అయ్యా ,
తమిళనాడు లోని కంచి జిల్లాలోని ఉత్తర మేరూరు అనే వూరు లో 1-12-2013 న తెలుగు నేర్చుకోవడానికి 21 మంది తెలుగు రాని తెలుగు వారు పోగయ్యరు. 17 వూళ్ళ నుంచి వొచ్చిన వీరికి వరుసగా 6 గంటలు స వెం రమేష్ గారు, తనకు వెన్ను నొప్పి వున్నా లెక్క చేయక, పాఠము లను నేర్పినారు.
తమిళం లో వివరాలు వున్న తెలుగు వాచకములను ఇందు కోసం వారు వేరుగా తయారు జేశారు. వాటిని వారు చాల సంతోషంగా 10 రూపాయల చొప్పున కొనుక్కొని, తమ ఊళ్ళల్లో తెలుగు వారి అందరికీ తెలుగు నేర్పుతామని మాట ఇచ్చారు.
ఇందులో 6 గురు ఆడ వారు వుండటం గమనార్హం.
6 గంటల్లోనే వారు రాయటం నేర్చుకొని, చివరలో చిన్న తెలుగు మాటలను నల్ల బల్ల మీద రాయ గలగటం కార్యకర్తలకు ఆనందాన్నిచ్చింది.
అసలైన తెలుగు కోసం [ఇంగ్లిష్ తెలుగు, సముస్క్రుతం తెలుగు, హిందీ తెలుగు కాకుండా ] పోరాడుతున్న మొత్తం దేశం లోని ఏకైక యోధుడు గా స వెం రమేష్ అందరికీ పరిచయమే.
8500548142 కు పిలుపు చేసి మీరు ఆయన గారి తో మాట్లాడి, మప్పిదాలు చెప్పటం మన కనీస కర్తవ్యం.
నుడి ఊడిగంలో,
మీ అనుగరి(అభిమాని).
పారుపల్లి కోదండ రామయ్య, రిటైర్డ్ ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీర్.
తెలుగును బతికించుకోవాలంటే 1. ప్రతి కొలువుకు తెలుగును వొక తప్పనిసరి అర్హతగా పెట్టాలని 2. ప్రతి బడిలో తెలుగును వొక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని మనం ఎసపు [ఉద్యమం] ను మొదలెట్టాలి.