కార్తీకం లో మా పంచారామ సందర్శనం -3
కార్తీకం లో మా పంచా రామ సందర్శనం -2
కార్తీకం లో మా పంచా రామ సందర్శనం – దర్శన మాలిక
కార్తీకం లో మా పంచా రామ సందర్శనం
క్షీరారామం
శ్రీ మహా విష్ణువు చే ప్రతిస్తింప బడి బ్రహ్మ చేత సేవింప బడిన దివ్య క్షేత్రం క్షీరా రామం .పావు తక్కువ ఎనిమిదికి బస్ ఆగిన చోటు నుండి మేమిద్దరం నడుచుకొంటూ వచ్చి క్షీరారామ రామ లింగేశ్వర్ఫా స్వామిని దర్శించాం మా మనవరాలు రమ్య ‘’భీమ వరం వరం దెబ్బకు’’ అలసి పోయి రాలేనంది. ఒక పిల్ల తల్లి కూడా బస్ లో ఉంటె ఆవిడకు అప్పగించి మేమిద్దరమే వచ్చాం .మిగిలిన రెండు క్షేత్రాలకూ రమ్య రాలేదు బస్ లోనే ఉంది .వందలాది ‘’పంచారామ స్పెషల్ ‘’బస్సులు రాష్ట్రం నలు మూలల నుండి ఈ నాల్గవ సోమ వారం నాడు పంచారామ దర్శనం కోసం వేలాది భక్తులు తరలి వచ్చారు .అన్నీ లక్సరీ బస్సులే ..రామ లింగేశ్వర దర్శనం తర్వాత పార్వతీ అమ్మ వారిని గణపతి మొదలైన దేవతామూర్తులను జనార్దన స్వామిని దర్శించం .ఆలయం బయట ‘’పాలకొల్లు స్పెషల్ పాపడి ‘’పావు కిలో నలభై రూపాయలు పెట్టి కొన్నాం .అక్కడి నుండి బస్ దగ్గరకు చేరాం .దగ్గరలో ఉన్న హోటల్ లో రెండు ప్లేట్ల ఇడ్లీ లు తెచ్చాను
నేను మా ఆవిడా చెరో ప్లేట్ తిన్నాం .ప్లేట్ పది రూపాయలు రెండిడ్లీ లు .ఒక ప్లేట్ కింద లెక్క. బాగున్నాయి .ఇప్పుడు క్షేత్ర మహాత్మ్యాన్ని తెలుసు కొందాం
.
పూర్వం వ్యాఘ్ర పాడుదు అనే మహర్షి కి ఉపమన్యువు అనే కుమారుడు పుట్టాడు.కొడుకు సర్వ వేదం విదుడై పవిత్రం గా జీవించే వాడు .సరైన యోగాభ్యాసం చెయ్యక పోవటం వల్ల యోగ భ్రస్టూడై నిరుపేద బ్రాహ్మణ కుటుంబం లో పుడతాడు .తల్లి పాలు కొని పోయ్యలేక పిండి పాలు పోసి పెంచుతుంది .ఒక సారి తల్లితో మేన మమల ఇంటికి వెడితే అక్కడ మంచి ఆవుపాలు తాగి ఆ రుచి మరిగిఇంటికి వచ్చిన తర్వాత పిండి పాలు తాగ నని మారాం చేస్తాడు .రోజు రోజుకీ చిక్కి పోతున్నాడు .తండ్రి కొడుక్కి శివ పంచాక్షరి బోధించి జపించ మంటాడు .ఉప మన్యువు మహా నిష్టతో జపిస్తాడు .భక్తికి మెచ్చిన శివుడు మారు వేషం లో వచ్చి శివ నింద చేస్తాడు .యితడు మంత్రించిన విభూతి ని శివుడి పై జల్లగా వేష దారి శివుడు అర్ధ నారీశ్వరుడై పోతాడు .ఉపమన్యువు ను ఎత్తుకొని పార్వతీ దేవికి ఇచ్చి పెంచమంటాడు ఆమె హస్తం నుంచి పాలు ప్రవహిస్తాయి అప్పుడు ఆ ప్రాంతం అంతా ‘’క్షీర కొలను ‘’అంటే ‘’పాల కొలను ‘’గా మారి పోయింది .అదే పాలకొల్లు క్షీరారామ అయింది .ఈ గ్రామం ‘’ఉపమన్యు పురం ‘’అయింది పాలుకారే మర్రి రావి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల కూడా పాలకొల్లు అయింది అంటారు .
త్రిమూర్తి ఆలయం గా క్షీరారామం ప్రసిద్ధి చెందింది .ఆలయం లో పార్వతీ పర మేశ్వరులు ,లక్ష్మీ నారాయణులు ,సరస్వతీ సహిత బ్రహ్మ దేవుడు కొలువై ఉన్నారు .దేవాలయ శిఖరం 120అడుగుల ఎత్తుఉండిదూరానికీ దర్శన మిస్తుంది .గోపురం పై తపోనిస్టలో ఉన్న శివుడు ఇంద్రాది అష్ట దిక్పాలకులు ,పంచ ముఖ పరమేశ్వరుడు ,నాట్య గణపతి ,లక్ష్మీ గణ పాటి ,సరస్వతి గజ లక్ష్మి ,కాలియా మర్దనం ,శివలీలలు ,దశావతారాలు మొదలైన ఎన్నో శిల్పాలు కను విందు చేస్తాయి .1774ఏప్రిల్ 14నశ్రీ బచ్చు అమ్మయ్య గారు గోపుర నిర్మాణానికి పూనుకోన్నారని స్తానికులు అంటారు .
దేవాలయ రాజ గోపురం దాటి లోపలి వెడితే శివుని సిమెంటు విగ్రహం పెద్ద సైజ్ లో కనీ పిస్తుంది .ధ్వజస్తంభం ఉత్తరాన ఆంజనేయ స్వామి గుడి ,దక్షిణం లో వీరభద్రుని గుడి ఉంటాయి .ఉత్తర దక్షిణం గా
విశాల మండపం వివాహాది శుభ కార్యాలకు యజ్ఞాలకు ఉపయోగ పడేట్లు గా నిర్మించారు .దీనినే ‘’పంచముఖ ప్రాంగణం ‘’అంటారు .శ్రీ క్షీరా రామ లింగేశ్వర స్వామి చుట్టూ జనార్దన స్వామి ,వినాయకుడు సుబ్రహ్మణ్యుడు ,గోకర్నేశ్వరుడు వేర్వేరు విమాన శిఖరాల తో కొలువై దర్శన మిస్తారు. స్పెషల్ దర్శనం పది రూపాయలు .శ్రీ రాముడు ప్రతిష్ట చేసిన రామ లింగేశ్వర స్వామి స్పటిక లింగం తారకాసుర వధ లో అతని కంఠం లో ఉన్న అమృత లింగాన్ని కుమార స్వామి చేదిన్చినప్పుడు పడిన నొక్కులే పంచారామాలలో లింగాలపై నొక్కులుగా కనీ పిస్తాయి ఇక్కడి శివలింగం మొన దేలి ఉండటం వల్ల ‘’కొప్పు ‘’భాగాన్ని సూచిస్తోందని అంటారు .శాసనాలలో ఈ స్వామిని ‘’కొప్పు రామ లింగేశ్వరుడు ‘’గా పేర్కొన్నారు .ఈ లింగం అమృత లింగం లోని శిరస్సు భాగమే నని అందరూ చెబుతారు .
ఉత్తరాయణ ,దక్షిణాయన కాలాలో సూర్యోదయాన సూర్య కిరణాలు పెద్ద గోపురం రెండ వ అంతస్తు నుండి ప్రాకారాలను దాటి రామ లింగేశ్వర లింగం పై ప్రసరించటం ఇక్కడి విశేషం .ఆలయ ముఖ ద్వారం
పై విష్ణు మూర్తికి క్షీరా రామేశ్వరుడు ‘’సుదర్శన చక్రం ‘’ప్రసాదించే సుందర శిల్పం చూడ ముచ్చట గా ఉంటుంది .ఇక్కడి శివుని అర్చిస్తే దారిద్ర బాధ ఉండదని నమ్మకం .ప్రాకార మండపం లో శిల్ప కళా విరాజమాన నందీశ్వర విగ్రహం ఉంది .పడమర ‘’రుణ హార గణ పతి’’ని దర్శించి నందీశ్వరుని కి ప్రదక్షిణం చేసి ,శ్రీ క్షీరారామ లిన్గేశ్వరుడిని దర్శించాలి .ఈ గణ పతిని దర్శిస్తే అప్పుల బాధలుఉండవు అని నమ్మకం .స్వామి పవళింపు సేవ గది చూడాల్సిందే నటరాజ విగ్రహం ఆకర్ష ణీయం.
ఇక్కడి అమ్మ వారు పార్వతీ దేవి .స్వామికి ఎదురుగా దక్షిణాన ఉత్తర ముఖం గా ,స్వామికి కుడి వైపు ఉంటుంది .శంకర భగవత్పాదులు ఇక్కడ శ్రీ చక్రమును ప్రతిష్టించారు .అమ్మవారిని ‘’త్రిపుర సుందరీ దేవి ‘’గా కూడా పిలుస్తారు .జనార్దన స్వామి లక్ష్మీ దేవి సమేతం గా ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించి ,పూజించి ,కొలువైనాడు శంఖ ,చక్ర గద ,పద్మ ధరుడై ,దశావతారాలు చెక్కిన మకర తోరణాలతో భక్త వత్సలుడై ఉంటాడు .
.
ప్రాకారం లో దుండి గణపతి ,లలితా దేవి ,వాసవీ కన్యకా పరమేశ్వరి ,వీర భద్రుడు ,సప్త మాతృకలు ,బ్రాహ్మీ, మహేశ్వరి ,కౌమారి వైష్ణవి , వారాహీ, చాముండీ వాహనాల తో దర్శన మిస్తారు .నైరుతి లో సరస్వతి అమ్మ వారు పుస్తక పాణి యై దర్శన మిస్తుంది .శ్రీ సంతోష రూపా దేవి ,దుర్గా దేవీలనూ చూడ వచ్చు పడమర తూర్పు ముఖం గా నెమలి వాహనం పై కార్తికేయుడున్నాడు .వాయవ్యం లో మహిషాసుర మర్దిని ఉత్తరాన కంచి కామాక్షి ,నాగేంద్రస్వామి ,సుందోప సుందులు ,నట రాజు ,దత్తాత్రేయ స్వామి ,ఆది శంకరా చార్యులు ,శనీశ్వరుడు రాధ కృష్ణుల విగ్రహాలు చూడ వచ్చు .
తూర్పు ప్రాకారం లో పశ్చిమ ముఖం గా సూర్య బగ వానుడు ,కాశీ విశ్వేశ్వరుడు ,నగరేశ్వరుడు బాణాసురుడు ,కాల భైరవ విగ్రహాలున్నాయి .ఇక్కడి నాగేశ్వర స్వామిని దర్శించి చిమ్మిరి నైవేద్యం పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం .తూర్పున శనీశ్వరుడు లింగా కారం లో ఉండటం విశేషం . నగరేశ్వరుడిని అగస్త్య మహర్షి ప్రతిష్టించాడని చెబుతారు .శ్రీరాముడు రావణ వధ దోషాన్ని పోగొట్టుకోవటానికి చేసిన 108శివలింగ ప్రతిస్టలలో 106వ లింగాన్ని ఇక్కడే ప్రతిష్టించినట్లుస్థల పురాణం ..అందుకే పాలకొల్లు అపర కాశి అని పించు కొంటున్నది .
క్రీ శ..918లో మొదటి చాళుక్య భీముడు ఈ పంచారామాలను గుర్తించి ఆలయాలు నిర్మించాడని చారిత్రిక కధనం .ఈ గుడిలో 75శిలా సాస నాలున్నాయి వాటిపై రంగులు పూయటంతో చరిత్ర కను మరుగౌతోంది .1136-1640మధ్య కాలం లో చాళుక్యులు ,రెడ్డి రాజులు ,కాకతి రాజులు మరెందరో భక్తులు విశేషం గా దానాలు ఇచ్చారు అలయాభి వృద్ధికి కృషి చేశారు .1176లో వెల నాటి చోడ రాజు భార్య గుందాంబిక అఖండ దీపారాధన కోసం భూదానం ఇచ్చింది .1276లో కోట గణపతి దేవ మహా రాజు నాట్య మండపానికి కంచు తలుపులు పెట్టించాడు .1296లో ఇతని రాణి ‘’ ఒడయ మహా దేవి ‘’దీపావళికి దీపోత్సవానికి శివ రాత్రి రోజు బ్రాహ్మణ అన్న సంతర్పనకు 10పుట్ల భూ దానం చేసింది .1316లో శ్రీ రామ నారాయణ చక్ర వర్తి శని వార మండపాన్ని కట్టిస్తే ,1385లో కాటయ వేమా రెడ్డి ప్రభువు పుష్ప వాహనాన్ని ఏర్పాటు చేశాడు 1388లో అల్లారెడ్డి రెడ్డి ప్రభువు శివాలయాన్ని కట్టించి ‘’అల్లాడేశ్వరుడు ‘’పేర లింగ ప్రతిష్ట చేశాడు 1415-1416లో బెళ్ళాపిన్నమ నేని ,నరహరి నేని అనే భక్తులు బంగారు రధాన్ని ,కళ్యాణ మండపాన్ని ఇచ్చారు 1596కే పవళింపు సేవ మందిరం ఉంది .1714లో పాలకొల్లు నిజాం పాలన లోకి వెళ్ళింది .క్షీరారామం పంచారామమే కాకుండా ‘’శిల్పా రామ క్షేత్రం ‘’గా ప్రసిద్ధి చెందింది .
చైత్ర శుద్ధ దశమి నాడు స్వామి వారల కల్యాణోత్సవం వైభవం గా నిర్వహిస్తారు .ఏకాదశి నాడు రధోత్సవం చేస్తారు 1972లో శ్రీ రామ లింగేశ్వర’’ ఓరిఎంటల్ కాలేజి ‘’ని ఏర్పరచి సంస్కృతవిద్యా బోధన ను ఉచిత భోజన వసతి సదుపాయాలతో కల్పించారు .
పాలకొల్లు లో బయల్దేరి రాత్రిపదకొండు నలభై అయిదు నిమిషాలకు ద్రాక్షా రామం చేరాము .ఆ విశేషాలు తర్వాత తెలియ జేస్తాను.
సశేషం
మీ –గబ్బిట దుర్గా రసాద్ -1-12-13-ఉయ్యూరు
Prasad garu, I am very happy to read your article on our home town, Palakol.