హోమర్ నుండి జాయిస్ దాకా -3(చివరి భాగం )
జోనాధన్ స్విఫ్ట్
జోనాధన్ స్విఫ్ట్ రాసిన గలివర్ ట్రావెల్స్ ఎన్నో రకాల కొత్తదనాన్ని సంత రించుకుంది .ఇది ప్లేటో కు వ్యతిరేకం గా ఉన్నట్లు ఉంటుంది .ఇందులోని Houyhnhnmsఅనే వాళ్ళు స్వీయ నియంత్రణ కలిగి ,మంచీ మర్యాడకల ,నిజాయితీపరులు .సమన్వయము ఉన్న వారు .అప్పుడే నాగరకతలో ప్రవేశించిన నవీనులు .త్వరగా నేర్చే శక్తి ఉన్నవారు .అంత లేకి స్వభావం అంత అందమైన వారూ కారు .భయపడరు .పిరికి పందలూ కారు .చావు అంటే అసలు భయం లేని వారు .రచయిత స్విఫ్ట్ ‘ideal rational republic is much horse cultured ‘’అన్నాడు .’’hous’’లు వేదాంతులు ,వీరి జీవితం తర్కం పైన నడుస్తుంది .’’yahoos’’అనే వాళ్ళు సామాన్య మానవులు .వీరు తిండికి బానిసలు .ఈ యాహూ నే మన వాళ్ళు డాట్ కాం గా ఉపయోగిస్తున్నారు .’’justice is present when reason controls spirit and spirit controls appetite .’’ అని వీళ్ళ స్వభావాన్ని తెలియ జేశాడు .’’Hous’’అనే వారు బుద్ధి మంతులు ,ఆలోచనాపరులు . గలివర్ వంటి సైనికులను మంచి స్వభావాలు ధైర్య సాహసాలే నియంత్రిస్తాయి .సాధారణ మానవులైనా యాహూలు కనీస అవసరాలైన ఆకలి వంటి వాటి చేత నియంత్రింప బడతారు .కనుక వీరిని రాజ్యం రాజ్యాంగం సంస్కరించి వృద్ధి లోకి తేవాలి .ఇందులో కొన్ని మాటలు చాలా అర్ధ వంతం గా ప్రయోగిస్తాడు స్విఫ్ట్ .’’hubris’’అంటే గర్వం తో మదించిన వాడు.గలివర్ మొదటి యాత్రలో తన లోకి తప్ప చుట్టూ ఉన్న ప్రపంచం అంతా చూస్తాడు .చివరి యాత్రలో స్నేహం బంధుత్వాలను అవతలివారు బలవంత పెడితే ఒప్పుకుంటాడు .దీన్ని అందుకే ‘’mock epic ends in mock tragedy .’’అన్నారు విశ్లేషకులు .స్విఫ్ట్ ఈ నవలలో జంతువుకు –ఆలోచనా పరులకు తేడా చూపిస్తాడు .మనిషి ఆలోచన వివేచనా పరుడిగా చిత్రిస్తాడు .తర్కానికి ప్రాధాన్యత నిస్తాడు హౌసులు రీజన్ కే ప్రాధాన్యత నిచ్చి ఆత్మను పట్టిన్చుకోరు .వీరికి ఆకలి గోల లేదు .యాహూలకు ఆకలే తప్ప ఆత్మ జ్ఞానం ,ఆలోచనా లేవు .గలివర్ యత్రికుడికి ఆకలీ ఆత్మా ఆలోచనా మూడూ ఉన్నాయి .అందుకని ఈ మూడిటిని వదిలేసి ‘ange beta’’ప్రపంచం లో ఏ మనిషి అతనికి కనీ పించలేదు .ప్లేటో కోరిన యుటోపియా కాని ,అఆధునిక మానవుడు కలలు కంటున్న సమాజం కాని ,సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం ఉన్న మనుష్యులు కాని కనీ పించలేదు .సోక్రటీస్ ‘’పరీక్షించని జీవితం జీవించటానికి అర్హమైంది కాదు ‘’అని చెప్పాడు .స్విఫ్ట్ ‘’స్వీయ విశ్లేషణ స్వచ్చమైన ఆలోచన కు పరిమిత మైతే అప్పుడు నువ్వు పరీక్షించిన జీవితం జీవించటానికి అర్హమైనది కాదు ‘’అని అభిప్రాయ పడ్డాడు .
డాస్టొవ్ స్కి
డాస్తోవ్ స్కి ‘’the brothers karmazov’’నవల రాశాడు .ఇతని దృష్టిలో ‘’god’s locomotive passes over the bodies and souls of all characters .it is both a murder mystery and spiritual mystery .’’దేవుడు స్వేచ్చ అనే వరం ఇచ్చాడని భావించాడు .పడటం లేవటానికే అంటే చావటం మళ్ళీ పుట్టతానికే అనే తత్త్వం చెప్పాడు .అన్నిటికీ అందరూ బాధ్యులే నంటాడు.బాధలతో జ్ఞానం రాదన్నాడు .సమాజం పై ప్రేమ ,తోటివాడి పై సానుభూతి ఆదరణ ,అతని అస్తిత్వాన్ని గుర్తించటం అనేదే ‘’అందరూ ఆన్నిటికి బాధ్యులు ‘’అన్న దానికి నిర్వచనం .
టి.ఎస్.ఇలియట్
ఇలియట్ రాసిన ‘’వేస్ట్ లాండ్ ‘’కావ్యం జగద్విఖ్యాతః మైంది .ఇది మరణం పునరుత్థానం లకు సంబంధించింది .అతని భావనలో స్మశానంలేక సమాధి అంటే ‘’emotional rather than intellectual .disillusions meant melancholy ‘’.వేస్ట్ లాండ్ కవిత జీవితం లో చావు ను గురించి చెప్పింది .ఆ కవిత కొన్ని రేణువులే కాని అంత్య ప్రాసలు కావు (the poem is particles than rhymes).అది జీవితానికి అర్ధం వివరించేది .ఇందులోని నీరు అగ్ని పుట్టుక ,చావు ప్పునర్జన్మలకు స్థావరాలు .ఇందులో ‘’objective correlative theory ‘’ఉందని విశ్లేషకాభిప్రాయం .వేస్ట్ లాండ్ కవితను ‘’A ghost poem full of un identified voices of the dead phantoms ,invisible prophets ‘’గా అభివర్ణిస్తారు .భారతీయ పదాలను ఇందులో ఉపయోగించి పాశ్చాత్య దేశాలలో వాటి వ్యాప్తికి దోహద పడ్డాడు ఇలియట్ .దీన్ని ప్రచురించటానికి ఎజ్రా పౌండ్ కవి ఎంతో ప్రోత్సహించాడు .దీని నడక తమాషా గా ఇలా ఉంటుంది ‘’water rock ,rock water road ,road mountains ,mountains rock water ,water rock ‘’దీన్ని ‘’టైట్ పాటేర్న్ ‘’అన్నారు
జేమ్స్ జాయిస్
జేమ్స్ జాయిస్ రాసిన ‘’యులిస్సేస్’’ఆధునిక కవిత కు మార్గ దర్శకత్వం చేసింది . వ్యతిరేక మైనదికాదని ‘’yes’’అని ఉపయోగించాడని అంటారు .’’lovely nothingness of every day life ‘’ ను రచయిత ప్రత్యక్షం గా చూశాడు .కుటుంబ జననం ,జీవితం లోని సంతోషం ,విషాదం నిండి ఉంటుంది ‘’Joyce elebrates the creativity of the family ,the joys ,the sorrows of life ,the at –one –mea nt of author and reader through the shares of imaginative recreation afforded by great literature and the courage and dignity of which the human spirit is capable ‘’అనేది యులిసిస్ లో సారం గా చెప్పారు .దీనితో కవిత్వం లో ‘’చైతన్య స్రవంతి ‘’-స్ట్రీం ఆఫ్ కాం షస్ నెస్ ‘’ను ప్రారంభించిన మొదటి వాడని పించుకొన్నాడు జేమ్స్ జాయిస్ .
ఇలియట్ ,పౌండ్ ,జాయిస్ అనే ఈ త్రయం కవిత్వం లో కొత్త మార్గాలను తొక్కారు .కొత్త భావ వ్యాప్తి చేశారు .కొత్త లోకాలనూ సృష్టించి చూపించారు .అందుకే వీరు ‘’అమరత్రయం ‘’అని పించుకున్నారు .వీరిని అనుసరించి కవిత్వం రాయని ఆధునిక కవి ఏదేశం లోనూ లేడనే చెప్ప వచ్చు ఇలా ఆదికవి హోమర్ నుంచి జాయిస్ దాకా వచ్చిన అనేక మార్పులను ,కొత్త పద్ధతులను ,రచయిత ‘’వాలెస్ గ్రే ‘’అరచేతిలో అరటి పండులా చక్కని విశ్లేషణ తో మన ముందుంచాడు. గ్రే నిజం గా రచనకు ‘’గ్రేస్ ‘’తెచ్చాడు .
సమాప్తం
అమెరికా (హూస్టన్ )లో 7-10-2002 నాటి నా డైరీ నుండి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-2-14-ఉయ్యూరు
Good post! Sir, I am looking for season’ descriptions in telugu – I studied some of it in my college days as Non-detail. I don’t remember the author’s name. I remember about a cow-herd boy sitting on a cow and going on a muddy road, the rising dust, color was beautifully described. If you know, the author or book, please e-mail me to – darbhasastry@yahoo.com
Thanks you very much.
I forgot to mention that description was in ‘vachanam.’