నా దారి తీరు -67

  నా దారి తీరు -67

పెద్ద మేనల్లుడి ప్రేమ పెళ్లి

మా పెద్ద మేనల్లుడు అశోక్ .మా అక్కయ్యా వాళ్ళు వాడి ఇంటర్ డిగ్రీ చదువు కోసం మా చిన్న మేనల్లుడు శాస్త్రి మేనకోడలు పద్మ ల చదువుకోసం బందర్లో బచ్చు పేట లోఒక  డాబా ఇంట్లో కాపురం పెట్టారు మా బావ ఇంకా ఇతర రాష్ట్రాల్లోనే పని చేస్తున్నారు నెలకో రెండు నెలలకో ఒక సారి వచ్చి వెళ్ళేవాడు .మా మిత్రులు రాజనాల శివరామ కృష్ణ మూర్తి గారు అక్కడ హిందూ హైస్కూల్ లో లెక్కల మేష్టారు ఆయన్ను షార్ట్ కట్ గా ఆర్ ఎస్.కే మూర్తి అంటారు .మంచి కధకులు .గొప్ప లెక్కల టీచర్ .ప్రఖ్యాత జర్నలిస్ట్ .ఆర్ ఎస్ ఎస్ జనసంఘ నాయకులు .వీటికి మించి సహాయ కారి స్నేహశీలి మ కుటుంబ స్నేహితులు నాకు గురు తుల్యులు .వెంకయ్య నాయుడు ఆయన చేత తీర్చి దిడ్డ బడ్డాడు .ఎమెర్జెన్సి లో మేష్టారు ఏంతో ధైర్యం గా ఎదిరించి సాందీపని అనే పత్రికను నడిపారు అందులో నా కవితలు పడేవి వెంకయ్య నాయుడు తరచూ వీరిని కలుస్తూన్దేవారు .అలాగే కొమర గిరి కృష్ణ మోహన రావు కూడా వీరిద్ద్దరికి గాడ్ ఫాదర్ .మూర్తి గారు .ఆయన దగ్గర మా మేనల్లుల్లు లెక్కలకు ట్యూషన్ చదివారు .ఆయన ఇంటర్ కూ లెక్కలు ట్యూషన్ చెప్పేవారు .ఇంగ్లీష్ లో మహా పండితులు కూడా ..జాగృతి వార పత్రికలో సినీ సమీక్షలు చేసేవారు అవి ఏంతో పకడ్బందీ గా ,ఏ ఇజమూ లేకుండా నిష్పాక్షికం గా సమీక్షించే వారు .అవి నా లాంటి వాళ్లకు వేద వాక్కుల్లా అని పించేవి .ఆయన పిల్లలతో చాలా చనువుగా ఉండేవారు తెల్ల పంచె ,హాఫ్ షర్ట్ తో స్కూల్ కు వెళ్ళేవారు పొట్టి వారైనా మహా గట్టి వారు ..అలాంటి ఆయన దగ్గర మా మేనల్లుల్లు ప్రైవేట్ చదవటం అదృష్టమే .మా అన్నయ్య గారబ్బాయి రామ నాద్ కూడా  బందర్లో ఇంటర్ చదివటానికి అక్కయ్యా వాళ్ళింట్లో ఉండేవాడు వాడు మూర్తి గారి  స్తూడెంటే .

అశోక్ డిగ్రీ ని బందరు హిందూ కాలేజి లో పూర్తీ చేశాడు .అప్పుడే కొత్తగా గుంటూర్ దగ్గర నమ్బూర్ లో నాగార్జున యూని వర్సిటి ఏర్పడింది .అశోక్ అక్కడ ఏం ఎస్ సి లో చేరాడు . .అశోక్ గుంటూర్ లో హాస్టల్ లో ఉండేవాడు .మా బావ రెక్కల కష్టం మీదే పిల్లల్ని ఏ లోపంలేకుండా చదువు చెప్పించి వాళ్ళ అవసారాలను అన్నిటిని తీర్చేవాడు .ఆయన శ్రద్ధ ,కార్య దక్షత మెచ్చుకోదగినవి పిల్లలకు ఏ ఇబ్బందీ రాకుండా చూసే వాడు .అశోక్ బందర్లో చదువుతున్నప్పుడే నటరాజ్ అనే స్నేహితుడు ఉండేవాడు తరచూ వీళ్ళ ఇంటికి వస్తూండేవాడు .వాళ్ళ ఫామిలి ప్రఖ్యాత ఇంజీ నీర్ డాక్టర్ కే.ఎల్ రావు గారి బంధువులు అంటే నియోగులు .అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాడు .నటరాజ్ అక్క సంధ్య కు అశోక్ లెక్కలు చెప్పి పడవ తరగతి పాస్ చేయించాడని విన్నాను .ఇలా ఆ అమ్మాయితో పరిచయం క్రామ గా ప్రేమ గా మారింది .అశోక్ గుంటూర్ లో చదివి నప్పుడు   వీళ్ళ  ప్రేమాయాణం బాగా పెరిగింది .ఈ విషయాలేమీ అక్కయ్యా వాళ్లకు తెలియదు .ఏదో స్నేహితులు కదా అను కొన్నారు కాని విషయం ఇంత ముడుర్తుందని వాళ్లకు తెలియదు .నాకూ ఆ తర్వాతెప్పుడో వాళ్ళు చెప్పితేనే తెలిసింది .

ఇలా ఉండగా మా మేనల్లుడు అశోక్ నటరాజ్ వాళ్ళ అమ్మా నాన్న ల ప్రోద్బలం తో సంధ్య ను తిరుపతి లో దైవ సాక్షిగా వివాహం చేసుకొన్నాడు .ఈ విషయం ఆ తర్వాత మా బావ వాళ్లకు చెప్పాడు .వాళ్ళు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు .’’నీఎకూ మాకూ సంబంధం లేదు నువ్వు మా ఇంటికి రానక్కర లేదు ఇవాల్టితో నీకూ మాకూ కటీఫ్ ‘’అని తేల్చి చెప్పారు .దానితో కొత్త దంపతులు హతాశులై పోయారు .ఏం చెయ్యాలో వాళ్లకు తోచక నాకు తెలియ జేశాడు అశోక్ .నేను ఏమి చేయాలో అర్ధం కాదు .అమ్మకు చెప్పాను .అమ్మా ఫైర్ అయింది .కాని వాడేమీ వేరే కులం పిల్లనుపెల్లాడలేదు శాఖా భేదమే  చేసుకొన్నాడు దీనికి అంతబాధ పడాల్సింది లేదు అని పించింది వాడేమీ వేరై పోతానన లేదు అక్సేప్ట్ చేయమన్నాడు అంతే .బందరు వెళ్లి అక్కయ్యా బావ లకు నచ్చ చెప్పటానికి ప్రయత్నించాను .కాని వాళ్ళు ఏ మాత్రమూ ఒప్పు కోలేదు .అసలు వాడితో తమకే సంబంధం లేదని మొరాయించారు .అక్కయ్య దుఖానికి ,బాధ కూ అంటే లేకుండా పోయింది ఆవిడను ఒడార్చతాం నా  వల్ల  కాలేదు .బతిమాలాడాను ,బామాలాడాను .కాని ససేమిరా అన్నారు .యెంత చెప్పినా వినలేదు ,విని పించుకో లేదు .నాప్రయత్నా లోపం ఏమీ లేదు వీళ్ళను కలపటానికి  శాయ శక్తులా ప్రయత్నించి ,కుదరక తిరిగి ఉయ్యూరు వచ్చేశాను .

అశోక్ ,మా ఇంట్లో చదువుకొన్నాడు నేనంటే మహా గౌరవం ఉన్నవాడు కనుక ఆ చనువుతో వాడిని చీవాట్లు వేశాను తిట్టాను ,రెచ్చి పోయాను వాడు ఏడ్చాడు తప్పు ఒప్పుకొన్నాడు తలి దండ్రులకు తెలియ కుండా పెళ్లి చేసుకోవటం తప్పు అన్నాడు నట రాజ్ ఉయ్యూరు వస్తే వాడినీ ఏకి పారిశాను వాడు కిమిన్నాస్తి గా ఉండి పోయాడు ఇంతా నాటకం ఎందుకు ఆడారు? /మా బావా వాళ్లకు తెలియ జేస్తే వాళ్ళు వచ్చి అక్షింతలు వేసేవారు కదా అని ఎడా పెడా వాయించాను. వంచిన తల పైకెత్త లేదు ఆవా బామ్మర్ది .కాని లోపల .అయ్యో మేనల్లుడికి సాయం చేయ లేక పోయాననే బాధా ఉంది నాలో .అప్పుడు అమ్మ తో ఆలోచించి అశోక్ ను సంధ్య ను ఒక రోజు మా ఇంటికి ఉయ్యూరు రమ్మని చెప్పాను .వాళ్ళిద్దరూ ఏంతో సంతోషించి నేను చెప్పిన రోజుకు ఉయ్యూరు వస్తామన్నారు .

మా మేన మామ గంగయ్య గారు  మేము ఇంట్లో పడుతున్న మధన చూ చాయగా తెలిసి వాళ్ళ డాబా మీద చేరి వచ్చే పోయే వాళ్ళను గమనించటం ప్రారంభించాడు .నక్కి నక్కి చూడటం రహస్యం బయట పడుతుందేమో నని ఆశ గా చూసేవాడు ఇవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను ఆయనకు ఝలక్ ఇవ్వాలని భావించి ఏ మాత్రం విషయం లీక్ కాకుండా జాగ్రత్త పడ్డాం .అశో భార్య అనుకొన్న రోజున వచ్చారు .మా అమ్మ ప్రభావతి వాల్లిద్దరిని ఆదరం గా చూశారు

సంధ్యకు చీరా సారే పెట్టారు వాళ్ళిద్దరూ రెండు రోజులుండి ఇంతటి ఆప్యాయతను చవి చూసి ఏంతో సంబర పడ్డారు .మనకు సపోర్ట్ దొరికింది కదా అని సంతృప్తీ చెందారు . .వాళ్ళు వెళ్లి పోయిన తర్వాతా నేను మళ్ళీ బందరు వెళ్లి అక్కయ్య బావ లతో సంప్రదించాను .వాళ్ళు మొండి పట్టుదల వదలలేదు అప్పుడు బావతో’’మోహన్ ఇదే పని చేస్తే వాడికి సపోర్ట్ గా నిలబడి మా అమ్మకు నచ్చ జెప్పి కుటుంబం తో కలిపారు ఇప్పుడు మీరు భీష్మిన్చుకొంటే బాగాలేదు పట్టు విడుపులు ఉండాలి వాడేమీ కాని పని చెయ్యలేదు బ్రాహ్మణ పిల్లనే చేసుకొన్నాడు చెప్పా కుండా చేసుకోన్నాడని అంటారా చెబితే మీరు ఒప్పుకుంటారా?అందుకని భయపడి చెప్పా లేదేమో అయినా పిల్లలు చేసిన దాన్ని క్షమించి వదిలి వారిని మన లో కలుపుకు పోవాలి .మొండి తనం అనర్ధం ‘’అని నాకు తోచిన భాష లో శైలిలో చెప్పాను అశోక్ అత్త గారిని మామ గారిని వీల్లింటికి పిలిపించి ముక్క దొబ్బులు పెట్టించాను పెట్టాను .తాము చేస్సింది తప్పే నని చెప్పా కుండా పెళ్లి చెయ్యటం నేరమే నని ఒప్పుకొన్నారు ఆకుటుంబం అంతా.కొంత దారిలోకి వచ్చి ఉద్రేకాలు తగ్గాయి .అందరు కొంత రిలీఫ్ ఫీల్ అయ్యారు .మా చిన్న మేనల్లుడు అశోక్ అత్తగారు లావుగా ఉండటం వల్ల  ‘’డరోతి ‘’అని పేరు పెట్టాడు మా ప్రైవేట్ సంభాషణల్లో ఆ పేరే వాడే వాళ్ళం

అప్పుడు నేను బావా అక్కయ్య లతో ఒక రాజీ ప్రతి పాదన చేశాను .అదేమిటంటే –అశోక్ సంధ్య నూతన దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అక్కయ్యా వాళ్ళింట్లో చేయటం దానికి అశోక్ మామ గారి కుటుంబం అంతా రావటం చేస్తే మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుందని చెప్పాను ఏ కళనున్నారో అక్కా బావా ఒప్పుకొన్నారు .సరే ఒక ఆదివారం సత్య నారాయణ స్వామి వ్రతం చేసే ఏర్పాటు చేయించాను ఉయ్యూరు  నుంచి మేమూ వెళ్లి పాల్గొన్నాం బావ ఇంకా ముభావం గానే ఉన్నాడు సరే కాలం మార్పు తెస్తుంది అని సమాధాన పడ్డాం .ఇలా పెద్ద మేనల్లుడి ప్రేమ పెళ్లి మలుపులు తిరిగి సుఖాంతమై అందని కలిపి ఆనందాన్ని సంతృప్తిని కలిగించింది ఏదో జరిగి పోతుందని పడ్డ భయం కాస్తా పోయి హాయి కల్గించింది మా బావ నన్ను చాలా మెచ్చుకొన్నాడు తర్వాతా అక్కయ్యా కూడా .అయితే ఈ ప్రేమాయణం లో అశోక్ ఏం ఎస్ సి పూర్తీ కాలేదు ఇదొక ట్విస్ట్ . కాని స్టేట్ బాంక్ లో ఉద్యోగం వచ్చి స్తిర ఒపడటం ఒక రిలీఫ్ .సిద్ది పేట లో  ఉద్యోగం లో చేరాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-1-14-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.