నా దారి తీరు -57 నా మొదటి ఉత్తర దేశ యాత్ర కాశీ యాత్ర

 

నా దారి తీరు -57

నా మొదటి ఉత్తర దేశ యాత్ర

కాశీ యాత్ర

మా బావ వివేకానందం గారు శని ఆదివారాల సెలవలలో లేకఇంకో సెలవ రోజు కూడా  కలిసి వచ్చినప్పుడు ,అంచే లంచేలు గా నన్నూ మా మేనల్లుడు అశోక్ ను యాత్రలకు తీసుకొని వెళ్ళాడు .మొదటి ట్రిప్ కాశీ ,ప్రయాగలు .ఏ ట్రెయిన్ ఎక్కాలో ఎప్పుడు దిగాలో అక్కడి నుంచి అనుకొన్న ప్రదేశానికి ఎలా వెళ్ళాలో ,అక్కడ ఏమేమి ముఖ్యమైనవి చూడాలో ఆయన ఇదివరకే వాళ్ళ అమ్మగారిని నాన్న గారిని  మా అక్కయ్యా వాళ్ళని తిప్పి చూపించాడు కనుక అన్నీ కొట్టిన పిండే .రిజర్వేషన్ లేదు ఖాళీ చూసి రైల్ పెట్టెలో కూర్చోవటమే .మొదటకాశీ వెళ్ళిన జ్ఞాపకం .అక్కడ స్టేషన్ లో దిగగానే వందలాది ‘’పండా’’లు మూగి మనల్ని ఏమీ ఆలోచించుకో నీకుండా మా దగ్గరకు రమ్మంటే మా దగ్గరకు రమ్మని ఒత్తిడి చేయటం మొదటి సారి చూశా .బావ కు హిందీ బాగా వచ్చు కనుక వీళ్ళని తప్పించుకొని ‘’జోషీ’’ అనే పండా వాళ్ళ మనుష్యులను గుర్తు పెట్టుకొని వాళ్ళతో జోషీ పండా దగ్గరికి రిక్షాలోనో జట్కా లోనో తీసుకొని వెళ్ళాడు అక్కడ ముందే రూమ్ తీసుకొన్నాడు కనుక సామాను అక్కడ పడేసి కాల కృత్యాలు తీర్చుకొన్న తర్వాత పండా ఏర్పాటు చేసిన మనిషి తో గంగా ఘాట్ కు వెళ్లాం .అక్కడ మంత్రం పూర్వకం గా స్నాన విధి పూర్తీ చేసుకోన్నాం చని పోయిన మా పెద్దలకు  హిరణ్య శ్రార్ధం పెట్టాను .బానే చేయించాడు .వీళ్ళకు తెలుగు బాగానే వచ్చు చక్కగా మాట్లాడుతారు .భోజనం కూడా జోషీ వాళ్ళ దగ్గరే ఏం పెట్టాడో ఏం తిన్నామో గుర్తు లేదు ఏంటో మంది ఆయన ఇంటి వద్దే కాశీ సమారాధన చేసుకొంటారు .అందరూ బ్రాహ్మలనే పిలిపించి చేయగలదు ఒక పూట ఇలాంటి భోజనం చేశామను కొంతా ..సాయంత్రం శ్రీ విశ్వేశ్వర దర్శనం హాయిగా చేసుకోన్నాం అన్నపూర్ణా విశాలాక్షీ అమ్మవార్ల దర్శనమూ బాగా జరిగింది .కాల భైరవ దర్శనం కూడా టాంగావెళ్లి చేశాం .తరువాత కాశీ విశ్వ విద్యాలయానికి తీసుకొని వెళ్ళాడు బావ అదంతా తిరిగి చూశాం .మా చిన్న తనం లో మదన మోహన మాలవ్యా గారు ఈ విద్యాలయానికి చేసిన సేవ ,నిర్మాణానికి ఆర్ధిక వనరుల కోసం పడిన ఇబ్బందులూ ,అనుకోకుండా ఒక ఆంగ్లేయుడికి కూలీ గా మారిన వైనం అన్నీ గుర్తుకొచ్చాయి ఆ మహాను భావుడి త్యాగాన్ని మనసారా స్మరించుకోన్నాను యూని ని వర్సిటి లో ఆయన విగ్రహానికి మనసారా నమస్కరించాను .

ఒక రోజు సారనాద్ యాత్ర ఉదయం చేశాం అక్కడి బౌద్ధ సంస్కృతిని ,అశోక ధర్మ చక్రాన్ని,మనజాతీయ చిహ్నమైన మూడు సింహాలను .ఆరామాలను చైత్యాలను తిరిగి కనులారా చూశాం .అప్పుడు టాంగాలే అన్నిటికీ .సాయంత్రం పడవ లో ఉత్తర కాశి(వ్యాస కాశి ) వెళ్లి కాశీ రాజు కోట ,లాల్ బహదూర్ శాస్త్రి గారిల్లు మొదలైన వన్నీ సందర్శించం వీటన్నిటి వివరాలూ బావ మాకు చెబుతూనే ఉన్నాడు అప్పుడు గంగ మీద వ్యాసకాశికి బ్రిడ్జి లేదు .పడవలో అందరితో బాటు అన్ని ఘాట్లు చూసి నట్లు జ్ఞాపకం అప్పుడు ఆంధ్రాశ్రమమూ లేదనుకొంటా .కరివేన వారి

సత్రమూ  ఈ మధ్య వచ్చిందే .మణికర్ణికా ఘాట్ ,హరిశ్చంద్ర నారద ఘాట్ లలో స్నానిన్చాం .శవాలను కాల్చటం సగం కాలిన వాటిని గంగాలోకి తోసెయ్యటం గురించి కధలు విన్నా ఇప్పుడు స్వయం గా చూశా.కాశీలో మరణం ముక్తి హేతువే .కాశీలోని ఇరుకు సందులు ,ఆవులు రాసుకొంటూ వెళ్ళటం దారంతా ఆవుపేడ తో ఉండటం ,జ్ఞాపకం ఉన్నాయి .మీగడ (మలాయి ),స్వీట్లు కొని తినిపించేవాడు .చిక్కని పాలు తాగే వాళ్ళం .అలాగే చిన్న కుండల్లో తోడూ బెట్టిన పెరుగు కొని తినే వాళ్ళం తియ్యగా కమ్మగా ఉండేది రాత్రికి పూరీ కూర తినే వాళ్ళం అక్కడ అప్పటికి దక్షిణాది హోటల్లు పెద్దగా లేవు. ఏదో ఒకటి ఉన్నట్లు గుర్తు అక్కడ ఇడ్లీ తిని కాఫీ తాగామని జ్ఞాపకం .జోషీ పండా తెలుగు వాడే నంటారు అప్పుడు ఉన్నాడు. తెలుగు మాట్లాడాడు .అన్నీ చేయిస్తాడు. చాలా మంది ఆయన చేతిలో ఉంటారు .పచ్చగా దబ్బ పండు ఛాయా తో నుదుట పొడుగాటి బొట్టు తో పంచె లాల్చీతో ఉండేవాడు భారీ పర్సనాలిటి తాంబూలం బుగ్గన ఎప్పుడూ ఉండేది .ఉత్తర దేశం లో ఇది మామూలే దేవాలయం లో పూజార్లు చొక్కాలతో ఉండటం మొదట ఇక్కడే చూసి ఆశ్చర్య పోయాను .మెడలో రుద్రాక్షమాలలు గంధం బొట్టు తో పండాలు అట్రాక్షన్ తో ఉంటారు .ఆడవారికి భక్తీ ఎక్కువ ..విశ్వేశ్వరాలయం లో రద్దీ ఉండేదే కాదు ఎన్ని సార్లైనా దర్శనం చేసుకోవచ్చు స్వయం గా గంగా జలం తెచ్చి అభిషేకించ వచ్చు అలానే చేసే వాళ్ళం .గంగా జలం రాగి చెంబుల్లో సీల్ వేయించి తీసుకొన్నాం

ప్రయాగ యాత్ర

కాశీ నుంచి అలహా బాద్ అనే ప్రయాగ కు ఉదయానికల్లా చేరేట్లు వెళ్లాం .అక్కడ హరి జగన్నాధ శాస్త్రి గారింటికి వెళ్లాం ఆయనా ఆంద్ర ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ స్తిర పడ్డ వాడే. మంచి తెలుగు మాట్లాడేవాడు .భార్య కూడా అందర్నీ పలకరించేది. అప్పటికి చిన్న ఇల్లు మాత్రమె ఉండేది ఆయన కుదిర్చిన పురోహితుడితో త్రివేణీ సంగమానికి వెళ్లాం .గంగా యమునా సరస్వతి నదుల సమ్మేళనం .మహాదానందమేసింది ఇప్పటి దాకా వినటమే .ఇప్పుడు ప్రత్యక్షం గా చూడటం ఏంటో సంతృప్తి నిచ్చింది భక్తీ తో త్రివేణీలకు నమస్కరించి స్నాన విధి మంత్రాలతో స్నానం చేశాం ఇక్కడ కూడా హిరణ్యం పెట్టాను .బాగా చేయించారు వీళ్ళ రేటు బావ మాట్లాడి ఉంచాడు కనుక ఆయన ఇవ్వ మన్నదే ఇచ్చాను కాశీ లోను ఇక్కడా కూడా .పడవ లో సాగర సంగమం కు వెళ్లి పడవను పట్టుకొని అక్కడ ఉన్న త్రాళ్ళ సహాయం తో స్నానం చేయాలి నల్లని నీరు యమునా వి తెల్లనివి గంగామ్మవి సరస్వతి అంతర్వాహిని .ఇక్కడా అప్పుడు.నీటి ప్రవాహం మహా వేగం గా ఉంది కాల్లు కిందనిలవలేదు .కొంతకంగారు కొంత ఆనందం కొంత ఆశ్చర్యం త్రివేణీ సంగమ మైంది నాకు  జనం తక్కువే .అన్నీ యధావిధిగా చేశారు .అక్కడినుండి కోట చూశాం.అందులో ప్రతిదీ మాకు దగ్గరుండి చెబుతూ చూపించాడు బావ .భరద్వాజ ఆశ్రమం ,నెహ్రూ గారి ఎస్టేట్ అన్నీ తిరిగి చూశాం .హోజనం హరి వారి ఇంట్లోనే  చేశామేమో ఆయనే టాం గా  మాట్లాడి ఇవన్నీ చూసే ఏర్పాటు చేశాడు అలహా బాద్ ను ఇక్కడ ‘’ఇలహా బాద్ ‘’అని హిందీలో రాస్తారు .అక్కడి నుంచి కాన్పూర్ కూడా వెళ్లాం కాన్పూర్ చెప్పులకు ప్రసిద్ధి ఊరికే రోడ్ల మీద తిరిగామని గుర్తు .

  గయా సందర్శనం

రాత్రి ట్రెయిన్ లో బయల్దేరి గయకు  ఉదయానికే చేరేట్లు వెళ్లాం అక్కడ కూడా పిత్రువిది చేశాను అశ్వత్థ వృక్షం గయ పాదాలు బాగున్నాయి ఇక్కడ జనం బాగానే ఉన్నారు .అన్నం అప్పటి కప్పుడు వండి శ్రార్ధం పెట్టించారు .విష్ణు మూర్తిని దర్షించాము .భోజనం చేసిన గుర్తు లేదు .మధ్యాహ్నం బయల్దేరి బుద్ధ గయ వెళ్లాం .దాదాపు పది కిలో మీటర్ల దూరం గాడ్పు బాగా కొట్టింది .మన లాగా ఇక్కడెక్కడా సోడాలు దొరకవు .దొరికిన చోట్ల మంచి నీళ్ళు తాగుతూ బుద్ధ గయ చేరాం  బుద్ధుడు  తపస్సు చేసిన చెట్టు అక్కడి ఆలయాలు బౌద్ధ సన్యాసులు బుద్ధ విగ్రహాలు చూడ ముచ్చట గా ఉన్నాయి. బుద్ధుని గురించి విన్నవీ చదివినవీ గుర్తుకొచ్చి బుద్ధ భగవానుడిని మనసారా స్మరించుకోన్నాను .బౌద్ధ సన్యాసులను చూడటం ఇదే మొదటి సారి .వాళ్ళ వస్త్ర ధారణ చదివే మంత్రాలు ధ్యానం వింత గొలిపాయి అక్కడ రాత్రికి బయల్దేరి మళ్ళీ ఉదయానికి జంతారా చేరుకొన్నాం .ఇదొక మినీ ట్రిప్ .ప్రశాంతం గా మొదటి సారిగా ఉత్తర దేశ పుణ్య క్షేత్ర సందర్శనం పూర్తయింది బావ చేదోడు వలన .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-13-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.