సినీ గీతా మకరందం -5
అలల మీద తేలించే‘ ’చెంగూన అల మీద ‘’గీతం
చివరికి మిగిలేది సిన్మా అంటే నాకు ఒక గొప్ప క్లాసిక్ అనే భావం పూర్తిగా ఉంది కదా బెంగాలీదైనా ,ట్రీట్మెంట్ మాత్రమచ్చ తెనుగు లో సాగింది .గుత్తా రామినీడు దర్శకత్వం గుడి మెట్ల అశ్వథామ స్వర మాధుర్యం ఘంట సాల ఏం ఎస్.రామా రావు మొదలైన వారి దివ్య గాత్రం ,హరనాద్ సావిత్రి ల నటనా వైదుష్యం ఇందులో రాశీ భూత మైనాయి .ప్రభాకర రెడ్డి ని ,జయంతిని మొదటి సారిగా సినిమాలకు పరిచయం చేసిన సినిమా 1960లో విడుదల అయింది .అప్పుడు నేను బందరు హిందూ కాలేజి లో ఫిజిక్స్ డిమాన్ స్త్రేటర్ గా పని చేస్తున్నాను .మా తమ్ముడు మోహన్ డిగ్రీ చదువుతున్నాడు ఒక గది అద్దెకు తీసుకొని రామానాయుడు పేటలో ఉండేవాళ్ళం .అప్పుడు విఠల్ ,రామ కృష్ణఅనే ‘పొట్టి ‘’మాతో సన్నిహితం గా ఉండేవాళ్ళు .ముందు రామ కృష్ణ ఈ సినిమా చూసి ‘’బాబాయ్ !అద్భుతమైన సినిమా రిలీజ్ అయింది .నేను చూసొచ్చాను తప్పకుండా వెళ్లి చూడండి ఎక్కువ రోజులు ఆడుతుందని గ్యారంటీ లేదు ‘’అన్నాడు .అలా ఆ సినిమా చూశాం .ఆ తర్వాత అది ఆడిన వారం రోజులూ రాత్రి సెకండ్ షోకు వెళ్లి చూశాం అంత బాగా నాకు నచ్చింది అందులో ఘంటసాల గానం చేసి,మల్లాది రచించిన ‘’సుధ వోల్ సుహాసినీ మధువోల్ విలాసినీ ఓహో కమనీ ‘’ ని రోజు కేనేన్ని సార్లు హమ్మింగ్ చేస్తూ పాడుకోన్నామో గుర్తే లేదు. అలాగే మల్లాది రాసిన ఏం ఎస్ రామా రావు పాడిన ‘’చెంగూనా అలమీద మిడిసి పోతది మీను ‘’అనే పాటమాకు అప్పుడు ఒక నిత్య పారాయణం .ఈ రెండో పాట గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం .
‘’ చెంగూన అలమీద మిడిసి పోతది మీను –చినవాడు ఎదరైతే మరచీ పోతవు మేనూ –కాదంటావా కాదంటావా – చిన్న దానా నువ్వు కాదంటావా?
వల్లా మాలిన మమత కమ్మా తెమ్మర లాగ –కమ్మకున్నది-నిన్నూ చిన్నదానా-చినదానా — కమ్మా నైన వాడు సరసనే ఉన్నాడు వల్లకుం టావే –నీవు చిన్న దాన -నీవు వల్లకుం టావే-
చినికిన చినుకెల్లా -మంచి ముత్యము కాదు -మెరసిన మెరుపులో లేత వెన్నెల లేదు-అందని చందమామా కోసమని –ఆశాశ పడినావే =నీవు అల్లాడిపోయినావే- అల్లాడి పోయినావే .
చివురంటీ వయసునా చిక్కనీ జీవితాన -చివరికి మిగిలింది చీకటేనా? –చివరికి మిగిలింది కారు చీకటేనా-కారు చీకటేనా ? ‘’
ప్రేమించిన వాడి మనసు తెలుసుకోలేని అమ్మాయి .కాని వాడు కనీ పిస్తే మేనే మరచి పోతున్దామే .ఆమె పరిస్తితి ఎలా ఉందంటే అలల మీద చెంగు చెంగున దూకే మీను అంటే చేప లా ఉంది వాడు .ఎదురైతే మేనే మరచి పోతుంది .ఇది కాదన గలవా అని అడుగుతున్నాడు కవి .ఆమె లో నిండి నిబిడీకృతమైన ప్రేమ వల్ల మాలినది .అది ఆమె ను కమ్మ తెమ్మెర లాగా కమ్ము కున్నది ఆమె కోరే ప్రియుడు చెంతనే ఉన్నాడు .కాని మనసు విప్పి పెదవి విప్పి ఆమె తన ప్రేమను వ్యక్తం చెయ్యలేక పోతోంది .మాట్లాడకుండా ఉండటమే ‘’పల్లకున్డటం అంటే పలక్కుండా ఉండటం .ఇక్కడొక జీవిత సత్యాన్ని ఆవిష్కరించాడు కవి –ప్రతి చినుకూ మంచి ముత్యం కాదని హెచ్చరించాడు .మెరుపు లో లేత వెన్నెల ఉండదని ,ఉంటుందని ఎదురు చూడటం భ్రమ మూర్ఖత్వమనీ చెప్పాడు
అందని చందమామ అయ్యాడు ప్రేమించిన వాడు .వాడికోసం ఆశ పడింది పాపం చివురాకు కనుక ఆ మెరుపుకు భయపడి అల్లాడి పోయింది ఆమె ఆమె మనసూ కూడా .మరి దీని పర్యవసానం ?.చిక్కని జీవితం లో చిగురంటి వయసులో ఇక చివరికి ‘’మిగిలేది చీకటే .అదీ భయంకరమైన కారు చీకటే అని వేదన తో ఆమె పై సాను భూతితో ,ఆవేదన తో అన్న మాటలు .ప్రతి మాట ను మల్లాది మేష్టారు సాన బట్టి వదిలారు ఇంత చిన్న పాటలో అనంత వేదనా, శోకమూ, నిరాశా సమయానికి తగిన విధం గా స్పందించక పొతే అనర్ధమూ తన స్వరం లో నిక్షిప్తం చేసి ఈ పాటకు జీవం పోశారు అభినవ రామ దాసు గా మారిన సుందర దాసు రామా రావు గారు .యెంత తేలికగా మాటల్ని పలికారో యెంత గా మనసులోకి చొచ్చుకు పోయేట్లు పాడారో ఆ పాట వింటే నే తెలుస్తుంది అనుభ విస్తేనే అర్ధమవుతుంది .ఇదొక మధు కణం .అందుకే నాకు గీతా మకరందమని పించింది .ఈ సన్నివేశం లో రామినీడు దర్శక ప్రతిభా సావిత్రి హిమోన్నత నటనా గరిమా, ఏం ఎస్ గారి రాగ స్వర హేల మల్లాది వారి సాహిత్యంపసందు గా ఉంది అయితే ఇది విషాదం లో చినికిన చినుకు .అలా అలా అలల మీద చేప తేలినట్లు రాగం, గీతం స్వరం తేలియాడుతూ ఆ అను భూతిని మిగిలిస్తాయి .అందరి గొప్ప పరిశ్రమ వల్లా ఇంత అందమైన మధు విషాద గీతం ఆవిర్భ వించింది .మనసుల్ని దేవేసే గీతం .ఆలాపనా అంతా ఒక అలౌకిక సృష్టి అందులో ఆనందం కనీ పిస్తుంది .
మరో మధు బిందువు కోసం ఎదురు చూద్దాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -9-12-13-ఉయ్యూరు