యాభైయేళ్ళ నాటి స్కూలు –మోపిదేవి -అప్పటి విద్యార్ధిని భారతి

యాభైయేళ్ళ నాటి స్కూలు –మోపిదేవి=అప్పటి విద్యార్ధిని భారతి

నేను మోపిదేవి జిల్లా పరిషద్ హైస్కూల్ లో సైన్స్ మేస్ట ర్ గా 1963-65 కాలం లో పని చేశాను .అది నేను మొదట పని చేసిన స్కూల్.ఆ స్కూల్ లో నే నా సర్వీస్ ప్రారంబమైంది .అప్పటి హెడ్ మాస్టర్ తూమాటి కోటేశ్వర రావుగారు .నేనంటే మహా ఆప్యాయం గా ఉండేవారు .ఆయన కూతురు ప్రభావతి ఎస్.ఎస్.ఎల్.సి .లోకి వచ్చినందువల్ల నన్ను ఉయ్యూరుకు బదిలీ ప్రయత్నిస్తుంటే ఆపేశారు  ఆ అమ్మాయి నా దగ్గర సైన్స్ చదువుకోవాలని ఆయన ఉద్దేశ్యం .అలానే ఆగి పోయాను .అప్పుడే మోపి దేవి దగ్గరున్న రావివారి పాలెం గ్రామం కు చెందిన కొల్లి భారతి అనే అమ్మాయి ఆస్కూల్ లో చదివింది ..కోటేశ్వర రావు గారమ్మాయి క్లాస్ మేటె.చాలా మంచి తెలివి గల అమ్మాయి వీళ్ళు స్కూల్ టాప్ క్లాస్ నా దగ్గర చదివారు .అక్కడి నుండి నేను వాళ్ళ క్లాస్ అపూర్తి అయిన తర్వాతా ఉయ్యూరు బదిలీ అయి వెళ్లాను .కాని మోపిదేవి నా జీవితం లో ఒక మధుర ఘట్టం.అక్కడ ఉండగానే మా పెళ్లి అవటం ,కాపురం పెదప్రోలు లో పెట్టటం మా పెద్దబ్బాయి అక్కడే కడుపు లో పడటం మా పెళ్లి అయిన కొన్ని నెలల్లోనే మా దంపతుల చేత శ్రీ లొల్లా బాల కోటేశ్వర రావు గారు అనే సెకండరి గ్రేడ్ మాస్టారు శ్రీ వల్లీ దేవా సేనా సమేత శ్రీ సుబ్రష్మన్యేశ్వర స్వామి వారల కల్యాణాన్ని కమనీయం గా చేయించటం ,అక్కడే గాన లోల ఘంటసాల  వారిని అక్కడి పూజారి గారింట్లో చూడటం ,కలిసి గంటకు పైగా మాట్లాడటం ,ఆక్విదేక్ట్ చూడటం ,అవని గడ్డ సంతా ,కృష్ణానది వరదలు మరపు కు రాని మధురాను భావాలు .

ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకు భారతి బందరు మునిసిపల్ హై స్కూల్ లో సైన్స్ టీచర్ గా పని చేస్తూ స్పాట్ వాల్యుయేషన్ లో కనిపించి గుర్తు పట్టి నన్ను పకరించింది .అప్పటి నుంచి తరచూ స్పాట్ లో కలిసి మాట్లాడేది .అప్పుడు యెంత వినయం గా ఉండేదో అంత వినయం గా ఇప్పుడూ ఉంది ‘’మా సైన్స్ మేష్టారు ‘’అని అందరికి గొప్పగా పరిచయం చేసేది ..అలా మళ్ళీ మా గురుశిష్య బంధం కోన సాగింది .ఆమె బందరు లో అదే స్కూల్ లో ప్రదానోపాధ్యాయురాలైంది .అప్పుడు కృష్ణా జిల్లా హెడ్ మాస్టర్ అసోసియేషన్ లో చేరి క్రమంగా ఎదిగింది ఆమెను అధ్యక్షురాలిని ఏక గ్రీవం గా చేశాము .సమర్ధం గా పని చేసింది ఆమె రిటైర్ అయినప్పుడు మమ్మలనందరినీ ఆహ్వానించింది ,ఘన సన్మానం పొందింది .DSCF4884 DSCF4885

అప్పటి నుండి  ఆదినారాయణ  రామం  గారు, ఉమా మహేశ్వర రావు ,విశ్వం, రాజు ,రాజేంద్ర ప్రసాద్ సుగుణ ,విజయ లక్ష్మి ,శర్మ మొదలైన రిటైరేడ్ హెడ్ మాస్టర్ లతో మేము ఏపని చేసినా మాతో సహకరించింది భారతి .మమ్మల్ని అందర్నీ తరచూ సమావేశం అయెట్లు చేసిన వారు తెన్నేరు వాసి దేవి నేని మధుసూదన రావు గారు .వారి ఇంట్లో  తరచు కలిసి విద్యాభి వృద్ధి పై ఆలోచించే వారం .

.ఎప్పుడు ఎక్కడ కనీ పించినా అదే మర్యాద అదే మన్నన అదే పలకరింపు .పాపం ఆమె భర్త మరణించాడు పదేళ్ళ క్రితం. ఆత్మ స్తైర్యం కోల్పోకుండా అమ్మాయిని అబ్బాయిని పెంచి వారి ఆలనా పాలనా చూసి ,చదివించి ప్రయోజకుల్ని చేసింది .దైవ భక్తీ తో ,ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధన్యమవుతోంది .మా గురు శిష్య బంధం పెరిగిందే కానీ తగ్గలేదు దీనికి ఆదినారాయణ ప్రోద్బలం ఏంతో ఉంది మమ్మల్ని అందర్నీ ఫోన్ చేసి పిలుస్తూ కలుపుతూ అను బంధాన్ని పెంచుతున్నాడు

నాలుగు రోజుల క్రితం సాయంత్రం భారతి ఫోన్ చేసి ‘’మా స్టారూ !మా అమ్మాయికి కూతురు పుట్టి నన్ను అమ్మమ్మ ను చేసింది పురిటికి ఇంగ్లాండ్ వెళ్లాను .ఇప్పుడు తల్లీ పిల్లను తీసుకొని ఇండియా వచ్చాను .మా మనవరాలి అన్నప్రాసన మోపిదేవి శివాలయం లో 28-12-13-శనివారం ఏర్పాటు చేస్తున్నాం .మీరు నాకు మొదటి గురువు గారు .మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను .’’అని చెప్పింది తప్పక  వస్తానని చెప్పాను .

ఇవాళ ఉదయం బయల్దేరి పదింటికి మోపిదేవి చేరి శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామిని దర్శించి ,శివాలయమూ సందర్శించి ,హైస్కూల్ కు వెళ్లాను. యాభై ఏళ్ళ క్రితం పని చేసిన స్కూలు .ఏంతో త్రిల్ అని పించింది ఫోటోలు తీసుకొన్నాను అక్కడి నుండి తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ  మండపానికి వెళ్లాను .అక్కడ భారతి ఆప్యాయం గా పలకరించి టిఫిన్ తిని పించింది .ఆ తర్వాత ఆదినారాయణ, విశ్వం, శర్మ గారు ఉమా మహేశ్వర రావు సుగుణ కుమారి రాజేంద్ర ప్రసాద్ దంపతులు మొదలైన వారందరూ వచ్చారు కాసేపు కబుర్లు చెప్పుకొని చిన్నారిని అందరం కలిసి ఆశీర్వదిన్చాము .భారతికి’’ సిద్ధ యోగి పుంగవులు ,శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం’’ రెండు పుస్తకాలు బహూకరించాను .మేమంతా కలిసి వచ్చి నందుకు అమితానందాన్ని పొందింది భారతి .ఆ తర్వాత మంచి విందు ఇచ్చింది అందరికి కానుక లిచ్చి వీడ్కోలు చెప్పింది .

పింగళి లక్ష్మీ కాంతం గారు పెరిగిన చిట్టూర్పు

శ్రీ గూడూరి నమశ్శివాయ గారు రాసిన పింగళి లక్ష్మీ కాంతం గారి జీవిత చరిత్రను ఆ మధ్య చదివాను అందులో ఆయన అర్తమూరు లో జన్మించి ఇక్కడ చల్ల పల్లి దగ్గరున్న చిట్టూర్పు లో పెరిగారని తెలుసు కొన్నాను మా సరసభారతి కార్య దర్శి శివ లక్ష్మి  ఆ ఊరే. వాళ్ళ తలిదండ్రులు అక్కడే ఉన్నారు .ఈవిడ వారానికోసారి వెళ్లి వస్తుంది .ఒక సారి ఆమెతో మీ చిట్టూర్పు లో పింగళి వారు పెరిగారు తెలుసా అని అడిగాను తెలుసు అంది .కాని అక్కడి వారెవరికి తెలీదు అన్నది .నేను సరసభారతి తరఫున అక్కడ ఒక కార్య క్రమం నిర్వహించి ఆ తరానికి ఈ తరానికి పింగళివారిని ఒక సారి జ్ఞాపకం చేద్దాం .ఊరి వారి సహకారమేలా ఉంటుందో తెలీదు అన్నాను ఆమె మూడు రోజుల క్రితం ఆ ఊరు వెళ్లి అక్కడ వారికి మేము అనుకొన్న విషయం చెప్పి వారిలో ఉత్సాహం కల్పించింది వచ్చి నాకు చెప్పింది నేను ఈ కార్య క్రామాన్ని కృష్ణా జిల్లా రచయితల సంఘం చ తో కలిపి చేస్తే బాగుంటుందని పించి గుత్తికొండ సుబ్బారావు పూర్ణ చంద్ గార్లకు చెప్పాను వారు ఏంతో సంతోషించారు .బుద్ధ ప్రసాద్ గారిని అడిగితె వస్తానన్నారు పింగళి వారి మీద రిసెర్చ్ చేసిన డాక్టర్పింగళి  వెంకట కృష్ణా రావు గారికి చెప్పి ఆహ్వానిస్తే తప్పక వస్తానన్నారు .మాది రాజు రామ లింగేశ్వర రావు గారు సరే నన్నారు ఊళ్ళో వారు కొందరు ఆయన గురించి తెలిసిన వారిని ఆహ్వానించాం .ఒకే  అన్నారు .లక్ష్మీ కాంతం గారు 1894జన వరి 10న జన్మించి ,జనవరి 10 తేదీ 1972లో మరణించారు .అంటే వారి జయంతి వర్ధంతి ఒకే రోజు అంటే జనవరి పది అయింది తామాషాగా. అందుకని వచ్చే జనవరి పది న వారి పై సభను చిట్టూర్పు లో జరపాలని అందరం నిర్ణయించాం .కాని బుద్ధ ప్రసాద్ గారు అ రోజు న విశాఖ లో ప్రోగ్రాం ఉందని ఈ ఉదయం చెప్పి పన్నెండు కు మారిస్తే వస్తామన్నారు సరే అన్నాం .

చిట్టూర్పు ప్రముఖులను  కలవటం

మోపిదేవి లో బారతి ఇచ్చిన విందు తీసుకొన్న తర్వాత నేను ,శర్మగారు ఉమా మహేశ్వర రావు విశ్వం కారు లో చిట్టూర్పు చేరాం  అక్కడ ఉన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ గోపాల రావు ఇంటికి వెళ్లి విషయం చెప్పాం ఆయన సంతోషం గా తనకు తెలిసిన వారందరికీ చెప్పి అందర్నీ శివాలయం దగ్గర కలిసేట్లు చేశాడు

.అక్కడే సభ చేద్దామని ముందే అనుకొన్నాం కనుక ఎలా ఉందొ చూశాం .సరి పోతుంది .ఇలా సభ ఇక్కడ పెట్టటం అందరికి చాలా సంతోషం గా ఉంది .స్తానిక ఏర్పాట్లను వారు చేస్తామని నిలబడి పని చేస్తామని  కుర్చీలు ,మైకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు .నేను మైక్ లో ఆ రోజు అందరికి చెప్పించమని చెబితే అలానే చేస్తామన్నారు .ఆహ్వాన పత్రాలు తయారు చేసి పంపిస్తామని వాటిని పంచమని సర్పంచ్ గారిని కూడా ఆహ్వానిద్దామని చెప్పాను. గొప్ప మంచి కార్యక్రమం ఇక్క డ చేస్తున్నందుకు గ్రా మస్తులకు సంతృప్తి ,సంతోషం కలిగి ముఖాలు వెలిగాయి .అక్కడి నుండి నేను ఉయ్యూరు వచ్చేసరికి మధ్యాహ్నం మూడు అయింది శివ లక్ష్మి కి ఫోన్ చేసి విషయం చెప్పాను .అందరి సహా కారం తో లక్ష్మీ కాంతం గారి 120వ జయంతి 42 వ వర్ధంతి ని చిట్టూర్పు లో12-1-2014 ఆదివారం మధ్యాహ్న మూడు గంటలకు శివాలయం లో నిర్వహిస్తున్నాముఅని తెలియ జేయటానికి ఆనందం గా ఉంది .

ఈ విధం గా ఈ రోజు  రెండు సంతోషకరమైన కార్య క్రమాలలో పాల్గొన్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 28-12-13-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.