నా దారి తీరు -68
స్కూల్ పిల్లలతో విహార యాత్ర
ఉయ్యూరు లో పని చేస్తుండగా కొండపల్లికి తొమ్మిది ,పది తరగతి విద్యార్ధులను ఖిల్లా చూపించటానికి తీసుకొని వెళ్లాం మాతో బాటు గిరిరెడ్డి, హిందీ మేస్టర్ రామా రావు గారు ,ఇద్దరు లేడి టీచర్లు సహాయం గా వచ్చారు ..దాదాపు వందమంది విద్యార్ధినీ విద్యార్ధులను బస్ లో తీసుకొచ్చాం .అక్కడ సౌకర్యాలేమీ లేవు మంచి నీటికీ ఇబ్బందే కిందనుంచి నడుచుకొంటూ ఖిల్లాకి చేరాలి .పిల్లలు హుషారుగా అన్నీ తిరిగి చూశారు ఇంటి నుంచి తెచ్చుకొన్నది తిన్నారు నాకు ఇదే మొదటి సారి రావటం .రామా రావు గారు చాలా సార్లు ఇక్కడికి వచ్చారట ఆయనే మాకు లీడర్ గా ఉండి అన్నీ దగ్గరుండి వివరిస్తూ చూపించారు .పిల్లలకు ఎంతో ఆట విడుపు గా ఉంది .హుషారుగా తిరిగి చూశారు .కొండపల్లి ఊర్లోకి తీసుకొని వెళ్లి అక్కడ కొండ పల్లి బొమ్మలు ఎలా తయారు చేస్తారో చూపించాం కావాల్సిన వాళ్ళు బొమ్మలు కొన్నారు .
కే.సి.పి.దర్శన్
ఒక సారి టెన్త్ విద్యార్ధులను కే సి పి వారి పర్మిషన్ తీసుకొని ఫాక్టరికి తీసుకొని వెళ్లి అన్ని విభాగాలను దగ్గరుండి చూపించాను అక్కడి వారితో అన్నీ వివరం గా విద్యార్ధులకు అర్ధమయ్యే భాషలో తెలియ జేసేట్లు చేశాను .ఉయ్యూరు వారికి ఫాక్టరీ చూసే అవకాశం రావటం అదృష్టం .పిల్లలు ఎంతో ఆనందించారు తిన్న వాళ్లకు తిన్నంత పంచ దార పెట్టారు అక్కడ .
బెజవాడ ఇండస్త్రియల్ ఎక్సి బిషన్
ఎప్పటి నుంచో బెజవాడ లో జరిగే ఎక్సి బిషన్ కు ఉత్సాహం ఉన్న విద్యార్ధులను తీసుకొని వెళ్లాను మా పిల్లల తో బాటు ,రాజ పచ్చాల్ అనే కాంగ్రెస్ నాయకుడి కూతురు ఇందిర, హిందీ మేష్టారు రామా రావు గారి అబ్బాయి తిరుమల మొదలైన వాళ్ళను తీసుకొని వెళ్లాం అన్నీ తిరిగి అన్నీ చూపించాము గాంధి పర్వతం కూడా చూపించి ప్రకాశం బారేజ్ కూడా చూపించాను .అంతా బస్ లోను రిక్షా లోను ప్రయాణం ఇంటికి వచ్చేసరికి రాత్రి పది అయింది మర్నాడు మళ్ళీ స్కూలు యధావిధి .తిరుమల ఆ తర్వాత విజయ నగరం లో గొప్ప డాక్టర్ అయి అక్కడ మంచి పేరు తెచ్చుకొన్నాడు .వాడి నాన్న గారు రామా రావు గారు మాకు హైస్కూల్ లో హిందీ మేష్టారు ఆతర్వాత ఆయనా నేను కలిసి అదే స్కూల్ లో కలిసి పని చేశాం
మొదటి సారి రేడియో రేడియో ప్రోగ్రాం
ఉయ్యూరు హైస్కూల్ లో ఉండగా హిందీ రామా రావు గారి ప్రోత్సాహం తో పిల్లల తో ఒక సైన్స్ పాఠం రేడియో లో చెప్పటానికి అవకాశం వచ్చింది .కాంతి మీద చెప్పాలి బాగా మాట్లాడేవారిని ఎంపిక చేయటం మంచి స్క్రిప్ట్ రాయటం ప్రాక్టీస్ చేయించటం కష్టమే .కాని అదే నాకు మొదటి అవకాశం కనుక ఏంతో శ్రద్ధ తీసుకొన్నాను .నా దగ్గర ట్యూషన్ చదువుతున్న ఊర సుజాత అనే తొమ్మిదవ తరగతి అమ్మాయిని మెయిన్ గా తీసుకొన్నాను ప్రశ్నలు వేయటానికి మా అబ్బాయిలను తీసుకొందామను కున్నాను కాని ,మరీ కుటుంబ తత్త్వం అంటారని సుజాత తమ్ముడినే ఎంపిక చేశాను కస్టపడి రిఫరెన్స్ పుస్తకాలు చదివి సరళ భాష లో విషయాన్ని సూటిగా సంతృప్తి గా చెప్పెట్లు స్క్రిప్ట్ రాశాను రోజూ సాయంత్రం ఇంటి దగ్గరే రిహార్సిల్స్ చేయించే వాడిని .ఇద్దరూ బాగా ప్రాక్టీస్ చేసి బాగా మాట్లాడటం నేర్చుకొన్నారు కృత్రిమత్వం ఉండకూడదని కలోక్వియాల్ లాంగ్వేజ్ లో మాట్లాడాలని తరిఫీదు ఇచ్చాను .రికార్డింగ్ రోజున ఉదయమే ఇంటి వద్ద టిఫిన్లు చేసి ,బస్ లో బయల్దేరాం రేడియో స్టేషన్ దగ్గర దిగి లోపలి వెళ్లి మాకు ఇచ్చిన ఆఫర్ కాగితం చూపించాను .రికార్డింగ్ రూమ్ లోకి మమ్మల్ని తీసుకు వెళ్ళారు వాళ్ళు ప్రశ్నలు అడిగటం నేను వాటికీ చక్కగా సమాధానాలు చెప్పటం చేశాం రికార్డింగ్ బాగా ఉందని అక్కడి స్టాఫ్ చెప్పారు .ఈ ప్రోగ్రాం కు కొంత డబ్బు కూడా ఇచ్చారు దాన్ని సుజాతకే ఇచ్చేశాను వారం తర్వాతా అది ప్రసార మై అందరినీ అలరించింది .ఆ రోజుల్లోసబ్జెక్ట్ కు సంబంధించిన విషయాలపై పాఠాలు చెప్పించేవారు రేడియో వాళ్ళు .ఉదయం పదకొండున్నరాకు ఈ ప్రోగ్రాం లను ప్రసారం చేసేవారు స్కూల్ లో రేడియో ఉంటె ఒక రూమ్ లో విద్యార్ధుల్ని కూచో బెట్టి విని పించే వారు అది చాలా ఏళ్ళు బాగా నడిచి విద్యార్ధులకు ఉపయోగకరం గా ఉందేవి .ముఖ్యం గా సైన్సు సోషల్ కు ఇవి బాగా సహకరించేవి
.సుజాత టెన్త్ వరకు నా దగ్గరే ట్యూషన్ చదివి మంచి మార్కుల తో స్కూల్ సెకండ్ గా పాస్ అయింది ,.చాలా మంచి పిళ్ళ అణకువ వినయం ఎక్కువ. నాకు చాలా ఇష్టమైన నేను మెచ్చిన శిష్యురాలు సుజాత ఊర సుబ్బారావు రెండో కొడుకు మోహన రావు కూతురు .ఈ అమ్మాయికి స్కూల్ లో పోటీ కే వి.ఎస్.ఎల్ నరసింహారావు గారనే మా గురూ గారు మాకు హెడ్ మాస్టారు ఆకునూరు జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్గారి కూతురు రుక్మిణికూతురు అంటే మనవ రాలు .ఆ అమ్మాయి డాన్స్ బాగా చేసేది అందుకని ఆ అమ్మాయిని నేను సుజాతా ‘’డాన్స్ ‘’అనే పిలిచే వాళ్ళం .సుజాతకు కైకలూరు షావుకారుతో వివాహమయింది .ఒక కొడుకు కూడా పుట్టాడు .ఒక సారి పిల్లాడి పసి తనం లో ఉయ్యూరుకు తండ్రి ఇంటికి వచ్చి మేడ మీద బట్టలు ఆరేస్తుంటే తల మీదే తక్కువ ఎత్తు లో ఉన్న హై టెన్షన్ కరెంట్ వైర్లు తగిలి అక్కడి కక్కడే చని పోయిందిపాపం .మా అందరికి ఏంతో బాధ కలిగింది .చూసి వచ్చాను .సుజాత చెల్లెలు వరలక్ష్మి కూడా ట్యూషన్ చదివింది నా దగ్గర ..ఆ అమ్మాయీ చురుకైన తెలివైన పిల్లే.అక్క చని పోగానే అక్క బాధ్యత తీసుకోవటానికి తయారై అక్కపసి కందు ను తానే తల్లి అయి పెంచటానికి అక్క భర్త బావనే వివాహం చేసుకొని అక్క స్థానం పూరించింది .వీరికీ సంతానం కలిగారు సుజాత కొడుకునూ పెంచి పెద్ద వాడిని చేశారు .వరల్సక్ష్మి దంపతులు సుమారు పది వేల రూపాయలు ఖర్చు చేసి శ్రీసువర్చలాన్జనేయ స్వామికి వెండి కవచాన్ని చేయించి సమర్పించారు .ఇదితండ్రి మోహన రావు పూనిక సంకల్పం .సుజాత జ్ఞాపకం గా స్వామి వారికి కానుక అన్న మాట .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 9-1-14-ఉయ్యూరు .