పులిపై స్వారీ ప్రమాదకరం!
- ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040-27425668
ఒక దేశం లేదా జాతి తన అస్తిత్వాన్ని ఒక సాంస్కృతిక సమానత్వంవల్ల కాపాడుకుంటుంది. సమాన సంస్కృ తి ఆ జాతి మూలాలను మూల్యాలను పరిరక్షిస్తుం ది. ఒక్కొక్కప్పుడు ఒక జాతి లేదా రాష్ట్రం డెమోగ్రఫీ మార్పువల్ల తన అస్తిత్వాన్ని ప్రాణశక్తి(విరాట్)ను కోల్పోతుంది. ఉదాహరణకు బంగ్లాదేశ్ నుండి భారీ సంఖ్యలో విదేశీయులు వెస్ట్ బెంగాల్లోకి ప్రవేశించిన సంగతి అందరికీ తెలిసిందే! ఇందుకు కారణం ‘జనాభా విస్ఫోటనం’అని సామ్యవాదులు వ్యాఖ్యానించారు. అంటే జనం ఎక్కువైనప్పుడు ఒక ప్రాంతంవారు మరొక ప్రాంతానికి వలసపోతారని వారి వాదం. అంటే ఇక్కడ సరిహద్దులు దేశాలు సంస్కృతి మతం వంటివి అడ్డురావని వారి భావన. నిజానికి బెంగాల్ సంస్కృతి భాష బంగ్లాదేశ్ సంస్కృతి భాష వేరువేరు కాదు. రెండూ ఒకటే. కేవలం మతం మాత్రమే తేడా! 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు చాలా పెద్ద ఉద్యమం వచ్చింది. దానినే వందేమాతరం ఉద్యమం అంటారు.
1947కు ముందు భారతదేశపు జనాభా నలభై కోట్లలోపే ఉండేది. నలుబది కోట్ల భారతీయులే కల్యాణి చల్లని కడుపుపంట’అని జంధ్యాల పాపయ్యశాస్ర్తీగారు అప్పుడు కవిత్వం వ్రాశారు. ఇవ్వాళ (2013) భారత జనాభా నూటఇరవై కోట్లు దాటింది. తద్వారా అవసరాలు పెరిగాయి. అరణ్యాలు వ్యవసాయభూములు చెరువులూ ఆవాసాలుగా మారిపోయాయి. హైదరాబాదు నగరం మూడు లక్షల మందికోసం ప్లాన్ చేయబడింది. నేడు గ్రేటర్ హైదరాబాదులో కోటి మంది జనాభా ఉంది. అంటే దాదాపు సింగపూర్ వంటి ఒక స్వతంత్ర దేశంలో సమానమన్నమాట. నా తెలంగాణా కోటి రత్నాల వీణ అన్నాడు దాశరథి. ఇది 1950కి ముందుమాట. నేడు తెలంగాణా జనాభా మూడు కోట్లు దాటింది. ‘ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం’అని ఓ సినిమా పాట 1960వ దశకంలో వచ్చింది. కాని నేడు ఆంధ్రప్రదేశ్ జన సంఖ్య తొమ్మిది కోట్లు దాటింది. అందువల్ల పరిపాలనా సౌకర్యంకోసం మరిన్ని చిన్న రాష్ట్రాలు రావాలని బిజెపివారు వాదిస్తున్నారు.
1950వ దశకంలో భాషాప్రయుక్త రాష్ట్రాలకు నాంది జరిగింది. దానిని చక్రవర్తుల రాజగోపాలాచారి వ్యతిరేకించారు. ఆర్.ఎస్.ఎస్ అధినేత ఎం.గోల్వార్కర్ వ్యతిరేకించారు (చూడండి: బంచ్ ఆఫ్ థాట్స్.) వారు యూనిటరీ రాజ్యాంగ వ్యవస్థను సమర్ధించారు. ఐతే అప్పుడు బలంగా ఉన్న సంయుక్త కమ్యూనిస్టుపార్టీ తెలుగు మాట్లాడేవారంతా ఒకే గూడుకు నీడకు రావాలని వాదించారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవాడా? అని కామ్రేడ్ వేములపల్లి శ్రీకృష్ణ వ్రాసిన గేయం చాలా ప్రచారాన్ని పొందింది. ‘మాకు తెలుగు ప్రాంతం ఇవ్వకపోతే రష్యా సహాయం తీసుకుంటా’అని ఒక ప్రకటన చేయటం ఈ తరంవారికి తెలియదు. మొత్తంమీద పండిత్ జవహర్లాల్ నెహ్రూగారు భాషాప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణా సంయుక్త మహారాష్టన్రుండి గుజరాత్ వేరు చేయబడింది. శాసనసభ రద్దు కావటంతో విశాలాంధ్ర, ఆంధ్రప్రదేశ్‌గా 1956 నవంబరు 1వ తేదీ అవతరించింది. అయితే 1969లో తిరిగి ఆంధ్ర-తెలంగాణా ప్రాంతాలు విడిపోవాలనే ఉద్యమం తీవ్రంగా సాగింది. అలాగే ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాంచల్‌ను విడదీశారు. మధ్యప్రదేశ్ నుండి చత్తీస్‌గఢ్‌ను వేరుచేశారు. బీహారునుండి జార్ఖండ్ విడివడింది. ఇదంతా పరిపాలనా సౌకర్యంకోసమేనని అప్పటి ఎన్.డి.ఏ. ప్రభుత్వం చెప్పింది అంటే జనాభా పెరిగినప్పుడు భాషాప్రయుక్త రాష్ట్రాల దృష్టికోణం (కానె్సప్ట్) పక్కనపెట్టి సత్వరాభివృద్ధికోసం చిన్న చిన్న రాష్ట్రాలను ఏర్పాటుచేయాలనే వాదం మొదలైంది. అంటే ఒకే హిందీ భాష మాట్లాడే వారికి నాలుగు రాష్ట్రాలు ఉండవచ్చు. అదే తర్కం తెలుగువారికి కూడా వర్తింపజేసి రెండు రాష్ట్రాలుగా విడగొట్టారు. ఇదంతా పరిపాలనా సౌకర్యంకోసమే నని వాదించవచ్చు. కానీ పాలనాసౌల్భ్యంకోసనే విభజన చేసామని చెప్ప కున్నా, మరో వాదన ప్రకారం తెలంగాణాలోని తొమ్మిది జిల్లాలు ఒక రాష్ట్రం చేసివుండాల్సింది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు కల్పుకొని గ్రేటర్ హైదరాబాదు మరొక రాష్టమ్రవుతుంది. కోస్తా మొత్తం ఒక రాష్ట్రం. రాయలసీమ మొత్తం మరొక రాష్ట్రం. అంతేకాదు రాయలసీమలో కర్ణాటకనుండి బళ్లారిని విడదీసి కలుపవచ్చు. తమిళనాడు నుండి కృష్ణగిరి-తిరుత్తని విడదీసి కలుపవచ్చు. తిరుపతి కేంద్రంగా ఒక ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేయవచ్చు. దీనిని గ్రేటర్ రాయలసీమ అంటారు. ఇందుకు ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. కాని ఇవేమీ పాలక పార్టీలకు పట్టలేదు. అంటే పరిపాలనా సౌకర్యం, భాషాప్రయుక్త రాష్ట్రం అనే దృష్టి (కానె్సప్ట్) కాకుండా ఏంచేస్తే తమ పార్టీ అధిక సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుంది? అనే దృష్టికోణం ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ ఆలోచించాయ. దానే్న అమలు పరచాయ.
మహారాష్ట్ర రాజధాని బొంబాయిలో బీహారీలు యుపివారు ఉండకూడదని రాజథాకరే హెచ్చరించారు. హైదరాబాదులో ఆంధ్రోళ్లు ఉండకూడదని తెలంగాణా నాయకులు చిల్లకల్లు (నల్గొండ జిల్లా బార్డర్)వద్ద అడ్డుగోడ కట్టారు. అంటే పరిపాలనా సౌకర్యంకోసంకాక విద్వేషాలతో ఈ ఉద్యమాలు నడుస్తున్నాయని సారాంశం. అఖిల భారత స్థాయిగల కాంగ్రెసు-బిజెపిలు దీనికి ఏం సమాధానం చెపుతాయి? ఒక పార్టీ గెలిచినా ఓడినా ప్రజాక్షేమమే ప్రధాన దృష్టిగా ఉండాలి అనే ఆలోచన దాదాపు అన్ని రాజకీయ పార్టీలల్లోనూ శూన్యం. ఇదే అసలు సమస్య.
చిన్న రాష్ట్రాలు- పెద్ద రాష్ట్రాలు అనే దృక్పధంతో సమస్యలు పరిష్కారం కావు. భారతీయులంతా ఒకటే అనే భావాత్మక సమైక్యత లేకపోతే భారతదేశం 1990లో రష్యా విడివడినట్లు చిన్న చిన్న దేశాలుగా విడిపోతుంది. ఇది ఊహాగానం కాదు. చైనావారు స్పష్టంగా తమ వెబ్సైట్లో ఈమధ్య ఈ అంశాన్ని ప్రచురించారు. ‘‘్భరత్ 50 చిన్న దేశాలుగా మారుతుంది’’ అని తేల్చి చెప్పారు. ప్రాంతీయ పార్టీల సంగతి అటుంచి అఖిల భారతీయ పార్టీలు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనుకుంటున్నారో వేచిచూడవలసిందే.
1947కు ముందు భారతదేశంలో మూడువందల స్వదేశీ సంస్థానాలు ఉండేవి. వాటన్నింటినీ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇండియన్ యూనియన్‌లో నయానా భయానా సామదానభేద దండోపాయాలు ప్రయోగించి కలిపివేశారు. కాని నేడు ఇటు గల్లీలో కాని అటు ఢిల్లీలో గాని సర్దార్‌వల్లభ్‌భాయ్ పటేల్ వంటి ఉక్కుమనుషులు ఒక్కరూ లేరు. ఇదే సమస్య.
భాష- మతం- సంస్కృతి అనుబంధ హేతువులని ఒకప్పుడు భ్రమించేవాళ్లం. కాని పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడివడటం ఆంధ్రనుండి తెలంగాణా విభజన కోరటం- వంటి అంశాలు పరిశీలిస్తే మతం-్భష మానవ హృదయాల మధ్య అనుసంధాన సేతువు హేతువుకాజాలదని సిద్ధాంతీకరింపవలసి వస్తుంది!! భాషాపరంగా జయలలిత-కరుణానిధి ఒకటే. అయినా పరస్పర గవనానికి ఎందుకు సిద్ధపడ్డారు?? అరాజక పరిస్థితులలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టదు. అప్పుడేమవుతుంది? పాకిస్తాన్లో వలె సైనిక పాలన వస్తుంది. అంటే పెనంనుండి పొయ్యిలోకి పోయినట్లవుతుంది.
జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లలో నక్సలైట్ల సమస్య పెరిగింది. ఇక గోవా, హర్యానాలల్లో ఆయారాం గయారాం ప్రభుత్వాలు వచ్చాయి. తాత్పర్యం ఏమంటే వౌలికంగా ప్రజలలో మార్పులు తీసుకురానంతవరకు భౌగోళిక పరిణామాలతో హద్దులూ సరిహద్దులూ మార్చి రెండవ ఎస్.ఆర్.సి వేయటంవల్ల ప్రయోజనం ఉండదు. పదవీ లాలస మరిగినవారు మరికొన్ని కొత్త సమస్యలు సృష్టిస్తారు. రాబోయే ఎన్నికల లాభాన్ని గురించి ఆలోచించేవాడు పొలిటీషియన్- రాబోయే తరాన్ని గురించి ఆలోచించేవాడు స్టేట్స్‌మన్. గుర్రపు స్వారీ సరే- కాని పులిస్వారీ ప్రమాదకరం? భింద్రేన్‌వాలే అనే పులి ఇందిరాగాంధీని తినేసింది. ప్రభాకరన్ అనే టైగర్ సత్పురుషుడైన రాజీవ్‌గాంధీని పొట్టనపెట్టుకున్నది. ఇప్పు డు భ్రమ (ఇల్యుషన్)తో వ్యాఘ్రభ్రమణం ఎవరు చేస్తున్నారో మీకు తెలుసు.
సత్పురుషుడైన రాజీవ్‌గాంధీని?
భలే!
భారత రాజకీయాలలో రాజీవ్ గాంధి మంచి వ్యక్తి. ఆయనని ఎగతాళి చేయవలసిన అవసరంలేదు.