నా దారి తీరు -54 ఏడవ తరగతి పరీక్షల పర్య వేక్షణ ప్రహసనం

నా దారి తీరు -54

ఏడవ తరగతి పరీక్షల పర్య వేక్షణ ప్రహసనం

‘’బ్రహ్మానంద రెడ్డి పాస్ ‘’ తో ఆరు ,నుంచి తొమ్మిది వరకు క్లాసులకు వార్షిక పరీక్షలలో పాస్ మార్కులక్కర్లేదు .అంటే పదో తరగతివరకు లాకులు ఎత్తేశారు .అందరూ ఆ క్లాసులు చదివితే పాస్ అయినట్లే లెక్క .కాని మళ్ళీ ఏమను కొన్నారో మధ్యలో ఒక ‘’హర్డిల్ ‘’పెట్టారు అదే ఏడవ తరగతికి జిల్లా కామన్ పరీక్ష అది పాస్ అయితేనే ఎనిమిదిలోకి చేరాలి .దీనితో అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు వచ్చాయి అంటే ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఉన్న స్కూళ్ళు ఆ పైవి హైస్కూళ్ళు .ఎనిమిది వనునది పది వరకు ఉన్నవి పదో తరగతిలో పబ్లిక్ పరీక్ష రాష్ట్రం మొత్తం ఒకే రోజుల్లో సెకండరీ బోర్డ్ ఆధ్వర్యం లో జరుగుతాయి .ఇది పాస్ అయితే కాలేజి లోకి ప్రవేశం .అందులో హైస్కూల్ నుండి ఇంటర్ వరకు ఉన్నవాటిని జూనియర్ కాలేజి లన్నారు మిగిలినవి డిగ్రీ కాలేజీలన్న మాట .ఇంటర్ కు మొదటి సంవత్సత్రం లో ఒక పరీక్ష రెండవ ఏడు ఫైనల్ పరీక్ష .ఈ రెండూ పాస్ అయితేనే ఇంటర్ గట్టెక్కి నట్లు .

అప్పర్ ప్రైమరీ లో ఏడవ తరగతి చదివిన వారికి దగ్గరున్న హైస్కూల్ల లో జిల్లా కామన్ పరీక్షలు మొదట్లో టెన్త్ పరీక్షలకు ముందే జరిగేవి తర్వాత మారింది టెన్త్ అయిన తర్వాత జరపటం మొదలైంది ఆరు ఎనిమిది తొమ్మిది క్లాసులకు వార్షిక పరీక్షలు ఏప్రిల్ రెండో వారం లో మొదలై ఏప్రిల్ ఇరవై రెండుకు పూర్తీ అయ్యేవి ఇర్వి మూడు లాస్ట్ వర్కింగ్ డే..సెలవల్లో పేపర్లు దిద్ది జూన్ మొదటి వారం లో పరీక్షా ఫలితాలను వెల్లడించాలి .ప్రతి నేలా ఒక టెస్ట్ ఉండేది .మూడు నెలల పరీక్షలు అర్ధ సంవత్సరం పరీక్షలు చివరికి వార్శికాలు ఇదీ పధ్ధతి వీటికి పరిగానింపు లేక పోయినా మేస్తర్లకు చాకిరీ మామూలే అన్నీ దిద్దాలి మార్కుల రిజిస్టర్ లో పోస్ట్ చేయాలి .టెస్ట్ పరీక్షలను క్వార్టర్లీ హాఫ్ యియర్లీల మార్కులను కూడి యాభై మార్కులకు ఏవరేజ్ చెయ్యాలి వార్షిక పరీక్షల మార్కులను యాభై మార్కులకు కుదించాలి ఇందాకటి ఏవరేజ్ కు దీన్నికలిపి మొత్తం వంద మార్కులకు రిజిస్టర్ లో పోస్ట్ చేయాలి ప్రతి నేలా ప్రోగ్రెస్ కార్డులివ్వాలి .మొదట్లో ‘’క్యుములేటివ్ రికార్డు ‘’అని ఒక బరాటి పుస్తకం పెట్టారు ఇందులో విద్యార్ధుల చదువు తో బాటు ఎక్స్ ట్రా కర్రిక్యులర్ యాక్తివితీలనూ నమోదు చేయాలి .వాళ్ళ ఆప్టిట్యూడ్ లను యాతి త్యుడ్ లను నమోదు చేయాలి తలిదండ్రుల గురించి వివరాలు షేక రించాలి విద్యార్ధి కేస్ హిస్టరీ తయారు చేయాలి .టెన్త్ పరీక్షా సర్టిఫికేట్ తో బాటు ఈ క్యుములేటివ్ రికార్డ్ ను కూడా విద్యార్ధులకు ఇవ్వాలి .చివరికి ఈ రికార్డ్ పని అంటా తూ తూ మంత్రమై పోయి వేగాతూ వాసనా పుట్టి వదిలేశారు .ఇప్పుడు అవి లేనే లేవు .ఇవన్నీ ఎందుకయ్యా అంటే పరీక్షలు ఎట్టేశాం కదా వీళ్ళ అభివృద్ధిని క్షున్నం గా పరిశీలించటానికి అని ప్రభుత్వం చెప్పేది మేమూ అలానే చేసే వాళ్ళం చివరికి అందరికి కను విప్పు కలిగి వదిలిన్చుకోన్నాం ప్రాణం హాయిగా ఉంది

హైస్కూల్ లో ఏడవతరగతి కామన్ పరీక్షలు జరిగేవి అని చెప్పాను కదా .దీనిని నిర్వహించటానికి హెడ్ మాస్టారు తో బాటు ఒక అసిస్టంట్ ఉండేవాడు ఆయన హైస్కూల్ లో సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయ్డుగా ఉండాలి ఆయనే పరీక్షల నిర్వహణ లో హెడ్ మాస్టారుకు సహాయం చేసే వాడు .పరీక్ష పేపర్లు హెడ్ మాస్టారి అధీనం లో ఉండేవి .ఆయనా ఈయనా కలిసి జాగ్రత్త గా నిర్వహించాలని ప్రభుత్వ భావన .పరీక్షలకోసం ఇన్విజి లెటర్స్ ను మండల విద్యాధికారి నియమించేవాడు .దీనికోసం హై స్కూల్ నుండి లిస్టు పంపే వారు దాని పై అందులో కావాల్సిన వారిని నియమించే వారు .ఇదీ ‘’లాలూచీ కుస్తీ ‘’లాంటిది కాస్త చూసి చూడ నట్లుండె వారిని నియమించే వారు .దీనికి డబ్బులు కూడా ముత్తేవని చెవులు కోరుక్కొనే వారు .ఒకరిద్దరు ఎలిమెంటరీ తీచర్లనూ వీరితో కలిపి నియమించేవారు వీరు వారి విద్యార్ధులు రాసే రూమ్ లకు వాచార్ గా ఉండరాదనే నియమం .

పరీక్షలు ప్రహసనం గా మారాయి .పరీక్ష పేపర్ల లీకులు ,వాచర్ల కుంభకోణాలు ,పరీక్ష హాలు లో గదుల్లో మాస్ కాపీయింగు ,ఏదో రకం గా పరీక్షలు జరపటమే అయింది .పకడ్బందీ గా కొన్నేళ్ళు మాత్రమె జరిగాయి .ఆ తర్వాత అంటా డొల్ల తనమే మిగిలింది .

ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ వాళ్ళు హైస్కూల్ లో రాయటం ఏమిటి ?మేము పరీక్షలు నిర్వహించాలేమా ?అనే ప్రశ్న వచ్చింది ఆ తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూళ్ళ లో కూడా సెంటర్ లు ఎర్పాతైనాయి ఇదంతా ఒత్తిడి వల్ల.నే .అప్పర్ ప్రిమరిలో డిపార్ట్ మెంట్ ఆఫీసర్ ను హైస్కూల్ మేస్తార్లలో ఒకర్ని వేసే వారు ఇదీ పైరవీలకు అతీతం కాకుండా పోయింది .ఒకటి రెండు సార్లు నన్ను ఆకునూరు అప్పర్ ప్రైమరీ స్కూల్ కు డిపార్ట్ మెంట్ ఆఫీసర్ గా వేశారు .నేను వెడితే అక్కడ కాపీలు కుదరవని అందరికి తెలిసిన విషయమే అప్పుడు కే.సుబ్బారావు అనే మాతో పాటు ఉయ్యూరు హైస్కూల్ లో డ్రిల్ మేష్టారు పని చేసిన కే.సుబ్బారావు బి ఇ డి పాసై అక్కడ హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నాడు .నేనంటే మహా అభిమానం ణా సంగతి తెలిసిన వాడు .కనుక ఏమాత్రం నాపై ఒత్తిడి తేలేదు .నాకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నాడు .ఎక్కడా కాపీ జరగా కుండా జాగ్రత్త గా పరీక్షలు నిర్వహించాము .ఆరు పరీక్షలు .హిందీ పరీక్ష చివర్లో ఉండేది .

ఈ ప్రహసనం ఇలా ఉంటె అరీక్షలు అయిన తర్వాత పేపర్ వాల్యుయేషన్ బందర్లో జరిగేది .ఇక్కడ ఏ స్కూల్ లో నైనా కాపీలకు స్కోప్ లేక పొతే స్పాట్ లో బాగానే మెయింటైన్ చేసి పాస్ మార్కులు వేయించుకొనే వారు .ఏ స్కూల్ యెంత శాతం పాస్ అయ్యారని జిల్లా లెవెల్ లో లెక్క ఉండేది అందుకని ఎవరి తంటాలు వాళ్ళు పడి ‘’పాస్ యే పరమా వధి ‘’గా జరిపిన పరీక్షలు ఇవి .ఉయ్యూరు హై స్కూల్ లో క్రిస్ద్నా రావు అనే సీనియర్ అసిస్టంట్ ఆ తర్వాత యాకమూరు నివాసి అయిన లెక్కల మేష్టారు పూర్ణ చంద్ర రావు ఈ లాలూచీ పరీక్షల్లో బాగా ఆరి తేరిన వారు ఇందులో సొమ్ము కూడా బానే వెనకేసుకోన్నారని అందరు చెవులు కొనుక్కొనే వారు నిజం దేవుడికేరుక .పరీక్షలు పూర్తీ అవగానేకొందరు పైరవీ గాళ్ళు జిల్లా నలు మూలల నుండీ  ఆయా స్కూల్ పిల్లల తలి దండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేసి బందరు వెళ్లి మార్కులు వేయించుకొని పాస్ అయ్యేట్లు చూసుకొనే వారు ఇది జగ మెరిగిన సత్యమే .ఇవన్నీ భరిస్తూ కళ్ళు మూసుకొంటూ గడిపే వాళ్ళం మార్కుల లిస్టు లను డి ఇ వొ ఆఫీస్ లోఉండేవి .పరీక్ష సెంటర్లో కాకపోతే స్పాట్ సెంటర్లలో పైరవీలు కుదరక పొతే దియివో ఆఫీస్ లో ముడుపులు చెల్లించి మార్కులని తారు మారు చేసి పాస్ అయ్యేట్లు చేసే వారు అందుకని స్కూల్ నుంచి అయిదు కాపీల నామినల్ రోల్స్ తయారు చేసి పంపాల్సి వచ్చేది . మార్కులను ఇందులో పోస్ట్ చేయించి స్కూళ్ళకు పంపే వాళ్ళు అందులో పాస్ అని ప్రొమోషన్ అని రాసే వారు అందులో స్కూల్ మార్కులను కూడా మేము పోస్ట్ చేసి ముందే పంపే వాళ్ళం .కామాన్ పరీక్షల్లో పాస్ కాక పొతే ఈ స్కూల్ మార్కులనూ లెక్క లోకి తీసుకొనే వారు .

హైస్కూల్ లో ఏడవ తరగతి పరీక్షలు జరిగితే చుట్టూ పక్కల అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్ధులు హైస్కూల్ విద్యార్ధులతో పాటు వచ్చి పరీక్ష రాసే వారు .హెడ్ మాస్టారు చీఫ్ .పేపర్ సెంటర్లు దగ్గర గా ఉన్న పెద్ద హైస్కూల్ హెడ్ మాస్టర్ల వద్ద ఉండేవి .ఆయనే చుట్టూ ప్రక్కల సెంటర్ల హెడ్ మాస్టర్లు వస్తే పేపర్లు ఇచ్చేవారు పరీక్షలు అవగానే మళ్ళీ ఇక్కడే ఆన్సర్ బండిల్ ను అందజేయాలి .పైకి ఇది అంతా బ్రహ్మాండం అని పిస్తుంది .కాని ఎక్కడ పడితే అక్కడ బొక్కలు .చీమ దూరే సందు ఉంటె ఏనుగులు లను కూడా దూరుస్తారు .ఇదీ క్లాస్ పరీక్షల్లో గేట్లు ఎత్తేసిన తర్వాత జరిగిన ఏడవ (ఎదవ )తరగతి పరీక్షా విధానం .రెండేళ్ళ దాకా ఈ ప్రహసనం ఇలానే  కొనసాగింది .ఇప్పుడు ఆ తరగతికి కామన్ పరీక్షలు ఎత్తేసింది ప్రభుత్వం ఇన్నేళ్ళకు కళ్ళు తెరచి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-12-13-ఉయ్యూరు

.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.