తెలుగు వికీ పీడియా దశాబ్ది ఉత్సవం
ఫిబ్రవరి పదిహేను ,పదహారు తేదీలలో విజయవాడ కాకర పర్తి భావనారాయణ కాలేజి లో తెలుగు వీకీ పీడియా దశాబ్ద ఉత్సవాలు జరిగాయి .నాకు పంపిన ఆహ్వానాన్ని మద్రాస్ లో ఉండగా చూసి అందరికి పంపాను .నిన్న వెళ్ళటం కుదరలేదు. ఇవాళ ఆదివారం వన్ టౌన్ లో ఒక చిన్న పని ఉన్నందున అది చూసుకొని కే బి యెన్ కాలేజి కి వెళ్లేసరికి పదిన్నర దాటింది .అప్పటికి ప్రారంభం కాలేదు. జి వి పూర్ణ చంద్ ,కాలానాధ భట్ట వారూ వచ్చారు నాతో బాటు .వీకీ పీడియన్లు పాతిక మంది కంటే కనీ పించలేదు. విద్యార్ధులు బాగానే పాల్గొన్నారు .వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ కూడా చేశారు .కాలేజి యాజమాన్యం ఈ కార్యక్రమానికి బాగా సహకరించి అన్ని ఏర్పాట్లు చేసింది .బయట ఊరి నుంచి వచ్చిన వారికీ వసతి కల్పించింది .హాజరైన వారందరికీ రెండు పూటలా టిఫిన్ కాఫీ భోజనాలను ఏర్పాటు చేసి గొప్ప ఉత్సాహాన్ని చూపింది .అందుకు వారు అభినంద నీయులు .’’కళా సదన్ ‘’అనే ఆరుబయట వేదిక మీద షామియానాలో కార్యక్రమం మొదలైంది .ఇంతలో వాన దంచేసింది .వేదిక ను మూడవ అంతస్తులోని సెమినార్ హాల్ కు మార్చారు .
సభాధ్యక్షులు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబ రావు .పూర్ణచంద్ ,ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు ,మొదలైన వారందరూ అతిధులు .అర్జంట్ కేసు ఒకటి ఉండటం వలన రమేష్ బాబు ముందు మాట్లాడి వెళ్లి పోయారు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు .ఆయన వెళ్లి పోయిన తర్వాత ప్రార్ధన తో అసలు సభ ప్రారంభమైంది.ఒక విద్యార్ధిని శ్రావ్యం గా గీతం ఆలా పించి వన్నె తెచ్చింది జ్యోతి ప్రజ్వలనం చేశారు .పూర్ణ చంద్ మాట్లాడుతూ తానూ తెలుగు వీకీ పీడియా ను తన రచనలకు బాగా ఉపయోగించుకోన్నానని ,తన రిఫెరెంస్ లలో ఎక్కువ భాగం వీకీ పీడియా కే సరిపోతోందని హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు .అన్ని ఫాంటుల కంటే కొత్త గా వచ్చిన ‘’మండలి ఫాంట్’’ చాలా బాగా ఉందని నిస్సంకోచం గా ఉపయోగించుకోవచ్చు నని , తాను దానినే అనుసరిస్తున్నానని చెప్పారు .’’వీవెన్ ‘’గారు తనకు ఇచ్చిన సలహాలు ఎంతో విలువైనవని కృతజ్ఞతలు తెలియ జేశారు .తాను వెన్నా అర్జున్ అభిమాని నన్నారు .మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో విజయ వాడ ఘంటసాల సంగీత కాలేజిలో మూడవ ప్రపంచ తెలుగు రచయితల సభలు జరుగుతాయని అందరూ పాల్గొనాలని మూడవ రోజు ‘’సాంకేతిక విజ్ఞానం- తెలుగు’’ మీద సదస్సు ఉంటుందని తెలిపారు పూర్ణచంద్ .వెన్నా అర్జున్ అంటే ఉయ్యూరు లో మాతో పాటు పని చేసి చని పోయిన లెక్కల మేష్టారు వెన్నా రాజా రావు గారి అబ్బాయేమో నని నాకు అని పించింది .అతను దీనిలో బాగా ప్రావీన్యుడు అయ్యాడని మన సరసభారతి బ్లాగ్ ను రెగ్యులర్ గా చదువుతున్నాడని మండా బాలాజీ తో చెప్పినట్లు బాలాజీ నాతో ఇటీవల అన్నాడు అందుకే ఈ అనుమానం .
‘’ సందట్లో సడేమియా’’ గా నాకు ఇక్కడ ఒక ‘’ఫాన్ ‘’పరిచయమయ్యారు ఆయన పేరు సి.వి.రావు .మన బ్లాగులను రోజూ చదువుతానని బాగుంటాయని మంచి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుందని ,దాదాపు రిఫెరెంస్ గా ఉంటాయని మెచ్చారు .చాలా ఆనందం వేసింది ఆయన వీకీ పీడియా కు తొమ్మిదేళ్ళ నుండి సభ్యులట .అందులో తన ఆర్టికల్స్ ఉన్నాయట .నాకు దీని సంగతి తెలియక పోవటం ఆశ్చర్యం .నేను అందులో ఎందుకు మెంబర్ కాలేక పోయానో తెలియదు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నేనూ మెంబర్ అయితే బాగుండేది అని పించింది . చేరాలి .అమీర్ అహ్మద్ దీని స్థాపన ,ప్రయోజనం, సేవలను వివరించారు .అర్జున రావు .పదేళ్ళ ప్రస్తానం లో ప్రముఖ పాత్ర పోషించారని అందరూ చెప్పుకొన్నారు .వాణిజ్య సంబంధం లేని మీడియా లలో తెలుగు వీకీ పీడియా అగ్రస్థానం లో నిలిచిందని ,అత్యధిక ప్రాధాన్యత కలిగిన వాటిలో అయిదవ స్థానం లో ఉందని ప్రకటించారు .ఇప్పటికి తెలుగు లో వివిధ అంశాల మీద 55,000వ్యాసాలూ అందులో చేరి ఎంతో ప్రాధాన్యతను సంతరించాయని అందరికి కర దీపికగా నిలుస్తోందని ‘’వీకీ’’ అంటే వేగవంతమైన అని ‘’పీడియా’’ అంటే విజ్ఞాన సర్వస్వం అని వివరించారు .
ఉదయం పదిన్నరకు సమోసాలు టీ లతో అల్పాహారం ఇచ్చారు .పది మంది వీకీ పీడియన్ లకు ఘన సత్కారం చేశారు .వారి సేవలు నిరుపమానమైనవని కీర్తించారు .అందులో వీవెన్ ,అర్జున రావుసుజాత, రెడ్డిగారు మొదలైన వారున్నారు .వీరికి పది వేల రూపాయలు నగదు పారి తోషికం ఒక జ్ఞాపిక, వీకీ పీడియా తెల్ల టీ షర్ట్ కానుక గా తుర్ల పాటి వారి చేతుల మీదుగా అంద జేశారు .వేదిక మీది అతిధులకు జ్ఞాపిక, టీషర్ట్ లు బహూకరించారు .
‘’ పెద్ద బాల శిక్ష ‘’పుస్తకాన్ని అన్నివివరాలతో విశేషాలతో ఎప్పటి కప్పుడు ఆధునీకరిస్తూ ఇప్పటికి 18 సార్లు పునర్ముద్రించిన శ్రీ గాజుల సత్యనారాయణ గారికి ప్రత్యేకం గా సన్మానించారు .గాజుల వారు పుస్తకానికి’’ ఒక్క రూపాయి మాత్రమె ‘’లాభం గా తీసుకొని దీన్ని ముద్రించి ఎన్నో లక్షల మందికి ఉపయోగ పడేట్లు చేస్తున్నారని పూర్ణ చంద్ హర్షధ్వానాల మధ్య తెలియ జేశారు .గాజుల వారు రాసి ముద్రించిన ‘’తెలుగు వారి సంప్రదాయ వేడుకలు ‘’అనే 27రూపాయల చిన్న పుస్తకాన్ని అందరికి ఉచితం గా అందజేశారు .దాన్ని తిరగేస్తుంటే అందులో నాకు ఒక దోషం కనీ పించింది ‘’శంఖు స్థాపన ‘’అనే శీర్షిక కనీ పించింది .అది ‘’శంకు స్థాపన ‘’అని ఉండాలని చెప్పాను ‘’నిజమే నండీ పొరబాటు జరిగింది ‘’అన్నారు .ఆయన న ఇటీవల ప్రచురించిన భారత దేశ దేవాలయాలు ‘’అనే పుస్తకాన్ని నేను బుక్ ఎక్సి బిషన్ లో కొన్నాను .ఇంకా తెరిచి చూడలేదు .ఈ మధ్య చలపాక ప్రకాష్ గారు ఏదో విషయం మీద నాతో ఫోన్ చేసి మాట్లాడుతూ ‘’గాజుల సత్యనారాయణ గారి ఈ పుస్తకం లోమీ పేరు కూడా ఉదాహరించారు ‘’అని చెప్పారు ‘’పుస్తకం కొన్నాను కాని ఇంకా చూడలేదని ‘’చెప్పాను ఇవాళ గాజుల వారితో ఈ ప్రస్తావన తెచ్చాను .నేను ఆయనకు బాగా పరిచయమే .బాల సాహిత్య చక్ర వర్తి శ్రీ ముదునూరు వేంకటేశ్వర రావు గారికి సరసభారతి రెండేళ్ళ క్రితం సన్మానం చేసి నప్పుడు గాజుల వారినీ ఆహ్వానించాను .ఆయన స్వగ్రామం లో దసరా ఉత్సవాలలో ఉంటానని తీరిక దొరకదని ఇంకో సారి వస్తానని అన్నారు .ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చాయి .
తుర్లపాటి వారు తాను రాసుకొన్న తన జీవిత చరిత్ర’’నా కలం నా గళం’’పుస్తకాన్ని వీకీ పీడియా లో పెట్టటానికి సకల హక్కులు రాసి దాఖలు పరచారు వేదిక మీద .ఇలా అయిన మొదటి పుస్తకం గా అది రికార్డు పొందిందని నిర్వాహకులు ప్రకటించారు .ఈ కాలేజి విద్యార్ధులు కంప్యూటర్ మేస్టర్ శ్రీ రమేష్ నాయకత్వం లో కే బి.యెన్ కాలేజి చరిత్ర అభి వృద్ధిని ‘’QR code’’లో నిక్షిప్తం చేసి ప్రపంచం మొత్తం మీద దీన్ని వాడుక లోకి తెచ్చిన తోలి సంస్థా గత విద్యార్ధులుగా రికార్డ్ స్తాపించారు .ఏ విషయం ఎక్కడ ఉందొ సునాయాసం గా తెలుకోవటానికి ఈ కోడ్ ఉపయోగ పడుతుందట .తుర్లపాటి వారు దీన్ని ఓపెన్ చేశారు .ఇదొక ఘన విజయం .ఆ తర్వాత తుర్ల పాటి తన సహజ ధోరణిలో ఎప్పుడూ మాట్లాడే విషయాలనే 200/110 B.P.లో కూడా వాయిం చేశాడు .ఆ తర్వాతా అందరికి కింద భోజనాలు ఏర్పాటు చేశారు బఫే పధ్ధతి. స్వీటు, హాటు ,పప్పు, రెండు కూరలు సాంబారు పెరుగు అప్పడం తో భోజనం బానే ఉంది ఆప్యాయం గా వడ్డించారు .నాకు ఈ సభలో పాల్గొన్నందుకు సంతృప్తి గా ఉంది .ఉయ్యూరు లో వెంట్రాప్రగడ గణపతి గారి అబ్బాయి శ్రీమన్నారాయణ కాలేజి లో కనిపించి పలకరించి ఎండుకోచ్చారని అడిగితే విషయం చెప్పి నువ్వెండుకోచ్చావని అడిగా తన భార్య ఈ కాలేజీ లో లెక్చరర్ అని చెప్పాడు .
మధ్యాహ్న సదస్సు మూడున్నర దాకా మొదలవ్వా లేదు బోర్ కొట్టి బయటికి వచ్చేశాను ఈ కాలేజి కేమిస్త్రి లెక్చరర్ గారు నన్ను చూసి ఎక్కడిదాకా అని అడిగితే బస్ స్టాండ్ కు అనగా తన బందీ మీద అక్కడ దిగ బెట్టారు క్రుతజంత చెప్పాను పంచాంగం వారి అబ్బాయి శ్రీ వైష్ణవులు అని చెప్పారాయన కుర్రాడే .సంస్కారం అంటే అదీ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-2-14-ఉయ్యూరు
వికీతో పరిచయం తక్కువ కాబట్టి కొన్ని సవరణలు అవసరమైనా మీ నివేదిక చక్కగావుంది, బహుశా బ్లాగర్లనివేదికలలో మొదటి సారిగా వచ్చినదనుకుంటాను. ధన్యవాదాలు.