కార్తీకం లో మా పంచారామ సందర్శనం -4 ద్రాక్షా రామం

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -4

ద్రాక్షా రామం

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -3

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం -2

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం – దర్శన మాలిక

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం

అర్ధ రాత్రి పన్నెండు గంటలకు ఇరవై రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లు కొని భీమేశ్వర స్వామి దర్శనం కన్నుల పండువుగా చేసుకోన్నాం .ఆ తర్వాత  అష్టా దశ శక్తి పీఠాలలో ఒకటైన మాణిక్యాంబ అమ్మ వారి ని సందర్శించి పునీతులయ్యాం .ఆలయం చాలా పెద్ద ప్రాకారం లో ఉంది .బయట నాటకాలు హరికధలు తెల్ల వార్లూ కార్తీకం లో నిర్వ హిస్తున్నారు ఇరవై ఏడవతేది రాత్రికి శ్రీని వాస కల్యాణాన్ని తిరు పతి దేవస్థానం  వారు ఇక్కడ నిర్వహిస్తున్నట్లు అనౌన్స్ చేస్తున్నారు .మైక్ లో.మా బస్ దిగిన చోట కాక ఆలయం ఎడమ వైపు ఉంచారు .అక్కడికి నడిచి వెళ్లి ఎక్కి కూర్చుని మిగిలిన వారి క కోసం ఎదురు చూశాము .ఇప్పుడు ఆలయ విశేషాలు తెలుసు కొందాం .

‘’ద్రాక్షారామాత్పరం క్షేత్రం –న భూతో న భవిష్యతి ‘’అని వ్యాస భగ వానుడు ‘’భీమ ఖండ మహా పురాణం ‘’లో చెప్పాడు .పంచారామాలలో

రెండవదిగా త్రిలింగ క్షేత్రాలలోను రెండవదిగా ,ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉపలింగ క్షేత్రం గా ద్రాక్షా రామం వర్ధిల్లింది .

శివుడి అమృతలింగం రెండవ భాగం ఇక్కడ పడింది .దీన్ని పవిత్ర గోదావరి జలాలతో సంప్రోక్షణ చేసి ఇక్కడ ప్రతిష్టించాలని సప్త ఋషులు భావించారు .కాని ఇక్కడ అప్పుడు నదిలేదు .గోదావరిని ప్రార్ధించారు .ఆమె మహర్షులతో ప్రయాణమై వచ్చింది .కాని మార్గ మద్యం లో ఋషుల ,రాక్షసుల ఆశ్రమాలన్నీ మునిగి పోయాయి దీనికి కోపించిన వారాంతా గోదావరిని అదృశ్యం అయేలా శపించారు .అప్పుడు ‘’తుల్య భాగుడు ‘’అనే రాక్షస రుషి మధ్య వర్తి గా ఉండి గోదావరిని అంతర్వాహిని గా ప్రవహించేట్లు చేస్తాడు .సప్తరుషులైన కశ్యప ,అత్రి ,జమదగ్ని ,విశ్వా మిత్ర ,గౌతమ ,వసిష్ట ,భారద్వాజుల చేత తీసుకొని రా బడింది కనుక దీనిని ‘’సప్త గోదావరి ‘’అంటారు .రాక్షసులతో వివాదం కారణం గా గోదావరి రాక ఆలస్యం అయి నందున శివుడు బ్రహ్మాది దేవతలా అభ్యర్ధన మేరకు ఇక్కడ ముహూర్త సమయానికి ‘’భీమేశ్వరుడు ‘’అనే పేరు తో మార్గ శిర శుద్ధ చవితి నాడు ‘’స్వయంభు ‘’గా వెలిశాడు .సప్తర్షులు వచ్చి విషయం తెలిసి నివ్వెర పోతారు.ఆలయం లోపలి వెళ్లాలని ప్రయత్నిస్తే అక్కడ విపరీత మైన వేడి గా ఉండటం గమనించారు .ఇంతలో ఆశీర వాణి’’ఇక్కడ స్వయంభు గా శివుడు వెలిశాడు  .సూర్యుడు మొదటి సారిగా స్వామిని అర్చించాడు ఈ వేడి తగ్గటానికి ఈ గ్రామం లో ఎనిమిది దిక్కులలోను ఎనిమిది సోమ లింగాలను ప్రతిస్టిం చండి .అప్పుడు ఈ వేడి తగ్గు తుంది ‘’అని వినబడింది.

Inline image 1Inline image 2Inline image 3Inline image 4

 

 

అప్పుడు సప్తర్షులు తూర్పున కోలంక లో సూర్యుడు ,ఆగ్నేయం లో దంగేరు లో కశ్యపుడు ,దక్షిణాన కోటి పల్లి లో అత్రి మహర్షి ,నైరుతి కోరు మిల్లి లో భరద్వాజుడు ,పడమర వెంటూరు లో విశ్వా మిత్రుడు వాయవ్యం సోమేశ్వరం లో గౌతముడు ,ఉత్తరాన వెల్ల గ్రామం లో వసిస్టూడు ,ఈశాన్యం పెను మళ్ళ లో జమదగ్ని మహర్షులు సోమేశ్వరుని పేర అష్ట లింగాలను ప్రతిష్టించారు .వీటినే ‘’అష్ట సోమేశ్వర క్షేత్రాలు ‘’అంటారు .

ద్రాక్షా రామం పంచారామమే కాక పన్నెండవ శక్తి పీఠం కూడా .నవ బ్రహ్మ లలో ఒకరైన దక్ష ప్రజా పతి .ఇక్కడే యజ్ఞం చేశాడు అందువల్ల ‘’దక్ష వాటిక ‘’అయింది .ఇక్కడే పార్వతీ దేవిని అవమానించి అల్లుడు శివుడిని  నిందించటం వల్ల  పార్వతి యోగాగ్నిలో దహనం చెందింది శివుడిఆజ్న తో వీర భద్రుడు దక్షయ యజ్న విధ్వంసం చేసింది ఇక్కడే ఇక్కడే విష్ణువు చక్రాన్ని తినేశాడు భద్రుడు. సూర్యుని పళ్ళు రాల గొట్టాడు .బతిమాలితే మళ్ళీ ఇచ్చాడు .శివుడు భార్యా వియోగం తో పార్వతీ దేవి సతీదేవి శరీరాన్ని భుజం పై వేసుకొని విలయ తాండవం చేస్తుంటే విష్ణువు చక్రం తో ఆమె దేహాన్ని పద్దెనిమిది ఖండాలు చేశాడు అవి పడిన చోటల్లా శక్తి పీఠం అయింది. ఇది పన్నెండవ శక్తి పీఠం అయింది .

ద్రాక్షా రామం ఎత్తైన రాతి ప్రహరీతో నాలుగు వైపులా నాలుగు రాజ గోపురాలతో ,అయిదు ప్రాకారాల మధ్య ఉంది ..మొదటి ప్రాకారం లో కొబ్బరి తోటలో నైరుతి భాగం లో మంగళ వార మండపం ,వాయవ్యం లో 70.స్తంభాల సోమ వార మండపం ,ఈశాన్య ములో రుద్ర తీర్ధం ,కాల భైరవుడు ,అష్ట భైరవులు ,తూర్పున అశ్వత వృక్షం మొదలు లో శంకర నారాయణు లుంటారు .తూర్పున నందీశ్వరుడు ధ్వజ స్తంభం ఉన్నాయి .దక్షిణాన శ్రీ అన్న పూర్నా సమేత విశ్వేశ్వర స్వామి ,మేధా దక్షిణా మూర్తి ఆలయాలున్నాయి .

Inline image 5Inline image 6Inline image 7Inline image 8Inline image 9

 

 

భక్తులు మొదట ప్రధాన ప్రాకారమండపం వద్ద కుడి వైపు నాట్య గణ పతి  దర్శించి ,ఎడమ వైపున డుండిగణపతిని చూసి ,లోపలి వెళ్లి కుడివైపు శ్రీ రామ ప్రతిష్టితమైన శేత్రపాలకుడు లక్ష్మీ నారాయణులను దర్శించి ,ఎడమ వైపున శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతిష్టించిన విరూపాక్ష స్వామిని చూసి ‘’,ఆలయ నమూనా’’ ను చూడాలి .బాల భీమేశ్వరుడు ,నట రాజ స్వామి ,సప్త మాతృక దర్శనం చేయాలి .సూర్య నారాయణ ,సుబ్రహ్మణ్య స్వాములని చూడాలి .మహిషాసుర మర్దిని ,చండీశ్వర స్వామి నవగ్రహ ,అష్ట దిక్పాలక మండపాలు ,శ్రీ వీరభద్రేశ్వరాలయం ,వటుక భైరవుడు ,లక్ష్మీ గణపతి,నకులేశ్వరుడు ,చతుర్ముఖ బ్రాహ్మలు ,మొదలైన ప్రాకార దేవతలను చూడాలి .

స్వామి ప్రధాన ఆలయం లో కింది భాగం లో 14అడుగుల ఎత్తుతో స్పటిక లింగాకారం గల స్వామి లింగ స్వరూపం గా కింది అంతస్తు నుండి పై అంతస్తుకు ఉంటుంది .ప్రధాన ఆలయం కింద భాగం లో శ్రీ సూరేశ్వర స్వామి ,శ్రీ దుర్గా దేవి ,శ్రీ ఆంజనేయ స్వామి ,108శివ సాల గ్రామాలతో కూడిన ‘’భీమ సభ ‘’మధ్య ఉన్న స్వామి వారి మూల విరాట్ కు (దీనినే

‘’చీకటి కోణం ‘’అంటారు )ప్రదక్షిణం చేసి ,మూడవ ప్రాకారం చుట్టి ప్ర వేశించాలి .నాల్గవ ప్రాకారం చూసి ,కింది అంతస్తులో మూల విరాట్ కి నమస్కరించాలి .ఇక్కడ పూజ ,అభిషేకాలుండవు .వెనక్కి వచ్చి దక్షిణం లో మొదటి  ప్రాకారం దగ్గర పది మెట్లు ఎక్కి ,పై అంతస్తులో నంది మండపం చేరి మళ్ళీ అయిదవ ప్రాకార ప్రదక్షిణ చేసి తూర్పు ఆగ్నేయం గా కైలాస గణపతి ని చూసి ఈశాన్యాన పంచ లోహ నట రాజ స్వామిని దర్శించి పార్వతి మందిరాలను చూడాలి .కింది భాగం లో పాన వట్టం నుండి 14అడుగుల ఎత్తుఉంది పై అంతస్తు వరకు వ్యాపించిన భీమేశ్వర స్వామి పై భాగం మూడు అడుగుల లింగాన్ని దర్శించాలి .ప్రదక్షిణ మండపం లో దక్షిణ నైరుతి లో రాతి స్తంభం పై శ్రీ వ్యాస భగ వానుని విగ్రహం తప్పక దర్శించాలి .అంతరాలయం లో పార్వతీ అమ్మ వారు ఉత్సవ మూర్తులు ఉంటారు .

పై అంతస్తు గర్భాలయం లో మూడు వైపులా విశాల మైన కిటికీలతో కింది నుండి పైకొచ్చిన భీమేశ్వర మహా లింగాన్ని దర్శించ వచ్చు .ప్రక్కనే ఉన్న మాణిక్యాంబ అమ్మ వారిని  దర్శించాలి .తూర్పు వైపు మెట్ల మీదుగా కిందికి దిగాలి .పది మెట్లు దిగితే శ్రీ చక్రస్థిత  అష్టాదశ శక్తి

పీఠాలలో పన్నెండవది అయిన మాణిక్యాంబ అమ్మ వారిని ప్రత్యెక ఆలయం లో దర్శించాలి .

మాఘ శుద్ధ ఏకాదశి కి భీష్మ ఏకాదశికి మాణిక్యాంబ సహిత భీమేశ్వర స్వామికి ,లక్ష్మీ నారాయణులకు ఒకే ముహూర్తం లో నిర్వహించటం విశేషం .శివ కేశవ అభేదాన్ని ఇక్కడ చూడగలం .

ఈశాన్యం లో వెలుపలిప్రాకారం లో డెబ్భై స్తంభాలతో సోమ వార మండపం లో ఉత్సవాలు జరుగుతాయి .ఆలయానికి రెండు కిలో మీటర్ల దూరం లో ‘’వేగాయమ్మ పేట ‘’లో మాణిక్యాంబ అమ్మ వారి పుట్టిల్లు. ,అక్కడే అమ్మవారి పన్నెండవ శరీర భాగం పడిందని అంటారు .కల్యాణం రోజున స్వామి వారు ఊరేగింపుగా వేగాయమ్మ పేటకు వచ్చి వెళ్తారు .

క్రీ పూ.ఒకటవ శతాబ్దినుండి ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది .హాల శాత వాహనుడు  ‘’హాలుడు ‘’‘’గాదా సప్త సతి ‘’ని సంకలనం చేశాడు .ఆయన సింహళ రాకుమారి లీలావతిని  ఇక్కడే సప్త గోదావరి తీరం లో శ్రీ

భీమేశ్వరాలయం లో వివాహం చేసుకొన్నట్లు జరిగి  ‘’లీలా వతి  కావ్యం ‘’లో రాశాడు .  గోరఖ్ పూర్ ‘’కళ్యాణ తీర్దాన్కాలు ‘’లో లలితా రాగం లో జ్ఞాన పద శివ లింగ ప్రాదుర్భావ పటలం లో అష్టోత్తర దివ్య శత క్షేత్రాలలో ‘’ద్రాక్షారామేత్ భీమేశం ‘’అని వర్ణన ఉంది .రాజ శేఖర కవి రాసిన బాల రామాయణం లో ఈ స్వామి స్తుతి వర్ణన ఉంది .కవి సార్వ భౌముడు శ్రీనాధుడు భీమ ఖండం లో ఈ స్వామి మహాత్మ్యాన్ని పరవశించి వర్ణించాడు ‘’విభావంబునకు ప్రభవంబును , ,విలాసంబునకు ,నివాసంబును ,నవ వర్గంబునకు వర్గంబును ,ధర్మంబునకు మర్మంబును ,దానంబునకు నిదానంబును ,విద్యలకు నిలయమై ‘’ద్రాక్షా రామ క్షేత్రం విలసిల్లిందని వర్ణించాడు .కవి భయంకరుడు వేముల వాడ భీమ కవి ‘’ద్రాక్షా రామ భీమేశ నందనుడన్ ‘’అని చెప్పుకొన్నాడు .ప్రౌఢ కవి మల్లన్న తన ‘’రుక్మాంగద చరిత్ర ‘’ను ఈ స్వామికి అంకితమిచ్చాడు .పదహారవ శతాబ్ది వాడిన సూరన్న కవి ‘’ధనభి రామ కావ్యం ‘’ను ద్రాక్షారామ స్వామికి అర్పణ చేశాడు .ఈ క్షేత్రానికి ఎందరెందరో రాజులు భూస్వాములు విలువైన వి దానం చేసినట్లు ఇక్కడున్న400,శాసనాల ద్వారా తెలుస్తోంది .

ఇక్కడి పంచ తీర్దాలైన –దక్ష యజ్ఞం జరిగిన దక్ష తీర్ధం ,సతీదేవి శరీర భాగం పడిన ముక్తి క్షేత్రమైన వేగాయమ్మ పేట ఎల్లారమ్మ గుడి ,పాప హారిణి అయిన భీమ పేట లోని సోమ తీర్ధం ,హిమవంతుడు తపస్సు చేసి శంకర వరం పొందిన హైమావతి క్షేత్రం ,సప్త ఋషులచే గౌతమిని అంతర్వాహిని గా తీసుకు రా బడిన సప్త గోదావరి తీర్ధ క్షేత్రం అందరు ఓపికగా చూడ దగినవి .

ఇక్కడే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇంద్రేశ్వర ,సిద్దేశ్వర ,యోగీశ్వర ,కాళేశ్వర ,యమేశ్వర ,వీరభద్రేశ్వర ,బ్రహ్మేశ్వర ,కపాలేశ్వర ,కుక్కుటేశ్వర ,సోమేశ్వర మహేశ్వర,సప్త కోటి రామ లింగేశ్వర క్షేత్రాలన్నీ ద్రాక్షా రామం చుట్టూ ఉన్నాయి .భీమేశ్వరాలయం మొదటి ప్రాకారం లో కాల భైరవాలయం వెనక రుద్ర తీర్ధం ఉంది .ఇక్కడ స్నానం చేస్తే పంచ మహా పాతకాలు నశిస్తాయి .ఆలయ వంశ పారం పర్య ట్రస్టీలు వేగాయం పేట జమీన్ దార్లు వాడ్రేవు రంగ నాయకమ్మ గారి కుమారులు వాడ్రేవు విశ్వ సుందర రావు బహద్దర్ ఆలయాన్ని అభి వృద్ధి చేశారు . 125ఎకరాల ఈనాం భూమిని స్వామికి సమర్పించారు .వీరి మనుమడు రాజా వాడ్రేవు సుందర రత్నాకర రావు ఈ విషయాలను చూస్తున్నారు .ఆలయం దేవాదయ శాఖ ఆధ్వర్యం లో నిర్వ హింప బడుతోంది .

ద్రాక్షారామ సందర్శనం తర్వాత బస్సు బయల్దేరి రాత్రి  రెండు గంటలకు  సామర్ల కోట లో ఉన్న ‘’కుమారారామం ‘’చేరింది .ఆలయ విశేషాలు తర్వాత తెలుసు కొందాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-13- ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పంచా రామ and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.