నా దారి తీరు – 52 మద్రాస్ దర్శన్

నా  దారి తీరు – 52

మద్రాస్ దర్శన్

ఉదయమే మా అక్కయ్య ఫిల్టర్ కాఫీ ఇచ్చేది. స్నానం తర్వాత వేడి వేడి ఇడ్లీ సాంబార్ తయారు చేసి పెట్టేది బావ ఆఫీసుకు ,పిల్లలు స్కూల్ కు వెళ్ళిన తర్వాత భోజనాలు చేసే వాళ్ళం .మధ్యాహ్నం రెండుకు ఇంటి నుంచి బయల్దేరే వాళ్ళం. రోజూ ఏదో ఒక కొత్తత ప్రదేశానికి తీసుకొని వెళ్లి చూపించేది అప్పుడుఆటోలు  లేవు ఉన్నా ప్రయాణం చేయటానికి ఖర్చు ఎక్కువ అని భయం అందుకని సిటీ బస్ లలోనో, లోకల్ ట్రెయిన్ లోనో ప్రయాణం .

కాపాలేశ్వర స్వామి గుడి ,పార్ధ సారధి కోవెల చూడటానికి చాలా ముచ్చటగా ఉండేవి జన రద్దీ లేదు .అందుకని దర్శనం హాయి అని పించేది .ఈ రెండు దేవాలయాలు చూడ వలసినవే అందరూ.మైలాపూర్ బీచ్ మెరీనా బీచ్ లు కూడా చూసి పిల్లలు బాగా సంబర పడ్డారు అదే మొదటి సారి వాళ్ళు సముద్రాన్ని చూడటం బీచ్ లో నడవటం సముద్ర కెరటాలలో కాళ్ళు పెట్టి అలలు మీదకొస్తే వెనక్కి వెళ్ళటం సగం ఒళ్ళు తడవటం పిల్లలకు సరదాగా ఉండేది .ఒక రోజు లైట్ హౌస్ కు వెళ్లాం .మరో రోజు మీనంబాకం ఎయిర్ పోర్ట్ కు వెళ్లాం .బతికిన కాలేజికి ఒకరోజు చచ్చిన కాలేజికి ఒక రోజు వెళ్లి చూశాం .

మా అక్కయ్యా వాళ్ళ ఇంటి దగ్గరే అంటే షినాయ్ నగర్ కు దగ్గరలో అన్నా నగర్ లో షిర్డీ  సాయి బాబా మందిరం చాలా ప్రసిద్ధి చెందింది .గురు వారం విపరీతమైన రద్దీ ఉండేది .’’స్వామి కేశ్వయ్యజీ’’ దీన్ని బాగా తీర్చి దిద్దారు .ఆయన అంటే అందరికి మహా భక్తీ గౌరవం .ఉయ్యూరు లో కే.సి.పి.వారు ఫాక్టరీ దగ్గర ఒక సాయి బాబా మందిరాన్ని  కట్టి స్వామి కేశవయ్య గారిచేత ‘’బాబా చిత్రపటాన్ని ‘’ఆవిష్కరింప జేశారు .చాలా ఏళ్ళు’’ బాబా ఫోటో ‘’మాత్రమె ఉండేది దానికే పూజాదికాలు. ఆ తర్వాత ‘’బాబా విగ్రహాన్ని’’ ప్రతిష్టించారు .ఉయ్యూరులో దర్శనీయ స్తలాల్లో సాయి మందిరం ఒకటి .ధుని కూడా ఏర్పాటయింది .ప్రత్యెక పూజారి ఉంటారు

మద్రాస్ లో ఉన్న కేశవయ్య గారి సాయి మందిరానికి సినిమా నటులు నటీమణులు గాయనీ గాయకులూ తరచు వస్తారు .బాబాను దర్శించాటమే కాక స్వామి కేశవయ్యజీ గారి ఆశీస్సులను పొంది వెడతారు .ముఖ్యం గా గాయిని ఎస్.జానకి ప్రతి గురు వారం వచ్చి భక్తీ గీతాలు శ్రావ్యం గా గానం చేస్తారు .అలాగే మిగిలిన వారూను .జానకి గారు అందర్నీ బాగా పలకరించి మాట్లాడుతారని మా అక్కయ్య చెప్పేది .అందరికి జానకి అంటే గొప్ప అభిమానం ట..మేము కూడా గురువారం చూసిన జ్ఞాపకం .ప్రసాదాలు బాగా పెడతారు .ఆడ వాళ్లకు బాబా కు పూజ చేసిన పూలు వెళ్ళేటప్పుడు ఇస్తారు .ఈ పధ్ధతి బాగా ఉందని పించింది. బాబా  అంటే ఈ ప్రాంతం లో గొప్ప భక్తీ ఉండేది .

బావ జీతమే ఆధారం కనుక మేము ఉయ్యూరు నుంచి బియ్యం రైల్వే పార్సెల్ గా పంపేవాళ్ళం అది ‘’సాల్ట్ కోటార్ స్టేషన్ ‘’కు చేరేవి. అక్కడి నుండి ఇంటికి తెచ్చుకొనే వారు .అట్లాగే వాళ్ళు వేసవిలో మద్రాస్ లో ఉంటె బేజ వాడ నుంచి మామిడి పండ్లను బుట్టల్లో పార్సెల్ చేసి పంపేవాళ్ళం .అవి ఒక వారానికి అందేవి .కనుక దొరకాయలనే ఎంపిక చేసి పంపాల్సి వచ్చేది .ఇవి పంపటం ఒక పెద్ద ప్రహసనం .మార్కెట్లో మంచి కాయ చూడాలి .బేరం ఆడాలి .బుట్టల్లో పార్సెల్ చేయించాలి. దాని పైన ఆడ్రెస్ రాయించాలి .రిక్షా లో బెజవాడ స్టేషన్ కు తీసుకొని వెళ్లి బుక్ చేయాలి ..ఒక పూట పని .మా చిన్నక్కయ్యా వాళ్ళు బీహార్ లో జమ్తారా లో ఉంటె వాళ్ళకూ మామిడి పళ్ళు పార్సెల్ గా పంపే వాళ్ళం .మా తమ్ముడికిపూనా కు  కూడా .బియ్యం అయితే ఇంటి దగ్గరే బస్తాల్లో నింపి అడ్రస్ రాసి ,డబల్ సంచీ వాడి పాలేరు తో గట్టిగా దగ్గర గా కుట్టించి బస్ లో బేజ వాడకు తీసుకొని వెళ్లి నేనే రైల్వే  పార్సెల్ చేయిన్చేవాడిని. ఇలా చేస్తున్నందుకు మాకేమీ ఇబ్బంది అని పించేది కాదు. మాతో బాటు వాళ్ళు కూడా హాయిగా అనుభ విస్తున్నారు కదా అని ఆనందించే వాళ్ళం .గేదెలు ఈనితే జున్ను పాలలో వస్త్రాన్ని తడిపి ఆరిన తర్వాతపోస్ట్ లో మా ఇద్దరక్కయ్యలకూ ,మోహన్ కూ పంపేవాడిని .

మద్రాస్ లో మేమున్నప్పుడు  రెండు రోజుల కోసారి దగ్గర మార్కెట్ కు వెళ్లి కూరలు నేనే కొని ఇంటికి తీసుకొచ్చి అక్కయ్యకు అంద జేసే వాడిని. ’’ఎండుకురా ‘’ అనేది .కొంత ఖర్చు కలిసొస్తుంది కదా అని మేమను కొనే వాళ్ళం .మా బావ గారి బాబాయి శంకరం గారున్దేవారు ఆయన భార్య సుందరమ్మ  గారు .వాళ్ళంటే వీళ్ళకూ వీళ్ళంటే వాళ్లకు వల్ల  మాలిన అభిమానం ప్రేమా .అందుకని తరచుగా కలుసుకొంటూ ఉండేవారు . .వాళ్ళింటికి కూడా మమల్ని తీసుకెళ్ళేది అక్కయ్య. ఆవిడ దుర్గాబాయి దేశ ముఖ్ సంస్త ‘’తెలుగు మహిళా సంస్థ ‘’లో పని చేసేది .భర్త గవర్న మెంట్ ఉద్యోగి .ఆవిడ ఏంతో ఆప్యాయాన్ని చూపేది .ఇప్పుడు ఇద్దరూ లేరు గతించారు అయినా వారి పిల్లలతో మా వాళ్ళ అను బంధం ఏమీ తగ్గలేదు వస్తూ పోతూ ఉంటారు .

మా బావ పెదనాన్న గారు గాడేపల్లి పెద సూర్య నారాయణ గారు .మా బావ తండ్రి గారి పేరు కూడా సూర్యనారాయణ గారే .పెద సూర్యనారాయణ గారిని ‘’రేడియో బావ గారు ‘’అనేవారు అప్పుడు మద్రాస్ నుండి ‘’బావ గారి కబుర్లు ‘’ప్రసారం అయ్యేవి .ఈయన బావ గారుగా చక్కని విషయాలు చెప్పేవారు .ఎన్నో విషయాలు చర్చించి జనాలకు బోధ చేసే వారు .చాలా బాగా ఉండేవి .రాకకీయాల దగ్గర్నుంచి లోకాభిరామాయణం దాకా వాళ్ళిద్దరూ స్ప్రుసించని విషయం ఉండేది కాదు. అప్పుడు ఆ కబుర్లు వినటం ఒక పెద్ద క్రేజు .ఆయనతో బాటు ప్రయాగ నరసింహ శాస్త్రి గారు ఉండే వారని జ్ఞాపకం .సూర్యం గారి మరణం తర్వాతా బావ గారి కబుర్లకు ప్రయాగ గారే ‘’పేటెంట్ ‘’అయ్యారు .

మా బావ తమ్ముడు కన్నయ్య అనే ఆతను సివిల్ ఇంజినీరు అడయార్ లో ఉండేవాడు .భార్య విజయవాడ అమ్మాయే .వీళ్ళ పెళ్ళికి పిలవటానికే మా అక్కయ్య ఉయ్యూరులో ఉంటె కాటూరి వెంకటేశ్వర రావు గారు దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు ఉయ్యూరు మా ఇంటికి వచ్చారు .‘’ఆ సీను’’ నాకు మరుపు రాని మధురాను భూతి .అడయార్ దగ్గర పానగల్ పార్కు చూశాం. సినిమా కు చెందిన హేమా హేమీలందరూ ఇక్కడికి వచ్చి కూర్చునే వారట .అక్కడే డాక్టర్ గాలి బాల సుందర రావు గారి ఇల్లు ,హాస్పటల్ ఉన్నాయి ఆయన సినీ నటుడు చంద్ర మోహన్ కు మామ గారు అయన కూతురు జలంధర చంద్ర మోహన్ భార్య .చంద్రమోహన్ మా ఉయ్యూరుకు దగ్గర పమిడి ముక్కల గ్రామం .ఇప్పటికీ అక్కడ ఇల్లు ఆస్తులు ఉన్నాయి అతని తమ్ముడు అక్కడే ఉంటాడు .’’గాలి గారు’’ ఆంద్ర పత్రిక వీక్లీ లో ఆరోగ్య విషయాల మీద సీరియల్ రాస్తూన్దేవారు .అది అందరికి బాగా నచ్చింది . .మా అక్కయ్య పిల్లలు ‘’కన్నా బాబాయి ‘’అని ఏంతో ఆప్యాయం గా పిలిచేవారు. అసలు పేరు ‘’గౌరాంగ మురళీధర్ ‘’కాని అందరూ  కన్న అనే పిలిచేవారు .ఆయనా భార్యా కూడా బంధు ప్రీతి బాగా ఉన్న వారు వాళ్ళ ఇంటికి వెడితే ఒకటి రెండు రోజులు ఉండే దాకా ఊరు కొనే వారు కారు .మంచిఅతిధ్యం ఇచ్చేవారు .మా అక్కయ్యను కన్నావొదినా,వొదినా ‘’ ‘’అని ఏంతో ఆప్యాయం గా పిలిచేవాడు. మా బావను ‘’అన్నాయ్ ‘’అని ప్రేమగా గౌరవం గా పిలిచేవాడు .ఆతను బాగానే సంపాదించే వాడు .పిల్లలూ బానే చదివి పైకొచ్చారు సెటిల్ అయ్యారు .వాళ్ళ పిల్లలకూ మా అక్కయ్య పిల్లలకూ ఇప్పటికీ  రాక పోకలున్నాయి .పెళ్ళీ ,పేరంటాలకు కలుస్తూనే ఉంటారు .కన్నాభార్య  ముందుగాను తర్వాత కొన్నేళ్ళకు కన్నా కూడా కను మూశారు ఆయన బొంబాయి లో సెటిల్ అయ్యాడు .అక్కడి నుండే మా వాళ్ళ ఇంట్లో వివాహాలకు వస్తూండేవాడు .ఇప్పుడు పిల్లలూ అంతే..బంధుత్వాలను ఎలా కాపాడుకోవాలో ఈ రెండు కుటుంబాలకు బాగా తెలుసు .ఈ తరం లో మళ్ళీ మా బావ మరది ఆనంద్ కూడా బంధుత్వాలను చక్కగా కాపాడుకొంటూ అందరి ఇళ్ళకూ వెడుతూ అందర్నీ తన ఇంటి కార్యాలకు పిలుస్తూ నిల బెట్టుకొంటున్నాడు .ఒక రకం గా ఈ తరం పిల్లకు ఆనంద్ ఒక ఆదర్శం గా ఉన్నాడని పిస్తుంది                ఒక ఇంట్లో సినీ నటుడు డాక్టర్ శివ రామ క్రిష్నయ్య వాలు కుర్చీలో కూర్చుని కనీ పించాడు లోకల్ ట్రెయిన్ లో నేను ఎక్కడికో వెళ్లి లోకల్ ట్రెయిన్ లో వస్తున్నప్పుడు    ..

నేను వీలైనప్పుడు సిటీ బస్ ఎక్కి అది యెంత దూరం వెడితే అంతదాకా వెళ్లి పట్నం అంతా చూస్తూ మళ్ళీ అదే బస్ లో తిరిగి ఇంటికి చేరే వాడిని .పిల్లల్ని పారిస్ బజార్ కు తీసుకొని వెళ్లాం. రిప్పన్ బిల్డింగ్ ,హై కోర్టు కూడా చూపించాం .రిప్పన్ బిల్డింగ్ దగ్గర పాత పుస్తకాల షాపులు విపరీతం గా ఉండేవి .అక్కడ దొరకని పుస్తకం ఉండేది కాదు అలాగే అక్కడ ఫాన్సీ వస్తువులు అమ్మే షాపులూ ఉండేవి .నేను వెళ్లి చూసి వచ్చే వాడిని మంచి పుస్తకాలు కొన్నాను .కాని గిట్టని  వాళ్ళేవరో పాత పుస్తకాల షాపులకు పాతికేళ్ళ నాడు తగల బెట్టారు అప్పటి నుంచీ వేరే చోటికి దీన్ని మార్చారు .

మద్రాస్ అంటే పూలు విపరీతం .అన్ని రకాల పూలు దొరుకు తాయి .అన్ని రకాల పూలతో కదంబం కట్టి అమ్ముతారు .సువాసన బాగా ఉంటుంది .వినాయక దేవాలయాలు మురుగన్ ఆలయాలు శివాలయాలు మద్రాస్ లో ఎక్కువ వీదికోటి ఉంటుంది .అరవవాళ్ళు సాంప్రదాయాన్ని బాగా పాటిస్తారని తెలిసింది .భక్తీ ఎక్కువ. సంగీతం మీద మోజూ ఎక్కువ .కచేరీలకు వెళ్ళటం చాలా సరదా .అక్కడ వినటం, తల బాగా ఊపటం వారికే చెల్లింది .విభూతి రేఖలు ప్రతి పెద్దాయన నోసటా కనీ పిస్తాయి .లుంగీ సరే .ఆడవారు సంప్రాదాయ చీర  లో పవిత్రత ఉట్టి పడేట్లుంటారు .వాళ్ళను చూడగానే ఏంతో గౌరవం కలుగుతుంది .

లేబర్ జనం దొడ్డికి వెళ్లి –కడుక్కోరనే అపవాదు ఉండేది నిజమో కాదో తెలీదు .అందుకే వాళ్ళు దగ్గర కొస్తే వాసన మాత్రం బాగా ఎక్కువగా  ఉండేది .కిళ్ళీ విపరీతం గా నమలటం అలవాటు .ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసే వాళ్ళు ..అది రోతగా ఉందేది .ఆ కాలం లో మద్రాస్ చాలా పరి శుభ్రం గా ఉండేది ఎక్కడా చెత్త ఉండేది కాదు .అందుకని మద్రాస్ అంటే గౌరవం గా,ఆదర్శం గా  ఉండేది .’’నీట్ నెస్’’’’ కు ప్రాధాన్యత ఉండేది .అలాగే సినిమాహాళ్ళ  ముందు బస్సులు  ఎక్కే టప్పుడు క్యూ పధ్ధతి పాటించటం మద్రాస్ నుండే అలవాటైంది .దీన్ని గురించి తెగ చెప్పుకొనే వాళ్ళం .ఇలా ఎన్నో అనుభవాలకు మా మద్రాస్ దర్శనం ఒక వేదిక అయింది సుమారు పది రోజులు ఉండి ఉయ్యూరు తిరిగి వచ్చాం .

సశేషం

శ్రీ హనుమద్ వ్రతం శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-12-13-ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.