విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -29
మనం మరచిన అలనాటి మరికొందరు శాస్త్రజ్ఞులు
జీవకుడు –క్రీ .పూ .అయిదు ఆరు శతాబ్ది వాడు .పాట్నా దగ్గర రాజ గృహ ఆస్థాన వేశ్య శాలా వతికి కుమారుడు .అప్పుడు మగధ సామ్రాజ్య రాజధాని రాజ గృహ .బౌద్ధం ఉన్నత దశలో ఉన్నప్పుడు గొప్ప వైద్యుడుగా ఉన్నాడు. బుద్ధునికి కూడా వైద్యం చేశాడు అరుదైన శస్త్ర చికిత్సలు చేసే వాడు .శిశు వైద్యం లో ప్రవీణుడు’’ కౌమార భ్రుత్య ‘’అనే శిశు రోగ వైద్యం ఈయన ద్వారా వచ్చిందే .
కళ్యాణ –క్రీ శ .1590లో అహి చాత్ర లో పుట్టాడు .తండ్రి మహీం దర . .’’బాల తంత్ర ‘’అనే వైద్య గ్రంధం రాశాడు .పిల్లల వ్యాదులనే ముఖ్యం గా చేసుకొని రాశాడు.గోడ్రాలి కి చికిత్స చేసి సంతాన ప్రాప్తి కల్గించే వాడు సుఖ ప్రసవం, శిశి సంరక్షణ లో ప్రత్యెక శ్రద్ధ తీసుకొన్నాడు .
వర్యో విద–చరకుడు తన సంహిత లో ఈయన గురించి రాశాడు శరీర ఆరోగ్యానికి వాయువు పోషిస్తున్న పాత్ర మీద పరిశోధన చేశాడు .
యత్వి సభ –గణిత శాస్త్రజ్ఞుడు. భూస్వరూప శాస్త్రం లో కృషి చేశాడు
సిద్ధ నిత్యా నాద –పద్నాలుగో శతాబ్ది వాడు .రస రత్నాకరం రాశాడు పర్వత పుత్ర గా ప్రసిద్ధుడు.రస ఔషధాలు తయారు చేశాడు .
సింహ గుప్త –విద్య శాస్త్ర వేత్త .వాగ్భాటుడికి మొదటి కుమారుడు .వ్యాధి నిర్ధారణలో అద్వితీయుడు .
స్పుజ ధ్వజ –ఖగోళ శాస్త్ర వేత్త .బెంగాల్ లో 269లో జననం .దౌత్యవేత్త గా ప్రసిద్ధుడు .’’యవన జాతక సిద్ధాంత ‘’రాశాడు .149లో యవనేశ్వార్ రాసిన గ్రీకు ఖగోళ గ్రంధాన్ని సంస్కృతం లోకి అనువాదం చేశాడు .వైద్య శాస్త్ర విజ్ఞాన సర్వస్వం తయారు చేశాడు .
సురేశ్వర –పదకొండవ శతాబ్ది వాడు .రస వాది .’’శబ్ద ప్రదీప్ ‘’రాశాడు ఇనుము ,బంగారం రాగి ,అభ్రకం మొదలైన వాటి ఉత్పత్తివిదానాలను రాశాడు .’’లోహ సర్వస్వ ,లోహ పధ్ధతి అనే గ్రంధాలు ప్రసిద్ధ మైనాయి .
తోడర్ మల్లు –అక్బర్ మంత్రి .1539జననం .అనేక శాస్త్రాలలో నిష్ణాతుడు .’’తోడార నంద ‘’రాశాడు .అందులో ఆయుర్వేద సౌఖ్యం ఒక విభాగం
త్రిమల్ల భట్టు –పదిహేనవశతాబ్దం లో కాశీ లో జన్మించాడు రోగానిదానశాస్త్రం, ఆహారం ,పద్యం ,చికిత్సా శాస్త్రాలు రాశాడు .ఔషధ నిర్మాణ శాస్త్రం విభజన శాస్త్రం రాశాడు ద్రవ్య గుణ శత శ్లోకి ,వైద్య చంద్రోదయ ,వృత్త మాణిక్య మాల్ ,యుగాంత రంజిని అనే ఈయన గ్రంధాలు దేశ విదేశాలలో ప్రాచుర్యం పొందాయి .
విజయా నంద –ఖగోళ శాస్త్ర వేత్త ..966లో జన్మించాడు .’’కరణ తిలక ‘’సిద్ధాంత గ్రంధం గా రాశాడు .దీన్ని ఆల్ బెరూని అరెబిక్ భాషలోకి అనువాదం చేశాడు .’’ఘావో రాట్అల్ జిజాన్ ‘’అని పేరు పెట్టాడు .
విజయ రక్షిత –పద మూడవ శతాబ్ది వాడు .వైద్య పరిశోధనలో అసామాన్యుడు .’’మాధవి నిదానం ‘’రాశాడు
వృద్ధ జీవక –క్రీ .పూ.ఐదో శతాబ్ది వాడు ‘’వృద్ధ జీవకాయ తంత్ర ‘’రాశాడు వైద్య విజ్ఞానం అంటా ఇందులో ఇమిడ్చాడు .
సోమేశ్వర -1126-38వాడు .కర్నాటక చక్ర వర్తి .అన్ని శాస్త్రాలలో నిధి .’’అభిలశితార్ధ చింతామణి ‘’రాశాడు .లోహాలు వాటి తయారీ వైద్యం లో
వాటి ఉపయోగాలను చర్చించాడు .నిద్ర ,క్రీడలు వినోదం నిత్య జీవితానికి యెంత అవసరమో వివరించాడు .
ఖండ దత్త –గణిత మేధావి మహా రాస్త్రీయుడు .1039వాడు .ఖగోళం లోనూ మేటి .మారాఠీ పాఠ్య గ్రంధాలు రాశాడు .చంద్ర, సూర్య గ్రహణాలు ఎందుకేర్పడతాయో తెలిపాడు ‘’ధ్రువ మానస ‘’గ్రంధం లో గ్రహాల భ్రమణాలు గ్రహణాల మీద గ్రహాల రేఖాంశాలను గణన చేసి105 పద్యాలలో పొందు పరచాడు . ఖగోళం పై ‘’సిద్ధాంత శేఖర ‘’గ్రంధం రచించాడు .
సూత్ర ధారా మండన –భవన నిర్మాణ వేత్త .పదిహేనో శతాబ్ది వాడు .అనేక దేవాలయాలకు రూప శిల్పి ‘’రాజ్య వల్లభ మండన ‘’రాశాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-13-ఉయ్యూరు