ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి 120వ జయంతి 42వ వర్ధంతి –వారి స్వగ్రామం చిట్టూర్పు గ్రామం లో
ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి స్వగ్రామం చిత్తూర్పులో వారి 120వ జయంతి
కృష్ణా జిల్లా రచయితల సంఘం ,సరసభారతి ఉయ్యూరు సంయుక్తం గా ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి పై సాహిత్య సభను12-1-14ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వారి స్వగ్రామం చిట్టూర్పు గ్రామం లో శివాలయప్రాంగణం లో నిర్వహించ బడింది .సభా ధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు ఇలాంటి సభలు గ్రామీణ వాతావరణం లో జరగటం అక్కడ పుట్టిన మహనీయులను జ్ఞప్తికి తెచ్చుకోవటం మంచి పని అని సరసభారతి తో తామూ కలిసి దీనిని నిర్వహించటం ఆనంద దాయకం అన్నారు లక్ష్య ప్రస్తావనను డాక్టర్ జి వి.పూర్ణ చంద్ చేశారు శ్రీ టి శోభనాద్రి మంచి కార్యక్రమగా అభినందించారు .పింగళి వారి పై పరిశోధన చేసిన డాక్టర్ పింగళి వేంకట కృష్ణా రావు తమ అరగంటకు పైగా చేసిన ప్రసంగం లోతాము లక్ష్మీ కాంతం గారూ గౌతమ గోత్రీకుఅలమేనని , కొందరు భారద్వాజ గోత్రీకులూ ఉన్నారని తాము వారి పై డాక్టరేట్ చేశానని ఆయన చాలా గంభీర మయిన వ్యక్తీ అని ముక్కు సూటిగా ఉండేవారని దేనినీ లెక్క చేసే వారుకాదని హాస్యం చాలా లోతుగా ఉంటుందని ,తిక్కన కవిత్వాన్ని ఆయన విశ్లేషించి చెప్పిననంత గొప్పగా వేరెవరూ చెప్పలేరని,ఆయనపై రిసెర్చ్ చేయటం తమ అదృష్టం అని చెప్పారు .ఇక్కడే ఆయన భారతాన్ని మొదటి సారిగా మునసబు గారి అమ్మాయికి పురాణం లాగా చెప్పారని అదే వారి మొదటి తిక్కన ఆవిష్కారం అని అన్నారు ..
నేను శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు పంపిన సందేశాన్ని చదివి వినిపించాను
.ఈ వూరి వారే అరిపిరాల విశ్వం
గారని గొప్ప జర్నలిస్టు రచయిత అని ఈ గుడి వెనకాలే వారిల్లు అని వారి పెదనాన్న గారి అబ్బాయి బందరు నుంచి ఈసభకు రావటం హర్ష దాయకమని అరిపిరాల వారిపై కూడా ఒక సభ నిర్వహించాలని అన్నాను .లక్ష్మీ కాంతం గారి అబ్బాయి శ్రీ సూర్య సుందరం గారిని కూడా ఆహ్వానించామని వారు డెబ్భై నాలుగేళ్ల వయసు వారవటం వలన రాలేక పోతున్నామని తెలియ జేశారని కార్యక్రమం జయ ప్రదం గా జరాలని ఫోన్పిం లో శుభా కాంక్షలు చెప్పి తండ్రి గారిపై తాము రాసిన పుస్తకాన్ని బ్రౌన్గ సంస్థ ప్రచురించారని దాన్ని నాకు పంపించారని ,అలాగే శ్రీ ముక్కామల రాజ శేఖర రావు గారు రాలేక పోయారని పింగళి వారి ఫోటోలు పంపి సహకరించారని అన్నాను.ఈ సభకు ముఖ్య ప్రేరణ శ్రీ గూద్దూరి నమశ్శివాయ గారు లాక్ష్మీ కాంతం గారి పై రాసిన పుస్తకం అని అందులో ఎవరూ చూపని వారి నట విశ్వ రూపాన్ని ఆవిష్కరించారని దీని పై నేను ఇంటర్ నెట్ లో నాలుగు వ్యాసాలు రాశానని చెప్పాను పింగళి .వారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిస్తిస్తే స్పూర్తిదాయకం గ ఉంటుందని సుబ్బారావు గారు సూచిస్తే జనవరి పడవ తేదీ న జన్మించి అదే తేదీన మరణించిన లక్ష్మీ కాంత గారిపై ప్రతి ఏడాది ఆరోజున ఒక స్మారక ఉపన్యాసం చిట్టూర్పు ప్రజలు నిర్వహిస్తే బాగుంటుందని మేమంతా సహకరిస్తామని నేను చెప్పాను”జనవరి పది జననంబా -జనవరి పది నాదే దైవ సాయుజ్యంబా ?ఘనమగు ణీ సాధర్మ్యము -జననము ,మృతి యొక్క తన్న సత్యము చాటేన్ ”.అని శ్రీ మల్లెల గురవయ్య గారు రాసిన పద్యాన్ని చదివాను .నిన్న లక్ష్మీ కాన్తుడైన శ్రీ మహా విష్ణువు ఉత్తర ద్వారా దర్శనం అయితీఈ రోజు సాహిత్య లక్ష్మి కాన్తుడైన పింగళి లక్ష్మీ కాంతం గారి సమగ్ర వ్యక్తిత్వ సాహిత్య దర్శనం చేయటం గొప్పగా ఉండన్నాను బుద్ధ ప్రసాద్ గారి అబ్బాయి వెంకట రత్నం తండ్రిగారు అని వార్య కారణాల వల్ల రాలేక పోవటం తో తనను సభకువెళ్ళ మని ఆదేశిస్తే వచ్చానని చాలా సంతోషం గా ఉందని చెప్పారు .జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు శ్రీ గొర్రెపాటి రామ కృష్ణ ఈ ఊరిలో ఇంత గొప్ప సాహితీ వేత్త జన్మించటం తమకు గర్వకారణం అన్నారు వారి ని గుర్తుంచుకొనే విషయమై అందరం ఆలోచిస్తామని హామీ నిచ్చారు .
శ్రీ మాదిరాజు రామలింగేశ్వర రావు గారు బందరు నోబుల్ కాలేజి లో పింగళి వారు చదివారని ఆయన సాహితీ జీవితం అందరికి ఆదర్శ ప్రాయం అన్నారు శ్రీ రావి రంగా రావు రేడియో స్టేషన్ లో వారు పని చేసినప్పుడు జరిపిన కవి సమ్మేళనం లో తాను యువకవి గా పాల్గోన్నానని వారితో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకొన్నారు .శ్రీ చింతల పాటి పూర్ణ చంద్ర రావు తమకు పులికంటి కృష్ణా రెడ్డి ప్రెస్ లో పని కల్పించారానని భోజన వసతి కూడా చూపించిన ఉదారుడని ఆయన వద్ద తిరుపతిలో చదువుకొన్న అదృష్ట వంతుడినని గర్వం గా చెప్పారు శ్రీ చింతల పాటి మురళీకృష్ణ పింగళి వారి పద్యాలను చదివితే శ్రీ మద్దూరి విశ్వం సౌన్దరనందం లోతులను స్పృశించారు
లక్ష్మీ కాంతం గారి జీవితం లోని ప్రముఖ ఘట్టాల ఫ్లెక్సీ లను గొర్రెపాటి వారు ఆవిష్కరిస్తే వారి చిత్రపటాన్ని నాదెళ్ళ గోపాల రావు గారు గ్రామ వయో వృద్ధులు కలిసి పుష్పమాలన్క్రుతులను చేశారు ..మూడు నలభై అయిదు నిమిషాలకు ప్రారంభమైన సభ ఆరు గంటల నలభై అయిదు నిమిషాలకు పూర్తీ అయింది అంటే మూడు గంతాల పాటు జరిగి ఎంతో సంతృప్తిని ఆనందాన్ని స్పూర్తిని కలిగించింది .విలేకరలు పాల్గొని విషయాలను సేకరించి తోడ్పడ్డారు .గోపాల రావు గారి తమ్ముడు గారింట్లో అతిధులకు అల్పాహారం గా చక్ర కేళీ ,లడ్డు ,మిక్చర్ కాఫీ ఇచ్చారు .మహిళలు కూడా బాగానే హాజరయ్యారు .కోసూరి ఆదినారాయణ ఉమామహేశ్వర రావు శర్మ గారు యాభై ఏళ్ళ కిందటి నా శిష్యుడు అడివి శ్రీరామ మూర్తి ,గ్రామ పెద్దలు గ్రామస్తులు అంతా కలిసి వంద మంది కి పైగా హాజరై చిట్టూర్పు గ్రామంలో ఒక చరిత్ర ను సృష్టించారు. చివరికి నేను మాట్లాడుతూ ఆలోచన నాడైనా సహకరించింది కృష్ణా జిల్లా రచయితల సంఘం అని ,గ్రామస్తులు అంకిత భావం తో చేయూత నిచ్చారాని ఈ గ్రామం లో పుట్టి పెరిగిన సరసభారతి కార్య దర్శి మాది రాజు శివ లక్ష్మి దీని విజయానికి చేసిన కృషి చెప్పనలవి కాదని వారి కుటుంబం తోడ్పాటు గొప్పగా ఉందని ఇంతటి విజయాన్ని చేకూర్చిన అందరికి క్రుతాజ్ఞాతలని చెప్పాను ..గోపాల రావు గారి మేనల్లుడు వందన సమర్పణ చేస్తూ ఇక్కడి తో దీన్ని ఆపం అని తరుచుగా పింగళి వారిని జ్ఞప్తికి తెచ్చే పనులు చేస్తూనే ఉంటామని అన్నారు .లక్ష్మీ కాంతం గారి చిత్రపటాన్ని అందరూ కలిసి రామ సర్పంచ్ శ్రీమతి చాట్రగడ్డ నాగలక్ష్మి కి అందజేసి పంచాయితీ లో ఉంచమని కోరారు .ఆమే తామందరినీ ఇందులో పాల్గోనేట్లు చేయటం వాళ్ళ పింగళి వారి గురించి తెలుసుకోగాలిగామని అన్నారు మైకు కుర్చీలు మంచి నీరు మొదలైన వాటిని గోపాల రావు గారు చూశారు .అతిదులందరికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో తో కింద లక్ష్మీ కాంతం గారి చిన్న ఫోటో ఉన్న జ్ఞాపికలను సరసభారతి తరఫున మాదిరాజు శ్రీనివాస శర్మ దంపతులు అందజేశారు .
వేడక పోయినా ”వేడి తేనీరు” ను సభలో మూడు సార్లు అందించి తమ ఆతిధ్య ధర్మాన్ని చక్కగా నెరవేర్చిన గ్రామస్తులందరూ అభి నంద నీయులే .తమ ఇంట్లో జరిగే పండుగ లాగా గ్రామస్తులందరూ పాల్గొని జయప్రదం చేశారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-1-14-ఉయ్యూరు