తెలుగు నేల పై ఓల్గా నవలా ప్రవాహం

సామాజికంగా స్త్రీలను అన్ని రకాల జ్ఞానాలకు దూరంగా ఉంచే పని పురుష స్వామ్యం రకరకాల రూపాలతో చేస్తూ వుంటుంది. వాళ్లకు స్వశరీర జ్ఞానం కూడా లేకుండా చేయటం పురుష స్వామ్యానికి అత్యంత అవసరం. విషయ జ్ఞానం ఉన్న స్త్రీలు అఘాయిత్యాలకు ఒడిగడతారేమోనని పితృస్వామ్యానికి భయం. ఈ విషయాలను గురించి ఓల్గా చాలా లోతుగా చర్చించారు.

ల్గా లాగా స్త్రీవాద రాజకీయాలను అనేక పార్శ్వాల నుండి, అనేక రంగాల నుండీ ప్రవేశపెట్టిన వాళ్లు దాదాపు తెలుగు స్త్రీవాద సాహిత్య విమర్శలో లేరు. ఎక్కువమంది ఏదో ఒక పార్శ్వానికి మాత్రమే పరిమితమై రాశారు తప్ప బహుళ పార్శ్వాలను సృజించటం జరగలేదు. ఆమె ఒక సందర్భంలో చెప్పినట్లు ‘స్త్రీలు రచన చేయడం అంటే ఈ సంస్కృతిపై తిరుగుబాటుగా నమ్మి రచనలు చేయడమే’. ఆ తిరుగుబాటు తత్వం ఓల్గా రచనలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
ఏదో ఒక కొత్త విషయాన్ని పరిచయం చేయకుండా, ప్రతిపాదించకుండా ఆమె ఏ రచనా చేయలేదని చెప్పటానికి ఎటువంటి సంకోచం అక్కరలేదు. పురుషత్వం (masculine) స్త్రీత్వం (feminine) అనే వర్గీకరణలు కల్పితాలు కావని, అవి స్త్రీల జీవితాలను నియంత్రిస్తూ వున్నాయని చాలా మౌలికమైన విషయాలలో ఈ వర్గీకరణలు ఆమెను పరాయిగా (other) మారుస్తున్నాయని, స్త్రీలు ధరించే బట్టలు తినే ఆహారం, లైంగిక సంబంధాలు, అసలు స్త్రీల మొత్తం ఆలోచనా విధానాన్ని ఈ వర్గీకరణ నియంత్రిస్తున్నదని ఓల్గా నిరూపించారు. అలాగే వర్గీకరణలతో కూడిన ఆ ఆలోచన మన జీవితాలలో అంతర్భాగం కావటాన్ని, ఈ వర్గీకరణే స్త్రీలను ఇంటికి, పురుషులకు సామాజిక క్షేత్రానికి చెంది వుండేటట్లు అమలు కావటానికి కారణం అవుతుంది అనే స్పృహ ఆమె ఆలోచనల్లో కనిపిస్తుంది. ఈ Spatial division వెనుక కూడా బలమైన రాజకీయాలున్నాయని ఒక స్త్రీవాద విమర్శకురాలిగా ఓల్గా నిరూపించారు.
కుటుంబ విషయాలను, కుటుంబంలో అమలయ్యే రాజకీయాలకు రాజ్యానికి మధ్య వున్న సంబంధాన్ని గురించి ఆమె విమర్శ వ్యాసాలలో లోతుగా విశ్లేషించారు. కుటుంబం అనేది స్త్రీకి ఏ విధంగా అణచివేతకు గురిచేస్తుందో కూడా ‘కుటుంబ వ్యవస్థ: మార్క్సిజం-ఫెమినిజం’ (2004) పుస్తకంలోని సాహిత్య విమర్శ వ్యాసాలలో బహిర్గతం చేశారు. అలాగే స్త్రీల భాష, అనుభూతులపై కొనసాగుతున్న నియంత్రణను ఆమె ప్రశ్నించారు. అంతకంటే ముఖ్యంగా సమాజం ఉదాసీనంగా ఆమోదించి, అమలుచేస్తున్న విషయాల వెనుక వుండే రాజకీయాల లక్ష్యాలను కూడా ఆమె తన రచనలలో బహిర్గతం చేశారు.
తెలుగు సాహిత్యంలో స్త్రీల దృక్కోణం నుంచి, స్త్రీవాద దృక్ప థం నుంచి నిర్దిష్టంగా విమర్శ రాసిన వాళ్లలో ఓల్గాది విశిష్ట స్థానం. ఆమె విమర్శనా వ్యాసాలు చాలా వరకు ‘పలికించుకు మౌన మృదంగాలను’ అనే సంపుటంగా వెలువడింది. ఈ సంపుటిలో ఎక్కువ భాగం రచనలు కొ.కు, చలంల మీద రాయటం యాదృచ్ఛికం కాదు. తెలుగు సాహిత్యంలో ఒక రకంగా ఈ యిద్దరు రచయితలు స్త్రీ సమస్యలను, స్త్రీల స్థితిగతుల్ని గురించి లోతుగా చర్చించారు. గత ఏడు, ఎనిమిది దశాబ్దాల తెలుగు సాహిత్యంలో వీళ్లిద్దరిదే సింహభాగం. అందుకే ఓల్గా వ్యాసాలు వీళ్లిద్దరిపై వుండటం అసంబద్ధమేం కాదు.
కుటుంబరావు ప్రేమతత్వంలో ఓల్గా గుర్తించిన మరొక అంశం ప్రేమ శాశ్వతం కాదనే భావన. అలాగే ప్రేమకు, డబ్బుకు వున్న సంబంధాన్ని, స్త్రీ పురుషులు ముఖ్యంగా భార్యా భర్తల సంబంధం లో డబ్బు నిర్వర్తించే పాత్రను గురించి కొ.కు.కు స్పష్టమైన అవగాహన వుందనే విషయాన్ని ఓల్గా సోదాహరణంగా ఋజువు చేశారు. అలాగే సమాజంలో అమలవుతున్న ద్వంద్వనీతిని గురించి కుటుంబరావు చేసిన కాల్పనిక సాహిత్య చిత్రణను ఓల్గా గుర్తించి విశ్లేషించడం ఈ వ్యాసంలో కనిపిస్తుంది. తెలుగు స్త్రీవాద విమర్శ నిర్దిష్ట సామాజిక శాస్త్ర నేపథ్యం నుంచి రాసిన విమర్శ తక్కువ. ఓల్గా ఈ విషయాన్ని ఈ సంపుటిలో ఋజువు చేశారు.
1984లో అరుణతార మాస పత్రికలో కుటుంబరావు కథ ‘కొత్త పద్ధతులు’పై ఓల్గా విమర్శ వ్యాసం రాశారు. ఆ విశ్లేషణ వివాదాస్పదమై మరింత చర్చకు దారితీసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ వ్యాసం ఈ సంపుటంలో వున్న మంచి వ్యాసాలలో ఒకటి. ఇది సరయిన సమయంలో వ్రాయబడిన వ్యాసం. 1980లలో స్త్రీవాదం ముందుకు వచ్చి నిలబడే ప్రయత్నం చేస్తున్న సందర్భం. సాహిత్య వాచకాలను స్త్రీ దృక్కోణం నుండి వ్యాఖ్యానించాల్సిన అవసరాన్ని గుర్తించి, ఆ దిశగా ప్రయత్నాలు మొదలవుతున్న సందర్భం. సరిగ్గా ఆ సందర్భంలో ఓల్గా ఈ వ్యాసాన్ని కొంత ధైర్యంగానే రాశారు.
వర్తమాన సాహిత్య ప్రపంచంలో మార్క్సిజమే శాస్త్రీయ దృక్పథం అనే నిర్ధారణ ఎవరూ చేయటం లేదు. వర్తమాన సామాజిక నైతిక చట్రం మొత్తం స్త్రీలలోని ప్రేమ, స్వేచ్ఛ, సమానత్వం వంటి మానవ లక్షణాలను చంపివేయటానికి ఉద్దేశించబడిందని, ఎండమావులు నవలలో మూడు ప్రధాన పాత్రలు రంగడు, సుందరం, రాజు మన సామాజిక స్వరూపాన్ని మూడు కోణాల నుండి బహిర్గతం చేస్తాయని ఓల్గా ప్రకటించారు. వివిధ సామాజిక సందర్భాలు వ్యక్తి అస్తిత్వాన్ని బహు రూపాల్లో కుదిపివేస్తున్న తీరును గురించి నిర్దిష్టమైన నిబద్ధతతో ఓల్గా విశ్లేషించారు.
తెలుగు సాహిత్యంలో మనం ఎక్కువ భాగం పాత్రల్ని నిర్దిష్టమైన పొజిషెన్‌లో

నిలిపి రచన చేయటానికి అలవాటు పడ్డాం. పాఠకులూ అంతే. పాత్రల మధ్య సంబంధాలు రాముడు వర్సెస్ రావణుడు లాగా; పెట్టుబడిదారుడు వర్సెస్ కార్మికుడిలాగా వున్నప్పుడు ఆమోదించటం, అలా లేనప్పుడు ఆ రచనలను సంక్లిష్ట రచనలుగా నిందించడం తెలుగులో చాలా కాలంగా జరుగుతూ వున్నదే. ఈ స్థితి నుంచీ పాఠకుల్ని బయటపడవేసే పనికి విమర్శకులు పూనుకుని సాహిత్య తత్వాన్ని, స్వరూప స్వభావాలను గురించి నిర్దిష్ట ప్రతిపాదనలు చేసి పాఠకుల అవగాహనా స్థాయిని పెంపొందించాల్సిన అవసరాన్ని ఒక విమర్శకురాలిగా ఓల్గా నిరూపించారు.
‘అతడు-ఆమె-మనం’ అనే పుస్తకంలో ఓల్గా నిర్దిష్ట రాజకీయ అంశాల, చారిత్రకాంశాల గురించి విమర్శ రాసిన క్రమంలో ఆమె ప్రధాన లక్ష్యం ఈ నవలలోప్రతిపాదించబడిన స్త్రీ పురుష సంబంధాలను గురించిన భావనలను, వాటిలోని సానుకూల అంశాలను చర్చించటం. స్త్రీ పురుష సంబంధాలంటే కేవలం భార్యాభర్తల సంబంధాలకే కుదించటం కాకుండా మొత్తం కుటుంబంలోని వ్యక్తుల సంబంధాలన్నింటికి విస్తరించి ఓల్గా చర్చించారు. సామాజికంగా స్త్రీలను అన్ని రకాల జ్ఞానాలకు దూరంగా ఉంచే పని పురుష స్వామ్యం రకరకాల రూపాలతో చేస్తూ వుంటుంది. వాళ్లకు స్వశరీర జ్ఞానం కూడా లేకుండా చేయటం పురుష స్వామ్యానికి అత్యంత అవసరం. విషయ జ్ఞానం ఉన్న స్త్రీలు అఘాయిత్యాలకు ఒడిగడతారేమోనని పితృస్వామ్యానికి భయం. ఈ విషయాలను గురించి ఓల్గా చాలా లోతుగా చర్చించారు.
‘ఈ సమాజం స్త్రీని ఎలాంటి పరిస్థితులలో ఉంచిందంటే, స్త్రీ తనకి సంబంధించిన సమస్యల్ని, విషయాలను మాట్లాడటానికి స్థిరపడే స్థితిలో ఉంది. చిన్నతనం నుంచి స్త్రీకి మర్యాద, మన్నన, సిగ్గు, భయం వీటన్నింటినీ బోధించి ఆ బోధనల పరదాల వెనుక ఆమె శరీరాన్ని మనసుని దాచేస్తారు. స్త్రీ తన శరీరం గురించి కోర్కెల గురించి మాట్లాడటం పాపమని, నీచమని అభిప్రాయపడతారు. శరీర ధర్మాలకు, ప్రకృతి ధర్మాలకూ అతీతంగా పెరిగిన ఆడ పిల్లలకు తమ శరీరాన్ని గురించిన కనీస జ్ఞానం ఉండదు. దానివల్ల వారికి చాలా అపకారాలు జరుగుతాయి. తన శరీరం గురించీ లైంగిక విషయాల గురించి అజ్ఞానంలో అమాయకత్వంలో వుండే ఆడపిల్లలు లేనిపోని ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు.’
గత మూడు నాలుగు దశాబ్దాల కాలంలో స్త్రీవాద విమర్శకులు ప్రపంచవ్యాప్తంగా శరీరం భాష, సెక్సు, సెక్సువాలిటీ, జెండర్, ప్రవచనం, వాంఛ, అధ్యయనం, చరిత్ర, స్త్రీత్వ రచన, స్త్రీవాద కథనం, స్త్రీవాద వ్యాఖ్యానం విషయిత్వం, లైంగిక రాజకీయాలు, వాచక రాజకీయాలు లాంటి పారిభాషిక పదాలు స్త్రీవాద విమర్శను ఆశ్రయించి వున్నాయి. ఈ పరిభాష లేకుండా, స్త్రీవాద విమర్శ రాయటం దాదాపు అసాధ్యంగా మారింది. అటువంటి సందర్భంలో ఓల్గా ప్రముఖ స్త్రీవాదిగా గుర్తింపు పొందారు. స్త్రీవాదం ఈ రోజు ఉదారవాద ధోరణిలోనుంచి రాడికల్ స్త్రీవాదం దాకా విస్తరించింది. ‘అయోని’ కథ గురించి రాసిన సందర్భంలో ఆమె రాడికల్ స్త్రీవాద విమర్శ కనిపిస్తుంది.
-డా.కె.శ్రీదేవి
94414 04080

(ఈ నెల 18న ఓల్గాకు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్, అంబేద్కర్ ఆడిటోరియంలో లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు ఇవ్వనున్నారు. సభలో జయాబచ్చన్, జస్టిస్ చలమేశ్వర్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొంటారు)

– See more at: http://www.andhrajyothy.com/node/53734#sthash.56KqnSb3.dpuf

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.