ఎనభై ఏళ్ళ బాల బాపు
బాపు కు ఎనభై ఏళ్ళు అంటే ‘’ఛీ పో’’ అంటారు .ఎందుకంటె ఆయన నవ్వు లో ముసి ముసి మిసిమి నవ్వలు లెప్పుడూ ఎనిమిదేళ్ళ బాలుడి వి గా ఉంటాయి .ఆరోగ్యం అయన చేతుల్లో లేక పోయినా ఉన్నదాన్ని కాపాడుకొనే తీరుంది .సతీ వియోగం కుంగ దీసినా ,అసలు ‘’బెటర్ హాఫ్ రమణ’’ పరలోకం చేరినా అన్నిటినీ తట్టుకొని నిలబడి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న బాపు చిత్రకారులకు బాపుయే .. .ఆదర్శాల హోరు ఉండదు నేల విడిచి సాము చెయ్యడు ..అందిన దాన్ని జార విరుచు కోడు .అందని దానికోసం ముంత వలక బోసి కోడు .ఆందీ అందని
చేలాంచలములన్నట్లు తామరాకు పై నీటి బిందువులా ఉండటం ఆయన ప్రత్యేకం.ఆయనకే ప్రత్యేకం .ఇంటికి వెడితే అపూర్వ స్వాగతం పలికే విశాల హృదయం ఉంది .ఎండుకోచ్చార్రా బాబూ అనుకోని వీధి గుమ్మం వేపు మొహం పెట్టి మాట్లాడే బాపతుకాడు .చుట్టమైనా ,పక్క మైనా మరోడైనా బాపు దారి తీరు వేరే .అందరూ చూసి నేర్వాల్సిందే ..
పైకోకటీ లోనోకటీ టైప్ కాదు ఖచ్చితమైన మనిషి ,మనీషి .మనసున్న మరో బాపు .విశ్రాంతి ఎరుగని అవిశ్రాంత చిత్ర జీవి .సినిమా కే రంగులు అద్దిన రంగు ల హంగుకాడు.భేషజం లేని వాడు .అందరికీ అందు బాటు వాడు .కొండరాయన్ను అతిగా వాడుకొంటారుఆయనేమీ అనుకోడు .అది వారి ఖర్మ అను కొంటాడు .
మన ప్రాచీన సంపదకు ప్రాపు బాపు .వాటి ని నిత్య జీవితం లో అందునా సినీ జీవితం లో అమలు చేసిన చరిత్రకారుడు .ఏది తీసినా నీటుగా తీర్చి దిద్దే నీటు గాడు ఒక రకం గా పోటు గాడు .ఆ లెవెల్ కు చేరటానికి సాహసం చేయలేరెవరూ .రాజకీయ స్వాతంత్ర్యం ఇచ్చింది ఆ బాపు .సినీ లక్షణ శ్రుమ్ఖ శ్రుమ్ఖ లాలను చేదించి చేటు భావాలను కూల్చి సాహసోపేత జాతి జన జీవితాలను ఆవిష్కరించాడు ఈ బాపు .ఆ బాపు చరిత్రకారుడు .ఈ బాపు చిత్ర చరిత్రకే మకుటాయమాన మైన వాడు .
ఆ అమాయక మనిషి లో స్వార్ధం లేదు .కపటం లేదు .కాని ఆయన పేరు చెప్పుకొని స్వార్ధం కోసం వాడుకొనే వారి మాటల్లో మాత్రం ఉంది స్వార్ధం .వీటికన్నిటికీ అతీతుడు బాపు .ఇప్పటికీ ఎనిమిదేళ్ళ పసి బాలుడే ‘’అన్నిటా టాపుబాపు’’ .అందుకే అందరికీ బాపురే బాప్ అయ్యాడు మరిన్ని ఏళ్ళు ఆరోగ్యం తో అందరి ముందు కదలాడాలని ఆశిస్తున్నాను .ఇది బాపు బాలునికో నూలు పోగు మాత్రమె .
గబ్బిట దుర్గా ప్రసాద్ -11-12-13-ఉయ్యూరు