రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ -9
1-అశోకుడి పరాజయం
కిరణుడి నిష్క్రమణం .
2-కే.సి.ఆర్ .దే ఘన విజయం
అనుకొన్నది సాధించిన వైనం .
3-రెండు కళ్ళు పోయే నారాయణా
కుళ్ళబొడి చారయ్య నారాయణా.
4- కమలం లో రేకుల మధ్య వైరం
భలేగా సృష్టించి చేరింది బిల్లు తీరం .
5- ఆంధ్రులు ఆరంభ శూరులు
అని మళ్ళీ రుజూ చేసిన భీరులు .
6-అన్నీ అమ్మ ఇష్టం అని జుట్టు చేతికిచ్చి బీరాలు పోయి
ఇప్పుడేడిస్తే ఏముంది ముందు నూయి వెనక గోయి .
7-తెలిసీ తెలియని తొలి ప్రసంగం
చేసి ‘’చిరు’’ చిన్న బోయాడు అంతా గరం గరం .
8-ఎవరిచ్చారో ఎవరు తీసుకొన్నారో’’ మూటలు ‘’
ఆరోపణలతో కోట(కోట్లు)లు దాటాయి మాటలు .
9-ఈ ఆవేశం ముందు నుంచీ ఉంటే వెంకయ్యా !
ఇంతదాకా ముంచు కోచ్చేది కాదు కదరా అయ్యా ..
10-పెద్దమ్మా చిన్నమ్మా కూడ బలుక్కుని ఒక్కటయ్యారు
సీమాంద్రు మునిగిపోయామని లబో దిబో మంటున్నారు .
11-అయిదు రోజులు నుంచొని ప్లకార్డు చూపించాడు కే .వి.పి.
పాపం సొమ్మసిల్లి పడిపోయినా ఎవరూ చూపలేదు’’ పిటీ’’
12-ఇరవై తొమ్మిదో రాష్ట్రం ఎవరికి ఆమోదం మోదం ?
ఈ పరంపర ఆగక అరవై తొమ్మిదయి ఇస్తుందా ఖేదం ?
13-తెల్లోళ్ళ విభజించు –పాలించు కు మళ్ళీ విజయమా ?
ఇన్నేళ్ళ స్వతంత్ర వృక్షం కాసిన చేదు ఫలమా లేక పరిహాసమా ?
14-విభజించటం మాట ఏమో కాని’’ భజించటమే’’ ఉభయ సభల్లోనూ జరిగింది
రాజ్యాంగం పట్టపగలు నిలువునా ‘’రేప్’’ చెయ్య బడిందనే ఆరోపణ మాత్రం మిగిలింది .
15-తెలుగు జాతి మళ్ళీ అయింది రెండు రాష్ట్రాలు
నాయకులయ్యారు ఇసుకలో తల దూర్చిన ఉస్ట్రాలు .
16-మనుషులు విడిపోయినా కలిసి ఉండాలి మనసులు
ఇరువైపులా అభి వృద్ధి చెందితేనే తేలికవుతాయి మనసులు .
17-ఇప్పటిదాకా కాట్ల కుక్కల్లావీధిన పడి కాట్లాడు కౌన్నాం .
అన్నీ మరిచి పోట్ల గిత్తల్లా ముందు కెడదాం అనుకొందాం .
18-ఎక్కడున్నా ఉండాలి తెలుగు జాతి సజీవం
అన్నదమ్ముల ఐక్యతే ఆంద్ర జాతికి జవం జీవం .
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభా కాంక్షల తో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-2-14-ఉయ్యూరు