రాచకీయ ద్విప్లేట్స్-9(శునకానందం స్పెషల్ )

   రాచకీయ ద్విప్లేట్స్-9(శునకానందం స్పెషల్ )

1-అసెంబ్లీ లో బిల్లు వోడిపోతే కే.సి.ఆర్. సీమాంధ్రుల ది అన్నాడు శునకానందం

 పాపం గత ‘’జన్మ’’స్మృతి ఇంకా వీడక పొండుతున్నాడేమో అను క్షణం రాక్షసానందం

2-అసెంబ్లీ’’ బావి’’ లో అందరూ అయ్యారు కప్పలు

  బిల్లు తిరస్కరించటానికే ఇంతగా పడ్డారు ఈ తిప్పలు ‘

3-ఆంద్ర ప్రదేశ్ నుంచి ధిల్లీ వెళ్లి  వెంటబెట్టుకొని తిరిగోస్తాడట సగర్వం గా  తెలంగాణ

   ఇలా చెప్పి ఉత్తి చేతుల్తో ఎన్ని సార్లు వాపసోచ్చాడో  ‘’దొర’’-,వెంట లేకుండా తెలంగాణ

4- అందరూ చేతులు దులిపేసుకొని ఎదురు చూస్తున్నారు ధిల్లీ వైపు

   ‘’ప్రణవ మంత్రమే ‘’పఠిస్తూ ఆశ గా ఎవరికి వారు ఉన్నారు వస్తుందని కైపు .

5-పెద్దల సభ ఎన్నికకు ప్రభాకర రెడ్డి ఆదాల

  ఆడుతున్నాడు నాటకం పిల్లాడిలా ఉన్నట్లు అడ్డాల.

6-నన్నప నేని ప్రవర్తించింది  నిన్న అచ్చమైన రాజకుమారిలా

  వీరోచిత పోరాటం లో విజయం కోసం తెగించి చేసిందేమో అలా.

7-అబ్ డిల్లీ దూర్ హై అని దూరం గా ఉంటున్నాడు ముఖ్యమంత్రి  కిరణ్

  అడ్డుకోలేక సతమతమౌతోంది  క్రమశిక్షణ అరచేత్తో ప్రతాప  సూర్య కిరణ్ .

8-  నిన్న ‘’బావి ‘’లోకి లంఘించిఎన్నో సార్లు  దూకిన మేనల్లుడు  హరీ

      అన్ని సార్లూ అడ్డుకొని కాలులాగి కౌగిలించి అడ్డుకొని చేశారు కిరి కిరీ

9-  శునకానికి ఎక్కువస్వామి భక్తీ ,విశ్వాసం

    అవిలేకే ‘’తూలుడు’’ మాటల తో ‘’దొర’’ గారి అవిశ్వాసం .

10-మనుషులు విడినా కలిసున్నా మనసులు కలవాలి

    అన్యోన్యం ఆత్మీయత ఎక్కడున్నా నిరంతరం కురవాలి .

11-క్షణికానందం వద్దు కావాలి మనకు శాశ్వతా నందం

    అదేదో ‘’ఆయన’’ కే ఇచ్చేద్దాం కోరుకొన్న శునకా నందం .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-14-ఉయ్యూరు

    

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రాజకీయం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.