విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -24
అలనాటి మహిళా శాస్త్రజ్ఞులు
ఈ కింది మహిళలు వివిధ రంగాలలో తమ విజ్ఞతను ప్రదర్శించి చరిత్ర పుటల్లో స్తానం సంపాదించుకొన్న వారే .
ప్రాచీన యుగం లో– ప్రజాపతి గౌతమి ,ఆమ్రపాలి ,కృపి ,సంఘ మిత్ర గౌతమీ బాలశ్రీ ,ధ్రువ దేవి ,ప్రభావతి గుప్త ,అవ్వైయ్యార్ ,కారైక్కల అమ్మయార్ ,రాజ్యశ్రీ ,మహత్తర ,సూర్య దేవి ,అండాళ్ప్రముఖ స్తానం పొందారు .
రాజ పుత్ర యుగం లో –భారతి ,అవంతి సుందరి ,దిడ్డ,మైనాల దేవి ,కళా వాటి ,శాంతలా దేవి ,అక్క మహా దేవి ,లీలావతి ,సంయోగిత ,అనుపమ .
ముస్లిం యుగం లో –రజియా సుల్తానా ,ముక్తా చాఘ్ ,దేవల దేవి ,పద్మిని ,గంగా దేవి ,మీరాబాయ్ .
మొఘల్ యుగం లో –గుల్ బదన్ బేగం ,దుర్గా వాటి ,చాంద్ బీబీ ,రూపమతి ,హాబ కాటూన్ ,నూర్జహాన్ ,ముంతాజ్ మహల్ ,జిజియా బాయ్ ,జహానారా ,జబ –ఉన్నీసా ,లాల్ కన్వర్ ,మస్తానీ .
నూర్జహాన్
షాజహాన్ భార్య ముంతాజ్ కు దగ్గర బంధువు నూర్జహాన్ .మేధా సంపద .ప్రకృతి పరిశీలనా గల స్త్రీ .సుగంధ పుష్ప పరిశోధనలో ఆరి తేరింది .పుష్పాల నుంచి సుగంధ తైలాలను ‘’దిష్టిలేషన్ పధ్ధతి ‘’ద్వారా తయారు చేసింది అన్న విషయం చాలా మందికి తెలియదు ..j1611లో జహంగీర్ మొహరున్నీసా అనే వితంతువును వివాహమాడాడు .ఈమె ‘’నూర్జహాన్ ‘’అనే పేరు పొందింది .నూర్జహాన్ అంటే’’ ప్రపంచ కాంతి’’ అని అర్ధం .జహంగీర్ 1627 లో చని పోయిన తర్వాత షాజహాన్ అధికారం లోకి వచ్చి ఈమెను నిరాదరణ కు గురి చేశాడు .జీవనం గడవటానికి ఆమె సుగంధ అత్తరులను ,తైలాలను తయారు చేసి అమ్ముకొని బతికింది .గులాబీ అత్తరు తయారు చేయటం లో గొప్ప పేరు పొందింది .నూర్జహాన్ 1645డిసెంబర్ 25న చని పోయింది .దేవరపల్లిసత్యనారాయణ రావు అనే ఆయన సెంటులు తయారు చేసి ఆమె పేర మీద ‘’నూర్జహాన్ సెంట్ ‘’అని అమ్మే వారు .
ఆంద్ర మహిళా శాస్త్రజ్ఞులు
చింతల సీతా దేవి
1929ఏప్రిల్ 21న జన్మించిన చింతల సీతా దేవి గుంటూరు మెడికల్ కాలేజి లో వైద్య విద్య నేర్చింది .ఆంధ్రా మెడికల్ కాలేజి విశాఖ లో ఏం డి .చేసింది .అ తర్వాతF.I .M.S.A డిగ్రీ పొందింది .ఆంధ్రా మెడికల్ కాలేజి లో బయో కేమిస్ట్రి విభాగం లో ట్యూటర్ గా చేరి అంచెలంచలుగా ఎదిగి సికంద్రా బాద్ గాంధి మెడికల్ కాలేజి లో బయోకెమిస్ట్రీ అసిస్టంట్ ప్రొఫెసర్ అయింది .కర్నూలు మెడికల్ కాలేజి ప్రొఫెసర్ అయి ఆంధ్రా మెడికల్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్ అయి ప్రిన్సిపాల్ గా 1981-84వరకు పని చేసి రిటైరయింది
జీవ రసాయన శాస్త్రం లో రోగ నిర్ధారణ లో అనేక పరిశోధనలు చేసింది .అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్ లో 52కు పైగా పరిశోధనా
పత్రాలను రాసి ప్రచురించింది సీతా దేవి .’’అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కేమిస్త్స్ ఆఫ్ ఇండియా ‘’పత్రిక సంపాదక వర్గం లో పని చేసింది .అనేక పరిశోధనా వ్యాసాల ను వెలువరించింది 1975లో F.A.M.S.లో ఫెలోషిప్ పొందింది .1981లో ‘’ఇంటర్నేషనల్ మెడికల్ సైన్స్ అకాడెమి ఫౌండర్ ఫెలో ‘’గా ఎన్నికయింది .’’అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కేమిస్త్స్ ఆఫ్ ఇండియా ‘’వారి గౌరవ సభ్యత్వాన్ని పొందింది .’’ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియాలజిస్త్స్ అండ్ ఫార్మ కోలాజిస్త్స్ ‘’కు ఉపాధ్యక్షురాలిగా ,అద్యక్షు రాలిగా ఎన్నికయింది సీతా దేవి ..’’అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కేమిస్త్స్ ఆఫ్ ఇండియా ‘’వారి నాల్గవ వార్షిక సదస్సుకు ఆర్గనైజింగ్ సెక్రెటరి గా వ్యవహరించింది .దీనితో సీతా దేవి ఖ్యాతి అంతర్జాతీయం గా పెరిగింది .
ఆంధ్రా మెడికల్ కాలేజి పూర్వ విద్యార్ధిగా ఆ కాలేజికి ఎన్నో సేవలందించింది సీతా దేవి .’’ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నిర్వాహకురాలిగా అఖండ సత్కారం పొందింది .త్రివేండ్రం మెడికల్ కాలేజి వారి సిల్వర్ జూబిలీ ఒరేషఅవార్డు పొందింది .రోగ నిర్ధారణ ,జీవ రసాయన శాస్త్రం లో విశేష కృషి చేసిన సీతా దేవి ఆంద్ర మహిళా రత్నం
కే .ఇందిరా బాయ్ .
శిశు రోగ నిర్ధారణ లో ,పరిశోధనలో ప్రఖ్యాతి పొందిన శాస్త్రజ్ఞురాలు కే .ఇందిరా బాయ్ .30-8-1927ణ శ్రీ కాకుళం జిల్లాలో పుట్టింది .వైద్యం లోM.D.,D.C.H ,F I .A P.,F .I C .P లను పొందింది .యూనిసెఫ్ ,ప్రపంచ ఆరోగ్య సమస్త లలో ఫెలోషిప్ పొందింది .’’అమెరికన్ అకాడెమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ‘’ ,’’ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెస్ అకాడెమి ,’’నేషనల్ అకాడెమి ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆఫ్ ఇండియా మొదలైన ఎన్నో సంస్థలలో ఫెలోషిప్ అందుకొన్నది .
విశాఖ కింగ్ జార్జి హాస్పిటల్ అసిస్టంట్ సర్జన్ గా ,ఉద్యోగం లో చేరి ఆంధ్రా మెడికల్ కాలేజి లో పీడిదయాట్రిక్స్ అసిస్టంట్ ప్రొఫెసర్ గా ,ఎస్.వి.లో అధిపతిగా ,ఉస్మానియా లో ప్రొఫెసర్ గా రాజా ముత్తయ్య కాలేజి ప్రోఫెసార్ గా పని చేసి గొప్ప అనుభవం పొందింది .
1921లో ‘’ఇండియన్ అకాడెమి ఆఫ్ పీడి యాట్రిక్స్ ‘’కు అధ్యక్షురాలైనది .ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ,ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ట్విన్ స్టడీస్ సంస్థలలో అనేకహోదాలలో పని చేసింది డాక్టర్ బి.సి.రాయ్ నేషనల్ అవార్డ్ ను పొందింది.
కోలా రాజ్య లక్ష్మి
చిత్తూరు జిల్లా పుత్తూరు లో జన్మించింది ఆంధ్రా యూని వర్సిటి నుండి డాక్టర్ పట్టా పొందింది .ఎండి.అయింది .గుంటూర్ మెడికల్ కాలేజి లో ఉద్యోగం ప్రారంభించి ఉస్మానియాలో చేరింది .’’ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ ,పబ్లిక్ హెల్త్ లాబ్ అండ్ ఫుడ్ అధారిటి డైరెక్టర్ అయింది .పద్మావతి మహిళా విశ్వ విద్యాలయానికి వైస్ ప్రిన్సిపాల్ గా పని చేసింది .వాక్సిన్ ప్రొడక్షన్ బోర్డ్ ,రాష్ట్ర టెక్నికల్ కమిషన్ ఫర్ రివెంషాన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్ ప్ల్యూషన్ ,మైక్రో బయాలజీ సంస్తలకు వివిధ హోదాలలో పని చేస్డ్డింది .రాష్ట్ర ఫార్మసి కౌన్సిల్ లో అనేక పరిశోధనలు చేసి వెలువరించింది .
.45కు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించింది .దేశ విదేశీ వైద్య సంఘాలలో గౌరవ సభ్యత్వాన్ని పొందింది .’’ఇండియన్ వాటర్ వర్క్స్ అవార్డ్ ,కే.ఎస్.రావు అవార్డ్ ,సుశ్రుత అవార్డ్ లను అందుకోండి రాజ్య లక్ష్మి
.
వినోదిని రెడ్డి
హైదరాబాద్ లో 1934లో జన్మించింది ఏం డి ,డి సి హెచ్ ,ఎఫ్ ఐ పి కోర్సులను చేసింది ఉస్మానియా అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నది పీదియాత్రిక్స్ లో ఫెలోషిప్ పొంది వైద్య పరిశోధనలు చేసింది .ఏ.విటమిన్ లోపం వాళ్ళ వచ్చే వ్యాధులపై .నేషనల్ ఇంస్తితిత్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కు డైరెక్టర్ అయింది ‘’.xeropthalmia ‘’జబ్బు కు కారణాలు కనుగొన్నది .కమలా మీనన్ మెడికల్ అవార్డ్ ,పి.ఎస్.రాజు అవార్డ్ మొదలైన అవార్డు లెన్నో పొందదిండి
మందవల్లి గౌరీ దేవి
అనకా పల్లి లో పుట్టిన గౌరీదేవి మానసిక శాస్త్ర వేత్త గా ప్రఖ్యాతి పొందింది .న్యూరాలజీ లో డి.ఏం.డిగ్రీ పొందింది ఉస్మానియా లో ప్రొఫెసర్ గా చేరి ,డిల్లీ యూని వర్సిటి కి చెందిన కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ,సఫ్దర్ జంగ్ హాస్పటల్ లో న్యూరాలజీ ప్రొఫెసర్ గా పని చేసింది .కామన్ వెళ్త హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ లో అధిపతిగా ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్
ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా ,ప్రొఫెసర్ గా పని చేసింది .ఇండియన్ మెడికల్ సైన్స్ వారి ఫెలోషిప్ పొందింది .అనేక అంతర్జాతీయ సంస్థ లలో విశిష్ట సభ్యత్వం పొంది దేశ ఖ్యాతిని ఇనుమడింప జేసింది .
పద్మా బందో పాధ్యాయ
తిరుపతిలో జన్మించి మెడిసిన్ లో డిప్లమా డిఫెన్స్ సైన్స్ లో ఉన్నత విద్యా పొందిన పద్మా గంగోపాధ్యాయ ఏం డి సాధించింది ఆర్మేడ్ ఫోర్స్ మెడికల్ సైన్స్ లో ఉద్యోగం ఆరంభించి,ఆర్కెటిక్ ఖండం పరిశోధనా బృందం లో పరిశోధన చేసింది .బెంగళూర్ యూని వర్సిటి లో ఏవియేషన్ మెడిసిన్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరి అనేక ఉన్నత స్తానాలు పొందింది .
ఐరో మెడిసిన్ సోఅసైటీ ఆఫ్ ఇండియా ,ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెస్ అకాడెమి మొదలైన సంస్థలలో గౌరవ సభ్యత్వంపొందింది .న్యూయార్క్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ గౌరవ పురస్కార గ్రహీత పద్మ .విశిష్ట సేవా మెడల్ , A.F.W.W.A..అవార్డు ను పొందింది .డిఫెన్స్ సర్వీసేస్ స్టాఫ్ కాలేజి లో ఉన్నత విద్య లో ప్రధమ శ్రేణి లో పాస్ అయి ఆర్మీ మెడికల్ కాలేజి సైనిక ఉద్యోగం లో చేరిన మొదటి మహిళా మన పద్మా బందో పాధ్యాయ . 1981లో వాయు సేవా దళం లో విశిస్టసేవలందించిన ఉద్యోగిని గా అపూర్వ సత్కారం అందుకోంది పద్మ .దేశ విదేశీ ప్రసిద్ధ మెడికల్ జర్నల్స్ కు పాతిక పైగా పరిశోధనా వ్యాసాలను రాసి ప్రచురించిన విశిష్ట మహిళా శాస్త్రజ్ఞురాలు పద్మ.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 2-12-13-ఉయ్యూరు