హాస్య బ్రహ్మ లో సంగీత సరస్వతి
భమిడి పాటి కామేశ్వర రావు గారంటే హాస్య బ్రహ్మ అని హాస్యం కోసమే పుట్టారని గోదావరి మాండలీకాన్ని శ్రీ పాద తో బాటు పాదుకోల్పారని మోలియర్ ,మేటర్లింకు లకు తన హాస్య నాటికల ద్వారా లింకులు గొంకులు లేకుండా తగి లించారని మాత్రమె తెలుసు కాని వారిలో వెల్లి విరిసిన సంగీత సరస్వతి గురించి ‘’చాలా చాలా చాలా’’ మందికి తెలీనే తెలీదు .నా లాంటి కొందరు అదృష్ట వంతులు వారి ‘’త్యాగ రాజు ఆత్మా విచారం ‘’చదివిన వారికి కొంత బోధ పడి ఉంటుంది.అదీ పై పై స్పర్శ మాత్రమె .వారికి సంగీతం వాచో విదేయం .అందునా త్యాగ రాజు గారు అంటే వారికి వల్ల మాలిన అభిమానం .ఆయన రచనల్లో సాహిత్యాన్ని వదిలేసి మన అరవ గాయకులూ చేసిన చేస్తున్న తప్పుల్ని విని చూసి వారి హృదయం ఏంతో గాయ పడ్డది .అందుకే అసలు త్యాగ రాజు గారు సాహిత్యం ద్వారా ఏం చెప్పారో అని మధన పడి మధన పడి విశేష కృషి చేసి ఆ ఆత్మా విచారాన్ని ప్రకటించారు ,ప్రచురించారు .దీన్ని తల్లా వఝల పతనజలి శాస్త్రి చక్కగా ఆవిష్కరించారు .అందులో విశేషాలే ఈ శీర్షిక లో చెబుతున్నాను .
9-1-1947లో శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన ‘’కళాభివర్ధిని పరిషత్ ‘’ఆధ్వర్యం లో రాజ మండ్రి లో సభ జరిపి భ.కా.రా.మేస్టారిని ఘనం గా సత్కరించారు .దీనికి కారణం వారు త్యాగ రాజు ఆత్మ విచారం రచన ప్రారంభించటమే .1948జనవరికి మేస్టారి రచన పూర్తయింది .ఆ సందర్భం గా శాస్త్రి గారు మళ్ళీ సభ జరిపి కామేశ్వర రావు మేస్టారిని22-2-48న నూతన వస్త్రాలు సమర్పించి సన్మానించారు. అదీ శాస్త్రి గారికి సంగీత సాహిత్యాల పట్ల, తోటి రచయితల పట్లా ఉన్న ఆదరణ .ఇలాంటి అరుదైన సన్మాన కార్యక్రమాలను ఆ రోజుల్లో శ్రీ పాద వారు భమిడి పాటి వారే చేసే వారట .త్యాగ రాజు గారు మరణించిన ఖచ్చితం గా వందేళ్ళకు మేస్టారి రచన సాదికారికం గా వెలువడింది .అంతవరకూ ఎవరూ ఈ పనికి పూను కోలేదు ,.
అరవ పాటకులకు తెలుగు సాహిత్య పరిచయం లేక పోవటం, ఉన్నా బుగ్గన కిళ్ళీ దట్టించి పాడటం తో సాహిత్యం ‘’హుష్ కాకి ‘’ అవటం వారే తెలుగు వారికి ఆడర్శమవటం తో త్యాగ రాజు గారి మనో ధర్మం ఏమిటో ఎవరికీ అర్ధం కాని ‘’బ్రహ్మ పదార్ధం ‘’అయింది .అందుకే మేష్టారు అంతగా కలత చెందారు .’’త్యాగయ్య ఆర్ద్రతా ,ఆర్తీ ఎవరికీ అక్కరలేక పోయాయి
గిరికీలు తీసే రాగాలతో ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేసేశారు .ఆయన ఆత్మ ను అన్వేషించ లేక పోయారు .కీర్తనలలో గుండెను పిండేసే ఆర్తి ఉంది .భక్తీ సంబంధిత ఆర్ద్రత ఉంది .కచేరీలలో ఇవేవీ ఉండేవికావు .పైగా ‘’కచేరీ బాణీ’’ అంటూ ఒకటి మొదలైందని ‘’బాధపడ్డారు తన పుస్తకం లో .‘’త్యాగ రాజు హృదయ కవి ‘’.హృదయం’’ అనే మాటను ఆయన వాడి నన్ని సార్లు ఏ తెలుగు కవీ వాడలేదు .ఈయన రచనల్లో ప్ప్రతిదీ మేధా సంపద మాత్రమె కాదు మనసుకు సంబంధించింది అని మర్చి పోయారు .ఆయన మనో క్షోభ వర్ణనా తీతం .ఆయన మాటా ,భావం సూటిగా హృదయాలను తాకే సామర్ధ్యం కలవి .ఆయన పరితాపం విప్పి చెప్పటం లో అది సకల మానవ హృదయ పరితాపమే అని పిస్తుంది .అతని హృదయ వైశాల్యమూ కనీ పిస్తుంది .హృదయ కవికి ముఖ్య లక్షణం సామరస్యం ,సర్వ సమత్వ భావం .ఆతను విరుద్ధాలను ,ద్వంద్వాలను సమన్వయము చేసిన వాడు .’’ఎవరని వర్ణిం చెదిరా?’’లో రాముడిని గురించి తను పడిన సందేహం ,తనను గురించి మనం పడేట్లు చేశాడు .అతడు సంగీత సాహిత్యాలను ‘’దుప్పటించాడు ‘’అన్నారు మేష్టారు
.
‘’అంతేకాదు సగుణత్వ నిర్గుణత్వాలను సమపాళం కూడా చేశాడు త్యాగ బ్రహ్మ .’’అరవత్వ ఆంధ్రత్వాన్ని కర్నాటించాడు ‘’వాస్తవికత్వ అవాస్తావికత్వాల మధ్య తేరా తీశాడు .ఆయన గుండె తడి ఉన్న విలక్షణ భక్త కవి .అంతకు ముందు, ఆ తర్వాత ఎవరూ ఇలా చేయలేదు .ఇవాల్టి కచేరీలలో శ్రోత కంటే గాయకుడే ఎక్కువ నష్ట పోతున్నాడు .శ్రోతకు స్వర మాధుర్యం ఆలాపనా అన్నా దక్కుతాయి .కాని తన ఆవరణ లోంచి ,మరో ఆవరణ లోకి పోయే ఉత్కృష్ట అవకాశాన్ని ‘’గాన విడుచు కుంటున్నాడు ‘’అన్నారు హాస్య బ్రహ్మ ఆ సంగీత బ్రహ్మ గొప్పతనాన్ని పొగుడుతూ కచేరీలలో ఆ ఆనందం దక్కక పోవటాన్ని జీర్ణించుకో లేక పోతూ .
త్యాగ రాజు ఆత్మ విచార గ్రంధం లో మేష్టారు తొమ్మిది శీర్షికలు పెట్టారు .త్యాగ రాజు మనసుకి సంబంధించి చెప్పుకున్నవి ,రాముడిని ఉద్దేశిస్తూ అతన్ని సంబోధిస్తూ అన్నవి ,జనం తో అన్నవి ,ఇతరుల్ని ప్రశంశిస్తూ అన్నవి ,అనుభవ సారం గలవి ,కవి కాలాన్ని నిన్దించేవి ,సగుణత్వాన్ని నిరూపించేవి ,దేవ భాషలో ఉన్నవి ,పూజా విధానం గురించినవి .ఇవీ నవ శీర్షికలు .ఆచార్య విస్సా అప్పా రావు గారు త్యాగ
రాజ శత వార్షికానికి ఏదైనా ఒక వ్యాసం రాసి పంప మంటే మేష్టారు ఈ రచన ప్రారంభించారు అదీ నేపధ్యం .సమయానికి రచన పూర్తికాక విస్సా వారికి క్షమాపణ ఉత్తరమూ రాశారు .అలా పొడిగించటం వల్ల ఆంద్ర సాహిత్య సంగీతజ్నులకు మేస్టారి అపూర్వ గ్రంధం దక్కింది .’’నిజానికి మేస్టారే త్యాగ రాజ స్వామి అయి రచించిన గ్రంధం ఇది ‘’అని పతంజలి గారిచ్చిన కితాబు మరచి పోలేనిది .
భాగవతం తర్వాత అంతటి పారాయణ గ్రంధం మేస్టారి రచన .సంగీత ప్రియులకు కీర్తనల లోని అర్ధం అంతరార్ధం జీర్నమవటం వాళ్ళ రాగ సౌందర్యాన్ని ఎక్కువగా అనుభవిస్తారు అన్నారు పతంజలి .నిజం గా ఈ పని చేయాల్సిన వారు సాహిత్య భాషా శాస్త్ర వేత్తలు .కాని పాపం వారెవ్వరూ దీని జోలికే పోలేదు .ఈ పుస్తకానికి పరిచయాన్ని శ్రీ పాద వారు రాశారు .’’వ్యాకరణ సూత్రాల వాసనే కాని రసానుభవం ,యోగ్యతా పెట్టి పుట్టని తెలుగు సాహిత్య వేత్తలూ దీన్ని స్ప్రు శింపక పోయారు ..వేమన్న కవితల యడా ఇలాంటి అరసికతా ముద్రనే తగిలించుకొన్నారు .వారికి పల్లవి ప్రస్తావనే సంగీతం వీరికి పద రచన- కవిత్వమే కాక పోవడమూ త్యాగ రాజ సాహిత్యానికి ఈ సౌభాగ్యం పట్టక పోవడానికి ముఖ్య హేతువు ‘’అన్నారు .’’వాడుక భాష ప్రాచుర్యం వల్లనే త్యాగ రాజ సాహిత్యానికి ఇలాంటి ప్రకాశం సిద్ధిం చటమున్నూ గమనించ దగ్గ విషయం ‘’అన్నారు శ్రీ పాద వల్ల్లభులైన శాస్త్రి గారు .త్యాగయ్య వాడిన పదాలు చిన్న చిన్నవి ఆయన వాడిన పోలికలు కూడా నిత్య జీవితం లో అతి సాధారణం గా పరిచయమైనవే .అన్వయించాటానికి మేష్టారు పడ్డ శ్రమ గొప్పది .ఆ దీక్ష గొప్పది .మేస్టారి ఏకాగ్రత మరీ గొప్పది ‘’అని శ్లాఘించారు శాస్త్రిగారు హాస్య బ్రహ్మ లోని సంగీత సరస్వతిని ఆవిష్కరిస్తూ .
‘’కీర్తనల్లొని భావాలు ,ఉత్కంఠ,విచారం ,పారవశ్యం ,అణు మాత్రం వదిలి పెట్ట కుండా పోగు చేసి చమత్కారం గా పూల దండల్లా అల్లేశారు ‘’అని మెచ్చారు పాకాల వెంకట రాజ మన్నార్. ,
నిజంగా త్యాగ రాజు గారు కీర్తనలు రాయలేదు .అవి వెలువడినాయి .అంటే త్యాగయ్య గారి నోటంట వెలువడుతుండగా శిష్యులు ‘’పల్చటి మామిడి చెక్కల ‘’మీద వేగం గా రాస్తూండే వారట .అలా దక్కాయి త్యాగరాజ స్వామి కీర్తనలు మనకు .త్యాగ రాజు గారికి పరమాత్మయే
ఆధారం ,గమ్యం ,శృంగారం ,వైరాగ్యం ,ఐదో తనం ,సర్వస్వం అని మేస్టారన్నారు .తన హృద్భూషణుడు సగుణ ,నిర్గుణ రూపాల్లో నిండి ఉన్న పరమాత్మ .’’పరమాత్మ ఇంగిత మెరిగిన సంగీత లోలుడు ‘’అన్నారు హాస్య బ్రహ్మ . .ఇంతగా త్యాగ రాజు గురించి ,ఆయన కీర్తనల గురించి అర్ధం చేసుకొన్న రీతిలో అన్యులేవరూ చేసుకోలేదు .’
‘’కీర్తన ఆలాపిస్తున్నప్పుడు ఆ రాగం కీర్తన ,మాటల్లో ఉండే మహోత్క్రుస్టమైన అర్ధాన్ని పెంపొందించి ,వాక్కు కి అసాధ్యమైన పని చేస్తున్నట్లు స్పురించాలి .అంటే కేవలం నాదమైన ఆ స్వరాలు కూడా అర్ధం అవుతున్నట్లు శ్రోతకి అని పించాలి ‘’అని హాస్య బ్రహ్మనాద బ్రహ్మ ను గురించి వివరించారు .’’త్యాగ రాజు అంటే నాద సుధారసం యొక్క నరాక్రుతి’’ (గాన శాస్త్రం యొక్క గాదు )అని మేస్టారి నిర్వచనం .’’బ్రాకెట్ ఆడింది ‘’మేస్టారే .నేను కాదు, పతంజలి గారూ కాదు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-13-ఉయ్యూరు