కార్తీకం లో మా పంచారామ సందర్శనం -5(చివరి భాగం )

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -5(చివరి భాగం )

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -4 ద్రాక్షా రామం

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -3

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం -2

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం – దర్శన మాలిక

కార్తీకం లో మా పంచా రామ సందర్శనం

ఈ సోమ వారం అర్ధ రాత్రి పన్నెండు దాకా దర్శనం ఇచ్చి ఒక పావు గంట మాత్రమె ఆలయ దర్శనం ఆపేసి మళ్ళీ రాత్రి పన్నెండుం బావుకు దర్శనం ఏర్పాటు చేశారు. సామర్ల కోట కుమారా రామం లో .రెండు గంటలకు బస్ దిగి ఒక వంతెన దగ్గర ఆటో లో మనిషికి అయిదు రూపాయలిచ్చి  ఆలయం దగ్గరకు చేరాం .ముప్ఫై  రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు కొని లైన్ లో నిలబడి కుమారా భీమేశ్వర స్వామిని దర్శించాం .అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి ని దర్శించాం .మిగతా దేవతా మూర్తులను దర్శించి ,లడ్డు ప్రసాదం కొని,అప్పుడే వచ్చిన  వేడి వేడి పులిహోర ప్రసాదంకూడా కొని తిన్నాం . ,బయటి కొచ్చి  కాఫీ త్రాగాం.ప్రభావతి పప్పు చెక్క కొని నవిలింది .యన మండ్రసాయి భార్య కొడుకు లతో కలిసి ఆటో లో మనిషికి పది రూపాయలిచ్చి వంతెన దగ్గరకు చేరి అక్కడే ఉన్న బస్సు ఎక్కి కూర్చున్నాం . .అందరు వచ్చేసరికి మూడు అయింది .అప్పుడు బస్సు బయల్దేరింది .ఇప్పుడు ఆలయ విశేషాలను తెలుసు కొందాం .

 

 

’మున్ను చాళుక్య భీమ రాత్పున్గవుండు-భక్తీ వెలయింప ,నాభీమ వరము నందు –నిల్చి యార్తుల కోర్కెల నించు నట్టి –సదయు జాళుక్య భీమేశు సంస్తుతింతు’’అన్నాడు శ్రీనాధుడు భీమ ఖండం లో ఈక్షేత్రాన్ని గురించి .దీన్ని ‘’చాళుక్య భీమ వరం ‘’అని కూడా అంటారు .సామర్ల కోట రైల్వే స్టేషన్ దగ్గర ఉంది .చాళుక్య భీముడు ఈ పట్నాన్ని కట్టించి రాజధానిగా పాలించి ,ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు .ఇక్కడ కుమార స్వామి అమృత లింగ శకలాన్ని ప్రతిస్టించాడు .కనుక ఈ క్షేత్రం ‘’కుమారా రామ భీమేశ్వరం ‘’అయింది .స్కంధా రామం అని పేరు కూడా ఉంది .

సామర్ల కోటకు ‘’శ్యామల కోట ‘’అని పేరు ఇక్కడ చాళక్య భీముడు కట్టిన కోట ఉంది .అది శిధిలమైంది .కుమార గిరి బావ మరది కాటయ వేముడు దీన్ని జయించి శ్యామలా  దుర్గాన్ని పునర్నిర్మించ బూనాడు .త్రవ్వుతూ ఉంటె మహిషా సుర మర్దిని అమ్మ వారి విగ్రహం దొరికింది దాన్ని ‘’శ్యామల దేవి ‘’పేరు తో కాటయ వేముడు ప్రతిస్టించాడు .దీనికి దక్షిణం గా గ్రామ నిర్మాణం చేసి దానికి ‘’శ్యామలా దుర్గం ‘’అని పేరు పెట్టాడు .అది క్రమం గా మారి ‘’సామర్ల కోట ‘’అయింది .శ్యామలా దేవి ఇప్పుడు ఈ భీమేశ్వరాలయం లో ప్రాకార దేవత గా కొలువై ఉన్నారు .ఈ శ్యామల కోట బొబ్బిలి యుద్ధం లో ఒక ప్రధాన పాత్ర వహించింది .ఒకప్పుడు ‘’స్వాములు ‘’ఇక్కడ ఉండే వారు .అందుకని స్వాముల కోట అయింది అదే సామర్ల కోట అయింది .

దేవాలయం చుట్టూ 18అడుగుల ఎత్తు ప్రాకారం ఉంది .నాలుగు వైపులా గోపురాలున్నాయి .ఇక్కడి శిల్పకళ ద్రాక్షారామాన్ని పోలి ఉంటుంది .ఇక్కడ కూడా ‘’నమూనా దేవాలయం ‘’ఉంది .దక్షిణం గా ప్రదక్షిణ చేస్తూ వెడితే తూర్పున ఉన్న కోనేటిలో స్నానమో పాదప్రక్షాళనో చేసి ఆలయ ప్రవేశం చేయాలి కోనేరుకు భీమ గుండం అని  ,పుష్కరిణి అని పేర్లు .కుమారనది లేక కుమార సరస్సు అంటారు .కుమారారామానికి దగ్గరలో ‘’కొమరేరు ‘’ప్రవహిస్తోంది .శ్రీ నాధుడు ‘’బాదరాయణు డత్యంత భక్తీ నియతి –దివ్య వాహిని ‘’గోమరేట’’దీర్ద మాడి –శిష్య వర్గంబు దాను దర్శించి ,మ్రొక్కి –శాశ్వతునకు జాళుక్య భీమేశ్వరునకు ‘’అన్నాడు

 

శివుడు వ్యాస మహర్షిని కాశీ నుంచి వెళ్ళ గొట్టిన తర్వాత ద్రాక్షారామాన్ని ,కుమారారామాన్ని సందర్శించి నట్లు భీమ ఖండం లో ఉంది

ధ్వజ స్తంభం దాటి లోపలికొస్తే నల్ల రాతి నంది విగ్రహం కనిపిస్తుంది ప్రాకార దేవతలను సూర్య దేవుడిని చూసి మహా గణపతి ,సప్త మాతృకలు దాటితే దక్షిణ ద్వారం వస్తుంది .ఇది దాటి తూర్పుకు వెడితే సరస్వతీ దేవి కుమార స్వామి కనీ పిస్తారు .వాయవ్యం లో మహిషాసుర మర్దిని ,ఉత్తర తూర్పులో శ్రీ మహా విష్ణువు ,దక్షిణాన లక్ష్మీదేవి దర్శించి ,ఉతర ద్వారం దగ్గరకు చేరాలి .దాన్నిదాటి ప్రాకార మండపం చేరితే చండీశ్వర స్వామి ,వీరభద్ర స్వామి ,ఈశాన్యాన వల్లీ సుబ్రహ్మన్య స్వామిని దర్శించాలి .ఇక్కడే ఉయ్యాల మండపం ఉంది .ఈ మండపం ‘’ఊపితే కదులుతుంది ‘’ఇదీ విశేషం ..ప్రాకారం లో బాలా త్రిపురసుందరి దేవి పశ్చిమాభి ముఖం గా దివ్య కాంతులతో దర్శన మిస్తారు .

అమ్మ వారి దర్శనం తర్వాత రెండు మెట్లు దిగి చతురస్రాకార గర్భ గుడి లో భీమేశ్వర స్వామి పాను వట్టం పై తెల్ల పాల రాతి రంగులో

ఉన్న పన్నెండు అడుగుల ఎత్తున్న శివ లింగం పై అంతస్తు దాకా ఉంటుంది .దీనినే ‘’యోగ లింగం ‘’అంటారు .కిందిఅంతస్తు గర్భ గుడి కి దక్షిణ ప్రాకారం ఉంది .ఇది చాలా చీకటి ప్రాకారం .కింది అంతస్తులో శివలింగాన్ని దర్శించ టమే కాని పూజాదికాలుండవు .పై అంతస్తులో ‘’రుద్ర భాగం ‘’లో అభిషేకాలు ,పూజాలు నిర్వహించాలి .కింది అంతస్తులోకి గర్భ గుడి నుండి కిందికి దిగి దక్షిణం లో ఉన్న మెట్ల ద్వారా పై అంతస్తుకు చేరచ్చు .ఈ మెట్లు చిన్నవి తల వంచి వెళ్ళాలి లేకుంటే పై అంతస్తు కు తల తగులుతుంది .ఈ దక్షిణ ఆగ్నేయ ద్వారాన్ని ‘’సూర్య ద్వారం ‘’అంటారు .కిందికి దిగటానికి ఉత్తరాన మెట్లుంటాయి .ఈ ఉత్తర ఈశాన్య ద్వారమే ‘’చంద్ర ద్వారం ‘’.ఈ సూర్య ,చంద్ర ద్వారాలు రెండు గర్భ గుడికి నాశికా రంధ్రాలు అంటారు మానవుడి నాసికా ద్వారాల్లలో ఎడమ వైపుది చంద్ర నాడి కుడిది సూర్య నాడి .యోగీశ్వరుడు ఈ రెండు నాడుల గుండా ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ప్రాణ వాయువు ను సహస్రారం లో అంటే శిరస్సులో చేర్చి పరమాత్మ అను భూతి పొంది ఆనందమయ మైన జీవికి ఇది యోగ మార్గం గా నిర్మించిన ద్వారాలు గా వీటిని భావిస్తారు .

 

గర్భాలయానికి నాలుగు దిక్కులా ద్వారాలుంటాయి .చైత్ర ,వైశాఖ మాసాల్లో సూర్య భగవానుడి ఉషః కిరణాలు ఉదయాన స్వామి పాదాల పైన సాయంత్రం అమ్మ వారి పాదాల మీద పడటం విశేషం .కార్తీక మాసం లో ,మార్గ శిర మాసం లో ,మహా శివ రాత్రి నాడు విశేష పూజలు అభి షెకాలు నిర్వహిస్తారు .శరన్నవ రాత్రులలో శ్రావణ మాసం లో అమ్మ వారికి కుంకుమ పూజ విశేషం .మాఘ బహుళ ఏకాదశి నాడు స్వామికి గ్రామోత్సవం కల్యాణోత్సవం రధోత్సవం వైభవం గా జరుగుతాయి .

అనేక మంది రాజులు పాలించిన ప్రదేశం ఇది .నంద వంశ రాజుల నుంచి తూర్పు చాళుక్యుల వరకు దీన్ని పాలించి స్వామిని దర్శించి కానుకలర్పించారు .కాళింగ దేశం నుండి పిఠాపురం  రాజ మండ్రి వరకు పాలించిన చాళుక్యులు ఈ ప్రాంతాన్ని దర్శించిన వారే .కుబ్జ విష్ణు వర్ధనుడి దగ్గర నుంచి మేడ విజయాదిత్యుని వరకు ముప్ఫై మంది పాలించారు .చాళుక్య భీముడు కుమారా రామ భీమేశ్వరాలయాన్ని నిర్మించాడు .తన యుద్ధాలవిజయాలకు ప్రతీక గా దీన్ని నిర్మించాడు .ఈయన 300యుద్ధాల విజేత ఈయన .కుమారారామ భీమేశ్వరాన్ని

రాజధానిగా చేసుకొని పాలించాడు.వీర చాళుక్యుడు అని పించుకొన్నాడు .అందుకే ‘’చాళుక్య కుమారా రామ భీమేశ్వర స్వామి ‘’గా ప్రసిద్ధి చెందాడు .

ఈ రంతం కొంతకాలం గోల్కొండ నవాబుల అధీనం లోను ఉంది ఈ నాటి హుసేన్ పురం వరకు వ్యాపించి ఉండేది .కొంతకాలం పెద్దాపురం సంస్థానం లో ,పిఠాపురం సంస్థానం లోను ఉండేది .ఆలయ పశ్చిమ ద్వారం వద్ద పశ్చిమ గోడకు ఒక గణ పతి  విగ్రహం ఉంది .ఈ విగ్రహం నాభి లో ఒక వజ్రం ఉండేదని ,రాత్రి పూట ఆ వజ్రం నుంచి కాంతి పుంజాలు వెలువడి భక్తులకు మార్గ దర్శకం గా ఉండేది .దాన్నెవరో దొంగిలించారు .వ్యాసుడు హీమేశ్వరుని ,రాజ నారయుణుడి ని దర్శించాడుఅని భీమేశ్వర పురాణం లో ఉంది .

‘’రాజ నారాయణ స్వామి రమ్య భావన –తార్క్ష్య కేతన పతికి నర్తనము గారపు –కుమారా రామ మాహర్మరేఖయ –చాళుక్య భీమేశు సదన వాటి ‘’అని వర్ణించాడు శ్రీ నాధుడు .ఆలయానికి పడమర రెండు కిలో మీటర్ల దూరం లో మాండవ్య లక్ష్మి దేవి సహిత నారాయణ స్వామి ఆలయం ఉంది .దీనికే ‘’రాజ నారాయణ స్వామి ఆలయం ‘’అంటారు .

కాటన్ దొర ఏర్పాటు చేసిన నీటి కాలువల వల్లఈ గ్రామానికి సామర్ల కోట తో సంబంధం తెగి పోయింది .గ్రామం నామ మాత్రం గా మిగిలింది .అయితే వంతెనలు నిర్మించటం వల్లసామర్ల కోట కు రాక పోకలు జరుగుతున్నాయి .

ఇలా పంచారామాలను  ఈ కార్తీక మాసం లో ,అందునా సోమవారం నాడు దర్శించే అరుదైన అవకాశం లభించి ,జీవితం ధన్య మైనదని పించింది .తెల్ల వారుజ్హామున మూడు గంటలకు మా బస్సు బయల్దేరి మళ్ళీ వచ్చిన దారిలోనే పాలకొల్లు ,భీమ వరం దాటి కైకలూరు చేరే సరికిమంగళ  వారం ఉదయం ఎనిమిదింటికి చేరింది .అక్కడ ఒక అరగంట ‘’రిసెస్’’కు సమయం కోసం బస్ స్టాండ్ లో ఆపారు డ్రైవర్లు .’’ఒకటి రెండు’’ కానిచ్చిఎనిమిదిన్నరకు బయల్దేరి గుడి వాడ ,వెంట్రప్రగడ కలవ పాముల ,కాటూరు మీదుగా ఉయ్యూరు సెంటర్ లో ఉదయం పది పది కి చేరాం .న్యాయం గా సోమ వారం రాత్రి ఉయ్యూరు చేరాలి .కాని పది గంటలు ఆలస్యం గా ఉయ్యూరు చేరాము .మా మనుమ రాలును ఇంటి దగ్గర దింపి ఇంటికి వచ్చి పళ్ళు తోముకొని ,స్నానం చేసి ,సంధ్య పూజాదికాలు నిర్వహించాను , మా కోడలు రాణి కి ముందే ఫోన్ చేసి మాకు కూర పచ్చడి చేసి పంపమని చెప్పాను .అలాగే మేము వచ్చేసరికి కారియర్ లో మా మనవడు చరణ్ చేత పంపింది .టిఫిన్ గా సీరియల్ తిన్నాం ..అన్నం వండుకొని ఆ కూరా పప్పు పులుసు తో తిన్నాం .మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయల్దేరి బెజవాడ వెళ్లి బస్ లో తణుకు సాయంత్రం నాలుగింటికి చేరి అక్కడ నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ భారతాలలో మానవ విలువలు ‘’పై ప్రసంగించి రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరాను .ఇలా ఆదివారం నుండి మంగళ వారం దాకా మూడు రాత్రులు నిద్రలేకుండా గడిపాను. అయినా ఆనందం గా హాయిగా ఉంది .

పంచారామ సందర్శనం సర్వం సంపూర్ణం .

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-13-ఉయ్యూరు

.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పంచా రామ and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.