శివ ముక్కోటి నాడు శివ కేశవ దర్శనం –మరియు స్వంత ఊర్ల సందర్శనం

శివ ముక్కోటి నాడు శివ కేశవ దర్శనం –మరియు స్వంత ఊర్ల సందర్శనం

మే నెలలో నాకు అకస్మాత్తుగా సుస్తీ చేసి నప్పుడు ,మా మనవడు ఛి భువన్ అంటే మా పెద్దబ్బాయి కొడుకు కు జబ్బు చేసినప్పుడు ,నెమ్మదిస్తే చిన్న తిరుపతికి వస్తామని మా శ్రీమతి మొక్కు కొండట .ఆ గండాలు గడిచిన తర్వాత చెప్పింది .అప్పటి నుంచీ అనుకొంటూనే ఉన్నాం ద్వారకా తిరుమల వాసుని దర్శనం చేసుకోవాలని .కాని కుదరక వాయిదాల మీద వాయిదాలు వేసుకొంటూ గడిపాం.ఏమైనా మార్గశిర మాసం లో మాధవ దర్శనం చేసుకు తీరాల్సిందే నని వారం ముందు అనుకొన్నాం .ధనుర్మాసం ప్రారంభానికి ముందే వెళ్లాలనీ భావించాం .మనం అనుకుంటే సరి పోతుందా ?భగవత్ అనుగ్రహమూ ఉండాలి కదా .ఇవాళ అంటే పద్దెనిమిదో తారీఖు బుధవారం న  కుదిరింది వెళ్ళ  టానికి .ఉదయమేతెల్లవారుఝామునే మూడుం బావుకు లేచి   ఇంట్లోపూజ చేసుకొని శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయానికి అయిదుపావుకు   వెళ్లాను .తిరుప్పావై చదివి ముకుందమాల పూర్తీ చేసి ,అక్కడ సహస్రనామార్చన పూజాదికాలు మంత్రపుష్ప తీర్ధ ప్రసాదాలు అయిన తర్వాతా సుందర కాండ పారాయణ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఏడుమ్బావయింది ..రామూ అనే మాకు తెలిసిన అతనితో చిన్నకారు ను ఎనిమిదింటికి రమ్మన్నాం .ఈ లోపు పూలు కోసుకొని టిఫిన్ తిని రెడీ అయ్యాం మాతో బాటు మా అబ్బాయి రమణ ,మా ఆవిడకు ఆప్తురాలు మాకు ఆడపడుచు లాంటి మల్లికాంబ గారు కూడా వచ్చారు .మల్లికాంబ గారింటికి వెళ్లి కారు ఎక్కిచ్చుకొని తొమ్మిదింటికి బయల్దేరాం .రాము కొత్త కారు కొన్నాడు దాన్ని మేమే మొదట ఎక్కాలని చిన్న తిరుపతికి దానిలోనే వెళ్లాలని చెప్పి తాను పాత కారు రిపేర్ లో ఉండటం వాళ్ళ తెలిసిన డ్రైవర్ ను పంపి మాకు అప్పగించాడు ..ఇదీ బాగుంది అతని నమ్మకం అతనిది .

తేలప్రోలు మీదుగా ఏలూర్ బై పాస్ ద్వారా భీమ డోలు మీదుగా శ్రీ ద్వారకా తిరుమల వెళ్ళే సరికి పదకొండున్నర అయింది .బుధ వారం కనుక భక్త సమ్మర్దం లేదు .ఫ్రీ దర్శనం వరుసగా రెండు సార్లు చేసుకోన్నాం .మా ఆవిడ మొక్కూ తీరింది అందరికి కనులారా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం లభించింది. మనసు హాయిగా ఉంది .అప్పుడు మల్లికాంబ గారు ఈ రోజు ‘’శివ ముక్కోటి ‘’అని కనుక ఇక్కడే పైన ఉన్న శివాలయం కు కూడా వెళ్లి దర్శనం చేసుకొందామని అన్నారు .మేము ఇదివరకు చాలా సార్లు చిన్న తిరుపతి వెళ్లాం కాని పైన ఉన్న శివాలయానికి ఎప్పుడూ వెళ్ళలేదు .ఆవిడ పుణ్యమా అని ‘’శివ ముక్కోటి ‘’నాడు శ్రీ భ్రమ రాంబా సమేత మల్లేశ్వర స్వామి ని  భక్తీ తో దర్శించాం .శివ ముక్కోటి అంటే శివుడికి ప్రీతికరమైన ఆరుద్రా నక్షత్రం మార్గశిర మాసం లో వచ్చిన రోజన్న మాట..ఆ రోజున మనం ముక్కోటి నాడు తెల్ల వారు ఝామున ఉత్తర ద్వార దర్శనం చేసుకొన్నట్లు శివాలయాలలో శివుడికి ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. అదీ దీని ప్రత్యేకత . అలాంటి పవిత్రమైన రోజున శ్రీ మహా శివుని దర్శనం నయనాన్దకరం ,పుణ్య ప్రదం .మేము గుడికి చేరే సరికి ఉత్తర ద్వార దర్శనం పూజా అయిపోయి స్వామి వార్లను లోపలి తీసుకొని వెళ్ళారు .ఆలయాన్ని ఇరవై  నిమిషాలు మూసి మళ్ళీ దర్శనం ఏర్పాటు చేశారు .అప్పుడు స్వామి వార్లను చూశాం జన్మ చరితార్ధమయిందని భావించాం .అందుకనే ‘’శివ ముక్కోటి ‘’రోజు శివ ,కేశవులను దర్శించి సంతృప్తి చెందాం .ఈ శివాలయం బాలాజీ గుడి కి కొంచెం పై ఎత్తుమీద కొండ పై ఉంది .కారులోనే వెళ్లాం .

This slideshow requires JavaScript.

మల్లేశ్వర స్వామి ఆలయం లో మల్లికాంబ గారు ఉయ్యూరు లో తయారు చేసి తీసుకొచ్చిన  దద్ధోజనం కడుపు నిండా డ్రైవర్ తో సహా ఆరగించాం  చాలా బాగా చేశారామే .అరటి పళ్ళు కూడా తిన్నాం . దర్శనాలు పూర్తీ అవగానే కిందికి దిగి ఆలయం ముందుకొచ్చి పదిరూపాయలకు పాతిక పెద్ద నిమ్మకాయలున్న కారీ బాగ్ లను రెండు కొన్నాం పది రూపాయలకు మాంచి రుచికరమైన దోర జామి పండ్లను కొన్నాం .మేమెప్పుడు వెళ్ళినా తిరుగు ప్రయాణం లో మా స్వంత అగ్రహారం అయిన రామా రావు గూడెం అగ్రహారం మీదుగా దెందులూరు వెళ్లి హై వే లోకి ప్రవేశిస్తాం .ఈ సారికూడా అలానే చేసి మల్లికాంబ గారికి మా అగ్రహారాన్ని చూపించాలను కొన్నాం .పంగిడి గూడెం చెరువు గూడెం ,చిన చిన్తాల పూడి దాటినా తర్వాత రామా రావు గూడెం ఆగ్రహారానికి చేరుకొన్నాం .

మా స్వంత అగ్రహార సందర్శనం

రామా రావు గూడెం అగ్రహారం అంటే మా తాత గారి స్వంత ఊరు .అదంతా గబ్బిట వారి అగ్రహారమే .భూములన్నీ మావే .మా చిన్నప్పుడు మా నాన్న గారితో అక్కడికి వెళ్ళే వాడిని .అక్కడ మాకు ఒక పెంకుటిల్లు ఉండేది మోట బావి కూడా ఉండేది చిత చెట్టు ,వేప చెట్ట్టు జ్ఞాపకమున్నాయి చుట్టూ తడి చేట్లున్దేవి మాకు బందీ జత ఎడ్లు ఉండేవి .ఉయ్యూరు నుండే నాన్న ఇక్కడ వ్యవసాయం చేయించేవారు డిందు లూరు స్టేషన్ లో దిగితే మా కోసం ఇక్కడి నుండి బందీ వచ్చేది దానిలో ఇక్కడికి చేరే వాళ్ళం ఒక వేల నేనొక్కడినే రావాల్సి వస్తే దెందులూరు నుండి నడిచి వచ్చేవాడిని మూడు కిలో మీటర్ల దూరం .మా బంధువు చండూరు సుబ్బారావు మా వ్యవహారాలూ చూసే వాడు ఆయన్ను నేను బావా అని ఆయన భార్యను అక్కయ్యా అనీ పిలిచే వాడిని ఇవన్నేఎ ఇక్కడి కొచ్చిన తర్వాత అన్నీ ఒక్క సారి జ్ఞాపకం వచ్చాయి ఎప్పుడొచ్చిన అలానే వస్తాయి మా పిల్లలందరికీ ఏఎ ఊరు చూపించే వాడిని ఇటు వచ్చినప్పుడల్లా .మా నాన్న టైం లోనే అగ్రహారం పొలాలన్నీ అమ్మేశాం .మాకు ఇక్కడ ఏమీ లేదు .కానీ మాది అన్న ప్రేమ మాత్రం పోలేదు అందుకే ఇటు వచ్చినప్పుడు చూస్తూ వెళ్ళటం .

http://youtu.be/UPaIfpsvDYs

http://youtu.be/iZ8_JAMnVpk

http://youtu.be/rmC1ezXdtQo

http://youtu.be/F7LAni7-Gvg

రామా రావు గూడెం లో పంచాయితీ ఆఫీస్ కు వెళ్లాం అక్కడ ఎవరూ లేరు తాళం వేసింది .గుమాస్తా బయట బెంచీ మీద కూర్చుని మేమేవరమో ఎందుకొచ్చామో అడిగాడు చెప్పాం వాళ్ళందరికీ మా నాన్న పేరు ఈ పొలాలన్నీ గబ్బిట వారివే నాన్న విషయం పూర్తిగా తెలిసి నట్లు చెప్పాడు .అప్పుడు నేను మా పొలాలను కౌలుకు చేసిన రొక్కం కోటయ్య గురించి అడిగాను ఆయన ఎప్పుడో చని పోయాడని అతని తమ్ముదికొడుకు ఇక్కడే ఉన్నాడని పిలుస్తానని చెప్పి పిలిపించాడు అతనూ మమ్మల్ని చూసి ఏంతో సంతోష పడ్డాడు .అప్పుడు ఏసోబు అనే డెబ్భై ఏళ్ళ ఆయనవచ్చాడు మాటల్లో ఆయన మా నాన్న గారి భూములలో ఒక ఎకరం తనకు అమ్మారని చెప్పాడు .వీళ్ళందరూ కలిసి పూర్వంఉన్న మా ఇల్లున్న చోటుకు తీసుకొని వెళ్ళారు ఇప్పుడక్కడ ఇల్లు లేదు అది ఎప్పుడో శిధిలమైంది అక్కడ ఆయిల్ పాం చెట్లు సాగు చేస్తున్నారు అప్పుడు ఉన్న బావి ని పూడ్చేశారు .చండూరు సుబ్బారావు గారు

This slideshow requires JavaScript.

ఏలూరు లో ఉండేవారు ఆయన చని పోయాడు భార్య కూడా ఈమధ్యనే చని పోయిందని అక్కడికి వచ్చిన కందుల వెంకన్న చెప్పాడు ఆవిడ పోతూ ఇక్కడ మాకు ఆంజనేయ స్వామి చిన్న గుడి ఉండేదని దానికి మాకు చెందినా ముప్ఫై సెంట్ల భూమి ఉందని అల్లుడు వర ప్రసాద్ కి చెప్పిందట .ఆతను ఈ మధ్యనే ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి మందిరాన్ని చక్కగా నిర్మించాడు .ఆతను ఏలూరు లో ఉంటాడట  మా నాన్న ను అందరూ ‘’ముత్తయ్య దొర గారు ‘’అని పిలిచే వారని ఇక్కడ వాళ్ళు జ్ఞాపకం చేసుకొన్నారు ఇవన్నీ ఉయ్యూరు వారి పొలాలే నని చెప్పారు .చండూరు బావ,అక్కయ్యా  మా నాన్న చనిపోయినప్పుడు వచ్చిన జ్ఞాపకం ఉంది .ఆతర్వాత చాలా కాలం ఉత్తరాలు రాస్తూందే వాడు .మాకు ఇంకా ఇక్కడ కొన్ని భూములు అన్యా క్రాన్తమై ఉన్నాయని కోర్టు లో కేసు వేద్దామని చాలా ఉత్తరాలు రాశాడు .నాకు దీని మీద ఇంటరెస్ట్ లేదని రాసే వాడిని .ఆ తర్వాత ఉత్తరాలు మానేశాడు .ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చినా దిగి ఇంత సేపు ఇక్కడ గడప లేదు. ఇవాళ అందరం ఏంతో ఆనందాన్ని అనుభవించాం .సంతృప్తి పొందాం మా స్వంత అగ్రహారం లో కొద్ది సేపైనా గడిపామని ఆనందించాం ఒక మధురాను భూతి ని మిగిల్చినఅనుభవం ఇది ఈ ఆనందానికి అవధులు లేవు .యెప్పుదొ దాదాపు అరవై ఏళ్ళ కిందట వెళ్లి అక్కడ ఉన్నాను మళ్ళీ ఇన్నేళ్ళకు ఈ నాడు మా స్వంత గడ్డపై తిరుగాడాను నాతొ బాటు మా కుటుంబమూ  .తనివి తీరా ఫోటోలు తీశాం .మల్లికాంబ గారు మరీ మరీ ఆనదించారు .అందరి దగ్గర వీడ్కోలు పొంది దెందులూరు మీదుగా మెయిన్ రోడ్ కు చేరి నూజివీడు రోడ్డు మీదుగా చినకడియం కొప్పాక ,అంకన్న గూడెం ,మీదుగా మా మామ గారి ఊరు వేల్పు చర్ల చేరుకొన్నాం   కొప్పాక అవతల పెద కడియం అనే ఊరిలోనే మా ఉయ్యూరు వీరమ్మ తల్లి జన్మించింది .ఉయ్యూరు లో పారుపూడి చింతయ్య ను వివాహం చేసుకొని ఉయ్యూరు వారి కోడలైంది .కొప్పాక వరకు ప.గో.జి.-వేల్పు చర్ల మాత్రం కృష్ణా జిల్లా .

మా శ్రీమతి జన్మ భూమి సందర్శనం

మా ఆవిడ ప్రభావతి తల్లి దండ్రులు అంటే మా మామ గారి అత్త గారి స్వగ్రామం వేల్పు చర్ల ఇక్కడ స్వంత పెంకుటిల్లు ఉంది మా బావ మరది ఆనంద్ పదేళ్ళ క్రితం వరకు ఇక్కడే ఉండి  ఏలూరు స్టేట్  బ్యాంకి ఉద్యోగం చేస్తూ  హైదరాబాద్ చేరాడు .బయల్దేరే టప్పుదే తన ఊరు చూడాలని మా ఆవిడ అన్నది .అందుకని వచ్చాం .ఆనంద్ పొలాలను చూసే ‘’నిఖామాను’’ చంద్రం తో రమణ ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నాడు .మేము మా మామ గారింటికి రాగానే చంద్రం వచ్చి మా వాడి దొడ్లో ఉన్న కొబ్బరి బొండాలు కొట్టి ఇచ్చాడు అందరం కమ్మగా తాగాం .కాయ చిన్నదే కాని బోలెడు నీళ్ళున్నాయి భలే రుచిగా, తీయగానూ ఉన్నాయి .నూరు వరహాలు పూలు కోసుకోంది. ప్రభావతి గోరింటాకు కూడా కోసుకొని ,విరజాజి అంట్లు తీసుకొన్నారు ప్రభా మల్లికాంబ గార్లు .ఇంట్లో అద్దె కున్న అమ్మాయి బాగా ఆదరించింది .ఫోటోలు తీసుకొన్నాము .

పక్క ఇల్లే పెద కర్ణం రామా రావు గారిది .మా  పెళ్లి వేల్పు చర్ల లోనే జరిగింది . .ఆ రామా రావు గారి ఇల్లే మా పెళ్ళికి విడిదిల్లు మా మామ గారికి మంచి మిత్రుడాయన భార్య కూడా చాలా మంచిది .బోలెడు పొలం గోడ్లూ,వ్యవసాయం ఉండేవి .ఇప్పుడు ఇద్దరూ లేరు .కొడుకు కోడలు ఇంట్లో ఉన్నారు ..కోడలు లక్ష్మి మా ఆవిడను ‘’అక్క య్యా అక్కయ్యా ‘’అంటూ ఆప్యాయం గా పిలిచింది ఇంటికి వెళ్లాం కమ్మని కాఫీ ఇచ్చింది .వీళ్ళకు జాకెట్లు పెట్టింది వాళ్ళ దొడ్లో కరి ఆవు ఉంది .దాని పేడ పాలేరుతో తెప్పించి కారీ బాగ్ లో ఉయ్యూరు కు తీసుకొనివెళ్ళ టానికి తయారు చేసింది .అక్కడి నుండి మా బావమరిది ఇంట్లో అద్దె కు ఉండి వ్యాపారం లో బాగా సంపాదించి అభి వృద్ధి లోకి వచ్చి ఇప్పటికీ కృతజ్ఞత చూపిస్తున్న ‘’సత్యం ‘’కు బై పాస్ సర్జరీ అయి కోలుకుంటున్నాడని తెలిసి వాళ్ళ స్వంత ఇంటికి కూడా వెళ్లాం .అందరికి మజా ఇచ్చాడు .ఆతను చాలా నీరసించి పోయాడు .అతనికి బెస్ట్ విషెస్ చెప్పి అతని వద్ద కాలీ ఫ్లవర్ పూలు రెండు తీసుకొని ,అందరికి గుడ్ బై చెప్పి ఇంటికి బయల్దేరాం ఆనంద్ మేము ఉయ్యూరు లో బయల్దేరిన ప్పటి నుంచి ఫోన్ లో కాంటాక్ట్ లో ఉన్నాడు ..మెయిన్ రోడ్ ఎక్కి వచ్చిన దారిలోనే జంక్షన్ చేరి ఆంజనేయ స్వామినిదర్శించి  ,తేలప్రోలు మీదుగా   ఉయ్యూరు కు సాయంత్రం ఆరున్నరకు చేరుకొన్నాం .మల్లికాంబ గారిని ఇంటి వద్ద దింపి మేము ఇంటికి చేరుకొన్నాం .ఇడ్లీ తెప్పించుకొని తిన్నాం భోజనం చేయాలని పించలేదు కారణం  మల్లికాంబ గారి పెరుగన్నం అంటే దద్ధోజనం కడుపు లో ‘’కాంక్రీట్ ‘’గా పడి ఉంది .ఆకలి వేయటం లేదు . ఇదీ ఈ ‘’శివ ముక్కోటి ‘’నాటి మా సఫల దైవ దర్శన ,జన్మ భూమి సందర్శన యాత్ర .

మీ –గబ్బిట దుర్గా పసాద్ – 18-12-13- ఉయ్యూరు        .. .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.