విక్టర్ హ్యూగో
‘’supreme romantic bard of French literature’’అని పేరు పొందిన విక్టర్ హ్యూగో 1802లో పుట్టాడు .అసలు పేరు విక్టర్ మేరీ హ్యూగో .ఫ్రెంచ్ అకాడెమి గుర్తించిన కవి ప్రముఖుడు .1948లో మరణ శిక్ష పడింది .1949లో లేజిస్లేటివ్ అసెంబ్లీ కి ఎన్నికైనాడు .1951దేశ రాజకీయాలకు బలై పారిపోయి ప్రవాస జీవితం గడిపాడు .1860లో ఫ్రాన్స్ పాలకుడు గరి బాల్డీ కి అనుకూలం గా ఉన్నాడు .మళ్ళీ పారిస్ తిరిగి వచ్చాడు .1876 ఫ్రెంచ్ సెనేట్ కు ఎన్నికయ్యాడు .1885లో ఎనభై మూడవ ఏట మరణించాడు .ఎన్నో ఉత్థాన పతనాలను ఎదుర్కొన్న కవి రచయిత హ్యూగో .మూడవ నెపోలియన్ హ్యూగో ను దేశం నుంచి బహిష్కరించాడు .
ఓడ్స్,బాలడ్స్ ,పోయెమ్స్ రాశాడు హ్యూగో .నియో క్లాసిక్ నుంచి దృష్టిని మరలించాడు గగమనమూ మార్చుకొన్నాడు .హ్యూగోప్రభావం పడని రచయిత లేడు.Notre dame de Paris ,les miseraables రచనలకు ప్రపంచ వ్యాప్తం గా గొప్ప పేరొచ్చింది .ఈ రెండూ మానవ బాధలను కష్టాలను చాలా శక్తి వంతం గా వివరించి ఆ నాటి ప్రజల్ని ఆకట్టుకొన్నాయి .హ్యూగో కు బ్రహ్మ రధమే పట్టారు .కొన్ని సానేట్స్ ,కొన్ని నాటకాలు కూడా రాశాడు .రాసిన ప్రతి దాంట్లోనూ కొత్తదనం తీసుకొని రావటమే హ్యూగో ప్రత్యేకత .హ్యూగో కుమార్తె ‘’Adele’’తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ‘’My father reads his poems on religions ,and began by speaking of religion of’’ Siva ‘’అన్నది అంటే శైవం పై హ్యూగో కు మక్కువ కలిగిందని తెలుస్తోంది .హ్యూగో కు ‘’విశ్వ ప్రేమ ‘’ఉంది .అతని కవితలో శైలీ విన్యాసానికి ముగ్దులవుతాం .సృజనకు ఆశ్చర్య పడతాం .ఈ రెండిటి తో హ్యూగో సాహిత్య లోకం లో గొప్ప రచయిత అని తన సాధన తో నిరూపించు కున్నాడు .మచ్చుకు ఒక కవిత చూద్దాం .
‘’ Love seeketh not itself to please –nor for it self hath any care –but for another gives its ease –and builds a Heaven in Hell’s despair .
As I wander the forest –the green leaves among –I heard a wild flower singing a song .
థామస్ గ్రే
థామస్ గ్రే లండన్ లో16-12-1716లో జన్మించాడు .1743లా పట్టా ఒంపొందాడు .1751లో ‘’ఓడ్స్’’రాశాడు .1768లో కవితలు రాశాడు .1771జులై ముప్ఫైన మరణించాడు.ఎడ్మండ్ స్పెన్సర్ వలే గ్రే ను ‘’కవులకు కవి ‘’అంటారు .చాలా స్పష్టం గా గొప్ప శైలితో కవిత్వాన్ని చెప్పేకవి .కవిత్వ కళ పుష్కలం గా ఉన్న వాడు బతికింది యాభై అయిదు ఏళ్ళు మాత్రమే అయినా మంచి ప్రభావం చూపాడు .అతని కవిత్వం లో ‘’sympathetic human voice ‘’ఉందని మెచ్చుకొంటారు.
.ఆత్మ శక్తి అధికం గా ఉన్న కవీశ్వరుడు .ఒంటరి వాడి పోయాడు .శ్రావ్యత అలంకారం నిండిన కవితల్ని రాసి కీర్తి పొందాడు .కొన్ని కవితలను ఆస్వాదిద్దాం .
1-on hasty wings thy youth is flown –thy sun is set –thy spring is gone –we flock while it is May
2-no more where ignorance is bliss –itsfolly to be wise
3-there confusion ,terror’child –conflict fierce and ruin wild –Agony that pants for breath –despair and honourable death
.
హెచ్ జి.వెల్స్
‘’ This century’s remarkable literary figure .Writer ,scientist ,philosopher ,humanist ,public figure ,lover ,homo sexual etc.’’ ఇదీ వెల్స్ గారి ఘనత .అమెరికా లోని మెయిన్ యూని వర్సిటి లో హిస్టరీ ప్రొఫెసర్ .పూర్తీ పేరు హెర్బర్ట్ జార్జ్ వెల్ల్స్.ఆయన ది’’రెడియేటేడ్ ఎనర్జీ ‘’అంటారు .మహా మేధావి భావ తీవ్రవున్న వాడు. .శారీరక, సెక్స్ జీవితం లో నిష్ణాతుడు .మహిళా హక్కులను గౌరవించాడు .కుటుంబ నియంత్రణ ను ప్రోత్సహించాడు .విశ్వ వ్యాప్త విద్య కోసం ఆరాట పడ్డాడు .నిరాయుధీకరణకు మద్దతు పలికాడు .ప్రపంచ శాంతి కావాలని నిర్ద్వందంగా ప్రకటించాడు .అందుకే వెల్స్ ను ‘’desperaterly mortal ‘’అని పిలిచారు .
వెల్స్-21-9-1866 నజన్మించాడు .1884-87కాలం లో ‘’సైన్స్ స్కూల్ జర్నల్ ‘’కు సంపాదకుడి గా సమర్ధ వంతం గా పని చేశాడు .1892నుంచి ఆపులేకుండా రచనలు చేయటం ప్రారంభించాడు .మొదటి భార్య ఇసాబెల్ కు విడాకు లిచ్చి జెన్ ను పెళ్ళాడాడు .’’the time machine ,wonderful visit ‘’నవలలు రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు .1896 లో ‘’దివీల్స్ ఆఫ్ చాన్స్ ‘’,తర్వాత’’దిఇన్విజిబుల్ మాన్ ‘’. మొదలైన వంద రచనలు చేసి పారేశాడు .’’the war of the worlds .tales of space and time ,the discovery of the future ,the sea lady ,’’మొదలైన సైంటిఫిక్ ఫిక్షన్ నవలలు రాశాడు .1905లో ‘’modern Utopia ‘’,war in the air ,రాశాడు .1914లో రష్యా లో పర్యటించాడు .1916లో ‘’the elements of re construction war propaganda పై మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో పని చేశాడు .1920లో ‘’the outline of history ,రాశాడు world’disarma ment race’’ను సమీక్షించాడు .’’మెన్ లైక్ గాడ్స్ ,రాశాడు .PE N కు ప్రెసిడెంట్ గా పని చేశాడు .మళ్ళీ రష్యా పర్యటన చేశాడు .1940లో ‘’rights of man declaration ‘’ప్రకటించాడు .1946లో ఎనభయ్యవ ఏట మహా రచయిత హెచ్ జి.వేల్స్ మరణించాడు
రష్యా పాలన పై ధ్వజ మెత్తి నందుకు వెల్స్ పై కమ్యూనిస్టులు గుర్ర్రు గా చూస్తారు .ఆయన చని పోయిన తర్వాత ఆయన పేర ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తే ఎవరూ సహక రించాలేదు .ఇప్పుడిప్పుడే స్పందన బాగా వస్తోంది .కారణ జన్ముడు వేల్స్ .బస్తాల కొద్దీ రాశాడు .ముట్టిన దంతా బంగారమే అయింది .అన్నిటికి వరవడి పెట్టాడు .ఆయనది’’ పాదరస మేధ’’ అంటారు .జంతు శాస్త్రం పై టెక్స్ట్ బుక్ రాశాడు .జీవ పరిణామ సిద్ధాంత కర్త చార్లెస్ డార్విన్ పై వేల్స్ ‘’అధారిటీ. ‘’స్వయం గా సాధించి ఎందరిలో వెలుగు చూపించాడు సూర్తి కల్గించాడు .ఒక శతాబ్దానికి సరిపడా వెలుగు నిచ్చిన మేధావి రచయిత వేల్స్ .A well of knowledge ‘’అనిపిస్తాడు హెచ్ .జి వేల్స్ .
9-10-2002 బుధవారం నాటి నా అమెరికా (హూస్టన్ ) డైరీ నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-2-14-ఉయ్యూరు