నాదయోగి కి ‘’ప్రమిద ‘’నివాళి –
శ్రీ బులుసు కామేశ్వర రావు గారు ‘’పట్టు వదలని విక్రమార్కుల ‘’జాబితో చేరిన మరొకరు .తన సాహితీ సర్వస్వం గా ‘’ప్రమిద ‘’ను త్రైమాసిక పత్రిక గా మొదలు పెట్టి ,మధ్యలో కొంత ఉద్యోగ శాఖా చంక్రమణం చేసి ,మళ్ళీ మాసపత్రిక గా తన అభిమాన’’ మానస పుత్రిక ‘’గా తెస్తానని చెప్పి మళ్ళీ మూడు నెలలకో సారి కనిపించేట్లు చేస్తూ ,సాహితీ పిపాసులను అలరిస్తూ హాస్యం కుమ్మరిస్తూ ,కదా సంపుటాలూ, కవితా సంపుటాలు అచ్చేస్తూ విరామం లేని సాహితీ సేవ చేస్తున్నారు .దాదాపు దశాబ్దం గా నాకు పరిచితులు . బందరు నుండినిన్న వచ్చిఘంటసాలగారికి (నాదయోగి )కు అంకితం చేసిన అక్టోబర్ –డిసెంబర్ ,మరియు పొట్టి శ్రీరాములుగారికి అంకితమిచ్చిన ,ఆగస్ట్- సెప్టెంబర్ ‘’ప్రమిద ‘’లు నా చేతిలో పెట్టారు . నాఅభిప్రాయం రాయమని కోరారు .నేను వారికి సరసభారతి ప్రచురించన నాలుగు పుస్తకాలు అందజేశాను .
ఘంట శాలను ‘’నాదయోగి ‘’గా సంభావించి చిట్టా వారు మంచి వ్యాసం రాశారు .అందులో ‘నాభి స్థానం నుండి నాదం వస్తేనే జనరంజకం అవుతుందని పాట్రాయని సీతారామ శాస్త్రిగారు ఘంటసాలకు చేసిన గురూప దేశం’’ గాయకు లందరికి వర్తిస్తుంది . ‘’మేస్టారి ప్రతి పాటా హిట్’’ అని సర్టిఫికేట్ ఇచ్చారు .’’సంగీతమే నా జీవితం .జీవిం చటానికే పాడుతున్నా .పాడటం కోసమే జీవిస్తున్నా ‘’అన్న బడే గులాం మన ఘంటసాలకు ఆదర్శం .త్యాగ రాజు పొందిన గౌరవమే ఈ గాన గంధర్వుడు పొందుతున్నాడని మురిశారు .ఆయన ఆత్మ సుస్వర సంగీత గానం ఉన్న ప్రతి చోటా ఉంటుందనడం మహా గొప్ప కితాబు .
వి.ఏ.కే రంగా రావు గారి ‘’రెండో ఆలాపన ‘’పుస్తకాన్ని ‘’అధిక చక్కని ఆలాపన ‘’గ బులుసు వారు సమీక్షించారు కాని అందులో రంగారావు గారి గురించే ఉంది కాని వారి ఆలాపన లేక పోవటం వెలితి .’’కీడు తలపెట్టక పోవటమే మడి .హితం కోరటమే ఆచారం .తోటివారికి తోడ్పడటమే తపస్సు .సమదృష్టి తో నడవటమే రుజు వర్తనం ‘’అన్న రంగా రావు గారి మాటలు అందరికి శిరోధార్యాలు .
మునిపల్లె రాజు గారి కల్లోల గౌతమి కద బాగా నడిచింది .క్లైమాక్స్ మనం ఊహించి నట్లే ఉంటుంది .ఈసంచిక కు హై లైట్ మలయ వాసిని ‘’విజయీ భవ .అమ్మ వారి తొమ్మిది అవతారాల ప్రాశస్త్యం ,విజయాన్నిచ్చే అపరాజితా దేవి వివరణ ,ఆ నాటి దేవతా విగ్రహాల కోలువే నేటి బొమ్మల కోలువవ్వటం ,రాయల కాలం లో క్రీడల ప్రోత్సాహం ,శివాజీ భవానీ పూజ ను వీరుల పూజగా నిర్వహించటం ,ఆయుధ పూజ ‘’ఉదాత్త క్రియా కలాపం ‘’అవటం మొదలైన ఎన్నో మనం మర్చిపోయిన విషయాలను తెలియ జెప్పిన తీరు బాగుంది .డాక్టర్ గారి ‘’పాల సంచీ ‘’కవిత భావ గర్భితం గా ఉంది ఈ సంచికకు మరో అలంకారం వేటూరి వారి గాంధీ స్మరణ .మహాత్ముడు ముట్నూరి వారికిచ్చిన అత్యున్నత గౌరవం ,తెలుగు వారి అమాయకత్వం తో బాటు’’ వెధవాయితనం’’ ,జాతి పిత మరణం పై ఆంద్ర ప్రభ ‘’భారతావనిలో గాడాంధకారం –స్వర్గధామం లో దివ్య ప్రభలు ‘’అనివిశిష్టం గా స్పందించిన తీరు, తాను నౌఖాళీ చితి మంటల్లో తిరుగుతున్నా కూడా బాపూ తాను పంపిన రోగార్తుల ఆరోగ్యంఎలా ఉందొ ననికృష్ణం రాజు గారికి జాబు రాసి కనుక్కోవటం చదివితే ‘’భూమి పై ఇలాంటి మానవుడు జీవిం చాడా ?’’అన్న అయిన్ స్టీన్ గుర్తుకొస్తాడు .వేటూరి మాత్రమె రాయగల వ్యాసం ఇది .విగ్రహ పంధా లో ‘’నమో సారూ ‘’అని నరేంద్ర మోడీ ని అనటం సరదాగా ఉంది పురాణం వారు వీరేశలింగం గారి జుట్టుముడి ,బీహార్ ‘’ కమ్మీ’’ లు కూడా పిలకలు పెంచటం’’ పైట’’ . అనే మాట’’ పైఠాన్’’మహా రాష్ట్రం నుంచి వచ్చిందని చెప్పిన కబుర్ల పురాణం హాయిగా ఉంది. పద్మా వతీ శ్రీనివాసం గార్లు శీలం వారి వేద విద్యా శిరోమణిత్వాన్ని సూక్ష్మం లో మోక్షం గా విశదీకరించారు .సీతారావమ్మ గారి ‘’కొత్త యుగ బాట ‘’బులుసు వారి డైరీ అదనపు ఆకర్షణలుగా నిలిచి సంచిక మహా ముచ్చటగా ఉంది .
గబ్బిట దుర్గా ప్రసాద్ -17-12-13-ఉయ్యూరు