తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం –1

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం –1

నవంబర్ పదహారు సాయంత్రం నాలుగు గంటలకు నేను హైదరాబాద్ లో ఉండగా మా బావ మరిది ఆనంద్ వియ్యంకులు ,తణుకు విజయ బాంక్ ఆఫీసర్ అయిన శ్రీ జి.వి.ఎల్ .యెన్ మూర్తి గారు ఫోన్ చేసి తణుకు లో తమ సంస్థ నన్నయ భట్టారక పీఠమ్ లోఇరవై ఆరవ తేదీ మంగళ వారం సాయంత్రం ఆరున్నర గంటలకు  ననను  ‘’రామాయణ మహా భారతాలో మానవ విలువలు ‘’పై ప్రసంగించమని కోరారు. సరే అన్నాను .కాని నాకు ఆహ్వానం ఇరవై రెండో తేదీన అందింది .అప్పటి దాకా దానిపై ఆలోచించ లేదు .ఆ మర్నాడు కూచుని విషయాలను నోట్స్ రాసుకోన్నాను .ఇరవై నాలుగు ఉదయం బెజ వాడలో ప్రముఖ ఇంజినీర్ శ్రీ టి.శోభనాద్రి గారి 81వ జన్మ దినోత్సవాన్ని వారి కుమారులు కూతుళ్ళు వైభవం గా జరుపుతున్నారని రావలసిందని ఆహ్వానం పంపారు .ఉదయం పదింటికి వెళ్లి ఆ కార్య క్రమం చూసి శాలువా కప్పి జ్ఞాపిక ఇచ్చి విందు ఆరగించి ఇంటికొచ్చే సరికి మధ్యాహ్నం మూడు దాటింది .రాత్రికి ‘’పంచారామ సందర్శనం .’మంగళ వారం దయం పదింటికి కాని తిరిగి రాలేక పోయాం .అంటే రెండు రోజులు విశ్రాంతి లేకుండా గడిపాను .భోజనం చేసి మధ్యాహ్నం పన్నెండు కు బయల్దేరి బెజ వాడ బెంజ్ సర్కిల్ దగ్గరకు ఒంటి గంటకు చేరి ఒకటిన్నరకు అమలాపురం ఎక్స్ ప్రెస్ బస్ ఎక్కాను. విషయాన్ని మూర్తి గారికి ఫోన్లో  చెప్పాను .సాయంత్రం నాలుగింటికి తణుకు’’ వై జంక్షన్’’ దగ్గర దిగాను .మూర్తి గారు వచ్చి స్కూటర్ పై తమ ఇంటికి తీసుకొని వెళ్ళారు .అక్కడ మా బావ మరిది కూతురు స్పందన అల్లుడు అంటే మూర్తిగారి అబ్బాయి హర్ష ఉన్నారు .వేడి వేడిగా ‘’పుల్లట్లు ‘’వేసి పెట్టారు మూర్తిగారి సతీమణి కాఫీ ఇచ్చారు .నా పరిచయం కోసం వివరాలు అడిగి రాసుకొన్నారు మూర్తిగారు .సాయంత్రం అయిదున్నరకు నన్ను స్కూటర్ పై ఎక్కించు దారిలో ‘’నన్నయ భట్టు ‘’గారి విగ్రహం ,దానికి కొద్ది దూరం లో ‘’గుర్రం పై ఎక్కిన సర్ ఆర్ధర్ కాటన్ దొర గారి విగ్రహాలను చూపించి శ్రీ రామ కృష్ణ సేవా సదన్ కు తీసుకొని వెళ్ళారు .అక్కడ నన్ను అందరికి  పరిచయం చేశారు .హాలు లోపలి కాలు పెట్టగానే ‘’వేలాది దోమలు స్వాగతం ‘’పలికి ముద్దులు పెట్టుకొని భయ పెట్ట్తాయి .ఎలా తట్టుకుం టున్నారో వీళ్ళు అనుకొన్నాను .

మంగళ వారం సాయంత్రం సరిగ్గా ఆరున్నరకు సంస్థ కార్య దర్శి శ్రీ సుశర్మ గారు స్వాగతం పలుకగా శ్రీ అక్కి పెద్ది రామ సూర్య నారాయణ ప్రార్ధన చేశారు.సభాధ్యక్షులు ఈ సంస్థ అధ్యక్షులైన’’ అభినవ కృష్ణ రాయ’’ బిరుదాంకితులుడాక్టర్ శ్రీ జి.ఎస్.వి.ప్రసాద్ .సభకు నన్ను శ్రీ మూర్తిగారు పరిచయం చేశారు .సరస భారతి పుస్తకాలు ‘’సిద్ధయోగి పుంగవులు ,శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ‘’అధ్యక్షా కార్య దర్శికి ,ప్రార్ధన చేసిన వారికి మాజీ ఏం ఎల్ ఏ గారికి ఇచ్చాను తర్వాత నేను నా ప్రసంగాన్ని కొనసాగించాను .

‘’మీసంస్థ   కు నాకు ఒక సంబంధం ఉంది .మేము ఉయ్యూరులో 1960లో ‘’నన్నయ కళా సమితి ‘’స్తాపించి అయిదారేళ్ళు నిర్వహించాం .ప్రసిద్ధ వ్యాఖ్యాత శ్రీ కాళ్ళూరివ్యాస మూర్తి గారి చే రామాయణ రహస్యాలను నెల రోజులు చెప్పించం .కల్లోరి సుబ్బా రావు గారు అనే సంగీత విద్వాంసుని చేత కచేరి చేయించాము .ఒక రాగం పాడుతుంటే వీణ తీగెలు ఆ సవరానికి అనుగుణం గా కంపింప జేశారు సుబ్బారావు గారు ఆ తర్వాతా వారి ప్రతిభ దేశమంతా ప్రపంచం అంటా తెలిసింది . ఆ తర్వాతా మా ఉద్యోగాల వల్లదూరప్రాంతాలకు వెళ్ళటం వలన కార్య క్రమాలు ఆగిపోయాయి .మీ సంస్థ తొంభై ఏళ్ళ  చరిత్ర కలిగి ఉందని తెలిసి ఆనందం గాఉంది  .మీరు  మాకు అన్నయ్యలు ‘’నన్నయ్య ‘’గారి వల్ల .మీఊల్లో పంచదార ఫాక్టరీ ఉంది ,మా ఉయ్యూరులోను ఉంది కాని మాది ఆసియాలోనే పెద్ద ఫాక్టరీ .మా కే.సి.పి.పంచదార క్రిస్టల్స్ చాలా నాణ్యమైనవి .మాకు సిమెంట్  ఫాక్టరీ కూడా ఆ పేరుతొ ఉంది .మీ  గోస్తనీ నది ‘’తణుకు దుఃఖ దాయిని ‘’.డెబ్భై దశకం లో వచ్చిన తుఫాను వల్ల  గోస్తని పొంగి ఏంతో నష్టాన్ని కలిగించింది .అప్పుడు ఆ వార్తలను మా

విద్యార్ధుల చేత ఫోటోలు తో సహా సేకరింప జేసి ‘’వణుకు తున్న తణుకు ‘’పేర మా సైన్స్ ఎక్సి బిషన్ లో పెడితే మా విద్యార్ధులకు బహుమతి వచ్చింది .

మూర్తి గారితో నాకు సుమారు మూడేళ్ళ క్రితం పరిచయం అయింది వారబ్బాయి హర్ష ను మా బావమరిది కుమార్తె స్పందన కిచ్చి వివాహం జరిపించారు .పెళ్లి చూపుల నుంచి పెళ్లి దాక ,వీరిని కలుస్తూ ఉండేవాళ్ళం వీరి కొత్త ఇంటి గృహ ప్రవేశానికీ వచ్చాం .మా బావమరది ఏలూరు స్టేట్ బాంక్ లో పని చేస్తు ఉండగా  అక్కడ వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న ‘’యంగ్గ్ మెన్ హిందూ అసోసియేషన్ ‘’లో రాష్ట్రం మొత్తం లో ప్రసిద్ధి చెందినా చిత్రకారులను పిలిచి లైవ్ చిత్రాలు గీయించే సందర్భం లో నన్ను ‘’చిత్రకళ ‘’పై మాట్లాడించాడు  .మళ్ళీ మా బావమరిది వియ్యంకులు గారైన మూర్తి గారు తొంభై ఏళ్ళ చరిత్ర ఉన్న తమ సంస్తలో నాతొ మాట్లాడిస్తున్నారు .ఈ రెండూ భలే తమాషాగా ఉన్నాయి .

ఇక్కడ నన్నయ విగ్రహం చూసి నమస్కరించాను .రాజ రాజ నరేంద్రుడు నన్నయ గారితో తణుకు నుంచి మా కృష్ణ జిల్లా ‘’కలి దిండి ‘’వచ్చి అక్కడి ‘’పాతాల భోగేశ్వర స్వామి ‘’ని దర్శించాడు .అక్కడ ఉన్న కోనేటి దగ్గర నిల బడి ‘’హర హర హర ‘’అని మూడు సార్లు అంటే కోనేటి లో నుండి మూడు నీటి బుడగలు పైకి వస్తాయి .ఇప్పటికీ ఇది జరుగుతూనే ఉంది .రాజుకు అక్కడ ఒక నాగ కన్య కనిపించి తాము రోజు సాయం వేళలో స్వామిని దర్శించిపాతాల లోకానికి వెళ్లి పోతామని  వేల్ ఈ స్వామి మహా మహిమాన్వితుడని చెప్పింది .ఆ విషయాలు విన్న నన్నయ తన్మయం తో ‘’వాసుకి’’ మొదలైన నాగ దేవతా స్తుతి చేశాడు .అప్పుడు రాజు నన్నయ ను ‘’భారతాన్ని తెలుగు లోకి అనువదించమని ప్రాధేయ పడ్డాడు .తొలి తెలుగు కవి అని పించుకొన్న నన్నయ భారత ఆంధ్రీకరణకు పూనుకోవటానికి కలిదిండి గొప్ప నేపధ్యం అయింది ఈ నాగస్తుతిని నన్నయ ‘’ఉదంకో పాఖ్యనం ‘’లో చేర్చుకొన్నాడు .ఇలా తణుకుకు మా కృష్ణా జిల్లా కలిదిండికి బాంధవ్యం కూడా కలిగింది .కాటన్ దొర పై  ఈ మధ్యనే నేను ఇంటర్ నెట్ లో ‘’అపర భగీరదీయం ‘’పేర పది ఎపి సోడ్లు రాశాను ..ఈ కార్తీక సాయం సంధ్యా సమయం లో ఈ సంస్థ కార్య క్రమం లో అవకాశం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు .ఇదంతా నేనిక్కడికి రావటానికి నేపధ్యం .ఇక అసలు విషయం లోకి వెళ్తున్నాను.

‘’హెలెన్ ఆఫ్ ట్రాయ్ ‘’లో హెలెన్ అనే మహిళ ఆ నాడు యెంత భీభత్సం సృస్తిమ్చిందో ట్రాయ్ ని గ్రీకు దేశాన్ని ఎలా వాణి కిమ్చిందో చరిత్ర చదివిన వారన్దరికీ తెలుసు ఇప్పుడు వచ్చిన ‘’హెలెన్ ఆఫ్ ఆంధ్రా ‘’తుఫాను ఇక్కడి మీ కొనసీమను అక్కడి మా కృష్ణా జిల్లాను అతలాకుతలం చేసి భీభత్సం సృష్టించింది .దీని వల్ల  ఎందరో మరణించారు ఏంటో మంది ఇబ్బంది పడ్డారు ఆస్తి నష్టం జరిగింది ఆ మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని వారి బంధువులకు, ,నష్టపోయిన వారికీ సాను భూతి, సహవేదనను తెలియ జేస్తున్నాను ఎందు కంటే ఇవాళ మనం మాట్లాడుకొనే విషయం ‘’మానవ విలువలు ‘’కనుక ఆప్యాయత అనురాగం ,స్నేహం బాంధవ్యం ప్రేమ ,కరుణ సాను భూతి కృతజ్ఞత సౌభ్రాతృత్వం సహవేదన ,విశ్వమానవ ప్రేమ మొదలైనవి అనేవి మానవ విలువలు .’’వేటిని ఆచరిస్తే మన జీవితాను ఉన్నతం ఉత్తమం అవుతాయో అవే విలువలు’’ .రామాయణం చెప్పినా భారతం చెప్పినా ఈ విలువలను కాపాడుకోవాలనే .మరి ఈ ఇతిహాసాలకు మూలం దేనిలో ఉంది ?ఋగ్వేదం లో ‘’మనుర్భవః’’అని ఒక రుక్ ఉంది అంటే ‘’మనిషిగా జీవించు ‘’అని అర్ధం. మనిషిగా బతికితే ‘’మనీషి ‘’అవవచ్చు అది వస్తే అప్పుడు మన ఆలోచన ‘’క్రింవంతు విశ్వం ఆర్యం ‘’అవుతుంది అంటే ఈవిశ్వం అంత ఆర్య మయం కావాలి .అంటే ఉన్నత మైన ఉత్తమ మైన పద్ధతిలో ఉండాలి అని మన సంస్కృతీ చెప్పిన విషయం .

రామాయణానికి నాయకుడుశ్రీ రాముడు భారతానికి శ్రీకృష్ణుడు నాయకుడు. రామాయం ధర్మ వీరం .భారతం శాంత రస ప్రాధాన్యం కలది .రాముడు నడచిన మార్గం లో నడవాలి కృష్ణుడు చెప్పి నట్లు చేయాలి .భారతం అర్ధ ప్రాధాన్యత కలది .రామాయణ కర్త వాల్మీకి మహర్షి ఆదికవి ఆదికావ్యం .భారత కర్త వ్యాస భగవానుడు .తెలుగు లో కవిత్రయం భారతాంధ్రీకరణ చేశారు తొలి తెలుగు కవి నన్నయ .ముందుగా రామాయణం లో మానవ విలువలను గురించి తెలుసు కొందాం

సశేషం –

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-13-ఉయ్యూరు

.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.