మేమిచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్లు చేయటం ప్రారంభించారు .కొంత మంది లాండ్ నంబర్లు ఇవ్వటం, కొందరిచ్చిన సెల్ తీసుకు రాక పోవటం కొంత ఇబ్బంది అయింది .డ్రైవర్ జోగేశ్వర రావు’’ఆసులో గొట్టం’’ లాగా రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నాడు .రెండో ఆయన ఫోన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు .యాభై రూపాయల టికెట్ల వారు ,ఉచిత దర్శనం వాళ్ళు కొందరు ఏడింటికి వచ్చారు .దేవాలయం లో మైక్ లో చెప్పించమని డ్రైవర్ తోచెప్పాను .అలాగే ఫోన్ చేసి చెప్పించాడు కూడా .మిగతా వాళ్ళు రాలేదని అందరం తిట్టుకోన్నాము .కొందరు అక్కడి రోడ్ మీద ఉన్న దుకాణాలలో టిఫిన్లు చేశారు .మేము మాత్రం ఇంటి నుంచి తెచ్చుకొన్న గారే లు ,బిస్కట్లు తిని ,కమలాలు తిని మందులు వేసుకోన్నాం .ఉదయం తొమ్మిదింటికి అందరు చేరారు .అప్పుడు డ్రైవర్లకు చెప్పాను ‘’ఈ సారి ఆపినప్పుడు యెంత టైం లో రావాలో ఖచ్చితం గా చెప్పండి ఆ సమయం లో రాక పొతే వాళ్ళ కోసం బస్ ఆగదని తెలియ జేయండి ‘’అన్నాను అలాగే చెప్పారు .డ్రైవర్లు ఇద్దరూ మంచి వాళ్ళే .బస్సు కూడా కత్తి  లాగా ఉంది డ్రైవర్లూ కత్తులె అందుకే యెంత దూరం అయినా యిట్టె నరికేసి నట్లు ..బస్ ను బాగా నడి పించారు. ఇద్దరు ఎక్స్ప్రెస్ ద్డ్రైవర్లే. .ముద్దు ముద్దు గా తొమ్మిదింటికి అంటే మేము దిగిన ఏడు  గంటల తర్వాత బయల్దేరింది .ఈ ఆలస్యం  రోజంతా ఇబ్బంది పెట్టింది .

పంచారామాలు,వాటి వివరాలు

అమరావతి లోని అమరేశ్వర స్వామి విశేషాలు తెలుసు కొందాం .అమరా వతి గుంటూరు జిల్లాలో ఉంది .దీనిని ‘’అమరా రామం ‘’అంటారు స్వామి ‘’అమరేశ్వర స్వామి ఇంద్రుడు ప్రతిస్టించాడు ‘’ఆయన ముఖం ‘’అఘోరం ‘’స్వరూపం శాంతి స్వరూపం’’ అమ్మ వారు ‘’బాల చాముం డేశ్వరి  .రెండోది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమ వరం లోని భీమేశ్వరవామి అలాగే ప్రక్కనే గును పూడిలో ఉన్న సోమేశ్వర స్వామి .స్వామి పేరు సోమేశ్వరుడు .’’సద్యో జాత ‘’ముఖం .స్వరూపం ‘’నిత్య నూతనం ‘’.చంద్ర ప్రతిష్టి తం .అమ్మ వారు పార్వతి దేవి ఈ క్షేత్రాన్ని సోమా రామం అంటారు .మూడవది పశ్చిమ గోదావరి లోనే పాలకొల్లు లో ఉన్న  ‘’క్షీరా రామం ‘’.స్వామి రామ లింగేశ్వరుడు .’’ఈశాన ముఖం ‘’.’’లోక మంతా తానె అయిన స్వరూపం’’ .’’ఈశాన ముఖం ‘’.శ్రీ రాముడు ప్రతిష్ట చేసిన లింగం .అమ్మవారు పార్వతి దేవి .నాల్గవది ద్రాక్షా రామం .తూర్పు గోదావరి జిల్లాలో ‘’దాక్షారం ‘’లో ఉంది .స్వామి భీమేశ్వరుడు .’’తత్పురుష ముఖం ‘’.స్వరూపం ‘’ఆత్మ ‘’.’’స్వయంభువు  ‘’.అమ్మ వారు మాణిక్యాంబ .అయిదవది కొమారా రామం .తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటలో ఉంది .స్వామి కుమారారామ భీమేశ్వరుడు .’’వామ దేవ ముఖం ‘’.’’సత్య సుందర స్వరూపం ‘’.కుమార స్వామి ప్రతిష్టి తం .అమ్మ వారు బాలా త్రిపుర సుందరి . ఇప్పుడు అమరారామం గురించి తెలుసు కొందాం .

అమరా రామం

కృష్ణా నదీ తీరం లో ఉన్న మహా మహిమాన్విత పుణ్య క్షేత్రం .అమరారామం .ఇంద్ర ప్రతిష్ట కనుక అమరేశ్వరుడు అయాడు .తారకాసుర కంఠాన్నిశివుడు చేదించినప్పుడు శివుని అమృత లింగం

అయిదు భాగాలుగా విడి పోయి పెద్ద భాగం అమరావతిలో పడింది దీనిని ఇంద్రుడు ప్రతిస్తించాడు మిగిలినవి పైన చెప్పిన నాలుగు చోట్ల  పడి ఆరామాలయ్యాయి .  కృష్ణానది పడమటి దిశ నుంచి తూర్పుకు మలుపు తిరిగిన చోట  ఆలయం నిర్మించారు .ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని గురించి స్కాంద ,బ్రహ్మ ,పద్మ పురాణాలలో ఉంది ..ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి నాలుగుదిక్కులా నాలుగు ధ్వజ స్తంభాలున్నాయి.దక్షిణ ద్వారం లో ముఖ మండపం ఉంది .తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణా నదీ ప్రవాహం ఉంటుంది .ఇది ‘’పంచాయతన క్షేత్రం ‘’కూడా అంటే గణపతి ,అంబిక ,సూర్య నారాయణ ,శ్రీ మహా విష్ణువు అంశ అయిన వేణు గోపాల స్వామి ఉంటారు .క్షేత్ర పాలకుడు కాల భైరవుడు .ఇది శివ కేశవులకు అభేదమైన క్షేత్రం .మూల విరాట్ శ్రీ అమర లింగేశ్వర స్వామి  36 అడుగుల ఎత్తున్న లింగాకారం .పై అంతస్తులో 9అడుగులు ఎత్తైన శ్వేత లింగాకారం ఉండగా ,మిగిలిన 23అడుగుల లింగం కింది అంతస్తులో గోడ కట్టి మూసి వేయ బడి ఉంది .

    

ఏకాదశ లింగాలు మూడు ప్రాకారాలలో ప్రతిస్తింప బడ్డాయి .ముఖ మండపం దక్షిణ ముఖం గాను ,గర్భాలయం తూర్పు ముఖంగా ,ఉంది .మొదటి ప్రాకారం లోకి ప్రవేశించ గానే ప్రాకార దేవతలు ‘’ప్రణవేశ్వరుడు ,

శంకరా చార్యులు ,కాశీ విశ్వేశ్వరుడు ,ఉమామహేశ్వరుడు,దత్తాత్రేయుడు ,రుద్రా పాదాలు ,జ్వాలా ముఖీ దేవి ,అగస్త్యేశ్వరుడు ,పార్దివేశ్వరుడు ,సోమేశ్వరుడు ,నాగేశ్వరుదు ,మహిషాసుర మర్దిని ,కోసలేశ్వరుడు ,వీర భద్రుడు అనే దేవతా మూర్తులను సందర్శించాలి

Inline image 3Inline image 4    తూర్పు ద్వా

తూర్పు ద్వారానిఎడురుగా కృష్ణా నది స్నాన ఘట్టం కనీ పిస్తుంది ఇక్కడి నుంచి మొదటి ప్రాకారం లోకి వస్తే పశ్చిమ ద్వారం వైపు ఉత్తరాభి ముఖం గా లింగా కారం లో అన్నపూర్ణా సహిత కాశీ విశ్వేశ్వరుడు ,గణపతి, నంది ని దర్శించాలి .తూర్పు ముఖం గా ఉన్న జ్వాలాముఖి అమ్మ వారిని దర్శించాలి మారేడు వృక్షాలు ,పున్నాగ వృక్షాలు పవిత్రతకు చిహ్నాలుగా ఉంటాయి .కృష్ణా నది మరొక వైపు ఎదురు గా కనీ పించే ‘’వైకుంఠ పుర క్షేత్రం ‘’చూస్తె పంచా రామాలలో ఉన్న మొదటి క్షేత్రమైన అమరావతి వైభవం, ప్రత్యేకత తెలుస్తాయి

రెండో ప్రాకారం తూర్పు ద్వారం గుండా ప్రవేశిస్తే కృష్ణమ్మ పరవళ్ళు ఒళ్ళు గగుర్పోడుస్తాయి .ప్రాకారం లోపల ప్రదక్షిణం గా వెళ్తే విఘ్నేశ్వరుడు ,కాలభైరవుడు మధ్య నవ గ్రహ మండపం ,అక్కడే శ్రీ కృష్ణ దేవ రాయలు ,అమరావతి ప్రభువు వాసి రెడ్డి వెంకటాద్రి

కాలాలలో,తులాభారం తూగిన మండపాలున్నాయి .తర్వాత నవ గ్రహమండపం ,దాని కెదురుగా యాగా శాల చూడచ్చు .‘ పడమటి వైపు సంతాన గోపాల స్వామి ,వాయవ్యం లో కుమార స్వామి ,ఈశాన్యం లో సిందూరం రంగులో శ్రీ ఆంజనేయ స్వామి తర్వాత నవ గ్రహమండపం ,దాని కెదురుగా యాగ శాల చూడచ్చు .

మూడవ ప్రాకారం లో 23మెట్లు ఎక్కి పైకి  వెళ్లి ఆగ్నేయంలో పస్చిమాభి ముఖం లో ఉన్న కాళహస్తీశ్వర స్వామిని దర్శించ వచ్చు .కొంత దూరం కిందికి నడిస్తే మెట్ల దారి కనీ పించి నైరుతికి వెడితే తూర్పు ముఖం గా శ్రీశైల  మల్లేశ్వర స్వామిని దర్శించ వచ్చు .ప్రదక్షిణం చేస్తూ వెడితే ధ్వజ స్తంభం కనీ పిస్తుంది . అక్కడ గోడ పై ఉన్న జ్యోతిర్లిన్గాలను చూడాలి .తూర్పు ముఖం గా కాశీ విశ్వేశ్వరుడు ఉంటాడు .తూర్పు ధ్వజ స్తంభం వద్ద సూర్య భగవానుడిని చూడాలి .ఇక్కడి నుంచి సభా మండపం లోకి వెళ్ళాలి .ఉత్త్తర దక్షిణాభి ముఖం గా ఉన్న బాలచాముం డేశ్వరి  అమ్మ వారిని దర్శించి తరించాలి .నంది మండపం ,నందిని చూసి ,గర్భాలయం లో ఉన్న 9 అడుగుల లింగా కార

అమరేశ్వర స్వామి మూల విరాట్టు ను దర్శించి జన్మ చరితార్ధం చేసుకోవాలి .స్వామికి అభిషేకాలు నిర్వహించుకో వచ్చు ,శుద్ధ స్పటిక లింగా కార శివ లింగమే అమరేశ్వర లింగం .వెనక్కి వెళ్లి నంది మండపం లో శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించి శివ కేశవులకు భేదం లేదని గ్రహించాలి .తర్వాత నిలుచున్నా ప్రమాణం లో ముఖం అంతా పసుపు ,ముఖం పై యెర్ర కుంకుమ బొట్టు లో ఉన్న బాల చాముండీ శ్వరి అమ్మ వారిని దర్శించి అనుగ్రహం పొందాలి ..మూడవ ప్రాకారం పైన తారకాసుర వధ ఘట్టం మొత్తం రంగు చిత్రాలలో చిత్రింప బడి ఉండటం చూస్తాం .కార్తీకం లో ను ,మహా శివరాత్రి నాడు ఇక్కడ విశేష కార్య క్రమాలు జరుగుతాయి .

అమరావతి పూర్వపు పేరు ‘’ధాన్య కటకం ‘’.ఒకప్పటి ముఖ్య పట్నం .కోట్ల రాజ వాఆఅమ్శస్తులు పాలించారు .వెంకటాద్రి నాయుడు వల్ల  ఇక్కడ పట్నం ఏర్పడింది .1795లో రాజధానిని చింతపల్లి నుంచి అమరావతికి మార్చాడు .తన పరగణా లో ఒకే ముహూర్తం లో108శివ లింగాలను నాయుడు ప్రతిస్టించాడు .శాతవాహనులు మొదలైన రాజు లెందరో స్వామిని దర్శించి కానుక లందించారు .ఆలయం లో ఎక్కడ చూసినా శిలా శాసనాలు కనీ పిస్తాయి . మూడవ ప్రాకారం లో ఉత్తర దక్షిణ ద్వారాల వద్ద ,రాజా వెంకటాద్రి నాయడి ముఖ మండపం ఉంది .కొమ్మ నాయుని శాసనం ,కోట కేత రాజుల శాసనాలు ,అనవేమా రెడ్డి శాసనం ,కృష్ణ దేవరాయ శాసనం ,హాద్రికం పెద్దప్పం గారి శాసనం ముఖ్యం గా అందరూ చూడాలి .

దీనికి దగ్గర లో ధరణి కోటలో బౌద్ధ స్తూపం ,మ్యూజియం తప్పక చూడాల్సినవి .స్తూపం శాలి వాహనుల కాలం లో 100అడుగుల ఎత్తు 138,అడుగుల వ్యాసం ,521అడుగుల  చుట్టు కొలత గల’’ జాతక కదా’’ విశేషాలతో ఉన్న శిల్ప కళా వైభవం వర్ణనా తీతం .నాగ రాజుల కాలం నుండి నాగార్జునుని కాలం వరకు నాల్గు దశల్లో ఇది పూర్తీ అయింది .ఇక్కడి విశ్వ విద్యాలయం లో శిల్పం చిత్ర లేఖనం ,సంగీతం వాస్తు శాస్త్రం ,ఆరోగ్య శాస్త్రం ,వైద్య శాస్త్రం మొదలైనవి బోధించే వారు .చైనా టిబెట్ ,బర్మా ,సింహళం నుంచి కూడా విద్యార్ధులు ఇక్కడికి వచ్చి విద్య నేర్చే వారు ..అమరావతి మ్యూజియం మన దేశం లోనే మొదటి శ్రేణికిచెందింది .ఆలయం దగ్గరే షిర్డీ సాయి ,సత్య శాయి ,కపోతేశ్వర ధ్యాన మందిరాలు చూడ దగినవి .కృష్ణా నదికి ఎదురుగా ఎత్తైన తిన్నె మీద ధ్యాన ముద్ర లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిభారీ  విగ్రహం దర్శనీయమైంది .అందువల్ల అమరావతి హిందువులకు ,బౌద్ధులకు ప్రధాన ఆరాధనా స్తలం అయింది

Inline image 1Inline image 2

..

తర్వాత మేము దర్శించిన భీమేశ్వర స్వామి ని వివరిస్తాను

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 27-11-13- ఉయ్యూరు .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు, పంచా రామ and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.