తొలితరం మహిలోద్యమ నాయకురాలు –భండారు అచ్చమాంబ
భారత దేశం లోనే మొదటి మహిళా చరిత్ర రచయితగా ,మన రాష్ట్రం లో తొలితరం మహిళోద్యమ సారధిగా శ్రీమతి భండారు అచ్చమాంబ గుర్తింపు పొందింది .కృష్ణా జిల్లా నందిగామదగ్గర పెనుగంచి ప్రోలు లో ఆమె 1874లో జన్మించింది తండ్రి కొమర్రాజు వెంకటప్పయ్య .కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు గారికి సోదరి .తండ్రి ప్రభుత్వ దివాన్ గా పని చేసే వారు .అచ్చమాంబకు ఆరేళ్ళ వయసు వచ్చేసరికి తండ్రి మరణించారు .మేనమామ భండారు మాధవ రావు గారితో పదేళ్ళ వయసులో వివాహం అయింది .పదిహేడవ ఏట కాపురానికి వెళ్లి దాంపత్య జీవితం ప్రారంభించింది
అచ్చమాంబకు విద్య మీద అమితాసక్తి ఉండేది .కాని భర్త మాధవరావు అందుకు సహకరించ లేదు .తమ్ముడు లక్ష్మణ రావు సాయం తో అతని దగ్గరే చదివి తెలుగు హిందీ ఇంగ్లీషు మరాఠీ భాషలు నేర్చింది తమ్ముడు బిలాస్ పూర్ లో ఉద్యోగం లో చేరటానికి వెడితే తానే స్వయం గా బెంగాలీ,గుజరాతీ సంస్కృతం లను అభ్యసించి నేర్చుకొని స్వయం సిద్ధ అని పించు కొన్నది . అచ్చమాంబ దంపతులకు పుట్టిన ఒక కొడుకు కూతురు అకస్మాత్తుగా మరణించారు .ఆమె శోకం వర్ణనా తీతం గా ఉంది ,ఈ దుఖం నుండి బయట పడటానికి అయిదుగురు అనాధలను చేర దీసి వారికి వసతి, ఆహారం సమకూర్చి విద్యా బుద్ధులు నేర్పించి తల్లిగా అండగా నిలిచింది .’తీరాంధ్రం లోనే మొదటి స్త్రీ సమాజాన్ని ఓరుగంటి సుందరీ రత్నాంబ గారితో కలిసి ‘’బృందావన స్త్రీల సమాజం ‘’పేరిట 1902 లో మచిలీ పట్నం లో నెలకొల్పింది
‘’ అబలా సచ్చరిత్ర రత్న మాల ‘’అనే గ్రంధాన్ని అచ్చమాంబ రాసింది .అందులో1000 ఏళ్ళ కాలం నాటి i 34మంది హిందూ సుందరీమణుల చరిత్రలను మధురం గా వర్ణించింది .ఆమెకు కుట్టుపని అల్లిక లలో మంచి ప్రావీణ్యం ఉండేది ‘’క్రోషా అల్లిక ‘’పై ఆమె వ్యాసాలను ‘రాసి ‘’హిందూ సుందరి ‘’పత్రికలో ప్రచురించింది .ఆంద్ర దేశం అంతటా పర్య టించి అనేక ఉత్సాహక ప్రసంగాలు చేసి మహిళోద్యమానికి నాంది పలికి స్త్రీ జనాభ్యుదయానికి వారిని సమాయత్త పరచింది .స్త్రీజనాభ్యుదయం పై అనేక పత్రికలలో వ్యాసాలు రాసి చైతన్య పరచింది .మహిళా సమాజాలను స్థాపించి సేవలందించింది .రాష్ట్రమంతా తిరిగిఅనేక చోట్ల మహిళా సమాజాలను నెలకొల్పింది .
ఆచ్చమాంబ ఆ కాలం లోని అనేక విషయాల పైనా స్త్రీ సమస్యల మీద గొప్ప కధలు రాసి తొలితరం మహిళా రచయిత గా గుర్తింపు పొందింది .తెలుగు బ్రిటిష్ మహిళలపై అనేక జీవిత చరిత్రలను రాసి మార్గ దర్శనం చేసింది .190
అచ్చమాంబ రాసిన ‘’ధన త్రయోదశి ‘’కధ మనం అందరం మొదటి తెలుగు కధానిక గా భావిస్తున్న1910లో వచ్చిన గురజాడ అప్పారావు గారి ‘’దిద్దు బాటు ‘’కధ కంటే ముందు రాసినదే నని అందరూ అంగీకరింఛి అచ్చమాంబ గారి ధన త్రయోదశి కద మాత్రమె ‘’తొలి ఆధునిక కద’’ అని ఎందరెందరో నిక్కచ్చిగా చెప్పారు . ఆమె రచనలలో ‘’బీదకుటుంబం,ఖానా ,శతకం ,’’ఉన్నాయి .ఆమె రాసిన ‘’దంపతుల ప్రధమ కలహం ,విద్యా వంతులగు యువతులకు ఒక విన్నపం ,స్త్రీ విద్య ప్రభావం ‘’మొదలైన వ్యాసాలూ హిందూ సుందరి, సరస్వతి పత్రికలలో ప్రచురింప బడినాయి .అచ్చమాంబ ‘’ధన త్రయోదశి ‘’కద హిందూ సుందరి లో 1902లో ప్రచురితమైంది . బీద యువ దంపతుల కద ఇది . .దీపావళి కి దీపాలు కూడా వెలిగించలేని గర్బః దరిద్రం వారిది .భర్త నేరం, కుటిలోపాయం చేసి డబ్బు సంపాదింఛి దీపావళి జరుపుకొందామని ప్రయత్నం చేస్తే వారించి అతనిని సన్మార్గం లో పెట్టిన సద్గుణ రాశి అయిన యువతి కధ.
సోదరుడు లక్ష్మణ రావు సహాయం తో 1901లో అచ్చమాంబ రాసిన ‘’అబలా సచ్చరిత్రమాల ‘’లోని కొన్ని భాగాలు కందుకూరి వీరేశలింగం గారి ‘ప్రముఖ పత్రిక ‘’చింతామణి ‘’లో ప్రచురింప బడ్డాయి .ఆమె రాసిన’’ ఖనా ‘’ప్రముఖ భారతీయ ఖగోళ గణిత శాస్త్ర వేత్త ‘’వరాహ మిహిరుడు ‘’భార్య’’ఖన కధ.అచ్చమాంబ దేశమంతా పర్య టించి అనేక మంది ప్రసిద్ధులైన విద్యా వేత్తలతో పరిచయం సాధించి వారి మెప్పు పొందింది .మహిళోద్యమానికి మద్దతు కూడా గట్టింది 1905జనవరి 18నఅచ్చమాంబ తన సోదరుడు లక్ష్మణ రావు దగ్గర మధ్యప్రదేశ్ లోని బిలాస పూర్ లో మరణించింది.1905జనవరి 18నఅచ్చమాంబ తన సోదరుడు లక్ష్మణ రావు దగ్గర మధ్యప్రదేశ్ లోని బిలాస పూర్ లో మరణించింది.