వైద్య ఈశ్వర (వైదీశ్వర )ఆలయం(చివరి భాగం )
తమిళ నాడు లో చిదంబరానికి ఇరవై ఏడు కిలో మీటర్ల దూరం లో వైద్యం చేసే ఏశ్వరుదైఅన వైదీశ్వరాలయం ఉంది .ఈ శివ దర్శనం సకల రోగ హరణం.నవగ్రహ దేవాలయాలలో ఇది అంగారక క్షేత్రం .ఆలయం ప్రక్కనే ఉన్న పుష్కరిణి ‘’అమృత పుష్కరిణి ‘’అంటారు ఇక్కడ స్నానం చేసినా ఈ నీరు తాగినా రోగాలన్నీ మాటు మాయం అవుతాయని ప్రగాఢ విశ్వాసం అందుకే కాశీ ,ప్రయాగ ల లో లాగా ఈ నీటిని భద్రం గా దాచుకొని తెచ్చు కుంటారు తీర్ధం లాగా సేవించి వ్యాధులను పోగొట్టుకొంటారు .ఏడవ శతాబ్దం లో నాయనార్లు నిర్మించిన ఆలయం ఇది .ఈ మహిమాన్విత ఆలయాన్ని శ్రీ రాముడు లక్ష్మణ సంమేతం గా దర్శించాడు .సప్తర్హులు సందర్శించిన క్షేత్రం ఇది .
అరణ్య వాసం లో ఉండగా సీతా సాధ్విని రావణాసురుడు అపహరించి లంకకు తీసుకొని వెడుతుండగా చూసిన జటాయువు దశాకంతుని తో పోరాడి మరణించాడన్న సంగతి మనకు తెలుసు సీతాపహరణం వార్తా ను రాముడికి చెప్పి మరణించాడు ఆ పక్షి రాజు శ్రీ రాముడు తన తండ్రి దాశరధ మహా రాజుకు అత్యంత ఆప్తుడు స్నేహితుడు అయిన జటాయువు ను పితృ సమానం గా భావించి ఇక్కడే దహన సంస్కారాలను విధ్యుక్త ధర్మ గా నిర్వ హించాడు .ఆ ప్రదేశాన్ని ఇక్కడ ‘’జటాయు కుండం ‘’అని పిలుస్తారు .స్వామి ఆలయానికి వెనుక భాగాన ఉంటుంది .ఇక్కడే శ్రీ రామ లక్ష్మణ జటాయు ,నాదాముని గాలవ మునుల చిన్న విగ్రహాలు ఆ సంఘటనకు సాక్షీ భూతం గా కనీ పిస్తాయి .
కుజుడు అని పిలువా బడే అన్గారకుడికి ఒకప్పుడు కుష్టు రోగం వచ్చి విపరీతం గా బాధ పడ్డాడు .మహర్షుల మాట విని ఈ వైదీశ్వర క్షేత్రానికి వచ్చి వైద్య ఈశ్వరుడైనా వైదీశ్వరుడిని భక్తిగా నిష్టగా కొలిచాడు శివుని అనుగ్రహం తో అంగారకుని కుష్టు వ్యాధి నయమైంది అంగారక విగ్రహం ఇక్కడ ఉంది .కుజ దోషం ఉన్న వారు ఈ శివుడిని పూజిస్తే దోష నివారణం అవుతుందని నమ్మకం .ఆచార్య ధన్వంతరి కూడా ఈ స్వామిని అర్చించి తరించాడు .
శంముఖుదైన కుమారస్వామి ని తల్లి పార్వతీ దేవి ఒక్క ముఖం తో కానీ పించమని ముద్దుగా కోరితే తల్లి మాట మన్నించి ఒక్క ముఖం తో ఇక్కడే దర్శన మిచ్చాడు తల్లి పార్వతి మురిసి పోయి ఏంటో సంతోషించి కుమారునికి ‘’వీ’’అనే ఆయుధాన్ని ప్రదానం చేసింది .దానితో కుమారస్వామి రాక్ష సంహారం చేశాడు .ఒక సారి ‘’సూరపద్మ ‘’అనే భీకర రాక్షసుదితో షణ్ముఖుడు ఘోర యుద్ధం చేశాడు వాడు కొట్టిన బాణపు దెబ్బలకు కుమారుడి ఒళ్లంతా గాయాలై స్పృహ కోల్పోయాడు .అప్పుడు తండ్రి శివుడు వైద్యుడే కనుక కుమారుని గాయాలను వైద్యం చేసి ,మాన్పిమళ్ళీ యుద్ధ సంనద్ధుని చేశాడు రెట్టించిన ఉత్సాహం తో పోరాడి ఆ రాక్షసుని సంహరించాడు స్కందుడు .ఇక్కడి శివుని విభూతి పరమ పవిత్రమైనదిగా రోగ నివారక మైనదిగా భావించి నుదుట ధరించి నోటిలో వేసుకొంటారు .
వైదీశ్వరాలయానికి అయిదు అంతస్తుల గోపురం ఆకర్షనీయం గా ఉంటుంది .లోపల సుబ్రహ్మణ్య స్వామి లోహ విగ్రహం ఉంది ఈయన్ను ‘’ముత్తు కుమారా స్వామి ‘’అని ఆప్యాయం గా పిలుచు కుంటారు .నట రాజ ,సోమస్కంద ,దక్షిణా అమూర్తి ,సూర్య .వేద జటాయు సోదరుడైన ,సంపాతి విగ్రహాలను సందర్శించి త్రేతాయుగ గాధలను జ్ఞప్తికి తెచ్చు కొంటారు .
ఇక్కడి అమ్మ వారి పేరు ‘’తైయాల నాయకి ‘’.అంటే దుర్గా మాత అన్న మాట .ఆలయం లో శివుడు తన జటా జూతం లో బంధించిన గంగా నదిని బయటకు వదిలే గంగా విసర్జన లోహ విగ్రహం చూడ ముచ్చటగా ఉంటుంది .1070 -1120కాలం లో రాజా కులోత్తుంగ చోళుడు వేయించిన అయిదు శాసనాలు గొప్ప చారిత్రిక ఆధారాలు గా నిలుస్తాయి .అగస్త్య మహర్షి ఇక్కడి స్వామిని దర్శించి పునీతుడైనాడు అగ్స్త్యుడే ఇక్కడి నాదీ జ్యోతిషానికి ఆద్యుడు .వైదీశ్వరం ‘నాదీ జ్యోతిషానికి ముఖ్య కేంద్రం గా వర్దిల్లుతోంది .నాదీ జ్యోతిషం పై నమ్మకం ఉన్న వారు ఇక్కడికే వచ్చి జ్యోతిషం చెప్పించు కొంటారు .భూత భవిష్యత్ వర్తమానాలను నాదీ జ్యోతిషం తెలియ జేస్తుందని విశ్వాసం గత జనం లో తాము ఏ రూపం లో జన్మించామో ,ఏ మంచి చెడు పనులు చేయటం వలన ఈ జన్మ లో సుఖాలు కస్టాలు పడుతున్నామో తెలుసు కుంటారు భవ్య మైన భవిష్యత్తుకు మార్గాలను తెలుసు కొంటారు .అదీ వైదీశ్వరాక్షేత్ర విశేషం .ఇహ రోగాలను శివుడు బాపితే పర రోగాలను నాదీ జ్యోతిషం బాపుతుందన్న మాట .
తిరువన్నామలైలో అరుణా చలేశ్వర దేవాలయం
తమిళ నాడు లో చెన్నై కి సుమారు రెండు వందల కిలో మీటర్ల దూరం ,చిదంబరానికి నూట నలభై కిలో మీటర్ల లో తిరువన్నామలై క్షేత్రం ఉంది .ఇక్కడి కొండను అరుణా చలం అంటారు ఈశ్వరుడిని అరుణాచలేశ్వరుడు అంటారు పంచ భూత శివ లింగాలలో అరుణాచలం అగ్ని లింగ క్షేత్రం .శివుడిని ‘’అన్నమలయ్యర్ ‘’అని ఆర్తిగా పిలుస్తారు .అమ్మ వారు పార్వతీ దేవి ని ‘’ఉన్నములై అమ్మన్ ‘’అంటారు .ఏడవశాతాబ్దికే ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది .
అరునాచలేశ్వరాలయం 25ఎకరాల విస్తీర్ణం లో ఆవరించి ఉంటుంది .నాలుగు వైపులా నాలుగు ద్వారాలు గోపురాలు ఉన్నాయి .తూర్పు గోపురం ఎత్తు 217అడుగులతో11అంతస్తులతో ఉంటుంది .ఆలయం లో వెయ్యి స్తంభాల మండపం ఆకర్షనీయం .ఉదయం అయిదు గంటల నుండి పది గంటల వరకు దర్శనం .మళ్ళీ సాయంత్రం అయిదు నుంచి ఎనిమిదిన్నర వరకు
కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవం అరుణాచలం ప్రత్యేకత .గిరి పై భాగం లో జ్యోతి ని ప్రజ్వలింప జేస్తారు దీనికి వట్టి కిలో మీటరు పొడవు ఉంటుంది అనేక వందల కిలోల ఆవు నెయ్యి తో వెలిగిస్తారు సుమారు వారం రోజుల బాటు దీపం వెలుగుతూనే ఉంటుంది మైళ్ళ దూరానికి కూడా కని పించి కను విందు చేస్తుంది ఈ కార్తీక దీపోత్సవాన్ని దర్శించేందుకు దేశం నలు మూల నుండి దాదాపు ముప్ఫై లక్షలకు పైనే భక్తులు వస్తారు దివ్య జ్యోతిని దర్శించి తరిస్తారు .ఆలయాన్ని చోళ రాజులు తొమ్మిదవ శతాబ్దం లో నిర్మించారు పదహారు స్తంభాల దీప దర్శన మండపం చూడ తాగినది .ఆలయం లో శంముఖుని దేవాలయం ఉంది ఇక్కడి మాజిఘ వృక్షం సుప్రసిద్ధ మైనది ..సంతానం కోరుకొనే వారు దీనికి ఉయ్యాల కడతారు .పిల్లలు పుట్టగానే వచ్చి మొక్కు చెల్లించు కొంటారు .కళ్యాణ మండపం వసంత మండపాలు కూడా ముఖ్యమైనవే అన్నిటి కన్నా6అడుగుల ఎట్టు ఉన్న నల్ల రతి నంది విగ్రహం మహా గంభీరం గా ఉంది శివుని దర్శనానికి అనుమతి నిస్తున్నట్లు గా ఉంటుంది .
ఏడవ శతాబ్దిలో తిరు జ్ఞాన సంబందార్ స్వామిపై కవితలు రాశాడు తొమ్మిదో శతాబ్దిలో మాణిక్య సాగర్ ‘’ఆన్ అమరి ‘’కావ్యం రాశాడు .భగవాన్ రమణ మహర్షి ఇక్కడ తపస్సు చేయతంవలన ఇరవయ్యవ శతాబ్దం లో తిరువన్నామలై కు విపరీతమైన ప్రశస్తి దేశ వ్యాప్తం గా వచ్చింది ఇక్కడ పద్నాలుగు కిలో మీటర్ల గిరి ప్రదక్షిణం చేస్తూ మధ్యలో అష్ట దిక్పాలకులు ప్రతిష్టించిన శివ లింగాలను దర్శిస్తూ ఆది అరునాచలేశ్వరుని గుడి దర్శించి యాత్ర ను ఫల వంతం చేసుకొంటారు .
ఆలయానికి కొద్ది రూరం లో ఉన్న శ్రీ రమణాశ్రమ సందర్శనం తో తిరువన్నామలై యాత్ర సంపూర్ణం అవుతుంది
ఇంతటి తో మేము ఈ ఫిబ్రవరి లో చేసిన కేరళ యాత్రా ,తమిళ నాడు యాత్ర దర్శిని సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 19-2-14-ఉయ్యూరు