తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -2
తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం –1
‘’ఆకృతి రామ చంద్రు విభావాక్రుతి ,కన్బొమ తీరు స్వామి చాపాక్రుతి
కన్నులన్ ప్రభు క్రుపాక్రుతి ,కైశిక మందు రామ దేహాక్రుతి
సర్వ దేహమున యందున రాఘవ వంశ మౌళి ధర్మాక్రుతి
కూరుచున్న విధ మంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియై ‘’
గా లంకలో ఉన్న సీతమ్మ రావణాసురుడికి కన్పించింది .వేలాది మైళ్ళ దూరం లో సీతా తా రాములున్నా వారి హ్రుదయాలెప్పటికీ సన్నిహితం గానే ఉన్నాయి .సీత దేహ మంతా రాముడు వ్యాపించి ఉన్నాడు .కను బొమ రామ చాపం లా,రాముని ప్రతిజ్ఞా స్వరూపం గా సీత ఉంది కనుక వారికి అభేదమే దాన్ని చేదించే ప్రయత్నం చేస్తే రాముని విల్లు సమాధానం చెబుతుంది ధర్మా గ్రహం వస్తే సర్వ నాశనమే కలుగు తుంది అని హెచ్చరిక ..అలాంటి సీత మనస్సు మార్చటం సాధ్యం కాదని తెలుసుకున్నాడు రావణుడు .అందుకే అంటాడు ‘’ఆతని యందీమెకు గల ప్రత్య యంబు –లోతునకు సముద్రములు చాలవు .ఎత్తునకు పర్వతములు చాలవు .వేగమున నదులు చాలవు .ఇంత ప్రశ్రయము విశ్లదీకరింప శివుడోక్కడే దయ చూడ వలే ‘’అని తెలుసుకొన్నాడు .అదీ సీతా రాముల ఆదర్శ దాంపత్యం .అదే ఆదరణీయంఅనుసరణీయం ..అందుకే అది రామ మార్గము సీత మార్గము అయి రామాయణం అని పించుకోంది..కనుకనే ‘’సీతాయణ మూ అయింది .అందుకే ‘’సీతాయః చరితం మహాత్ ‘’అన్నారు .విశ్వ నాద గారి కుమారుడు శ్రీ కృష్ణ దేవ రాయలు అమెరికా లో ఉంటూ ‘’సీతాయణం ‘’పేర వచన రామాయణం రాశారు నేను చదవటం జరిగింది .
జన సామాన్యం తో కలిసి మెలిసి వారి కస్టాలు ,బాధలు ,ఇబ్బందులను తొలగించి ,వారి సేవ చేయటమే శ్రీ రాముని ధ్యేయం గా వాల్మీకి రాముడిని చిత్రించాడు .తాటక స్త్రీ కనుక దాన్ని చంపటానికి కొన్ని క్షణాలు సంకోచించాడు .కాని అధిక జన సుఖం కోసం పాపం వచ్చినా ఫరవా లేదని చంపేశాడు .అందుకే మహర్షి వాల్మీకి ‘’సరైన దారిలో సరైన సమయం లో సరైన పనిని సక్రమంగా చేస్తే ,జరగాల్సింది జరిగి తీరు తుంది ‘’అన్నాడు సీతా స్వయం వర సమయం లో .స్వచ్చమైన ప్రేమకు ప్రతీక రాముడే .అందువల్ల రామ దర్శనం తో అహల్య పూర్వ రూపం పొందింది .వ్యక్తిత్వానికి ఇంతటి శక్తి ఉందన్న మాట .
పట్టాభి షేకం జరుగుతుందని తండ్రి దశరధుడు చెప్పి నప్పుడు రాముడు పొంగి పోలేదు అడవికి వెళ్ళ మన్నప్పుడు కుంగీ పోలేదు అంతటి ప్రశాంత చిత్తం తో ఉన్నాడు అదే అందరికి ఆదర్శం కావాలి .బాహ్య ప్రపంచం లో తనాకు విశాల మైన అవకాశాలు కలుగ బోతున్నాయని మునులతో కలిసి పని చేసే గొప్ప అదృష్టం కలగ బోతోందని ‘’ప్రజల మనిషి ‘’అని పించుకోవటానికి కైక అవకాశం ఇచ్చిందని ఆనంద పడ్డాడు ‘’దేవి !లోక మానస్తు ఉత్సహే ‘’అన్నాడు పిన తల్లి కైక తో .ప్రపంచం అంతా రాముడే .రాముడే ప్రపంచం ‘’అందుకే రామ దాసు ‘’అంతా రామ మయం జగ మంతా రామ మయం ‘’అన్నాడు అదే ప్రభువుకు ఉండాల్సిన లక్షణం .
భరతుడు వచ్చి అరణ్యం లో రాముడిని కలిశాడు అయోధ్యకు రమ్మని బతిమిలాడాడు ఇద్దరూ ఎవరి వాదాన్ని వారు స్ట్రాంగ్ గా చెప్పారు .సత్యం కోసమే పోరాడారు .అదీ సత్య పాలన .భరతుడు నిద్ర లేని రాత్రి గడిపాడు రాముడి పక్కనే ఉండి మౌనమే ఇద్దరి మధ్య రాజ్య మేలింది .వాల్మీకి ఇక్కడ ‘’మౌనం అవధులు దాటితే రాత్రి కూడా మౌనం గానే గడిచి పోయింది .’’శోచతా మేవ రజనీ ,దుఖేన వ్యత్య వర్తత్ ‘’
విరాధుడు రామ లక్ష్మణులను భుజాల పై కెత్తుకొని అడవిలో పారి పోయాడు .లక్ష్మణుడికి విపరీతమైన కోపం వచ్చి వాణ్ని చంపెస్తానన్నాడు .అప్పుడు రాముడు ‘’ఈ దుర్గమ అరణ్యం లో ఆ రాక్షసుడు మనకు దారి చూపాడు .కనుక వాడికి మనం కృతజ్ఞత చూపాలి ‘’అన్నాడు ఇదీ మానవీయ విలువ .విరాధుడు మార్గ దర్శి అయ్యాడు .శర భంగ మహర్షిని దర్శించమని చెప్పాడు కూడా .కబంధుడనే రాక్షసుడు కిష్కింద కవైపుకు వెల్ల మని సలహా ఇచ్చాడు .ఇలా బద్ధ శత్రువులు కూడా రాముడికి సాయం చేశారు .ఇది రామ వ్యక్తిత్వం మహిమ .అందుకే రాముడు ‘’బద్ధ శత్రువులే శ్రేయోభిలాషులవటం అనూహ్యం గా ఆశ్చర్యం గా ఉంది ‘’అన్నాడు .మంచికి అంతటి విలువ ఉంది అని చెప్పే సన్ని వేశం ఇది .కబంధుడు ఆశీర్వ దించి పంపాడు సోదరుల్ని .
అగస్త్య మహర్షి రామునితో ‘’సీత ఆనందానికి నువ్వు కారకుడివి గా ఉండాలి’’ .అని హితవు చెప్పాడు ‘’అజేయ బల పరాక్రమాలున్నా నువ్వు శాంతి మార్గాన్ని ఎంచుకోన్నావు. కనుక తప్పక విజయం సాధిస్తావు ‘’అని దీవించాడు మహర్షి అగస్త్యుడు . శాంతి కి అంతటి విలువ ఉంది .జనస్థానం లో పద్నాలుగు మంది రాక్షసులతో ప్రారంభ మైన యుద్ధం పద్నాలుగు వేలతో ఘోర సంగ్రామం గా మారింది ఒంటి చేత్తో అజేయ ధనుర్ పరాక్రమాన్ని చూపి కళ్ళు మిరు మిట్లు అయేట్లు వాళ్ళ నందరిని చంపేశాడు క్షణాలలో ఎప్పుడు బాణం వదిలాడో ఎప్పుడు శరాన్ని సంధానం చేశాడో తెలీకుండా చేశాడు .రావణ సేనాధిపతులు ఖరుడు ,దూషణుడు ,త్రిశురులు అసువులు కోల్పోయి రావణుడికి తీవ్ర నష్టం చేశాడు .దేవతలు స్తుతించారు తమ్ముడు లక్ష్మణుడు ‘’చిరు నవ్వు చిందించాడు .సీత రాముడిని అభి నందిస్తూగాఢం గా అల్లుకు పోయింది భర్త ను .దీనితో శ్రమ అంతా మర్చి పోయాడు .రాముడు .మంచి పని చేస్తే అభి నందిస్తే వచ్చే ఫలితం ఇది .
మాయ లేడిని సీత కోరినప్పుడు దాని వెనుక ‘’భగవత్ ప్రేరణ ఉంది ‘’అని రాముడు భావించాడు .అదొక ప్రశ్నా సమయం గా అనుకొన్నాడు స్తిర దృఢ ధైర్య చిత్తం తో అన్నిటికీ సిద్ధ పడ్డాడు .అదీ స్తిత ప్రజ్నుడి లక్షణం ..
శ్రీరాముని ఉదాత్త వ్యక్తిత్వం సుగ్రీవుడికి నైతిక సహకారాన్ని అందించింది .ఇక్కడ వాల్మీకి ‘’ఏష రామ శివాహ్ పంధాః ‘’అన్నాడు .అంటే ఒక వైపు రాముడుగా మరో వైపు దేవత గా రాముడి మహోన్నత వినయ గుణం భాసించింది .వాలి వధ లో అంగదుడిని ,వాలి భార్య తార లకు పునరా వాస సౌకర్యం కల్గించాడు రాముడు .సుగ్రీవుడు వారిద్దరిని చేర దీసేట్లు చేశాడు రామ మూర్తి .కిష్కింధలో అప్పటికి ఉన్నసంక్షోభ తీవ్ర రాజ కీయ మార్పులను అత్యంత శాంతి యుతం గ సాధించాడు రాముడు .అదీ రాకీయ దురంధరత .సుగ్రీవుడు రాకీయానికి దాంపత్య సుఖానికి చాలాకాలం దూరమై ఉన్నాడు కనుక అతనికి సమయం ఇవ్వాలని రాముడు భావించి అతడు మానసికం గా స్తిర పడటానికి నాలుగు నెలల గడువు ఇచ్చాడు .కార్య సాఫల్యతకు ఇంతటి వివేకం ఉండాలి అని మంకు తెలిపాడన్న మాట .
తాను రామ బంటుని అని యెంత చెప్పినా ఆతను చేసిన సహాయానికి మెచ్చిహనుమ ను ‘’మహాత్మా !’’అని సంబోధించి అతనిలో ఉన్న గొప్పతనాన్ని లోకానికి చాటాడు .యుద్ధం లో ఒక సారి అంతఃపురం పై అంతస్తు మీద తిరుగుతున్న రావణుడిని చూసి ఉద్రేక పడి సుగ్రీవుడు ఒక్క సారి లంఘించి వాడికిరీటం కింద పడేసి వస్తే రాయుడు ‘’రా బోయే రోజుల్లో అధిక జన నాశనం, విపత్తులు రానున్నాయి ధైర్య ,నిగ్రహాలు చాలా ముఖ్యం ‘’అని హితవు చెప్పాదు.అతనిప్రాణం చాలా విలువైనది అని తెలియ జెప్పాడు .అన్న రావణుడు చని పోయిన తర్వాతా విభీషణుడి తో ‘’శరీర దోషాలన్నీ మృత్యువు తో అంతమవుతాయి .కనుక అన్న రావణుడికి దహన సంస్కారాలు చెయ్యి ‘’అని బోధించాడు ఇక్కడే మనం చెప్పుకొనే వాల్మీకి మాట ‘’మరణం తాని వైరాణి’’గుర్తుందికదా .
ఇలా మానవ విలువలైన సత్యం ధర్మం ,న్యాయం ,గౌరవం ,హోదా ,హుందా తనం ,మర్యాద ,కరుణ ,రెమ వాత్సల్యం సహా వేదన సాను భూతి మొదలైన వాటిని సందర్భోచితం గా రాముడు మిగిలిన రామాయణ పాత్రలు చూపించి వాటి విలువలను పెంచారు .వీటికి కాపాడే విషయం లో రాముడు ‘’మనస్సాక్షి ‘’కి ప్రాధాన్యత నిచ్చాడు
సీతా దేవి శ్రీ రాముని తో జరిపిన అతి తక్కువ సంభాషణ లో వినయం ,రాజ వంశ గౌరవం ప్రతి స్పందిస్తుంది .ఇలాంటి ఆదర్శ వనితా తన సహ ధర్మ చారి అయి నందుకు గర్వ పడుతున్నాను అని అంటాడు .సీతను అనసూయా దేవిని ఒకే పదం వాడి వారి ఔన్నత్యాన్ని మనకు గుర్తు చేశాడు మహర్షి .’’అనసూయ –అనసూయ తో మాట్లా డింది ‘’అంటాడు వాల్మీకి .ఒక అనసూయ అత్రి మహర్షి భార్య మహా సాధ్వి రెండవ అనసూయ అంతటి సాధ్వీత్వాన్ని పొంద బోతున్న సీతా దేవి .ఇది మహిళకు ఆదర్శం కాదా ?జటాయువు చూపిన సాహసం త్యాగ నిరతి ని సీత ప్రసంశించింది .ఆతను రాముడికి తన వార్త తెలియజేసే వరకు అతన్ని బతికించమని దేవుళ్ళను ప్రార్ధించింది .అతని మరణానికి సాను భూతి ప్రకటించింది ఇది మానవ విలుకున్న ప్రాధాన్యత .
హనుమ చూసిన సీత ను ‘’సీతేక్షణ ‘’అన్నాడు .ఆమె చూపుల్లో రాముడే కనీ పిస్తాడు .ఆమె చూపుల్లో సహిష్ణుత ,సమానత్వం కనీ పించాయి హనుమకు .సీత భౌతిక సుఖాలకు అతీతం గా రాముడి ఘనతను పెంచింది .సంపూర్ణ మానవుడి గా రాముడిని తీర్చి దిద్దింది సీత .అందుకే జీవితాన్ని వ్యయం చేసిన త్యాగ మూర్తి .త్యాగం అత్యంత ఉదాత్త మాన వీయ విలువ .ఒక ఆదర్శ స్త్రీకి ఉండాల్సిన అన్ని లక్ష ణాలు ఆమె లో మూర్తీభవించి ఉన్నాయి .సంసారిక జీవితానికి ఉద్దేశ పూర్వకం గా దూరం గా ఉంది త్యాగం విసర్జన ల ద్వారా అమర్త్యులం అవాలని చెప్పిన వేదం వాక్యానికి సీతా రాములు ప్రతీకలు .
సీత జాడ తెలియక రాముడు కోపోద్రిక్తుడై ‘’సర్వ నాశనం చేస్తాను ‘’అన్నప్పుడు తమ్ముడు మంచి మాటలతో ఆయన ఉద్రేకాన్ని తగ్గించి మరీ సన్నిహితుడయ్యాడు .అందుకే రాముడు అతడిని ‘’నా ప్రధాన మిత్రుడు ‘’అని గౌరవం గా అన్నాడు తమ్ముడిని ..హనుమ సీతా రాముల తో సమానం గా దేవతా స్వరూపుదయ్యాడు .ఇది అతని త్యాగం సేవకు లభించిన అత్యధిక స్తాయి, గౌరవం ప్రతిష్ట .
మిగిలిన విషయాలు రేపు తెలియ జేస్తాను
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-13-ఉయ్యూరు