నా దారితీరు -50 హైదరా బాద్ సందర్శనం

నా దారితీరు -50

హైదరా బాద్ సందర్శనం

అంతకు ముందు మేమెప్పుడూ హైదరాబాద్ చూడలేదు .దాన్ని గురించి కధలూ గాధలూ విన్నాం .బెజవాడ దాటం గానే నిజాం నాణాలలో డబ్బు చెల్లించాలని ,ఉద్యోగం కావాలంటే ముల్కీ ఉండాలని దానికోసం మన వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు పుట్టించే వారని ,అక్కడి భాష మనకు అర్ధం కాదనిఉర్దూ తెలుగు లోమాట్లాడుతారని   ఆడా మగా అందరూ తమల పాకు కిళ్ళీలు వేసి ,ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తారని ,కంపార్టు మెంట్లు ప్లాట్ ఫారాలు  అన్నీ  కిళ్ళీ ఉమ్మితోను రోతపుట్టిస్తాయని చెప్పుకొనే వారు .అంతేకాదు రైళ్ళు కూడా హైదరాబాద్ కు రోజుకోకటే ఉండేవని విన్నాను .క్రమం గా అన్నీ మారి పోయి ఇప్పుడు రాజ దాని అయి తెలుగుబాగా మాట్లాడే స్తితి వచ్చింది .ఈ స్తితిలో మేము హైదరాబాద్ యాత్ర చేశాం .

స్టేషన్ కు మా తోడల్లుడు వారణాసి దక్షిణా మూర్తి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని విజయ నగర్ కాలని లో ఉన్న ఎల్ ఐ.జి.కు చెందిన వాళ్ళ స్వంత ఇంటికితీసుకొని వెళ్ళాడు .అది ఆయన తండ్రివెంకటరామ శాస్త్రి  గారిది  .ఆయన హైదరాబాద్ మునిసిపాలిటి లో ఇంజినీర్ గా పని చేసి రిటైర్ అయ్యారు .ఆయన స్వయానా మా రేపల్లెల బాబాయి రాయ ప్రోలు శివ రామ దీక్షితులుగారి భార్య అంటే  మా  లక్ష్మీ కాంతం పిన్ని కి అన్నగారు .అంతేకాదు దక్షిణా మూర్తి అన్నకృష్ణ మూర్తి నాకు బెజవాడ కాలేజి లో ఇంటర్ లో క్లాస్ మేట్ .కనుక పూర్వ బంధుత్వమూ ఉంది .భారతి అంటే మా మరదలు దక్షిణా మూర్తి భార్య అత్త గారు మామ గారు ప్రక్కనే ఉంటారు .రెండు పోర్షన్ల ఇల్లు .ఒక పోర్షన్ లో వీళ్ళు రెండో దానిలో వాళ్ళు ఉంటారు .అతని ఇద్దరు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అక్కడే ఉంటారు .శాస్త్రి గారు బాగానే మాట్లాడే వారు భార్య కూడా .వీళ్ళకి మా మామ గారి ఊరు వేలుపు చర్ల లో స్వంత పొలాలు బాగా ఉండేవి .మంచి స్తితి పరులు .పొలాల్లో పొగాకు బాగా పండి మంచి ఆదాయం వచ్చేది .

దక్షిణా మూర్తి ఉన్న భాగం చిన్నదే .ఒక బెడ్ రూమ్ ,వంటగది మాత్రమె .అక్కడే ఉన్నారు .దొడ్లో పెద్ద మామిడి చెట్టు ఉంది .కాయలు ఎక్కువేకాసేవి .అందరం అక్కడే సర్డుకొనే వాళ్ళం .దొడ్లో చిన్న రేకుల షెడ్ చెట్టు కింద ఉంది .పిల్లలు అక్కడే చదువుకొనే వాళ్ళు .పడక కూడా అక్కడే .ఇంత ఇరుకు ఇంట్లో ఉన్నా మా తోడల్లుడి హృదయం విశాల మైంది .అందకని ఆప్యాయతకు కొరత లేదు .మమ్మల్నందర్నీ ఏంతో అభిమానం గా చూశారు అందరూ .

పొద్దున్నే అందరికి ఇడ్లీ కాని లేక ఏదో టిఫిన్ కాని చేసి ,చిక్కటి  ఫిల్టర్ కాఫీ  ఇచ్చేవారు పిల్లలకు పాలు, లేక హార్లిక్స్ కలిపి ఇచ్చే వారు .మూర్తి- ప్రభుత్వ రంగ సంస్థ ఐ.డి.పి.ఎల్ .లో పని చేసేవాడు కంపెనీ బస్ లో వెళ్లి వచ్చేవాడు నైట్ షిఫ్ట్ లు కూడా ఉండేవి .వీటికి తోడూ ఆతను కొన్ని సినిమాలలో నటించాడు. కూడా పెద్ద నటులతో పరిచయమూ ఉండేది .గుంపులో గోవింద గా కొన్ని సినిమాల్లో, కొన్నిట్లో కాసేపు కనీ పించి తెరమరుగయ్యే  పాత్రలూ చేశాడు డైలాగ్ ఉన్న వి కూడా కొద్దిగా చేశాడు .మంచి పర్సనాలిటి .యెర్రని ఎరుపు కుది మట్టం గా ఉండేవాడు .వెడల్పైన ముఖం కోపం వస్తే ముఖం కంద గడ్డ అయ్యేది .చిరు బురు లాడినా భార్య భారతి అంటే విపరీత మైన ప్రేమ .భారతికీ అంతే .ఒకరకం గా ‘’ఓవర్ ప్రేమ ‘’వారిద్దరి మధ్యా ఉండేది .ఆతను మంచి మాటకారి హాస్య ప్రియత్వం ఎక్కువ .

భారతి పెందరాళే వంట పూర్తీ చేసి మా కందరికీ పెట్టి ,తానూ తిని ,మమ్మల్ని ‘’ఊరేగింపు ‘’గా అన్ని చోట్లకూ సిటీ బస్ మీద తీసుకొని వెళ్ళేది. మధ్యాహ్నం టిఫిన్ ఖర్చు కూడా లేకుండా దిబ్బరొట్టె కాని పూరీలు కాని చేసి మాతో బాటు తీసుకొచ్చేది .వీలైన చోట వాటిని

మాకిచ్చి తిని తానూ తినేది .వాళ్ళమగ  పిల్లలు మారుతీష్ భానులు . ఆడ పిల్లలు మాధవి ,పద్మజ. పిల్లల్ని స్కూలుకు పంపి మాతో వచ్చేది భారతి .ఒక రోజు గోల్కొండ కోట చూశాం ఒక రోజు హైకోర్టు .ఇంకో రోజు మ్యూజియం .మరో రోజు టాంక్ బండ్డ్ దగ్గర ఇందిరా పార్కు  .అన్నీ  చాలా చాకచక్యం గా నేర్పుగా చూపిస్తూ వివరించి చెప్పేది .చార్ మీనార్ కూడా ఎక్కాం .పిల్లలు సరదాగా ఎక్కారు .ఎక్కలేని వాళ్ళని చంకలో ఎత్తుకొని చూపించే వాళ్ళం .ఇలా సరదా గా రోజులు గడిచి పోయాయి .సాయంత్రం అయిదూ అయిదున్నరకు ఇంటికి చేరే వాళ్ళం మళ్ళీ  వంటా వడ్డింపు .ఇదేదో బాధ గా చేసే వాళ్ళు కాదు భార్యా భర్తలు .మన  వాళ్ళు ఒచ్చారు .వారు ఇవేవీ చూడలేదు చూపించాలి అని భావించి చేసింది భారతి .రాత్రి నిద్ర అందరం నేల మీదే .దగ్గర దగ్గర గా పడుకొనే వాళ్ళం తెల్ల వారి లేచి మళ్ళీ ఇంకో ప్రోగ్రాం .

ఇలా ఉండగా రాం గుండు దగ్గర ఉన్న మల్లాది రామచంద్రయ్య  గారింటికి ఒక రోజు వెళ్లాం .వాళ్ళు ఉయ్యూరు లో మా పెంకుటింట్లో అద్దెకు ఉండేవారు .మేష్టారు చాలా మంచి వారు భార్య వెంకట లక్ష్మమ్మ గారు .పిల్లలు నరసింహ శాస్త్రి ,రామ కృష్ణ, సత్యం ,వెంకటేశ్వర్లు .ఉయ్యూరు లో నే చదివి హైదరాబాద్ చేరారు పెద్దబ్బాయి శాస్త్రి ఏ.జి ఆఫీస్ లో పని చేసి పెద్ద ఆఫీసర్ గా రిటైర్ అయ్యాడు .రెండో వాడిని ఏం ఆర్.కే .అనే వాళ్ళం సరదా మనిషి .ముద్ద ముద్దగ మాట్లాడే వాడు మూడో వాడు సత్యం పెద్దాడైనా ఎప్పుడూ నోటిలో వేలు వేసుకొని చీకుతూ ఉండేవాడు .చివరి వాడు వెంకటేశ్వర్లు ను వెంకన్నా అని పిలిచే వాళ్ళం .అందరూ మంచి పిల్లలే అంతా మా ఇంట్లో పిల్లల్లాగా ఉండేవారు .భేషజాలు లేవు .మా అమ్మాయి విజ్జి అంటే మేస్టారికి, భార్యకీ మరీ ముద్దు’’విజ్జమ్మా విజ్జమ్మా ‘’అని ఏంతో ప్రేమ గా చూసే వారు

మేము మల్లాది వారింటికి వెళ్ళ గానే వాళ్ళు పొంగి పోయారు .వాళ్ళ స్వంత బంధువులు వచ్చినట్లు ఫీల్ అయ్యారు .నన్ను ఆయనా ఎప్పుడూ ‘’మేస్టారూ ‘’అనే పిలిచే వారు .నేనూ అలానే సంబోధించే వాడిని .వాళ్ళింట్లో పండగ సంబరమే అయింది మా రాక .లక్ష్మమ గారు అన్నీ వండి స్వీట్ చేసి మాకు విందు భోజనం పెట్టారు .అది మరచిపోలేం .నాలుగైదు రోజులు వాళ్ళింట్లో ఉండాలని బల వంతం చేశారు .

ఆ సాయంత్రం వెంకన్న మమ్మల్ని ‘’జూ’’కు తీసుకొని వెళ్ళాడు .అక్కడ తిరిగి అన్నీ బాగానే చూపించాడు. పిల్లలూ బాగానే ఎంజాయ్ చేశారు ‘’బతికిన కాలేజి లో ..ఇక అక్కడి నుండి మా తిప్పలు దేవుడికెరుక .దగ్గర దారి అని చెప్పి యెంత దూరం తిప్పాడో తెలీదు యెంత దూరం నడిచామో తెలీదు అప్పటికే రాత్రి తొమ్మిది అయింది .కాళ్ళీడ్చు కొంటూ ,ఒళ్ళు పులిసి పోయి బట్టలు దుమ్ము కొట్టుకు పోయి ,నీరసం గా అడుగు లో అడుగు వేస్తూ రాత్రి పది దాటిన తర్వాత మల్లాది వారింటికి చేరాం .వాళ్ళంతా ఒకటే కంగారు ఏమై పొయామో నని. .విషయం చెప్పి అందర్నీ కంగారు పోగొట్టాను .ఆ రాత్రి మళ్ళీ ఆప్యాయమైన భోజనం ఏర్పాటు చేశారు .

మర్నాడు ఉదయం అందరం వెంకటేశ్వర్లు సహాయం తో విజయ నగర్ కాలనీకి భారతి వాళ్ళ ఇంటికి చేరుకొన్నాం .వీళ్ళకు దగ్గర స్టాప్ ‘’వెల్ఫేర్ సెంటర్ ‘’అక్కడే సిటీ బస్ ఎక్కే వాళ్ళం దిగే వాళ్ళం వీళ్ళ ఇంటికి  లకడి కా పూల్ దగ్గర .అక్కడనుంచి అన్ని చోట్లకూ తిరిగే వాళ్ళం .బిర్లా మందిర్ సెక్రెటేరియట్,రవీంద్ర భారతి అన్నీ చూశాం అన్నీ దగ్గరుండి చూపించింది భారతి .దక్షిణా మూర్తి మగ పిల్లలుఇప్పుడు  మంచి ఉద్యోగాల్లో చేరి పెళ్ళిళ్ళు అయి పిల్లలతో బానే ఉన్నారు  ఇద్దరాడ పిల్లలకూ పెళ్ళిళ్ళు అయి పిల్లా పాప లతో సుఖం గా హైదరాబాద్ లో ఉన్నారు.

ఇలా సుమారు పది రోజులున్నామేమో హైదరా బాద్ లో. మళ్ళీ మళ్ళీ చూడాల్సిన పని లేకుండా అన్నీ సందర్శించి ఆనందం పొందాం .పిల్లలంటే దక్షిణా మూర్తి మహా ప్రేమ వాళ్ళకోసం తాము చాలా కష్టపడ్డారు భార్యా భర్తా .స్వంత సుఖం వదులు కొని పిల్లల కేది కావాలంటే దాన్ని సమకూర్చారు .హేల్డీ ఫుడ్ .న్యూట్రి షస్  ఫుడ్ పిల్లకు పెట్టె వాళ్ళు .వాళ్ళ చదువు వాళ్లకు ముఖ్యం గా భావించి తీర్చి దిద్దుకొన్నారు  దక్షిణా మూర్తి ఆవేశ పరుడు ఆలోచన తక్కువ భారతి ఆచి తూచి అడుగేస్తుంది .బాగా స్పష్టం గా ఆలోచించ గలదు అవతల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ముందే తెలుసు కొని పై ఎత్తు వేయగలదు .భర్త అమాయకత్వం వల్ల బావగారు, మరదులు, మామ గారూ ఎక్కడ మోసం చేస్తారో నని ఆస్తినీ ఇంటినీపోగొట్టుకోకుండా ముందు జాగ్రత్తగా కాపాడు కొంది .అన్నీ దక్కెట్లు చేసుకోంది.ఇదంతా ఆమె ప్రతిభా సామర్ధ్యమే అందుకే భారతి నాకు ‘’స్వయం సిద్ధ ‘’అని పిస్తుంది .

హాయిగా పిల్లలూ మేము హైదరాబాద్ ట్రిప్ ను ఆనందం గా పూర్తీ చేసుకొని ఉయ్యూరు కు తిరిగి వచ్చాం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-12-13-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.