రాచకీయ ద్విప్లేట్స్ -8

           రాచకీయ ద్విప్లేట్స్ -8

1-పెద్దల సభకు సీటిచ్చినా రాముడు  ,ఇవ్వక నరసింహుడు ,అవమానం అని రాజూ ఏడుపు

  నామినేషన్ల ముందే ఇంత జరిగితే ,ఎన్నికప్పుడు కోట్లు పోయి సీట్లూ పోయి లబో దిబో నేనా ముగింపు?

2-బెజవాడలో మోడీ విజయం కోసం సభ పెట్టిన వెంకయ్య

  బానే జనాన్ని సమీకరించి విజయాన్ని సాధించినందుకు మెచ్చిన  రజ్జూ భయ్యా .

3- కరుణ ఇంట్లో విభేదాల కుంపటి

  జనం నడుస్తారా అలగిరి వెంబటి ?

4-స్టాలిన్ ను వారసుడిగా ప్రకటించి చేద్దామనుకొంటే డిక్టేటర్

   వెంట పడి గెలిపిస్తాడా గుడ్డిరాజుతో  కేడర్ తో బాటు ఓటర్ ?

5-లాస్ట్ బాల్ విసరకుండానే విసిరాడు సి.ఏం కిరణ్ సవాల్

   వ్యూహం అర్ధం కాక జనం చేస్తున్నారు అనేక  ఊహాగానాల్ .

6-అందర్నీ  దులిపేసి హీరో అనుకొన్నాడు నటుడు ఓవర్ యాక్షన్ తో మోహన్ బాబు

  పాప ప్రక్షాళనం చేసే మరో పోపు ననుకొంటున్నాడేమో టింగిరి డింగిరి  మాటల నవాబు .

7-ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఆపే హక్కు ఉంది బి.జే.పి.కి మాత్రమే

 అన్న ఆశ తో ఉన్నారు పాపం దింపుడు కళ్ళం ఆశతో కొద్ది మంది మాత్రమే.

8-మళ్ళీ పొడుస్తుంది దిన పత్రిక ఉదయం

 దాసరిమాటకు పడాలి కార్డు శుభోదయం  .

9-అత్యంత సమర్ధ భావి భారత ప్రధాని అవుతాడని మోడీ

 ‘’నమో’’ ‘’నమో’’ అని ఎదురు చూస్తున్నారు బాబు తో జోడీ .

10-తెలుగు దేశం సీటు కోసం పాటు తెగ పాటు పడుతున్నాడు వేణు మాధవ్   

   నవ్వులు పూయించి చట్ట సభ టెన్షన్ తగ్గించి అవుతాడా క్రేజీ మాధవ్ ?

11-శాసన సభలో వ్యూహాత్మకం గా పావులు కదిపి తీర్మానాన్ని ఓడించిన కిరణ్ ,మనోహర్

   ఇప్పుడే విన్న ఈ వార్తకు సీమాంధ్రుల తొలివిజయం గా జరుపుకుంటున్న తీరు నయన మనోహరం .

12-రెండు కళ్ళ సిద్ధాంతం తో ఇరకాటం లో అప్పుడు సందిగ్ధం లో చంద్ర బాబు పడ్డాడు  

  కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు బిల్లు  తిరస్కరణ తో ఇప్పుడు సేఫ్ జోన్ లో పడ్డాడు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-14-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రాజకీయం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.