నా దారి తీరు -48 ఫామిలీ తో పూనా ట్రిప్

నా దారి తీరు -48

ఫామిలీ తో పూనా ట్రిప్

మా తమ్ముడుమోహన్  పెళ్లి చేసుకొన్న దగ్గర్నించీ మమ్మల్ని పూనా రమ్మని పిలుస్తూనే ఉన్నాడు .ముందు అమ్మ ను తీసుకేళ్ళమనే వాడిని .ఆవిడ కు అంత ఇస్టమున్దేదికాడు .మమ్మల్నే వెళ్ళమనేది .ఇక కదలక తప్ప లేదు. అప్పుడు నేను పెనమ కూరు లో పని చేస్తున్నాను .1979 వేసవి సెల వుల్లో పూనా ప్రయాణం పెట్టుకోన్నాం .మా నాల్గో అబ్బాయి రమణ కు యేవో పరీక్షలుండటం మూలం గా వాడు రాలేదు మిగతా మా కుటుంబం అంటే నేను మా ఆవిడా ,రెండో వాడు శర్మ ,మూడు మూర్తి అమ్మాయి విజ్జి పూనా కు బయల్దేరాం అప్పటికి టేలి ఫోన్ లు లేవు ఉత్తరాలే .రిజర్వేషన్ బెజ వాడ లో చేసుకోవాలి .నేనే వెళ్లి చేయించాను .అప్పటికి సరాసరి ట్రెయిన్ లేదు అందుకని సికందరాబాద్ వెళ్లి అక్కడి నుంచి బాంబే ఎక్స్ ప్రెస్ లో బొంబాయికి వెళ్ళాలి .బొంబాయికి ఇవతలే పూనా ఉంది.

మేము ఎక్కిన ట్రెయిన్ కృష్ణా express కి బాంబే ఎక్స్ ప్రెస్  లింక్. కృష్ణ మద్యాహ్నం 12 గంటకు విజయవాడలో బయలుదేరి  సికింద్రాబాద్   కు  కొంచెం ఆలస్యం గా చేరింది అప్పటికే బాంబే ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫాం మీదకోచ్చేసింది .కంగారు ,పిల్లా జెల్లా సామాన్లు .ఎల్లా అని ఒకటే ఇదై పోయాం .ఎలాగో అలా ట్రెయిన్ పట్టుకొని బెర్త్ర్ట్ ల లో చేరాం, మామూలు లగేజి కి తోడు బియ్యం తీసుకొని వెళ్ళాము .ట్రైన్ సికింద్రాబాద్ నుంచి నాంపల్లి కి వచ్చింది అక్కడ  తోడల్లుడు దక్షిణా మూర్తి భార్య భారతి స్టేషన్ కు వచ్చి మాకు అన్నం ,కూరలు చపాతీలు వగైరాలున్న పాకెట్లు అంద జేశారు .హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొన్నాం .మేమేక్కిన అయిదు నిమిషాల్లో బయల్దేరింది ట్రెయిన్ ..

ఒక గంట అయిన తర్వాత ఇచ్చినవీ  తెచ్చుకోన్నవీ తిన్నాం పిల్లలు హాయిగా బెర్తులు ఎక్కి నిద్ర పోయారు .నాకు నిజామా బాద్ స్టేషన్ గుర్తుంది. విశాఖమేడికల్ కాలేజి నుంచి నన్ను నిజా మా బాద్ పాలిటేక్నికి కు ట్రాన్స్ ఫర్ చేశారు మా నాన్న పోయిన కొత్తలో .జాయిన్ అవుదామని వచ్చాను .ఇక్కడి వాతావరం ఎందుకో నచ్చలేదు’’ఒళ్ళు బలుపు’’ కూడా ఒక కారణం కావచ్చు .ఉయ్యూరు విడిచి ఉండలేకపోవటం, అమ్మ దగ్గరెవరూ లేకుండా ఉండటం నచ్చక పోవటం ,కుటుంబానికి పెద్ద కొడుకు ను కనుక బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనా కారణాలుగా నేను నిజామా బాద్ లో చేరి వెంటనే ఓకే రోజుండి వచ్చేసి లీవ్ పెట్టాను .మంచి వాళ్ళు కనుక ఒక నెల జీత నష్టం మీద సెలవు ఇచ్చారు .మళ్ళీ పోడిగించాను ఇక ‘’వీడు చేరే ఘటం కాదను’’కొని ఉద్యోగం పీకేశారు .రోగీ ప్తచ్యమే కోరాడు డాక్టరూ చెప్పాడు అన్నట్లుంది .ఆక్కడే ‘’జాల్నా’’ ఉంది .మా అన్నయ్య అక్కడ మిలిటరిలో ఉద్యోగం చేశాడు .అదీ జ్ఞాపకం వచ్చింది .నిద్రపోయాము .

ఉదయం తొమ్మిదింటికి పూనా చేరాం .పూనా కు ముందే ‘’కిర్కీ స్టేషన్’’ లో దిగాలని మా తమ్ముడు చెప్పినట్లు అక్కడే దిగాం .మోహన్ వచ్చి ఆటోలో ఇంటికి తీసుకు వెళ్ళాడు .వాళ్ళు అప్పుడు మిలిటరీ క్వార్టర్స్ దగ్గర ఉండే ‘’సిపోరేక్స్ క్వార్టర్స్ ‘’లో ఉంటున్నారు .వాడి మామ గారు కూడా దగ్గరలో నే ఉన్నారు బావమరదులు మరదలు కూడా .మా మరదలు సునీత మాటల్లో ఏంతో ఆప్యాయం కన బరుస్తుంది .నాలుగైదు రోజులు ఏంతో బాగుందని పించింది. ఆ తర్వాతమొదట్లో ఉన్న ఉత్సాహం నెమ్మదిగా బై పాస్ అయింది .సాయంత్రం వేళల్లో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం .పెద్ద ఇల్లు అయిదారు గదులు అందరికీ అను కూలం గా ఉండేది.అక్కడ డిఫెన్స్ క్వార్టర్స్ లో సెక్యూరిటీ ని మొదటి సారి చూశాను .బొమ్మ లాగా తుపాకి పట్టుకొని కదల కుండా కను రెప్ప వేస్తాడో లేదో తెలీకుండా నిల బడే వాడు .అది వింత అని పించింది ప్రతి ఇంటి లో మామిడి చెట్టు ఉండేది .ఆర్డి నేంస్ ఫాక్టరీ లో పని చేసే కార్మికులకు అధిక వడ్డీ లకు డబ్బులు అప్పు ఇచ్చి ఒకటవ తేదీన గేటు  దగ్గర నిలబడి మార్వాడి లాగా బాకీలు వసూలు చేస్తారని మా వాళ్ళు చెప్పగా విన్నాం .నిజం గా ఒకటవ తేదీ న ఆసీన్ ని చూసి నిజమే నని నమ్మాను .డబ్బులన్నీ బాకీ వాడికి కట్టేస్తే వాళ్లకు మిగిలేది స్వల్పం .అందులో ఇల్లు గడవటం కష్టం .అందుకని తాగుడుకు బానిసలయ్యే  వాళ్ళు .అదీ చూశాం .

మహా రాష్ట్ర లో చెక్ డాం లు ఎక్కువ .అవి వ్యవసాయానికి బాగా ఉప యోగ పడేవి .పూనా క్లైమేట్ చాలా ఆహ్లాదం గా ఉండేది .నులి వెచ్చని వేడి మాత్రమె. సాయంత్రం అయితే వర్షం భీభత్సం గా పడేది ‘’టోరెంషియల్ రైన్ ‘’అంటారు అలా కురిసి వదిలేది .యెంత నీరు పడినా పది నిమిషాల్లో నీరంతా ద్ద్రేయినేజ్ లోకి పోయి చుక్క కూడా రోడ్డు మీద కనీ పించేది కాదు .మాకిది ఆశ్చర్యం గా ఉండేది .

మోహన్ మామ గారు గవర్న మెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు .ఆయన మంచి టెన్నిస్ ప్లేయర్.వెటరన్ క్రీడల్లో ఆయన పాల్గొని గెలిచే వాడు ఎన్నో కప్పులు సాధించాడు ఎన్నో బహుమతులన్డుకొన్నాడు ఇంగ్లాండ్ మొదలైన దేశాలకు వెళ్లి అక్కడా పాల్గొన్నాడు .ఆ వివరాలన్నీ ఒక డైరీ లో రాసుకొన్నాడు .అడిగితె వాయించేసే వాడు. ఉడికించటానికి నేను ‘’ఏమండీ ఆ ఊర్లో ఎలా గడిపారు ?’’అని అడిగే వాడిని .ఇంకే ముంది ‘’గుండ్రాలు ‘’తిప్పి ఫ్లాష్ బాక్ లోకి వెళ్లి పూస గుచ్చి నట్లు చెప్పే వాడు .వింటూ ముసి ముసి నవ్వులు నవ్వుకొంటూ గడిపే వాడిని ఆయన భార్య మంచిదే .పచ్చగా బాగుంటుంది ఈయన కస్తూరి శివ రావు లాగా ఉంటాడు ఆవిడ సినిమా నటి శాంతకుమారికి దగ్గర చుట్టం .మా వాడు ఆవిడ ద్వారా నన్ను సినిమాలలో మాటలూ పాటలూ రాయటానికి ఏర్పాటు చేస్తానని చెప్పే వాడు .నాకు అంత ఇంట రెస్ట్ ఏమీ లేదు వాడు మాట అంటం తప్ప అంగుళం ముందుకు వెయ్యలేదు ఇది వాడికి సహజమే .మా అన్నయ్య గారి అమ్మాయి వేద వల్లి పెళ్లి అయిన తర్వాత అతనికి పూనా లో ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ పెట్టాడు .నాతొ అనే వాడు ‘’రామ కృష్ణ లో మనకు మంచి అల్లుడు కనీ పిస్తాడు. అతనికి నేను ఉద్యోగం చూపిస్తాను ‘’కాని మేటీరియలైజ్ కాలేదు .కొందరి తీరు ఇంతే .మా వాడి బావ మరదులు వెంకట్ ,అతని తమ్ముడు వసంత్  చాలా మంచి కుర్రాళ్ళు . వాళ్లకి అప్పటికి పెళ్ళిళ్ళు కాలేదు నన్ను కూడా ‘’బావ గారూ బావ గారూ ‘’అంటూ  ఆప్యాయం గా పిలిచే వారు .రోజూ ఎక్కడికో అక్కడికి బైక్ మీద తీసుకొని వెళ్ళే వాళ్ళు .మోహన్ మరదలు కూడా ఉద్యోగం చేస్తూ ఉండేది అందరూ ఆర్డినెన్స్ ఫాక్టరీ లోనే సునీత కూడా తర్వాత చేరింది

ఒక రోజు మమ్మల్ని శివాజీ కోట కు తీసుకొని వెళ్ళింది .అక్కడ అమ్మ వారి దర్శనం అద్భుతం ఈ అమ్మ వారే శివాజీ మహా రాజ్ కు ప్రేరణ .ఇలా కొన్ని ప్రాంతాలకు సాయం వేళ వెళ్ళే వాళ్ళం .మోహన్ ఏం ఎస్ సి చేసిన పూనా యూని వర్సిటి చాలా పెద్దది .ఎన్నో ఎకరాలు అంతా చెట్లూ బిల్డింగులు చాలా ఆహ్లాదం గా ఉండేది .దాదాపు అంతా నడిచే తిరిగే వాళ్ళం .అవసరామైతేనే ఆటో లేక బస్ .పూనా బస్ సర్వీస్ బాగుండేది ఖచ్చితమైన సమయాన్ని పాటించే వారు .

మిగిలిన విషయాలు తర్వాత

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 10-12-13—ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.