తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -3

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -3

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -2

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం –1

‘’మానవ అన్వేషణ కోసం చేసే ప్రయాణమే రామాయణం ‘’అన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక పరిశోధకులు స్వర్గీయ ఇల పావులూరి పాండు రంగా రావు గారు .రాముడు విశ్వ ప్రేమ ,కనికరం ,పూనరావాసం లను ప్రపంచానికి పంచాడు .నోటి మాటలు చెప్పకుండా ఆచరించి చూపి మార్గ దర్శి అయ్యాడు .ఒక విధం గా మంచికి చెడు కు మధ్య అవగాహనే రామాయణం .మానవ దృక్పధం లో మారీచ రాక్షసుడికి గుణ పాఠం చెప్పి ప్రాణాలు కాపాడాడు రాముడు .’’మానవాస్త్రం ‘’అనే మార్మిక అస్త్రాన్ని రాముడు ప్రయోగించి మారీచాదులను తరిమేశాడని వాల్మీకి మహర్షి అన్నారు .వాడిని సంస్కరించాడు .వాడికి మనశ్శాంతి కల్గించాడు .రుషి తుల్యుడినీ చేశాడు .రావణుడికి హితవు చెప్పే స్తాయికీ ఎదిగాడు .సహనం ,ఓర్పు  నశించేట్లు చేస్తే తాముడు ఊరుకోడు .అందుకేరావణ  మారీచాదులను చంపాల్సి వచ్చింది .మానవ జాతి మానుగడ కోసమే రావణ సంహారం చేశాడు .

భరద్వాజ మహర్షి శ్రీ రామాదులకు ఆతిధ్యమిచ్చి ‘’రామా !నీకు ఏదైనా సంకల్పం ఉంటె నేను నేర వేరుస్తాను ‘’అన్నాడు .అప్పుడు రాముడు తనకోసం తన వారికోసం ఏదీ కోరుకోకుండా ‘’మహర్షీ !ఇక్కడ మీ

ఆశ్రమం నుంచి అయోధ్య వరకు వెళ్ళే మార్గం లోచెట్లు  అన్నికాలాల్లో ఫల పుష్ప భరితం అయెట్లు అనుగ్రహించండి ‘’అన్నాడు .అలానే చేశాడు మహర్షి .

కుంభ కర్ణుడి లో ధైర్యం ,పట్టుదల ,కారుణ్యం,నిస్స్వార్ధ త్యాగం  ఉన్నాయి .ఇంద్ర జిత్తు స్వార్ధం తో ఏ తప్పూ చేయలేదు .తండ్రి మద్దతుకోసమే ఏదైనా చేశాడు .పాపం దుస్ట తండ్రికి కొడుకుగా పుట్టటమే ఇంద్ర జిత్ తప్పు .మొదట్లో వాలి సుగ్రీవులు హార్దిక సౌభ్రాతృత్వం తోనే ఉన్నారు తర్వాత అధికార కాంక్ష వారిద్దరిని వేరు చేసింది

‘’మానవ హుందా తనానికి రాముడు ప్రతీక ‘’సహచరులకు రాముడు ఇచ్చిన ‘’మానవతా స్పర్శ ‘మానవ పరిధిని దాటి పశు హృదయాలనూ తాకింది అదీ రాముని లోని మాన వాతా గుణం .రధ సారధి గా ఉన్న సుమంత్రుడు  రాజ నీతిజ్ఞుడు ,వేదాంతి ,చివరికి ప్రవక్త స్తాయి ని పొందాడు .అదీ రామ ప్రభావం .శ్రీ రాముని ఆధ్యాత్మిక ప్రకాశం ,మానవతా స్పర్శ సుమంత్రుడిని అంత ఉన్నత స్తితి కి చేర్చింది

.

గుహుడు భరతుని హృదయం లోకి చొచ్చుకు పోవాలని ఏంతో  ప్రయత్నించాడు .అందుకే మహర్షి వాల్మీకి ‘’గహన గోచరుడు ‘’అన్నాది మెచ్చుతూ .నిస్వార్ధ సేవకు ,త్యాగానికి ప్రతీకలు జటాయువు ,సంపాతి .

‘’దేశ కాలాలకు అతీతమైన నిత్య సత్య ప్రకాశకావ్యం వాల్మీకం .మానవ జీవితం లో అన్ని కోణాలను ఆవిష్కరించి ,శాశ్వత విలువలను ప్రతిష్టించిన‘’విశ్వ కావ్యం రామాయణం ‘’అన్న ఇల పావులూరి వారి మాటలు శిరోధార్యాలు .

‘’కుటుంబ వృద్ధిం ,ధన ధాన్య వృద్ధిం –స్త్రియస్య ముఖ్యాః సుఖం ఉత్తమంచ –శ్రుత్వా శుభం  కావ్య మిదం మహార్ధః-ప్రాప్నోతి సర్వం భూపాచార్ధసిద్ధిం ‘’.

ఇప్పుడు యుగం మారి త్రేతాయుగం నుంచి కృత యుగం లోకి ప్రవేశిద్దాం .మహా భారతానికి నాయకుడు శ్రీ కృష్ణుడు అని ఇందులో శాంత రసం ఉందని ముందే చెప్పుకున్నాం .శ్రీ కృష్ణుడు ఎలాంటి నాయకుడు ?

 

‘’Sree Krishna is the first teacher in the history of the world to discover and proclaim the grand truth of love for love’sake and duty for duty sake ‘’.అన్నారు శ్రీ త్యాగీశా నంద

అంటే ప్రేమ ప్రేమ కోసం  విధి –కర్తవ్య నిర్వహణ కోసమనే సత్యాన్ని ప్రపంచ చరిత్ర లో మొదట గ్రహించి ప్రకటించిన ప్రధమ ఆచార్యుడు శ్రీ కృష్ణుడు .

‘’in Krishna we find the ideal house holder ,and the ideal sanyasin ,the hero of a thousand battles who knew no defeat ,the terror of despots ,psychophants ,,hypocrats ,sophists and pretenders .The master statesman ,the uncrowned monarch ,the king maker who had no ambition for himself ‘’అని కీర్తించారు స్వామి త్యగీశానంద తమ ‘’సర్వ సిద్ధాంత సౌరభం ‘’లో

అంటే ‘’ఆదర్శ గార్హస్త్యం ,ఆదర్శ సన్యాసం శ్రీ కృష్ణుని లోనే చూస్తాం .ఆయన అపజయం ఎరుగని రణ రంగ ధీరుడు .నిరంకుశులకు పరాన్న భుక్కులకు ,వంచకులకు ,కుతర్క వాదులకు నటించే వారికి ఆయన భయంకరుడు .అతి కుశల రాజకీయ వేత్త కృష్ణుడు .కిరీటం లేని చక్ర వర్తి .రాజ్య నిర్మాత .స్వార్ధ రహితుడు

‘’డాక్టర్ అమీయా సేన్ గుప్తా కృష్ణుని గుణ గణాలను వర్ణిస్తూ ‘’krishna gives knowledge to the ignorant ,powr to weak ,mercy to sufferers ,and goodness to the wicked .His qualities are for the sake of others ,not for himself .He naturally becomes the dearest treasure of a human heart ‘’అన్నారు .ఇవన్నీ కృష్ణుని మానవీయ గుణాలకు ఉత్కృష్ట రూపాలు .

‘’భక్తిభిహ్ శాన్తిభిహ్ భక్తో కే గీత మే హై –ధర్తీకే వాసియోకి ముక్తీ –ప్రీత్ మే హై ‘’అన్నాడు ప్రముఖ కవి ఇక్బాల్ .అంటే ‘’జనులందరి మధ్య ప్రేమ వికసిస్తే భూమి స్వర్గం గా మారుతుంది .ఆ ప్రేమనే శ్రీ కృష్ణుడు అందరికి పంచాడు .

మహా భారతం లో సత్యా సత్యాలకు ,ధర్మా ధర్మాలకు ,దైవ ,రాక్షస భావాలకు జరిగే సంఘర్షణ ప్రధాన ఇతి వృత్తం .భారతం అర్ధ ప్రాధాన్యం కలది .పరబ్రహ్మ స్వరూపాన్ని ,విధి ప్రభావాన్ని ,లోకులకు తేట తెల్లం చేసి సత్య ధర్మాలను లోకం లో ప్రతిస్టిం చటమే  వ్యాస మహర్షి ఆశయం .అప్పటికే సంఘం లో న్యాయ ధర్మాలు క్షీణించి పోయాయి అధర్మం పెచ్చరిల్లింది. అందుకే భారత యుద్ధానికి దారి తీసింది .తానూ ఆ యుద్ధానికి నికి సాక్షీ భూతుడు కనుక ఆ కధను ఆధారం గా చేసుకొని ధర్మ ప్రచారాన్నిసంఘ ఉద్ధరణను చేయటానికి పూను కున్నాడు కృష్ణ ద్వైపాయన వ్యాసుడు .మధ్యలో ఎన్నో రసాలు తరంగాలు గా  వచ్చి ఎగసి పడి సమసి పోయి చివరికి ప్రశాంత మైన శాంతియే  వర్ధిల్లాలని వ్యాస భావం .శ్రీ కృష్ణుడు నాయకుడు .కనుక భారతం కావ్యమే కాదు ‘’శాస్త్రం ‘’కూడా .లౌకిక ఇతి వృత్తం ఆధారం గా ఆధ్యాత్మికత ను ప్రతి పాదించాడు .లోక కల్యాణానికి మార్గం వేశాడు భగవాన్ వ్యాసుడు .

‘’’ ఆయుష్యంబితి హాస వస్తు సముదాయం ,బై హికాముష్మిక శ్రేయః ప్రాప్తి నిమిత్త ముత్తమ సభా సేవ్యంబు లోకాగమ –న్యాయైకాంత గృహంబు నా బరగి –నానా వేద వేదాంత విద్యా యుక్తంబగుదాని జెప్ప దొడగెం దద్భారతాఖ్యానమున్ ‘’-‘’కమనీయ ధర్మార్ధ కామ మోక్ష ములకు నత్యంత సాధనం బైన దాని ‘’వ్యాస మహర్షి చెప్పాడు అని మహా కవి తిక్కన కీర్తించాడు .

విరాట పర్వం లో స్త్రీ కి జరిగిన అవమానం,శీ ల రక్షణ కోసం ఆమె చేసే ప్రయత్నాలు ,దాని ద్వారా జరిగిన పరిణామాలు లోక సామాన్యమై కీచక వధ ఒక ప్రబంధమే అయింది .

భారత కాలం నాటికి ‘’యౌవనేషు విషయైషి ‘’,వార్ధకే ముని వ్రుత్తి’’అనే భావన ఉండేది .బ్రాహ్మణ ,క్షత్రియులు స్వర్గ సుఖం కోసం వాజ పెయ ,రాజ సూయ ,అశ్వ మేధా ,పురుష మేధా మొదలైన యాగాలు చేసే వారు .ఉపనిషత్తులు బాగా ప్రచారం అవటం తో నిష్కామ తపస్సు ,బ్రహ్మ నిది ధ్యాస చేయటమే జన్మ సాఫల్యం గా భావించారు .ఈ నేపధ్యం లో ‘’గీతోపదేశం ‘’అని వార్య మైంది ప్రవృత్తికి నివృత్తికి మధ్య ఒక మధ్య బిందువు పై సమాజాన్ని నిలపాల్సి వచ్చింది అంటే ఈ రెండిటికి ‘’బాలన్స్ ‘’సాధించాల్సి వచ్చిందన్న మాట .అదే సాధించాడు గీత ద్వారా శ్రీ కృష్ణ పరమాత్మ .

ఆ నాటి సమాజం లో వర్ణ సంకరం బాగా జరిగి పోయింది దీనికి కారణం చంద్ర వంశ రాజులు అన్ని చోట్లా వ్యాపించి అన్నికులాల వారినీ పెళ్లి చేసుకోవటమే .దీనితో మిశ్రమ కులాలేర్పడ్డాయి .అప్పటిదాకా వేదం శాస్త్రాలు చదివిన వైశ్యులు వ్యవసాయం లో పడ్డారు .స్త్రీలలో అన్ని వర్ణాల వారు ఏర్పడ్డారు . చదువు అబ్బలేదు .యజ్న యాగాలు ,సన్యాసం దుర్లభ మయ్యాయి .ఈ స్తితిలో ఉన్న వారికి ‘’పరమ పదం’’దుర్లభ మైంది .వీళ్ళు మోక్షానికి అర్హులు కారు అని అగ్ర వర్ణాల వారు భావించారు

.ఇలాంటి దీనులను ఉద్ధరించటానికి ‘’జనతా జనార్దనుడు ‘’అవసరమయ్యాడు ఆ పని నెర వేర్చాడు శ్రీ కృష్ణుడు.ఏం చేశాడో తరువాత తెలుసు కొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 29-10-13-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.