విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -27
అంతరిక్ష పరిశోధక రాజా జయ సింగ్
రాజా జయ సింగ్ 1686లో జన్మించాడు .అప్పటికే మొగలాయీల పాలన క్షీణ దశ లో ఉంది .యవ్వనం లో ఔరంగ జేబ్ తో సాన్నిహిత్యం సంపాదించాడు .విశాల్ ఘర్ ఆక్రమణకు సాయం చేశాడు .మెచ్చిన జేబు ‘’’’సవా’’బిరుదు ఇచ్చాడు .1797లో మహమ్మద్ షా పానిపట్టు యుద్ధం లో ఓడిపోయాడు .అప్పుడే జయ సింగ్ కు అవకాశం వచ్చింది .ఆధునిక ప్రణాళిక ఆధారం గా రాజస్తాన్ లో జైపూర్ పట్నాన్ని నిర్మించాడు .అంబర్ కోట లో ముస్లిం యువరాణి జయ సింగ్ ను చంద్రునికి భూమికి యెంత దూరం ఉందని ఒక రోజు హఠాత్తుగా అడిగింది .అప్పటి నుంచి ఖగోళ పరిశోధకుడయ్యాడు
.
యలుగ్ బేగ్ ,టైరో బ్రాహే,జాన్ సలాం స్తీద్ మొదలైన నిర్మాణ కర్తలకు దీటుగా ఒక ఖగోళ శాస్త్ర పరిశోధకుడిగా ,గణిత శాస్త్ర వేత్తగా ,జయసింగ్ పేరు పొందాడు .ఒక డిగ్రీ కి ‘’సైన్ ‘’విలువ కనుకొన్నాడు .ఈయన కని పెట్టిన ఒక వందేళ్ళ తర్వాత యలుగ్ బేగ్ ఆ విలువను సాధించాడుఅలమా జెస్ట్ ,తాబ్యులే ఆస్త్రానిక మొదలైన గ్రంధాలను సంస్కృతం లోకి అనువదించాడు జయ సింగ్ మహా రాజు .1730లో ఒక బృందాన్ని పంపి లిస్బన్ రాజు దగ్గరున్న ఖగోళ శాస్త్ర వేత్త ‘’జేవియర్ డే సెల్వా ‘’ను దిల్లీకి పిలిపించాడు .షా రాజు కూడా ప్రోత్సహించాడు . జైపూర్ లో అబ్సర్వేటరి నిర్మాణానికి అనుమతించాడు .దీనితో బాటు వారణాసి లో గంగా తీరం లో ,ఉజ్జయిని లో క్షిప్రా నది ఒడ్డున దిల్లీలో జంతర్ మంతర్ అబ్సర్వేటరిలను స్తాపించాడు .
ధిల్లీ లో జంతర్ మంతర్ లో యంత్ర ,మంత్రం పరికరలున్నాయి .కొందరు బంది పోట్లు దీన్ని ధ్వంసం చేశారు .ఇక్కడ ‘’సామ్రాట్ యంత్ర ‘’,రాం తంత్ర .జయప్రకాష్ తంత్ర ,మిశ్ర యంత్ర అనే నాలుగు ప్రధాన నిర్మాణాల అంతర్యం ఈ నాటికీ నిగూఢ రహస్యం గానే ఉంది .
సామ్రాట్ యంత్ర –ఇది సన్ డయల్ .కాలాన్ని చెబుతుంది .జయసింగ్ మేధో నిర్మాణం ఇది
.రాం తంత్ర –రెండు గోళాకార నిర్మాణాలు .ప్రతిదాని మధ్య ఒక స్తంభం ,గ్రహ మండలం లో వివిధ గ్రహాల సమతల కొణాల అధ్యయనానికి గుర్తులు .గ్రహాల స్తితి గతులను ఖచ్చితం గా కనుక్కో వచ్చు .1818లో ఖగోళ శాస్త్ర వేత్త’’ దార్నే’’ దీన్ని సందర్శించి ‘’ఒకే సమయం లో వివిధ ఖగోళ శాస్త్ర అధ్యయనాలు చేసిన పొర బాట్లను నిరోధించటానికి ,ఫలితాలను పోలిక చేయ టానికి ఈ నిర్మాణాలు చేబట్టిన జయ సింగ్ ప్రపంచ ఖగోళ శాస్త్రానికి మహోప కారం చేశారు ‘’అని కీర్తించాడు .
జయ ప్రకాష్ ,రామ యంత్ర రెండు కూడా నక్షత్రాలను ,గ్రహాలను నిశితం గా పరిశీలించేటానికి వీలు కలిగింది .గిన్నె ఆకారం లో ఉండే ఈ పరికరాలు ఆకాశం లో ప్రయాణించే ఒక వస్తువు ద్రవ్యాన్ని పూర్తీ స్తాయిలో గంట గంటకూ గుర్తింప జేస్తాయి .
మిశ్ర యంత్రం –నాలుగు భాగాలున్న యంత్రం .నియమితమైన చక్ర భాగం లో ఉండే ధ్రువ రేఖ ను సూచిస్తుంది .మధ్యాహ్నం 12గంటలకు యూరప్ ఖండం లో రెండు ,జపాన్ ఫసిఫిక్ మహా సముద్రాలలో ఒక్కొక్కటి వంతున నాలుగు స్తానాలకు సంబంధించి ఈ ద్రువరేఖ సూచిస్తుంది .రెండవ వైపు సామ్రాట్ యంత్ర భాగం ,మూడవది దక్షినోత్తర భిత్తి యంత్రం ఉంది ఇది మధ్యాహ్న రేఖ యొక్క ఉన్నతాంశాన్ని అంటే
ఎత్తు ను తెలియ జేయటానికి తూర్పు గోడమీద ఉంది .నాల్గవది కర్కట రాశి వలయ .పడమటి గోడ మీద ఉంది ,కర్కాటక రాశి లోకి సూర్య గ్రహ ప్రవేశాన్ని తెలుపుతుంది .
మిశ్ర యంత్ర కు నైరుతి భాగం లో ఉన్న రెండు స్తంభాలు సంవత్సరం లో అతి పెద్ద అతి చిన్న పగటి సమయాలరోజులను తెలుఉతాయి .డిసెంబర్ లో వీటిలో ఒక స్తంభం తన నీడ ను పూర్తిగా రెండవ స్తంభం మీదకు ప్రసరింప జేస్తుంది .జూన్ నెల లో తన నీడ ను రెండవ స్తంభం పై అసలు పడ నివ్వదు .రాజా జయ సింగ్ నిర్మించిన ఈ ‘’వేద శాలలు ‘’అంటే అబ్సర్వేటరీలు చాలాకాలం నిరుప యోగం గా పడి ఉన్నాయి .యలుగ్ బేగ్ అధ్యయనాలకు సమంధించిన ‘’తారా సరణి ‘’గ్రంధాన్ని సవరించి ,ఆధునీకరించటానికే ఎక్కువ సమయం ఖర్చు చేశాడు జయ సింగ్ .కాని గ్రాహ కూటమి సంబంధించిన ప్రాచీన అధ్యయనాలు అధ్యయనాలు సరి యైనవి కావని గ్రహించాడు .భూ అక్షం పరిభ్రమణ పై విస్తృత అధ్యయనం చేశాడు .
ఇంత కస్టపడి ఇంత బుద్ధి పెట్టి నిర్మించిన జంతర్ మంతర్ ఒక అద్భుతం గా మిగిలి పోయిందే కాని జయ సింగ్ ఆశించిన ఫలితాలను ఇవ్వ లేక పోయింది .అసలు సంస్కృతం లో దీని పేరు ‘’యంతర్ -మంతర్ .‘’అపభ్రంశం చెంది ‘’జంతర్ మంతర్ ‘’అయింది ఇప్పుడు ఈ పేరు గారడీ కి ,కని కట్టు కు పర్యాయ పడమై పోయింది .హత విధీ
-15—1-2001 ణ ప్రఖ్యాత భౌతిక శాస్త్ర వేత్త స్టీఫెన్ హాకింగ్ జంతర్ మంతర్ ను దర్శించాడు .దీని నిర్మాణ వైభవాన్ని ,ఆలోచనలను మెచ్చుకొన్నాడు దీనికి పునర్వైభవం సాధించాలని హితవు చెప్పాడు .’’.Einstein had objected strongly to the un certainty principle in physics .,remarking that God did not play dice with the universe .But the evidence is that god is a quiet a gambler .it was necessary to incorporate the un certainty principle into Einstein;s general theory of relativity ‘’అని ఢిల్లీ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘’బిగ్ బాంగ్ ‘’అంశం మీద ప్రత్యెక ప్రసంగం చేస్తూ వ్యాఖ్యానించాడు’’ సైన్స్ కింగ్ స్టీఫెన్ హాకింగ్ ‘’.
జంతర్ మంతర్ నిర్మాణం లో జయసింగ్ కు సహకరించిన వాడు మన జగన్నాధ పండిత రాయలూ ఉన్నాడు .ఈయన తూర్పు గోదావరి జిల్లా ‘’ముంగండ’’ గ్రామస్తుడు .అలభ్యమైన ప్రాచీన గ్రంధాలను తిరిగి
సంస్కృతం లో రాసిన దిట్ట .’’సామ్రాట్ సిద్ధాంత’’పేరిట గణిత శాస్త్ర పరిశోధన గ్రంధాన్ని రాశాడు పండితుడు .జగన్నాధుని గంగా లహరి రసగంగాధారం అనే అలంకార శాస్త్రం ఆయన వైదుష్యానికి కర దీపికలు జయ సింగ్ నిర్మించిన అబ్సర్వేటరికి తన వంతు సహకారం అందించిన శాస్త్ర పండితుడు జగన్నాధ పండితుడు
ప్రాచీన కాలం లో ‘’వైబ్రేషనల్ ఎనేర్జి’’ అంటే మంత్రం శక్తి ఆధునిక కాలం లో ‘’మెకానికల్ ఎనేర్జి ‘’గా మారిందని భావిస్తున్నారు .అయిన్ స్టీన్ ఐన చెప్పిన ‘’లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనేర్జి ‘’మన మహా భారతం లో కనిపిస్తుంది .ద్రుత రాస్త్రుడికి సంజయుడు కురు క్షేత్ర యుద్ధాన్ని దివ్య దృష్టితో హస్తిన నుంచే చూచి వివ రించాడు .ఇవాళ మనం అనేక విషయాలను చానెళ్ళ ద్వారా ఎన్నో వేల మైళ్ళ నుండే చూస్తున్నాం దీనికి అదే మూలం .
అయిన్ స్టీన్ న్ గారి ‘’formula nothing –but Autom bomb;s principle –E=mc2అనేది మన గాయత్రి మంత్రం లోని భావనకు సరి పోతుంది అంటారు .’’వరేణ్యం ‘’అంటే స్క్వేర్ .’’సవితు’’ అంటే’’ వెలాసిటి ఆఫ్ లైట్’’ .ఈ రెంటిని సమన్వయ పరిస్తే ఆయిన్ స్టీన్ భావన అందు తుంది అంటారు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-13-ఉయ్యూరు .
.