పరిశుభ్ర ప్రసవానికి ”జన్మ”కిట్లు -ఆంద్ర జ్యోతి

 

“పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రసవం కోసం సహాయపడుతుంది మా ‘జన్మ’ కిట్. ఇందులో శస్త్రచికిత్సకు వాడే బ్లేడ్ (సర్జికల్ బ్లేడ్), రక్తస్రావాన్ని పీల్చుకునే ప్రత్యేక వస్త్రం (బ్లడ్ అబ్జార్బింగ్ షీట్), బొడ్డుతాడును ముడివేసే క్లిప్, మెడికేటెడ్ సోప్స్, చేతులు శుభ్రం చేసుకునే నాప్‌కిన్స్.. వంటివన్నీ ఉంటాయి. ఈ కిట్ ధర కేవలం వంద రూపాయలు. మేము అందించేదే సామాన్యుల కోసం కాబట్టి అంత తక్కువ ధరను పెట్టాము”

పరిశుభ్రమైన చోట ప్రసవించే హక్కును కూడా కోల్పోతున్న దేశం మనది. కాన్పులు చేసేందుకు అవసరమయ్యే చిన్న చిన్న పరికరాలు లేక పురిటినొప్పులతో బాధపడే ఆస్పత్రులెన్నో ఉన్నాయి. అవన్నీ తన బాధలుగా తలపోసింది చెన్నైకు చెందిన జుబేదా. ఆరోగ్యకరమైన ప్రసవం కోసం ‘జన్మ’ అనే చౌకధర కిట్‌ను పేదలకు అందిస్తోంది..

“మన దేశంలో జరిగే శిశు మరణాలు మరెక్కడా జరగవు. ప్రసవ సమయంలో శుభ్రత లోపించడమే దీనికి ప్రధాన కారణం. అరకొర వైద్య సదుపాయాలున్న పల్లెల్లోనే ఈ సమస్య ఎక్కువ. ఇప్పటికీ చాలా ఆస్పత్రులలో పురుడు పోయడానికి తగిన పరికరాలే లేవు” అంటున్నారు 32 ఏళ్ల జుబేదా. ముస్లిం కుటుంబంలో ఎదురయ్యే అడ్డంకుల్ని దాటుకుని పెద్ద చదువులు చదివిన ఆమె సరికొత్త ఆవిష్కరణకు పూనుకుంది. ‘ఐజ’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి.. దాని ద్వారా కాన్పులు చేసేందుకు అవసరమయ్యే ‘జన్మ’ అనే కిట్‌ను సరఫరా చేస్తున్నది. “స్వీడన్‌లో ఇంజనీరింగ్ చేశాక హబీబ్‌ను పెళ్లి చేసుకున్నాను. ఉద్యోగరీత్యా ఇద్దరం కెనడా వెళ్లాము. అక్కడ కొన్నాళ్లుండి సొంతూరైన చెన్నైకి తిరిగి వచ్చేశాము. ఇండియాకు వచ్చాక – మనం పుట్టి పెరిగిన సమాజానికి తిరిగి ఏదైనా చేయాలన్న ఆరాటం మొదలైంది..” అన్నారామె.


చెన్నైకి రాగానే అక్కడున్న రూరల్ ఇన్నొవేషన్ నెట్‌వర్క్ (ఆర్ఐఎన్)లో చేరారు జుబేదా. గ్రామీణ ఆవిష్కరణలను ప్రోత్సహించే ఈ సంస్థ.. ఆమెకు తగిన మేథో సాయం అందించింది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత కాన్పుల కోసం వైద్యపరికరాలను అందించే ఆలోచన వచ్చింది ఆమెకు. “ఒక మహిళ కష్టాన్ని మరో మహిళ మాత్రమే కచ్చితంగా అర్థం చేసుకోగలుగుతుంది. నా తొలి కాన్పుకు చాలా ప్రయాస పడ్డాను. ప్రసవం అయ్యాక శుభ్రత లేక బిడ్డకు ఇన్‌పెక్షన్లు వచ్చాయి. అది చూసి తల్లడిల్లిపోయాను” అని గుర్తు చేసుకున్నారు. ఆ అనుభవం కూడా తన కొత్త ఆలోచనకు పనికొచ్చింది. వెంటనే స్త్రీల వైద్యులు, మిడ్‌వైఫ్‌లు, మంత్రసానులు, పల్లెల్లోని పెద్దలను కలిసి.. తన ఆలోచనను పంచుకున్నారు. కాన్పులప్పుడు ఎదురయ్యే సమస్యల్ని అర్థం చేసుకున్నారు. “గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అసలే శుభ్రత ఉండదు. దానికితోడు నిధుల కొరత ఒకటి. వాడిన పరికరాలనే మళ్లీ వాడి కాన్పులు చేస్తుంటారక్కడ. ఇలా చేయడం వల్ల తల్లికి, బిడ్డకు లేనిపోని సమస్యలు వస్తాయి.

ఒక్కోసారి జీవితాంతం బాధపడాల్సి వస్తుంది..” అని చెప్పారు. తను నెలకొల్పిన సంస్థలో కొందరు మహిళలను తీసుకుని శిక్షణ అందించారు జుబేదా.”పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రసవం కోసం సహాయపడుతుంది మా ‘జన్మ’ కిట్. ఇందులో శస్త్రచికిత్సకు వాడే బ్లేడ్ (సర్జికల్ బ్లేడ్), రక్తస్రావాన్ని పీల్చుకునే ప్రత్యేక వస్త్రం (బ్లడ్ అబ్జార్బింగ్ షీట్), బొడ్డుతాడును ముడివేసే క్లిప్, మెడికేటెడ్ సోప్స్, చేతులు శుభ్రం చేసుకునే నాప్‌కిన్స్.. వంటివన్నీ ఉంటాయి. ఈ కిట్ ధర కేవలం వంద రూపాయలు. మేము అందించేదే సామాన్యుల కోసం కాబట్టి అంత తక్కువ ధరను పెట్టాము” అన్నారు సంస్థ సభ్యులు. ఈ కిట్‌ను గర్భిణులు కొనుక్కుని దగ్గర్లోని ప్రసవ కేంద్రాలకు వెళితే.. బిడ్డను తీసుకుని సురక్షితంగా ఇంటికి తిరిగి రావచ్చు అన్నది జుబేదా ఉద్దేశం. ఇప్పటివరకు యాభైవేల ‘జన్మ’ కిట్‌లను అమ్మినట్లు పేర్కొన్నారామె. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులు కూడా ఆర్డుర్లు ఇచ్చి కిట్‌లను తెప్పించుకుంటున్నారు.

“కేవలం మన దేశంలోనే కాదు. వీటిని హైతీ, ఆఫ్ఘ్ఘనిస్తాన్, ఆఫ్రికా దేశాలలో కూడా విక్రయిస్తున్నాము. కిట్‌కు ప్రాచుర్యం లభించడంతో పలు వెనుకబడిన దేశాల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తున్నది” అంటున్నారు ఐజ వ్యవస్థాపకురాలు. ప్రసవానికి అవసరమయ్యే కిట్‌ను ప్రైవేటుగా కొనాలంటే వందల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం వంద రూపాయలకు మాత్రమే ‘జన్మ’ కిట్‌ను అందిస్తున్న ఈ సంస్థకు.. మరింత బ్రాండ్ వాల్యూ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకుని విస్త్రృత ప్రచారానికి సన్నద్ధం అవుతున్నారు జుబేదా. ఇప్పటికే ఈ సంస్థ ప్రాచుర్యం పొందడమే కాకుండా.. పలు గుర్తింపు పొందిన సంస్థల అవార్డులను సైతం పొందింది. ప్రముఖ వరల్డ్ హెల్త్ కాంగ్రెస్ అవార్డు, ఇండెక్స్ అవార్డులతో పాటు క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ అవార్డులను సైతం గెలుచుకుంది.

ఫోన్ : 09176951290

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.