నా దారి తీరు -63 తమ్ముడికి శాటిలైట్

నా దారి తీరు -63

తమ్ముడికి శాటిలైట్

మా తమ్ముడు మోహన్ పెళ్లి అయిన కొత్తలో వాళ్ళ అత్త గారు మామ గారు ఉయ్యూరు వచ్చి ఇక్కడి పరిస్తితులు చూసి వెళ్ళారు గౌరవ మర్యాదలతో చూశాం ..అప్పటి నుంచి మోహన్ వీలైనప్పుడల్లా నాకు ఉత్తరాలు రాస్తూ కొత్త దంపతుల కార్య క్రమాలను ఎప్పటికప్పుడు తెలియ జేస్తూన్దేవాడు .వాళ్ళిద్దరూ తిరుపతి కి వెళ్ళినప్పుడు నాకు తెలియ జేస్తూ నన్ను కూడా తమ తో రమ్మనే వాడు .నేను అలానే అని’’ తోకాడించు కొంటు’’ వెళ్ళేవాడిని .మా అమ్మ వెళ్ళ మనేది .మా ఆవిడకు నేను ఒక్కడినే వాళ్ళ తో వెళ్ళటం ఇష్టం ఉండేది కాదు .అందుకని దెప్పుతూ ఉండేది .అయినా మా వాడు నన్నోక్కడినే రామ్మనటం ఏమిటి ?/అని నాకు అప్పుడు ఆలోచనే వచ్చేదికాదు .తమ్ముడు పిల్చాడు కదా నని’’ ఎగరేసుకొంటూ వెళ్ళటమే’’నాకు అప్పుడు చేతనైంది .ఒక సారి అలాగే వెళ్లి అక్కడ సత్రం లో ఉండి అన్నీ చూసి వచ్చాను .తిరుపతి వరకు నా ఖర్చే మిగిలినవి వాళ్ళే చూసే వాళ్ళు .శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా జరిగింది మంగా పురం శ్రీ కాల హస్తికి కూడా వెళ్లి దర్శించుకోన్నాం .ఇలా వాళ్ళు మాతో కలిసి పోవటానికి చేసే ప్రయత్నమే ఇది అని ఆలస్యం గా గ్రహించటం ణా మంద మతి తత్వానికి ప్రతీక సూక్ష్మ గ్రాహి కనుక మా ఆవిడ యిట్టె పసి గట్టింది .

ఇంకో సారి మోహన్ పెద్ద బావమరిది వెంకట్ వివాహం తిరుపతి లో జరిగితే శుభలేఖ పంపి రమ్మని చెబితే నాతొ బాటు మా అబ్బాయి రమణ ను కూడా తీసుకొని వెళ్లాను .కింది తిరుపతి లో దిగిన దగ్గర్నుంచి పైకి వెళ్ళే దాకా మా వాడి చేత ‘’అరవ చాకిరీ’’ చేయించారు అత్తమామలు బామ్మర్దులు ..వాళ్ళు చేయిన్చారన్న దానికంటే వీడే ఎక్కువ చేశాదేమో పూసుకొని ,పూనుకొని అని నాకు అని పించింది .ఎన్ని సార్లు సామాన్లు మోసు కొంటు పైకి కిందికి తిరిగాడో  నాకంటే మా రమణ బాగా గమనించాడు .అక్కడ రెండు మూడు రూములు బుక్ చేశారు మేమూ వాళ్ళతోనే ఉండేవాళ్ళం పెళ్లి బానే చేశారు పెళ్లి కూతురు వీళ్ళకు దగ్గరి బందుత్వమే .వెంకట్ నన్ను ‘’బావ గారు బావ గారు ‘’అంటూ ఏంతో గౌరవం గా పిలిచే వాడు .అతని తమ్ముడు వసంత్  కూడా అదే ధోరణిగా నాతో ప్రవర్తించేవాడు .వీళ్ళకు ఒక బెంగుళూరు దంపతులు బాగా క్లోజు .అలానే మోహన్ మామ గారి తమ్ముడు మునిసిపల్ కమిషనర్ గా పని చేసే వాడు హైదరాబాద్ విజయ నగర్ కాలనీ లో ఉండేవాడు ఆ బెంగుళూరు ఆయనా ,ఈయన ఈయన అన్న అందరు ఖాళీ ఉంటె పేకాట ఆడుతూ కాలక్షేపం చేసే వారు .మా వాడేమో అటూ ఇటూ ‘’ఆసులో గొట్టం లా తిరుగుతూ’’చిన్నా ,పెద్దా పనులు చేస్తూ ఎవర్ బిజీ గా ఉండేవాడు .కడుపు నిండా అన్నం తినే వాడో లేదో కంటి నిండా నిద్ర పోయాడో లేదో తెలీదు .అంతచాకిరీ చేస్తూనే ఉన్నాడు ..దైవ దర్శనం రెండు మూడు సార్లు చేసుకోన్నాం వీళ్ళ బంధువు ఒకతను అక్కడ ఆఫీసర్. అందుకని సాధ్యమైంది .ఏది ఏమైనా తిరుపతి స్వామి దర్శనాలు ఇలా జరుగుతున్నందుకు సంతృప్తి గా ఉండేది

పెళ్లి అవగానే వీళ్ళు ఆదోని వెళ్ళాలి .నేను ,మా అబ్బాయి మద్రాస్ వెళ్లాలని ప్లాన్ వేసుకోన్నాం .అందుకని అందరం రేణి గుంట రైల్వే స్టేషన్ కు వెళ్లాం అప్పుడు బొంబాయి నుంచి మద్రాస్ కు మెయిల్ రాత్రి రెండిన్తికో మూడింటికో ఉండేది .మేమందరం స్టేషన్ కు రాత్రి పదింటికే బస్ లో కార్ లో చేరు కొన్నాం . చేసేదేమీ లేక ట్రెయిన్లు వచ్చేదాకా ‘’‘’కేర్ ఆఫ్ ప్లాట్ ఫాం’’ ‘’గా చిన్నా ,పెద్ద కొత్త దంపతులతో సహా ప్లాట్ ఫారం మీదే గడిపాం .మేమిద్దరం ఉయ్యూరు నుంచి తిరుపతి కి పెళ్ళికి వచ్చినందుకు వాళ్ళ సంప్రదాయం ప్రకారం డబ్బు నాచేతి లో పెట్టారు ఇది మాకు కొత్త .మా ఇద్దరికీ వెంకట్ మద్రాస్ కు టికెట్లు తీశాడు .రమణ మొదటి సారి మద్రాస్ చూడ టానికి వస్తున్నాడు .ఇక్కడ స్టేషన్ లోను మా వాడు సామాన్లు మోయటం లో ‘’తన లాఘవం’’ బాగానే చూపాడు. కొత్త అల్లుడితో అంత చాకిరీ చేయిస్తున్నందుకు మా రమణ కు ‘’ఎక్కడో కాలుతోంది సహిన్చలేకుండా ఉన్నాడు .నాకు ఇదేమీ కొత్తగా అని పించలేదు .వాడికిది మామూలే అనుకొన్నాను .కానిరమణ బాధ పడుతూనే ఉన్నాడట .నాకెప్పుడో తర్వాతా మద్రాస్ నుంచి ఉయ్యూరు వచ్చిన తర్వాత తెలిసింది .

మద్రాస్ లో మా పెద్దక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్లాం .రమణ ను చూసి మేనల్లుడు మేన కోడళ్ళు ఆనందించారు .బాగా ఆదుకొన్నారు .రమణ ను తీసుకొని మా అక్కయ్య తో మద్రాస్ లో ముఖ్యమైన ప్రదేశాలు చూపించాను .వాడు ఏంతో సంతోషించాడు .మద్రాస్ వచ్చినందుకు, చూడనివి చూసి నందుకు .అక్కడ నాలుగైదు రోజు లున్నామేమో .అక్కడి నుంచి విజయ వాడ మీదు గా ఉయ్యూరు చేరాము

మా అమ్మ తో మర్నాడు మా రమణ ‘’మామ్మా !బాబాయిని వాళ్ళ ఇంట్లో పెళ్లి లో ఒక కూలీ వాడు గా చూసి ,చాకిరీ అంతా చేయిస్తుంటే నాకు ఏడుపొచ్చింది భరించలేక పోయాను ఏడుపొచ్చింది మామ్మా .కొత్త అల్లుడితో ఇట్లా ఎవరైనా చేయిస్తారా ?’’’’అని ఏడుస్తుండగా మా ఆవిడ చూసిందట .ఆవిడ చెబితేనే తరువాత నాకు తెలిసింది .మా అమ్మ మాత్రం ఏమీ అనలేదట .మా ఆవిడ మాత్రం నన్ను ‘’తమ్ముడు పిలవటం తమరు ఒళ్ళు తెలియ కుండా వెంట పడి తోకాడించు ఝాడింకొంటూ ది వెళ్ళటం  మీకు బానే ఉంటుందేమో కాని మాకు చాలా అసహ్యం గా ఉంది ‘’అని మళ్ళీ ఒక ఝాడింపు జాదించింది .’’నా స్కిన్ రఫ్ ‘’కనుక పప్పుడు పట్టించుకో లేదు .అందుకే నన్ను నేను తమ్ముడికి సాటి లైట్ అనుకొన్నాను హెడ్డింగ్ లో రాసి నట్లు .

వాడి పెళ్ళికాక ముందు మోహన్ ఒక టి రెండు సార్లు ఎక్కడికో టూర్ వెళ్లి నప్పుడు తిరిగి వస్తున్నప్పుడూ నన్ను బేజ వాడ స్టేషన్ లో కలవ మనే వాడు ‘’.ఊపుకుంటూ వెళ్ళే వాడిని’’ తెల్లారు ఝామున ట్రేయినయినా ,అర్ధ రాత్రి రైల్ అయినా అప్పుడు ఆ సమయానికి బస్సులు ఉండవు కనుక ముందే బయల్దేరి స్టేషన్ లోనే పడుకొని రైల్ వచ్చేదాకా ఉండి చూసి వచ్చే వాడిని .ఇంట్లో ఏదైనా టిఫిన్ కాని భోజనం కాని చేసి ఇస్తే స్టేషన్ లో వాడికి అంద జేసే వాడిని. ఒక సారి అలాగే వెడితే కొంత మంది స్నేహితులతో ట్రెయిన్ లో వెళ్తూరమ్మంటే వెళ్లాను పది మందికి మా వాళ్ళు పూరీ కూర అన్నం పెరుగూ చేయించి తీసుకొని రమ్మంటే అలానే తీసుకొని వెళ్లి ఇచ్చాను  అందులో ఒక అమ్మాయి కూడా ఉండటం నాకు ఆశ్చర్యం వేసింది .’’మా కొలీగ్ ‘’ అని నాకు పరిచయం చేశాడు .నమస్తే అంటే నమస్తే అనుకొన్నాం .ఆ అమ్మాయే తర్వాత మా వాడి జీవిత భాగస్వామిని సునీత అని అప్పుడు నాకు అనిపించక పోవటం నా కు లోకజ్ఞానం లేక పోవటానికి గొప్ప ఉదాహరణ .ఈ విషయం ఆ తర్వాత ఎప్పుడో మోహన్ చెప్పే దాకా ‘’నా బల్బు వెలగ లేదు ‘’అదీ నా శాటిలైట్  తత్త్వం ..

మరో సారి దివి సీమ వరద బాధితులను పరామర్శించి వాళ్లకు వీళ్ళిద్దరూ సేకరించిన వస్త్రాలు డబ్బు అంద జేసేందుకు అవని గడ్డ వెళ్లాం .ఇదీ అలాంటిదే నని ప్రభావతి భావన .ఇవి తప్పవు అని నేను అనుకొంటాను .ఇంకా ఒకటి రెండు సార్లు ఇలా వాళ్ళ తో వెళ్ళిన జ్ఞాపకం .

సశేషం

మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ – 27-12-13-.ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.