నా దారి తీరు -70 కాశీ లో అమ్మ మాసికం

నా దారి తీరు -70

కాశీ లో అమ్మ మాసికం

మా అమ్మ భవానమ్మ గారు ఫాల్గుణ శుద్ధ పాడ్యమి రోజు న మరణించింది ..నెల వారీ మాసికాలు పెడుతున్నాను .అయిదవ మాసికం కాశీ లో పెట్టి అప్పటి దాకా శ్మశానం లో భద్రం గా ఉంచిన అస్తికలను కాశీ ,లో నిమజ్జనం చేయాలని అనుకొన్నాం .వేసవి సెలవల్లో ఈ పని చేయటానికి నిర్ణయించాం పూనా లో ఉన్న మా అతమ్ముడు మోహను భార్య సునీత,కొడుకు రాజు కూతురు అనూరాధ సరాసరి కాశీ చేరేట్లు, పాట్నా లో ఉన్న మా చిన్నక్కయ్యా బావ మేనకోడలు పద్మ  కూడా అక్కడికి వచ్చేట్లు అనుకున్నాం. ప్రయాణ ఏర్పాట్లన్నీ బావ చేశాడు .నేను ప్రభావతి ,మా అత్తగారు పద్మావతక్కయ్యా ఉయ్యూరు నుంచి బస్ లో బయల్దేరి బేజ వాడ లో వారణాసి ఎక్స్ ప్రెస్ ఎక్కాలి .బస్ స్టాండ్ లో ప్రభావతిని ఉంచి నేను స్మశానానికి వెళ్లి అస్తికలున్న పాత్ర తీసుకొని బస్ స్టాండ్ కు వచ్చి ఇద్దరం కలిసి బెజవాడ వెళ్లాం .అక్కడికి మా బావమరది ఆనంద్ నూజి వీడు చిన్న రసం మామిడి వంద పళ్ళు ఉన్న గంప తెచ్చి అంద జేశాడు .వాటిని జాగ్రత్త గా సర్డుకోన్నాం కాశీలో బ్రాహ్మలకు మాసికం రోజు న వీటిని వేసి తిని పించాలని అనుకొన్నాం ..ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ప్రభావతి చూసింది .దారి లో తినటానికి అన్నం పూరీలు పులిహార ,వగైరాలేకాక చిరుతిండ్లు కారప్పూస ,బూందీ ,చేగోడీలు వగైరా వారం రోజులు పైగా నిలవ ఉండేట్లు తయారు చేసి రేడి చేసింది .పావు బస్తా బియ్యం చింతపండు మిర్చి తిరగ మూత సామాను సాంబారు పొడి రసం పొడి అప్పడాలు వడియాలు ఊరు మిరపకాయలు ఊరగాయలు కిరోసిన్ స్టవ్ ,కిరసనాయిలు తో సహా అన్నీ వెంట తీసుకొని వెళ్లాం అక్కడేమీ ఇబ్బంది పద రాదనీ ఇంత మందికి ఖర్చు కూడా ఎక్కువేనని ఈ జాగ్రత్త .

అనుకున్న సమయానికి కాశీ చేరుకున్నాం .అక్కయ్యా వాళ్ళు అప్పటికే చేరుకొన్నారు మోహన్ వాళ్ళు కూడా ఒక గంటకు చేరారు .అందరం ఆంద్ర ఆశ్రమం  కు గుర్రబ్బండీ లలో చేరుకొన్నాం .అక్కడ మాకు రూమ్స్ అప్పటికే బుక్ చేశాడు బావ .హాయిగా రూమ్స్ లో సామాన్లు అన్నీ సర్డుకోన్నాం .అప్పటికి ఇంకా మంచాలు ఏర్పాటు లేవు .అందరం కిందే పడుకోన్నాం ఉదయమే చేరాం కనుక కాఫీలు పెట్టు కొని త్రాగాము  ప్రభావతి అందరికి వంట చేసింది .ఆంధ్ర భవన్ వాళ్ళతో చెప్పి బావ అస్తినిమజ్జనం గంగాస్నానం ఏర్పాటు చేయించాడు మంచి తెలుగు బ్రాహ్మణుడే కుదిరి బాగా చేయించాడు ..మర్నాడు అమ్మ తిది .దానికి కూడా ఆంధ్రా ఆశ్రమం వాళ్ళతో  ఏర్పాటు చేయించాడు బావ .కాశీ విశ్వ విద్యాలయం లో లెక్చరర్ ఒకాయన ఇంకొక తెలుగు పండితుడు .భోక్తలు గా వచ్చారు .మంత్రానికి కూడా బాగా నేర్చిన వారే వచ్చారు .చాలా శాస్త్రోక్తం గా మాసికం జరిగింది .ఏంటో ఆనందం గా ఉంది .అందరికి బావా చెప్పినట్లు సంభావనలు ఇచ్చాం డబ్బు అంతా నేనే ఖర్చు పెట్టాను .ప్రభావతి మాసికం వంట ఉయ్యూరులో ఎలా మడి కట్టుకొని చేస్తుందో అలా వండింది పద్మావతక్కయ్యా చిన్నక్కయ్యా మిగిలిన సహాయం చేసేవారు .నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు పప్పూ పాయసం గారెలు బూరెలు అన్నీ యదా విధిగా నే చేసింది .మేము వెంట తెచ్చిన మామిడి పళ్ళను వీరికి చాలా భక్తిగా విస్తాల్లలో వేశాం.బ్రాహ్మలు ఏంతో సంతృప్తి గా భోజనం చేసి మాకు తృప్తి కలిగించారు .రసాలను కొసరి కొసరి వేసి తిని పించం ఇక తినలేము బాబోయ్ అనే దాకా వేశాం.అమ్మ ఆత్మ సంతృప్తి చెందిందని భావించాం .వాళ్ళు కూడా ఎంతో సంతోషించి ఇంత శ్రద్ధగా ఈ కార్య క్రమం నిర్వర్తించు నందుకు అభినందించారు .మంచి సద్  బ్రాహ్మణులు లభించి నందుకు మా ఆనందానికి  అవధుల్లేవు .ఇంత కార్యక్రమం దగ్గరుండి నిర్వర్తింప జేసినా బావ వివేకానందం గారి ఋణం తీర్చుకోలేనిదే అని పిస్తుంది …మాతో వచ్చిన ప్రభావతి అక్కయ్యకు ఏ లోటూ జరక్కుండా చూసుకొన్నాం ..

వారం పైగా కాశి లో ఉన్నాం .రోజూ సాయం వేళల్లో నగర సందర్శనం విశ్వనాధ దర్శనం చేసే వాళ్ళం .నాకు కాశీ రావటం రెండవ సారి మొదటి సారి నేను మేనల్లుడు అశోక్ బావతో వచ్చాం .ఆంధ్రాశ్రమం కు నారదఘాట్ దగ్గర   రోజు ఉదయమే అక్కడ స్నానం చేసి ఇంటికి వచ్చి టిఫిన్ చేసుకొని తినే వాళ్ళం మధ్యాహ్న భోజనమూ పూర్తీ చేసి ఊరిలో తిరగటానికి వెళ్ళే వాళ్ళం ఒక రోజు సారనాద్ వెళ్లి అన్నీ చూశాం అన్నీటాంగా లోనే అప్పటికి ఆటోలు లేవు .అప్పుడు ఉత్తర ప్రదేశ్ లో బి.జే పి ప్రభుత్వం ఉందని జ్ఞాపకం ఇది1982 మే నెలలో .ఒక రోజు ఉత్తర కాశికి అంటే కాశీ రాజు పాలించిన ప్రాంతం కోట ఉన్న ప్రదేశం ,వ్యాసుడు ఉన్న ప్రదేశం అన్నీ చూసి లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టిన ఇల్లు చూకూడా చూసి తిరరిగి వచ్చాం పడవలో గంగా నదిలో వెళ్లి తిరిగి వచ్చాం .దారిలో ప్రసిద్ధ బావరీ బాబా దర్హనం దూరం గా అయింది .ఒక రోజు ఒక ఆంధ్ర వేదం పండితుని ఇంటికి వెళ్లాం .ఏంటో ఆదరించారు ఇంటిల్లి పాదీ.ఇక్కడికొచ్చి నలభై ఏళ్ళు పైగా కాశీలో స్తిరపోయిన కుటుంబం .వాళ్ళది .కాలభైరవ అన్న పూర్ణ విశాలాక్షి మందిరాలు చూశాం .సాయం పూట విశ్వనాధ దర్శనం తప్పని సరి గా చేశాం .ఆంద్రాశ్రమం దగ్గరే జోషీ పాండా భవనం ఉంది వాళ్ళ ఆవిడ ఏదో నోము మోస్తే బ్రాహ్మనులన్దరిని భోజనానికి పిలిస్తే అందరం తిన్నాం ఆడవాళ్ళకు బొట్టు పెట్టి రవికల గుడ్డ పెట్టింది భోజనం లో అనేక రకాలైన స్వీట్లు కూరలు చాలా బాగానే చేశారు అందరం ఇస్టంగానే తిన్నారు .మరగకాచిన పాలపై ఉన్న వేమీగడ ను మలై అంటారు అది తినే వాళ్ళం మిఠాయిలు కొని తినే వాళ్ళం మార్కెట్ లో కూరాలు కొని త్చ్చుకొని వండుకొనే వాళ్ళం కిరసనాయిల్ బాగానే దొరికేది .పెరుగు మున్తల్లో తోడూ పెట్టి అమ్మేవారు అది కొని వాడే వాళ్ళం .భాలేరుచికరం గా ఉండేది .

కాశీ లో వారం పైన ఉండి అందరం అలహాబాద్ కు వెళ్లాం .ఇదే ప్రయాగ అని పిలువ బడే పవిత్ర క్షేత్రం .ఇక్కడ గంగా ,యమునా సరస్వతి సంగమ స్థానం ఇది .హరి జగన్నాధ శాస్త్రి గారింట్లో ఉన్నాం .వారిన్ట్లోనే భోజనాలు ఏర్పాటు చేసుకోన్నాం ఆయన మనుష్యులతో సంగం లో స్నానాలు హిరన్య శ్రాద్ధం పెట్టాం .ఇవి అయిన తర్వాత శాస్త్రి గారింటికి తిరిగి వచ్చి భోజనాలు చేశాం .సాయంత్రం శాస్త్రి గారు ఏర్పరచిన టాంగా లలో అలహాబాద్ నగర సందర్శనం చేశాం సంగమానికి దగ్గరే ఉన్న వట వృక్షం రాజా గారి కోట వగైరాలు చూసి ,నెహ్రు పాలస్ ను కనుల దీరా చూశాం .భరద్వాజ ఆశ్రమం సందర్శించాం.అక్కడి నుండి మా ప్రయాణం పాట్నా కు అందుకని మిగిలిన మామిడి పండ్ల బుట్ట ను మాతో గుర్రం బండీ లో తీసుకు వెళ్లాం దారిలో కొన్ని పళ్ళు మిస్ అయ్యాయి .శాస్త్రి గారికి కూడా పండ్లు అందజేశాం ఆయనా ఏంతో సంతోషం గా ఉన్నారు .ఆయన కూడా ఆంధ్రా ప్రాంతం వారే వారూ వచ్చి నలభై ఏళ్ళు అయింది .చక్కని తెలుగు ఆయనా భార్యా మాట్లాడారు ఆప్యాయం గా ఉన్నారు .

ట్రెయిన్ లో పాట్నా చేరుకొన్నాం అక్కయ్యా వాళ్ళింట్లో  అందరం చేరాం ఇళ్ళు  సౌకర్యం గానే ఉంది .గుళ్ళు కొట్టిన్చాం కనుక  నా తలకు మోహన్ రంగు వేశాడు .నాకు అంత ఇష్టం లేదు సరే చూద్దాం అను కొన్నాను కొన్ని నెలలు రంగు ఉంది .తర్వాత షెడ్ లు మారాయి. మళ్ళీ రంగు వేయాలని పించలేదు .కొంత ఎర్రగా కొంత నల్లగా ,కొంత తెల్లగా మూడు రంగుల్లో ఉండి  అసహ్యమేసింది .దాని మీద మోజు లేదు .కనుక ఆ జోలికి మళ్ళీ వెళ్ళలేదు .పాట్నా లో ఎక్కడికీ తిరిగలేదు .ఒక రోజు రాత్రి దొంగల బండీ లో గయ కు వెళ్లాం. అందులో చోరీలు ఎక్కువ .మెడలో గొలుసులు స్టేషన్ లో నుంచునే లాగేస్తారు ట్రెయిన్ లో స్టేషన్ లలో కరెంట్ ఉండేదికాదు .భయం భయం గా ప్రయాణం ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకొని వెళ్లాం .అక్కడేదో సత్రం లో ఉన్నాం ..అక్కడ పిండ  ప్రదాన క్రియ భక్తిగా చేశాం అక్కడే ఏడో వండుకు తిన్నాం మధ్యాహ్నం బుద్ధ గయా కి వెళ్లి తిరిగి చూశాం .దాహానికి మంచి నీరు దొరికేది కాదు .విపరీత మైన ఎండలు .చాలా ఇబ్బందిగా ఉండేది .బుద్ధ భూమి లో విహరించాం అన్నీ దగ్గర ఉండి బావ చూపించాడు .మళ్ళీ పాట్నా చేరాం .

పాట్నా నుండి కలకత్తా వెళ్లాం బ్రేక్ జర్నీలో అక్కడ చూడాల్సిన వన్నీ చూసి భువనేశ్వర్ చేరాం మేము ముగ్గురం .అక్కడి నుండి పూరీ కోణార్క్ లను చూసి గరివిడి చేరాం మా అన్నయ్య గారమ్మాయి వేదం వల్లి వాళ్ళింటికి చేరాం అర్ధ రాత్రికి అంతా కొత్త దారి .ఇల్లు తెలుసుకొని చేరాం బ్రేక్ జర్నీలో ఒకరోజు అక్కడే ఉండిఅన్నవరం చేరాం అక్కడ దైవ దర్శనం చేసి విజయ వాడ  మీదుగా ఉయ్యూరు చేరుకొన్నాం ఇలా ఒక ప్రదక్షిణం పూర్తీ అయింది

సశేషం

ముక్కోటి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్- 11-1-14-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.